రాష్ట్రంలో మరో మూడు వారాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ నేతలు ప్రచార జోరు పెంచారు. ఈ సారి, 2014లో టీడీపీ-బీజేపీతో కలిసి పనిచేసిన జనసేన తాజా ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా నిలిచింది. ఇక జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీల ప్రభావం దాదాపు లేనట్లే! హోరాహోరీగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, బీఎస్పీలతో కలిసి బరిలో నిలిచిన జనసేన మూడో పక్షంగా నిలిచింది. టీడీపీ, వైసీపీలకు సవాలుగా మారింది. 2014 ఎన్నికల్లో నవ్యాంధ్ర ప్రజలు చంద్రబాబుపైనే నమ్మకం ఉంచారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడంతో పాటు సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువయ్యారు. తాను చేసిన అభివృద్ధి, సంక్షేమమే మళ్లీ తనను గెలిపిస్తాయనని చంద్రబాబు నమ్ముతున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ కూడా ఎన్నికల ప్రచార వేగాన్ని పెంచారు. చంద్రబాబుపై విమర్శల దాడిని తీవ్రతరం చేశారు. పోరు టీడీపీ, తమకు మధ్యేనని భావించారు. జనసేనను చాలా తేలిగ్గా తీసుకున్నారు. పవన్‌ కల్యాణ్‌ను అసలు లెక్కలోకే తీసుకోలేదు. ఆయనది పార్టీనే కాదన్నట్లు చూశారు.

pk pk 24032019

ప్రచారంలో టీడీపీ, చంద్రబాబునే టార్గెట్‌గా చేసుకున్నారు. గతంలో వైసీపీ ఘోరంగా దెబ్బతిన్న ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాజకీయ వేదికలుగా పేరున్న కృష్ణా, గుంటూరు జిల్లాలపై జగన్‌ ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాజకీయ దురంధరులుగా పేరొందిన, ఓటమి ఎరుగని తెలుగుదేశం ముఖ్య నేతలపై గురి పెట్టారు. వారి బలాలు, బలహీనతలను బేరీజు వేశారు. వీరికి హైదరాబాద్‌లో ఆస్తులుంటే లొంగదీసుకునే బాధ్యతను పొరుగు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించినట్లు తెలిసింది. నామినేషన్ల ఘట్టం సోమవారంతో ముగియనుంది. ఆ లోగా వారిపై చివరి అస్త్రాలను సంధించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు వైసీపీ అధ్యక్షుడు జగన్‌ నుంచి ఇచ్ఛాపురంలోని ఆ పార్టీ అభ్యర్థి దాకా అందరూ జనసేనను చూసి భయపడుతున్నట్లు తెలుస్తోంది. కారణం.. తాజాగా వైసీపీ రాజకీయ సలహాదారు ప్రశాంత్‌ కిశోర్‌(పీకే) నిర్వహించిన సర్వే! ఆ సర్వేలో జగన్‌కు ఆందోళన కలిగించే విషయం వెల్లడైందని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

pk pk 24032019

ఇంతకాలం అధికార తెలుగుదేశం పార్టీపైనే దృష్టి సారించి జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను జగన్‌ తేలిగ్గా తీసుకున్నారు. కానీ, పవన్‌ ప్రభావం ఏంటి? ఆయన వల్ల ఎదురయ్యే ఇబ్బందులేంటన్న విషయం పీకే నివేదికతో జగన్‌కు బోధపడినట్లు తెలుస్తోంది. కోస్తా జిల్లాల్లో పవన్‌ వైసీపీకి కలిగించే నష్టం ఏ మేరకు ఉండనుందో తెలుసుకున్నట్లు సమాచారం. అంతేకాదు పవన్‌ తన ప్రసంగాల్లో జగన్‌-కేసీఆర్‌, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలనూ ఎండగడుతున్నారు. భీమవరం సభలో తెలంగాణ సర్కారు, వైసీపీ నేతల తీరును కడిగిపారేసిన సంగతి తెలిసిందే. భయపడితే బెదిరిపోయేవారెవరూ లేరని, తెలంగాణలో ఆస్తులను లాక్కుంటారా? అదీ చూసుకుందామని.. సవాలు చేశారు. పవన్‌ ఎదురుదాడి ప్రారంభించడంతో జగన్‌ అప్రమత్తమైనట్లు సమాచారం. ఇకపై టీడీపీ అధినేత చంద్రబాబు కంటే పవన్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పవన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడిని కొనసాగించాలని వైసీపీ అభ్యర్థులకు జగన్‌ స్పష్టం చేసినట్లు సమాచారం. మొత్తంమీద పవన్‌ను చూసి వైసీపీ అభ్యర్థులు భయపడుతున్నారని రాజకీవర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది.

ఇప్పటికే మన రాష్ట్రం పై, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, అతని బ్యాచ్ ఎలాంటి దాడి చేస్తున్నారో చూస్తున్నాం. జగన్ మోహన్ రెడ్డిని అడ్డు పెట్టుకుని, మన రాష్ట్రం పై ఆధిపత్యానికి, చంద్రబాబుని దెబ్బ కొడుతూ, రిటర్న్ గిఫ్ట్ డ్రామా ఆడుతున్నారు. మరో పక్క హైదరాబాద్ సినీ బ్యాచ్ అయిన పోసాని, మోహన్ బాబు, లాంటి వాళ్ళు మన రాష్ట్రం పై ఎలాంటి దాడి చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు వచ్చిన మరో కొత్త ఐటెం చిన్ని కృష్ణా అనే మరో హైదరాబాద్ సినీ వ్యక్తి. కేసీఆర్ కు గులాం లు కొట్టే వీళ్ళు, మన రాష్ట్రం పై దండ యాత్రకు వస్తున్నారు. కేసీఆర్ డైరెక్ట్ గా మాట్లాడితే, ఎక్కడ జగన్ కు ఇబ్బంది అవుతుందో అని, ఇలాంటి వాళ్ళ చేత మాట్లడనిస్తున్నారు.

108 26112018 1

పవన్ కళ్యాణ్ కేసీఆర్ అని విమర్శలు చేస్తున్నారని, పొడుచుకు వచ్చిన ఈ సినీ బ్యాచ్, రోజుకి ఒకళ్ళు వచ్చి, విరుచుకు పడుతున్నారు. పవన్ కళ్యాణ్ విమర్శలకు సమాధానం ఇస్తూ, ఎగువ రాష్ట్రాలకు దిగువ రాష్ట్రాలు తలొగ్గి ఉండాలని చిన్నికృష్ణ వ్యాఖ్యానించారు. ఎన్నికల తర్వాత నేను నోరు తెరిస్తే నవరంధ్రాలు మూసుకోవాల్సి వస్తుంది అని పవన్ కల్యాణ్‌ను చిన్నికృష్ణ హెచ్చరించాడు.చిరంజీవి ఫ్యామిలీ సినీ పరిశ్రమకు చేసింది ఏమీ లేదని, ఓట్ల కోసం ప్రజలను మెగా ఫ్యామిలీ మభ్య పెడుతోందని ఆరోపించారు. తెలంగాణ పోలీసులపై నమ్మకం లేదని చంద్రబాబు, ఇంకో వ్యవస్థపై నమ్మకం లేదని పవన్ కల్యాణ్ అనడం తప్పు. అని చిన్ని కృష్ణ తీవ్రంగా స్పందించారు.

108 26112018 1

అయితే, ఇక్కడ పవన్ ను విమర్శలు చెయ్యొచ్చు, కేసీఆర్ కు భజన చేసుకోవచ్చు, ఎవరికీ ఇబ్బంది ఉండదు. కాని, ఎగువ రాష్ట్రాలకు దిగువ రాష్ట్రాలు తలొగ్గి ఉండాలని చెప్పటం ఎంత ఖండ కావరం ? తెలంగాణాకి క్రింద రాష్ట్రమైన ఏపీ తెలంగాణాకి తలొగ్గి ఉండాలా! ఎగువరాష్ట్రం క్రింద దిగువరాష్ట్రం తలొగ్గి ఉండాల్సిందేనని చెప్తున్నాడు! చిన్నికృష్ణ, సినీరచయిత అంట! నీకు తెలంగాణాలో నాలుగు ఆస్తులు ఉండగానే, కేసీఆర్ భజన చెయ్యాలా ? అయిదు కోట్ల మంది ప్రజల్ని బానిసగా బ్రతకమంటావా! వందల కోట్లు ఆస్తులున్నోళ్లే కెసిఆర్ కి బెదరక ఎదురు తిరిగారు... నువ్వెంత.. నువ్వు ఎవరివి మమ్మల్ని తలొగ్గి బ్రతకమని చెప్పటానికి!

కృష్ణాజిల్లాలో మిత్రపక్షం సీపీఐకి కేటాయించిన రెండు స్ధానాల్లో పోటీ చేయాలని చివరి నిమిషంలో జనసేన తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది. జనసేన వైఖరికి నిరసనగా ఆ పార్టీతో తెగదెంపులు చేసుకోవాలని సీపీఐ నాయకత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. జనసేన తీరుకు నిరసనగా విజయవాడ పశ్చిమ సీటు నుంచి పోటీకి సీపీఐ సిద్ధమవుతుండటం ఇరు పార్టీల పొత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తోంది. ఏపీలో పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. రాష్ట్రంలో పార్టీలన్నీ దాదాపుగా ఒంటరిపోరుకు సిద్ధమైన వేళ.. జనసేన మాత్రం వామపక్షాలతో పొత్తు పెట్టుకుని చెరో ఏడు అసెంబ్లీ సీట్లు కేటాయించింది. వీటిలో సీపీఐకి కేటాయించిన కృష్ణాజిల్లా నూజివీడు సీటును జనసేన చివరి నిమిషంలో వెనక్కి తీసుకుంది. నూజివీడు అసెంబ్లీ సీటుకు బదులుగా విజయవాడ ఎంపీ సీటును సీపీఐకి ఆఫర్ చేసింది. దీంతో ఆ పార్టీ తరఫున న్యాయవాది చలసాని అజయ్ కుమార్ బరిలో నిలిచారు.

pk 2224020102019 2

కానీ నిన్న విజయవాడలో జరిగిన జనసేన ప్రచార సభలో పవన్ కళ్యాణ్ సీపీఐకి మరోసారి షాక్ ఇచ్చారు. విజయవాడ లోక్ సభ సీటు నుంచి జనసేన బరిలో ఉంటుందని తేల్చిచెప్పిన పవన్... తమ పార్టీ తరఫున ముత్తంశెట్టి ప్రసాద్ బాబు పోటీ చేస్తారని సంచలన ప్రకటన చేశారు. మిత్రపక్షాలకు కేటాయించిన స్ధానంలో జనసేన పోటీకి గల కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. పవన్ ఏకపక్ష వైఖరిపై సీపీఐ మండిపడుతోంది. తొలుత నూజివీడు అసెంబ్లీ సీటు కేటాయించి వెనక్కి తీసుకున్న జనసేనాని, ఇప్పుడు ఏకంగా విజయవాడ ఎంపీ సీటులోనూ బరిలోకి దిగుతానని ప్రకటించడంపై సీపీఐ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తక్షణం జనసేనతో తెగదెంపులు చేసుకుని ఒంటరిగా బరిలోకి దిగుదామని అధినాయకత్వానికి ప్రతిపాదిస్తున్నారు. అదే సమయంలో విజయవాడ ఎంపీ సీటు అన్యాయంగా లాక్కున్నందుకు నిరసనగా తాము ఇప్పటికే జనసేన పోటీ చేస్తున్న విజయవాడ పశ్చిమ అసెంబ్లీ సీటులో పోటీకి దిగుతామని సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ హెచ్చరిస్తున్నారు.

pk 2224020102019 3

వాస్తవానికి ఎన్నికలకు రెండు నెలల ముందే వామపక్షాలతో మాత్రమే పొత్తు ఉంటుందని ప్రకటించిన పవన్.. చివరి నిమిషంలో బీఎస్పీతో కూడా పొత్తు కుదుర్చుకున్నారు. వారికి 3 ఎంపీ సీట్లతో పాటు 21 అసెంబ్లీ సీట్లు కూడా కేటాయించారు. సీపీఎం, సీపీఎంలకు చెరో 7 అసెంబ్లీ సీట్లు, 5 ఎంపీ సీట్లు కేటాయించారు. కానీ చివరి నిమిషంలో సీపీఐ పోటీ చేసే సీట్లలో నూజివీడు వెనక్కి తీసుకుని జనసేన బరిలో ఉంటుందని ప్రకటించారు. నిన్న విజయవాడ ఎంపీ సీటు కూడా జనసేన తీసుకోవడంతో సీపీఐ నేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మిత్రధర్మాన్ని గౌరవించకుండా జనసేన ఏకపక్షంగా వ్యవహరిస్తోందని సీపీఐ నేతలు మండిపడుతున్నారు.... నూజివీడు, విజయవాడ ఎంపీ సీట్లు వెనక్కి తీసుకోవడం వెనుక భారీగా డబ్బులు చేతులు మారాయని సీపీఐ విజయవాడ ఎంపీ అభ్యర్ధి చలసాని అజయ్ కుమార్ ఆరోపిస్తున్నారు. మరో రెండు రోజుల్లో అన్ని విషయాలు బయటపడతాయని చలసాని వెల్లడించారు. దీంతో జనసేన తీరుపై కమ్యూనిస్టుల ఆగ్రహం ఎన్నికల ఫలితాలపై పడుతుందనే ఆందోళన కూడా ఇరుపార్టీల్లో వ్యక్తమవుతోంది.

సినిమాలకు, రాజకీయాలకు విడదీయలేని అనుబంధం ఉంది. వెండితెరపై ఓ వెలుగు వెలిగి రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేసినవారు ఎందరో ఉన్నారు. వారిలో ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత ముఖ్యమంత్రులుగా పనిచేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఎన్నికలు వచ్చాయంటే తారలు ఏదో ఒక పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా మారిపోతారు. ప్రస్తుత ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తోన్న అభ్యర్థి మాగంటి రూప సీనీ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందినవారే. ఆమె నటుడు మురళీ మోహన్ కోడలు కాగా, ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీచేస్తే యువకుడు మార్గాని భరత్ రామ్ కూడా నటుడే కావడం విశేషం.

rajahmundry 24032019

ఇక, 2017లో ఓయ్ నిన్నే అనే చిత్రంతో నటుడిగా భరత్ పరిచయమయ్యారు. అయితే, భారీ తారాగణంతో రూపొందించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు. ఆ తర్వాత భరత్ సినిమాలకు విరామం ఇచ్చి, రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన భరత్ తండ్రి మార్గాని నాగేశ్వరరావు పారిశ్రామికవేత్త. ఆర్ధికంగా బాగా స్ధితిమంతుడు. వీటిని పరిగణనలోకి తీసుకునే భరత్‌కు వైసీపీ అధినేత టిక్కెట్టు కేటాయించారు. భరత్ కొద్ది రోజులు టీడీపీలోనూ బాగా యాక్టివ్‌గా పనిచేశారు. మంత్రి నారా లోకేశ్‌కు భరత్ సన్నిహితుడిగా ప్రచారం జరగ్గా, ఆయనకు రాజమండ్రి రూరల్‌ టిక్కెట్టిస్తామని ఆయన హామీ కూడా ఇచ్చారని అప్పట్లో ప్రచారం జరిగింది.

rajahmundry 24032019

కానీ, అనూహ్యంగా భరత్ రామ్ వైసీపీ అభ్యర్థిగా రాజమండ్రి లోక్‌సభ నుంచి పోటీచేస్తున్నారు. ఇక్కడ నుంచి జనసేన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యన్నారాయణ బరిలో ఉన్నారు. దీంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకుంది. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంలో పరిధిలో మూడు ప్రధాన పార్టీలూ బలంగా ఉండటంతో హోరాహోరీ పోరు తప్పదని తెలుస్తోంది.

Advertisements

Latest Articles

Most Read