పాడేరులో వైసీపీ అధినేత జగన్‌ ఎన్నికల ప్రచార సభ రసాభాసగా మారింది. పాడేరు వైసీపీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. జగన్ సమక్షంలోనే పాడేరు వైసీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మికి వ్యతిరేకంగా ఆ పార్టీ పాడేరు సమన్వయకర్త మత్యరాస విశ్వేశ్వరరాజు అభిమానులు నినాదాలు చేశారు. జగన్ సభలో ప్రసంగిస్తున్న సమయంలోనే వైసీపీ జెండాలు, ప్లెక్సీలను విశ్వేశ్వరరాజు వర్గీయులు తగులబెట్టారు. అక్కడే ఉన్న పోలీసులు ఆందోళనకారులను చదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే వైసీపీకి సీనియర్ నేత మత్యరాస బాలరాజును పోలీసులు కొట్టారు. ఈ నేపథ్యంలోనే వైసీపీలో ఉన్న వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలోనే ఆయన వైసీపీకి రాజీనామా చేశారు.

108 26112018 1

ఆదివారం విడుదల చేసిన వైసీపీ అభ్యర్థుల జాబితాలో మాజీ సమన్వయకర్త కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి పేరు కనిపించడంతో విశ్వేశ్వరరాజు ఖిన్నులయ్యారు. ఆయన వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నర్సీపట్నంలో నిర్వహించిన రోడ్‌షోలో వైసీపీ అధినేత జగన్‌ ప్రసంగిస్తుండగా విశ్వేశ్వరరాజు మద్దతుదారులు ‘భాగ్యలక్ష్మి వద్దు... విశ్వేశ్వరరాజు ముద్దు’ అంటూ నినాదాలు చేస్తూ ఫ్లెక్సీలను ప్రదర్శించారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన గిడ్డి ఈశ్వరి.... అనంతరం ఏర్పడిన రాజకీయ పరిణామాలతో టీడీపీలో చేరారు. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు కూడా ఆమె బాటలో నడిచారు. దీంతో వైసీపీకి పెద్దదిక్కులేని పరిస్థితి ఏర్పడింది.

108 26112018 1

మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి చిట్టినాయుడు కుమార్తె భాగ్యలక్ష్మిని సమన్వయకర్తగా అధిష్ఠానంనియమించింది.. అయితే ఆమె అందర్నీ కలుపుకుని వెళ్లడంలేదని, ఆశించిన స్థాయిలో పార్టీని బలోపేతం చేయలేకపోతున్నదని భావిస్తూ కొద్ది రోజులకే సమన్వయకర్త పదవి నుంచి తప్పించారు. ఆమె స్థానంలో జి.మాడుగులకు చెందిన న్యాయవాది మత్స్యరాస విశ్వేశ్వరరాజును నియమించారు. ఏడాది నుంచి నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో పాడేరు టిక్కెట్‌ తనకేనని అధిష్ఠానం హామీ ఇచ్చినట్టు చెప్పేవారు. అయితే విశ్వేశ్వరరాజుతోపాటు మాజీ ఎమ్మెల్యే దేముడు కుమార్తె మాధవి, మాజీ సమన్వయకర్త భాగ్యలక్ష్మి కూడా పాడేరు టిక్కెట్‌నే ఆశించారు. వాల్మీకి తెగకు చెందిన చెట్టి ఫాల్గుణకు అరకులోయ ఎమ్మెల్యే టిక్కెట్‌, భగత తెగకు చెందిన తనకు పాడేరు ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇస్తారని విశ్వేశ్వరరాజు భావించారు.

"వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి ఇటీవల దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా రేపల్లెలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 48 పేజీలతో జగన్‌ ఎన్నికల అఫిడవిట్‌ దాఖలు చేశారన్నారు. "20 పేజీల్లో నేర చరిత్ర, మరో 20 పేజీల్లో ఆర్థిక నేరాలు. 31 కేసులున్న ఏకైక వ్యక్తి జగన్. నేనేమీ నేరాలు చేయలేదన్నట్లు జగన్‌ నటిస్తున్నారు. ఫాం-7తో వైసీపీ నేతలు ఓట్లు తొలగించాలని చూశారు. తెలంగాణలో కేసీఆర్‌ ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేశారు. ఎమ్మెల్యేలను కొని కేసీఆర్‌ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు" అని బాబు చెప్పుకొచ్చారు.

108 26112018 1

జగన్‌ ప్రతిపక్ష నాయకుడిగా గత ఐదేళ్లలో కేవలం 23 సార్లు మాత్రమే అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆయనపై ఉన్న కేసుల వాయిదాల కోసం మాత్రం 240సార్లు కోర్టు మెట్లు ఎక్కారు. పోలింగ్‌ తేదీ శుక్రవారం వస్తే... తన ఓటు తాను వేసుకోలేరు! జగన్‌ వస్తే అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టులు ఆగిపోతాయి. ఓట్లే దొంగిలించిన వ్యక్తి ఏ ఒక్కరి భూములను వదిలిపెట్టడు. జగన్‌కు ఓటేసే మోదీకి వేసినట్లేనని ముస్లిం సోదరులు గుర్తించాలి. జగన్‌ ధోరణి ‘లోటస్‌ పాండ్‌ ముద్దు... అమరావతి వద్దు’ అన్నట్లుగా ఉంది. ఒక్కరోజు కూడా ఆయన ఇక్కడ నిద్రపోలేదు. అమరావతి కడితే హైదరాబాద్‌కు పోటీ వస్తుందన్న భయం కేసు కేసీఆర్‌కు పట్టుకుంది. సైబరాబాద్‌ నిర్మాణం తర్వాత అప్పటి కర్ణాటక సీఎం... ‘మీతో పోటీపడలేను. కలిసి పని చేస్తాను’ అని ముందుకొచ్చారు. అమరావతి రాజధాని శంకుస్థాపన సమయంలో రూ.500 కోట్లు భిక్షం వేయాలని కేసీఆర్‌ అనుకున్నారట! భిక్షం వేయక్కర్లేదు. విభజన తర్వాత సీమాంధ్రకు దక్కాల్సిన రూ.లక్ష కోట్ల ఆస్తులు ఇవ్వు. హైదరాబాద్‌ ఆస్తులపై మాకూ హక్కు ఉంది!" అని చంద్రబాబు అన్నారు.

108 26112018 1

ఏ పనిచేసినా గౌరవప్రదంగానే.. "దేశంలో ఒకేసారి రుణమాఫీ చేసిన ఘనత మాదే. రూ.24,500 కోట్ల రైతు రుణమాఫీ చేశాం. రైతులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం. వ్యవసాయంలో 11శాతం వృద్ధి సాధించాం. కరువు, తుపాన్లు వచ్చినా ఉక్కు సంకల్పంతో ముందుకెళ్లాం. రైతుల జీవితాల్లో వెలుగువచ్చే వరకు అండగా ఉంటాను. రైతులకు అన్నదాత సుఖీభవ నిరంతరం కొనసాగుతుంది. కౌలు రైతులకు ఖరీఫ్‌ నుంచి అన్నదాత సుఖీభవ అమలు. డ్రైవర్ల కోసం సాధికార సంస్థ ఏర్పాటు చేశాం. నేనూ ఓ డ్రైవర్‌గా రాష్ట్రానికి సురక్షిత పాలన అందిస్తున్నా. అన్నా క్యాంటీన్లతో రుచికరమైన భోజనం అందిస్తున్నాం. కేఎఫ్‌సీ స్థాయిలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. ఏ పనిచేసినా గౌరవప్రదంగా, పద్ధతిగా చేశా. ఒకే ఏడాదిలో పట్టిసీమను పూర్తిచేసి కృష్ణాడెల్టాకు నీరిచ్చా. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంతో చరిత్ర సృష్టించాం పట్టిసీమకు వైసీపీ నేతలు అడ్డుపడ్డారు. కాల్వలకు గండి కొట్టి దుర్మార్గంగా, అమానుషంగా ప్రవర్తించారు. రాజధానికి రైతులు భూములిస్తే చెరుకు తోటలను తగులబెట్టారు" అని వైసీపీపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు పి.గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి షాక్‌ ఇచ్చారు. టీడీపీ టికెట్‌ దక్కకపోవడంతో వైసీపీలో చేరేందుకు వెళ్లి చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం టికెట్‌ను చంద్రబాబు వేరే వ్యక్తికి కేటాయించడంతో పులపర్తి టీడీపీకి రాజీనామా చేశారు. శనివారం వైసీపీలో చేరాలని నిర్ణయించుకుని పిఠాపురంలో జరిగిన జగన్‌ బహిరంగ సభకు హాజరయ్యారు. జగన్‌ ప్రసంగం ముగిశాక బస్సెక్కి ఆయనతో కరచాలనం చేసి కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం జగన్‌ కండువా వేసేందుకు ప్రయత్నించగా పులపర్తి తిరస్కరించారు. ఒప్పించేందుకు ప్రయత్నించినా అంగీకరించలేదు. జగన్‌ అవాక్కయ్యారు. తన చేతిలోనున్న కండువాను పక్కనున్న నేత చేతిలో పెట్టి పులపర్తిని పంపేయాలని సైగలు చేశారు.

108 26112018 1

ప్రజలకు అభివాదం చేసి పులపర్తి బస్సు దిగిపోయారు. తిరిగి వెళ్లిపోతూ మీడియాతో మాట్లాడారు. కొన్ని కారణాల వల్ల వైసీపీలో చేరలేదని, అక్కడ ప్రవర్తన, నియమాలు చూసి చేరకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు. చంద్రబాబు తనకు చేసిన అన్యాయం పెద్దదేం కాదని చెప్పి వెళ్లిపోయారు. పులపర్తి తనకు ఎమ్మెల్సీ కావాలని అడిగారని.. ముందు మీరు పార్టీలో చేరండి... అన్ని విషయాలూ చర్చిద్దామని జగన్‌ ఆయనతో అన్నారని తెలిసింది. ఇదే సమయంలో జగన్‌ బలవంతంగా కండువా వేయడానికి ప్రయత్నించగా పులపర్తి ప్రతిఘటించారు. దీనిపై ఎమ్మెల్యేను రాత్రి 11 గంటల సమయంలో మీడియాతో ఫోనులో సంప్రదించగా.. కొందరు వైసీపీ నాయకులు తనను బలవంతంగా పిఠాపురం తీసుకెళ్లారని, వైసీపీలో చేరితే ఉన్నత పదవి ఇస్తారని హామీ ఇచ్చారని చెప్పారు. అక్కడకు వెళ్లాక జగన్‌ స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో తాను వెనుదిరిగివచ్చినట్లు తెలిపారు. టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

108 26112018 1

ఇక మరో పక్క, సార్వత్రిక ఎన్నికల్లో విజయావకాశాలపై జిల్లాలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ధీమాతో ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, నేతలు గత అయిదేళ్లలో చేపట్టిన అభివృద్ధిని ఓటర్లకు వివరిస్తున్నారు. గత అయిదేళ్లలో అభివృద్ధి కుంటుపడిందంటూ వైకాపా ప్రచారాన్ని నిర్వహిస్తుండగా రాష్ట్రానికి జరిగిన అన్యాయం, అసంబద్ధ పొత్తుల అస్త్రాలను జనసేన సంధిస్తోంది. ఇలా అన్ని పార్టీల అభ్యర్థులు, నేతలు తమ అనుకూల అంశాలతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు.జిల్లాలో తెదేపా, వైకాపా, జనసేన, కాంగ్రెస్, భాజపా, సీపీఎం అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు తమ అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేశాయి.మరికొందరు స్వతంత్రంగా రంగంలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. నామినేషన్ల ప్రక్రియ దాదాపుగా చివరి అంకానికి చేరింది. సోమవారం ఒక్కరోజే గడువు ఉండడంతో ఆరోజు మిగిలిన అభ్యర్థులంతా నామపత్రాల దాఖలుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఏపీలో జగన్‌ గెలిస్తే కేసీఆర్‌ గెలిచినట్లేనని.. వైసీపీ అభ్యర్థి గెలిస్తే ఆం ధ్రుల ఆత్మగౌరవం పోయినట్లేనని జనసేనాధిపతి పవన్‌ క ల్యాణ్‌ అన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కించపరుస్తుంటే వైసీపీ అధినేత జగన్‌ ఒక్క మాట కూడా అనకపోవడం ఆశ్చర్యంగా ఉందని ధ్వజమెత్తారు. కృష్ణాజిల్లా మైలవరం, నూజివీడు, విజయవాడల్లో శనివారం ప్రచార సభల్లో పాల్గొన్నారు. ‘ఆంధ్రా నాయకులెవ్వరూ తెలంగాణకు రాకూడదుగానీ.. తెలంగాణ నాయకులు వచ్చి ఆంధ్రాలో చేయొచ్చా వైసీపీ ద్వారా? నాకు నచ్చలేదా మాట. మీకు నచ్చిందామ్మా? వైసీపీ నాయకులు అలా చెయ్యొచ్చా?’ అని ప్రజలనుద్దేశించి ప్రశ్నించారు. ఏపీలో తెలంగాణ నేతల పెత్తనం ఏమిటని నిలదీశారు. ‘ఇక్క డ వైసీపీ అభ్యర్థి గెలిస్తే.. అక్కడ మనల్ని తిట్టిన కేసీఆర్‌ గెలిచినట్టేనమ్మా. అది మీరు అర్థం చేసుకోవాలి.

108 26112018 1

‘ఆంధ్రులు ద్రోహులు’ అని తిట్టిన కేసీఆర్‌ గెలిచినట్టే. వైసీపీ అభ్యర్థి గెలిచా డు ఇక్కడ అంటే.. ఆంధ్రుల ఆత్మగౌరవం పోయినట్టే. గుర్తుపెట్టుకోండి. మనల్నెవరైనా ఛీకొడితే వాళ్లని భుజానికెత్తుకుంటా మా?’ అన్నారు. ‘‘ఆంధ్రులకు ఆత్మగౌరవం లేదా? ఆంధ్రులకు పౌరుషం రాదా? ఆంధ్రులెంతసేపూ బానిసలా మీరు? తిట్టించుకుంటా ఉండాలా మీచేత మేము?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాట్లాడితే జగన్‌గారు బీసీ సభలు బీసీ సభలు అంటాడు. తెలంగాణలో ఒక్కదెబ్బకి బీసీల్ని ఓసీల్ని చేశారు. దానికి మీరెళ్లి కేసీఆర్‌గారితో మాట్లాడండి. తీసేయమని అడగండి. మళ్లీ అవి తియ్యరు. ‘నేను ముఖ్యమంత్రి అయ్యాక చేస్తాను’ అంటారు. అప్పుడేముంటుంది? బూడిద ఉంటుంది’ అని మండిపడ్డారు. కేసీఆర్‌కు ధైర్యం ఉంటే జనసేన అభ్యర్థుల మీద టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల్ని ఏపీలో పోటీలో పెట్టాలని సవాల్‌ విసిరారు.

 

108 26112018 1

కేసీఆర్‌ చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్టు ఇవ్వాలంటే అభ్యర్థుల్ని పోటీలో పెట్టి ఇచ్చుకోవాలి తప్ప జగన్‌కు దొడ్డిదారి మద్దతు ఇస్తే సహించేది లేదన్నారు. జగన్‌ను హైదరాబాద్‌లో తిరగనివ్వబోమని ప్రగల్భాలు పలికిన కేసీఆర్‌.. ఆయనకు ఇప్పుడెలా సహకరిస్తున్నారని నిలదీశారు. ఇది ఇలా ఉంటే, తెలంగాణను పాకిస్థాన్ తో పోల్చినందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. రాష్ట్ర అడ్వొకేట్ జేఏసీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు. రెండు రోజుల క్రితం భీమవరంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం పవన్ కల్యాణ్ పర్యటించిన వేళ, పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం పాకిస్థాన్ లా మారిందని నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో లబ్ది కోసం ఆయన తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని, మా ముఖ్యమంత్రి కేసీఆర్ పై నోరు పారేసుకుంటున్నారని అడ్వొకేట్ జేఏసీ ఫిర్యాదు చేసింది.

Advertisements

Latest Articles

Most Read