ఎన్నికల్లో వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపును ఎందుకు పెంచట్లేదంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 50శాతం మేర ఓటు రసీదు యంత్రాలను(వీవీప్యాట్‌లను) లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ చంద్రబాబుతో సహా, ప్రతిపక్షాల దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఈసీ తీరుపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఈవీఎంను మాత్రమే వీవీప్యాట్‌ స్లిప్పులతో లెక్కించి సరిచూస్తున్నారు. అయితే ఈ స్లిప్పుల లెక్కింపును ఎందుకు పెంచలేకపోతున్నారని న్యాయస్థానం ప్రశ్నించింది. దీనికి ఈసీ తరఫున కోర్టుకు హాజరైన సుదీప్‌ జైన్‌ స్పందిస్తూ.. ప్రత్యేక కారణాల వల్లే లెక్కింపు పెంచడం లేదని తెలిపారు.

bjp 25032019

అయితే ఇదే సమాధానంతో అఫిడవిట్‌ దాఖలు చేయాలంటూ సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ‘వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపును పెంచాలనుకుంటున్నారా? ఒకవేళ పెంచకపోతే స్లిప్పుల లెక్కింపులో ఈసీకి ఉన్న ఇబ్బందులను తెలియజేస్తూ మార్చి 28 సాయంత్రం 4 గంటలలోగా అఫిడవిట్‌ దాఖలు చేయండి’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుత ప్రక్రియతో మీరు సంతృప్తిగా ఉంటే అందుకు గల కారణాలు కూడా తెలియజేయాలని పేర్కొంది. ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్‌ 1కి వాయిదా వేసింది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల ద్వారా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు రేకెత్తుతున్న నేపథ్యంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తప్పనిసరిగా 50శాతం మేర వీవీప్యాట్‌లను లెక్కించి, వాటిని ఈవీఎంలలో నమోదైన ఓట్లతో సరిపోల్చేలా నిబంధనలు తీసుకురావాలని 21 రాజకీయ పార్టీలు గత నెలలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేశాయి.

bjp 25032019

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షనేత గులాంనబీ ఆజాద్‌, జమ్ము కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, ఎస్పీ, బీఎస్పీ ఎంపీలు రాంగోపాల్‌యాదవ్‌, సతీష్‌ చంద్ర మిశ్రల నేతృత్వంలో 21 పార్టీల నేతలు ఫిబ్రవరి 4న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా, కమిషనర్‌ అశోక్‌ లవాసాలను కలిసి వినతిపత్రం అందజేశారు. అయితే ఈసీ నుంచి సంతృప్తికర స్పందన లేకపోవడంతో వీరంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

కమల్‌హాసన్ కుమార్తె శృతిహాసన్‌ను వైసీపీ ఎంపీ అభ్యర్థి పీవీపీ(పొట్లూరి వర ప్రసాద్) బ్లాక్ మెయిల్ చేశారని టీడీపీ అభ్యర్థి కేశినేని నాని ఆరోపించారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేశినేని మీడియాతో మాట్లాడుతూ.. తన ప్రత్యర్థి పీవీపీపై సంచలన ఆరోపణలు చేశారు. ‘‘కమల్‌హాసన్ గారి అమ్మాయి శృతిహాసన్‌ను బ్లాక్‌మెయిల్ చేసి కాల్ షీట్లు తీసుకున్నారు. అలాగే చాలామంది హీరోయిన్లు ఏడిపించిన వ్యక్తి ఇతను. సినిమా ఇండస్ట్రీలో మహేశ్‌బాబును తప్ప ప్రతి హీరోనూ ఇతను మోసం చేశాడు. సినిమా ఇండస్ట్రీకి కూడా ఇతనంటే అసహ్యం పుట్టింది. ఒక్క మహేశ్ బాబే ఈయన చేతికి దొరకలేదు. హీరోయిన్లను ఏడిపించాడు.. డైరెక్టర్లను ఏడిపించాడు. అవసరం అయితే లీగల్ నోటీసులని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి వాళ్ల డేట్లు తీసుకునేవాడు. ఇతను ఏదైనా చేయడానికి సిద్ధహస్తుడు. ఇతను ఒక క్రిమినల్.. ఇతనొక మోసగాడు.’’ అంటూ కేశినేని నాని ఆరోపించారు.

bjp 25032019

అంతేకాకుండా పీవీవీ ఆర్థికనేరగాడంటూ కేశినేని విమర్శించారు. ‘‘పీవీపీ నాకంటే ఐదేళ్లు చిన్నోడు. చిన్నప్పటి నుంచి ఇతనో నేరగాడు. అంతర్జాతీయ ఆర్థిక నేరగాళ్లను ప్రజలు విజయవాడలో అడుగు పెట్టనివ్వరు. హైదరాబాద్‌లో ఇతని సీన్ అయిపోయింది. కెనరాబ్యాంక్‌కు ఇతను రూ. 137 కోట్లు ఎగ్గొడితే మొన్న నోటీసులు ఇచ్చారు. ఇతను తాకట్టు పెట్టిన ఆస్తిని బ్యాంకు వాళ్లు వేలం వేస్తే ఏడు కోట్లు కూడా రాలేదు. మిగతా 130 కోట్లు ఎవరు కడతారు?. అలాగే ఇంకా చాలా స్కాములు చేశాడు. బొగ్గు స్కాము, జగతి పబ్లికేషన్స్‌లో రూ. 147 కోట్ల మనీల్యాండరింగ్, హవాలా కేసులు, అలాగే సెబీ కూడా రూ. 30 కోట్ల ఫైన్ వేసింది.’’ అంటూ కేశినేని నాని ఆరోపణలు చేశారు.

 

bjp 25032019

జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ-సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం... 74 మంది నిందితుల్లో పొట్లూరి వరప్రసాద్ 19వ నిందితుడు. జగన్ కు చెందిన జగతి పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్-జె.పి.పి.ఎల్ సంస్థల్లో రూ. 146.97 కోట్లు పెట్టుబడులు పెట్టారని ఆరోపణలున్నాయి. పీవీపీ వెంచర్స్ రూ. 55 కోట్లు, క్యూబిక్ రియల్టర్స్ రూ. 35 కోట్లు, మెటాఫర్ రియల్ ఎస్టేట్స్ అండ్ ప్రాజెక్ట్స్ రూ. 6 కోట్లు, పీవీపీ బిజినెస్ టవర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.10 కోట్లు పెట్టుబడులు పెట్టారని అభియోగాలున్నాయి. వరప్రసాద్ కు పోటీగా తెలుగుదేశం తరఫున సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని బరిలో నిలిచారు. ఇద్దరూ కృష్ణా జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతలే. ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడ లోక్ సభ స్థానంలో పోటీ హోరా హోరీగా ఉంటుందని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.

టీఆర్‌ఎస్‌, వైసీపీలు తమకు మిత్రులేనని బీజేపీ నేత, కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ పరోక్షంగా వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్‌లో ఫిక్కీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘విజన్‌ ఇండియా’ అనే అంశంపై మాట్లాడుతూ.. బీజేపీకి సొంతంగా 300 ఎంపీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ‘జగన్‌, కేసీఆర్‌ మీ మిత్రులు. మీతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నారుగా?’ అన్న ప్రశ్నకు.. ‘కచ్చితంగా! అదృష్టవశాత్తూ దానిపై ఎలాంటి జీఎస్టీ ఉండదు’ అని పీయూష్‌ సమాధానమిచ్చారు. ఎన్నికలకు 60 రోజుల ముందు కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకా గాంధీ వచ్చి ప్రచారం చేస్తున్నారని అన్నారు.

bjp 25032019

ఆమె సోదరుడు, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ విఫలమైనందునే.. ఆమె రాజకీయాల్లోకి వచ్చారా? అని ఎద్దేవా చేశారు. రామ జన్మభూమిలోనే మందిరాన్ని నిర్మించి తీరుతామన్నారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ విషయంలో శామ్‌పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై గోయల్‌ మండిపడ్డారు. దేశాన్ని మోదీ రక్షిస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. మహిళల భాగస్వామ్యంతోనే దేశ నిర్మాణం జరుగుతుందని గోయల్‌ అభిప్రాయపడ్డారు. దేశ రక్షణలో మీడియా కూడా చౌకీదార్‌గా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

 

‘దావూద్ ఇబ్రహీం ఉగ్రవాదం.. నీరవ్ మోదీ బ్యాంక్ చీటింగ్.. హర్షద్ మెహతాది ఆర్థిక నేరం.. చార్లెస్ శోభరాజ్‌ది హింసావాదం.. ఈ నేరాలన్నీ కలగలసిన కరడుగట్టిన క్రిమినల్ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి’ అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎలక్షన్ మిషన్-2019పై శనివారం పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ‘జగన్‌ది టిపికల్ విలన్ క్యారెక్టర్ అని.. ఇలాంటి విలనిజాన్ని ఇంతవరకు ఏ తెరపైనా చూడలేదు’ అని వ్యాఖ్యానించారు. అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్ (ఎఫ్‌బీఐ)లో తొలిపాఠం ఆయన లాంటివాళ్ల గురించే ఉంటుందని గుర్తుచేశారు. ఎఫ్‌బీఐలో జగన్ తరహా నేరాల నిరోధంపై శిక్షణ ఇస్తారన్నారు.

bjp 25032019

పైకి నవ్వటం.. లోన కుతంత్రాలు.. వేధింపులు.. అనుకున్నది సాధించేందుకు విధ్వంసాలు.. ప్రత్యర్థులకు బెదిరింపులు.. పైకి అద్భుత నటన.. లోన ఆర్థిక ఉగ్రవాదం.. కరడుగట్టిన నేరస్వభావం.. అరుదైన క్రిమినల్ మనస్తత్వం గురించి ఎఫ్‌బీఐలో తొలి పాఠ్యాంశంగా బోధిస్తారని తెలిపారు. కేసుల మాఫీకోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లకు జగన్ బానిసగా మారారని మండిపడ్డారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కేసీఆర్ చెడగొడుతున్నారని ఆరోపించారు. అక్కడ ఆస్తులున్న వారిపై వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నారని, చివరకు అధికారులను కూడా బెదిరించే స్థాయికి దిగజారారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

bjp 25032019

ఏపీకి విభజన చట్టం ప్రకారం రావాల్సిన వాటి గురించి మోదీని ప్రశ్నించే ధైర్యం జగన్‌కు లేదన్నారు. ఆస్తుల విభజనను అడ్డుకునే కేసీఆర్‌తో జతకట్టారని ఆంధ్ర ద్రోహులను ఒక్క మాట కూడా అనలేరని విమర్శించారు. ముస్లింలు, ఎస్సీలపై దాడులు జరుగుతున్నా బీజేపీ, టీఆర్‌ఎస్‌తో జగన్ అంటకాగుతున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి పార్టీ, నాయకుడు ఏపీకి అవసరమా అని ప్రశ్నించారు. తెలంగాణ, గుజరాత్‌ల కంటే ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందుతోందనే అక్కసుతోనే ఏపీని నష్టపరిచేందుకు మోదీ, కేసీఆర్‌లతో జగన్ మిలాఖత్ అయ్యారని మండిపడ్డారు. ముగ్గురూ కక్షకట్టి ఏపీ, టీడీపీపై ముప్పేట దాడి చేస్తున్నారని, ఆ మూడు పార్టీలకు ప్రజలు బుద్ధిచెప్పే సమయం ఆసన్నమైందన్నారు.

Advertisements

Latest Articles

Most Read