ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లాలో పర్యటించిన జనసేనాని పవన్ కల్యాణ్.. వైసీపీ అధినేత జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్‌తో కలిసి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించాలని జగన్ చూస్తున్నారని ఆరోపించారు. వైసీపీ అభ్యర్థులను కేసీఆర్ నిర్ణయిస్తున్నారని అన్నారు. దోచుకున్న డబ్బుతో మీడియా పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు పిచ్చి రాతలు రాస్తే చూస్తూ ఊరుకోబోనని, గౌరవిస్తున్నానని చిన్న చూపు చూస్తే సహించబోనన్నారు. పులివెందుల వేషాలు తన వద్ద వద్దంటూ జగన్, విజయసాయిరెడ్డిలకు హెచ్చరికలు జారీ చేశారు.

pardhasaradhi 25032019

తాను ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను అమ్ముకుంటున్నట్టు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. తన దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయని, తనకు డబ్బుతో పనిలేదని స్పష్టం చేశారు. సొంత చిన్నాన్న వివేకానందరెడ్డి చనిపోతే వేలిముద్రలు, రక్తపు మరకలు తుడిచేసి దుస్తులు మారుస్తారా? అని సూటిగా ప్రశ్నించారు. సొంత చిన్నాన్నను కాపాడుకోలేని వ్యక్తి రాష్ట్రంలోని ఆడపడుచులను ఎలా కాపాడతారని పవన్ నిలదీశారు. హత్య చేసింది ఎవరో తెలియకుండా రాజకీయ లబ్ధి కోసం ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారన్నారు. చిన్నాన్న చనిపోతే రక్తపు మరకలను తుడిచివేసిన వ్యక్తి ప్రజానాయకుడు అవుతారా? అని ఎద్దేవా చేశారు.

pardhasaradhi 25032019

తెలంగాణలో ఆంధ్రులను పీల్చి పిప్పి చేస్తుంటే ఒక్క మాటా మాట్లాడకుండా జగన్ నాటకాలాడుతున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అభ్యర్థులను కేసీఆర్ ఎంపిక చేసి బీఫారాలు ఇస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ల వద్ద జగన్ తాకట్టుపెట్టారని మండిపడ్డారు. పాదయాత్ర పేరుతో రోడ్లపై తిరిగిన జగన్ సమస్యలు తీర్చమంటే మాత్రం ముఖ్యమంత్రి అయ్యాకే తీరుస్తానని చెప్పారని ఎద్దేవా చేశారు. జగన్‌కు కరెక్టు మొగుడు వైజాగ్‌లో ఉన్నారని, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను అక్కడ నిలబెట్టానని పవన్ చెప్పుకొచ్చారు. జగన్ వైజాగ్ వెళ్తే ఆయన సంగతి తేలుస్తారని పవన్ హెచ్చరించారు.

ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్‌కు షాక్‌ తగిలింది. నామినేషన్ సమయం ముగియడంతో ఆయన నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు. భీమవరంలో కేఏ పాల్ నామినేషన్‌ను వేసేందుకు వచ్చారు. ఆలస్యంగా వచ్చారంటూ నామినేషన్‌ తిరస్కరించినట్లు అధికారులు పేర్కొన్నారు. నరసాపురంలో ఎంపీ నామినేషన్‌ను ఆలస్యంగా తీసుకున్నారని, అందుకే భీమవరం రావడం ఆలస్యమైందని కేఏ పాల్‌ ఆరోపించారు. చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్‌లు కుట్ర పన్నారని కేఏ పాల్ మండిపడ్డారు. గెలుస్తానన్న భయంతో భీమవరం ఆలస్యంగా చేరుకునేలా చేశారని కేఏ పాల్ విమర్శించారు. నరసాపురంలో ఎంపీగా గెలిచి నేనేంటో చూపిస్తానని కేఏ పాల్‌ స్పష్టం చేశారు.

kapaul 25032019

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేయడానికి పాల్ వెళ్లగా.. ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై పోటీ చేస్తానని ప్రకటించిన కేఏ పాల్.. సోమవారం (మార్చి 25) మధ్యాహ్నం భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడానికి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి బయలుదేరారు. అంతకుముందే తన బంధువు ఒకరితో నామినేషన్ పత్రాలను పంపించారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత అక్కడికి చేరుకున్నారు. పాల్ సమర్పించిన నామినేషన్ పత్రాలను అధికారులు పరిశీలించారు. అనంతరం ఆయన తన నామినేషన్ పత్రాలపై సంతకం చేయాల్సి ఉండగా.. అప్పటికే సమయం అయిపోయిందని అధికారులు నిరాకరించారు. మొదటి విడత ఎన్నికల నామినేషన్లకు సోమవారం సాయంత్రంతో సమయం ముగిసిన విషయం తెలిసిందే.

kapaul 25032019

తన నామినేషన్‌ను నిరాకరించడం వెనుక కుట్ర దాగి ఉందని పాల్ ఆరోపిస్తున్నారు. అధికారులు ఉద్దేశ పూర్వకంగానే అలా చేశారని ఆరోపిస్తున్నారు. అటు లోక్ సభ ఎన్నికలకు పోటీ చేస్తానని చెప్పిన కేఏ పాల్.. ఇప్పటికే నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం అదే స్థానం నుంచి అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేయడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అనంతరం ఆలస్యంగా భీమవరం చేరుకున్నారు. నర్సాపురం పార్లమెంట్ స్థానానికి కేఏ పాల్ దాఖలు చేసిన నామినేషన్ కూడా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆయన దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో వివరాలు సరిగా పొందుపరచలేదని చెబుతున్నారు. అదే జరిగితే పాల్‌కు మరో షాక్ తప్పదు.

ప్రజా సమస్యల పై మాట్లాడటానికి ఏమి లేక, కేవలం చంద్రబాబుని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, జగన్ చేస్తున్న పనులు చూస్తున్నాం. ఇందులో భాగంగా, తన పార్టీలో చేరిన చంద్రబాబు బంధువు అయిన నార్నే శ్రీనివాస్ చేత, చంద్రబాబు పై వ్యక్తిగతంగా తిడుతూ, నారా రాంమూర్తి నాయుడుని చంద్రబాబు హింసించారు అంటూ చెప్పించారు. దీని పై రాంమూర్తి నాయుడు కొడుకు, నారా రోహిత్ బహిరంగ లేఖ విడుదల చేసారు. "మీ ప్రయోజనాల కోసం మా మధ్య విభేదాలు సృష్టించొద్దు... నారా అనే పేరును రాష్ట్ర అభివృద్ధికి బ్రాండ్‌ గా మార్చడంలో ముఖ్యమంత్రివర్యులు, మా పెద్దనాన్నశ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషి అభినందనీయం. రామలక్ష్మణుల్లా కలిసి ఉండే మా పెదనాన్న, మా నాన్న(రామ్మూర్తి నాయుడు) మధ్య విభేదాలున్నాయంటూ వ్యాఖ్యానించడం బాధాకరం. మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అన్నదమ్ముల మధ్యవ భేదాలు సృష్టించొద్దు."

narnre 25032019 2

"నారా పేరును నిలబెట్టడానికి మా కుటుంబం నుంచి ఒక్కరు చాలు. కనుకనే మేమంతా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నాం. మీ రాజకీయ ప్రయోజనాల కోసం మా కుటుంబంపై, మా మధ్య ఉన్న బంధంపై బురద చల్లకండి. రాష్ట్ర ప్రజలతో పాటు నారా కుటుంబ సభ్యులు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుని వారి అడుగు జాడల్లో నడుస్తారు.నాలుగు దశాబ్దాల క్రితమే సమాజ అభివృద్ధి కోసం మా ఆస్తులను పాఠశాలలకు, పంచాయతీ భవనాలకు ఇచ్చామనే విషయాన్ని మరిచిపోకండి. మాకు రాష్ట్ర అభివృద్దే ముఖ్యం. మా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశారన్న వాదన నూటికి నూరుపాళ్లు అవాస్తవం, అసత్యం. రాత్రింబవళ్లు శ్రమించి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను ఏవిధంగా చూసుకుంటున్నారో.. మమ్మల్ని అదేవిధంగా చూసుకుంటున్నారు.

narnre 25032019 3

"ఎంపీ పదవి కోసం సొంత బాబాయి మీదనే చేయి చేసుకున్న చరిత్ర వైఎస్‌ కుటుంబానిది. మాకు పదవులు ముఖ్యం కాదు. మాకు అటువంటి నీచ చరిత్ర అవసరం లేదు. కోర్టులు, జైళ్లు చుట్టూ తిరిగే మీకేం తెలుసు కుటుంబ బాంధవ్యాల విలువ?ప్రతి సంవత్సరం మాతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు.ముఖ్యమంత్రిలా కాకుండా ఒక కుటుంబ పెద్దగా గడుపుతున్నారు. మా అందరికీ ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇస్తున్నారు. మా నాన్న ఆరోగ్య పరిస్థితి బాగోలేదు కనుకనే ఆయన ఇంటికే పరిమితమయ్యారు.రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోలేకనే.. కుటుంబ సభ్యులపై, వారి వ్యక్తిగత విషయాలపై అసత్య ప్రచారం చేస్తున్నారు. నారా కుటుంబంలో చీలికలు మనస్పర్థలు తీసుకొచ్చి రాజకీయ లబ్ది పొందాలనుకోవడం మీ దివాళా కోరు తనానికి నిదర్శనం."

వెల్ఫేర్ గ్రూప్ సంస్థల పేరుతో విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి మళ్ల విజయప్రసాద్ ప్రజల నుంచి అక్రమంగా డిపాజిట్లు సేకరించారని, వైసీపీ నేతల అఫిడవిట్‌లలో అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ వైవీ శేషసాయి ఆరోపించారు. శనివారం ఉండవల్లి ప్రజావేదిక వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ వెల్ఫేర్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించడం నేరమని, వెల్ఫేర్ గ్రూప్ సంస్థల పేరుతో అగ్రిగోల్డ్‌ను మించి భారీ కుంభకోణానికి తెరలేపారని ధ్వజమెత్తారు. విజయప్రసాద్ వసూలుచేసిన రూ 1240 కోట్ల సొమ్మును ఆయనే ఆరగించారా, లేక వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేశారో తేల్చాలని డిమాండ్ చేశారు.

affidavit 25032019

నేర ప్రవృత్తే ప్రధాన అర్హతగా సీట్ల కేటాయింపు జరిగిందని, రూ. 480 కోట్లు చిరునామాలేని డిపాజిట్ దారుల సొమ్మును ఎవరు సేకరించారని ప్రశ్నించారు. ప్రజల సొమ్మును అక్రమ వ్యాపారాల ద్వారా డిపాజిట్ల రూపంలో వేల కోట్లు కొల్లగొట్టిన విషయం వాస్తవమో కాదో నిగ్గు తేల్చాలన్నారు. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వర ప్రసాద్, మైలవరం అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్‌లపై సీబీఐ కేసులు ఉన్నట్లు అఫిడవిట్‌లో వివరించారని, వారిపై ఏ నేరం కింద కేసులు నమోదయ్యాయో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల నేర చరిత్రపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు. ఎన్నికల్లో చిత్తశుద్ధితో పోటీ చేయాలంటే రూ. 1250 కోట్లు ప్రజలకు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాసేవకు రావాలంటే డిపాజిట్లు తిరిగి చెల్లించాలన్నారు. వైసీపీ మాటల్ని నమ్మే స్థితిలో ప్రజలు లేరని సాయిబాబు అన్నారు.

Advertisements

Latest Articles

Most Read