ఎన్నికల ముంగిట జరిగిన వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో రాజకీయ పార్టీలకు ముడిసరుకుగా మారింది. వివేకానంద హత్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ సూత్రధారులు, మంత్రి ఆదినారాయణరెడ్డి పాత్రధారి అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించగా, హత్యను సహజ మరణంగా చిత్రీకరించడానికి ప్రయత్నించింది ఎవరో తేలాల్సి ఉందని ముఖ్యమంత్రి బదులిచ్చారు. నిజానికి ఈ హత్యోదంతం ఆసాంతం మిస్టరీగా అనిపిస్తోంది. వివేకానందరెడ్డి తన స్వగృహంలో హత్యకు గురయ్యారు. ఆయన దారుణ హత్యకు గురైతే గుండెపోటుతో మరణించారని బంధువర్గం తొలుత ప్రచారం చేసింది. జగన్మోహన్‌రెడ్డి సొంత చానల్‌లో కూడా వివేకాది సహజ మరణంగా ప్రచారం చేశారు. తెల్లవారుజామున హత్య జరిగితే ఆయన గుండెపోటుతో మరణించారని నమ్మించే ప్రయత్నం చేయడానికి కారణం ఏమిటి? అందుకు కారకులు ఎవరు? తేలితే తప్ప.. ఈ హత్య మిస్టరీ వీడదు.

108 26112018 1

రాజకీయ పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలు పక్కనపెడితే వివేకానందరెడ్డి హత్యకు గురైన విషయాన్ని కుటుంబసభ్యులు ఎందుకు బయటకు చెప్పలేదు? వివేకానంద శరీరంపై గాయాలున్నాయని మీడియా సందేహాలు వ్యక్తంచేయడం, పోస్టుమార్టం నివేదికలో ఆయన హత్యకు గురయ్యారన్న విషయం నిర్ధారణ అయ్యే వరకు జరిగింది హత్య అని కుటుంబసభ్యులు, బంధువులు ఎందుకు చెప్పలేదో తెలియదు. వివేకా హత్యకు గురయ్యారని పోలీసులు ప్రకటించిన తర్వాతే రాజకీయాలు మొదలయ్యాయి. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తీరిగ్గా శుక్రవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ వివేకా హత్య వెనుక చంద్రబాబు హస్తముందని ఆరోపించారు. మరీ మూడు వారాల్లో ఎన్నికలు పెట్టుకుని ఏ రాజకీయ పార్టీ అయినా, ముఖ్యంగా అధికార పార్టీ హత్యలు చేయిస్తుందా? అని ఒక విలేకరి వేసిన ప్రశ్నకు విజయసాయిరెడ్డి నీళ్లు నమిలారు. ఈ హత్యోదంతంలో అసలు ఏం జరిగిందన్నది ఇప్పుడు పరిశీలిద్దాం. సమీరా అనే మహిళ పేరిట ఉన్న ఫోన్‌ నుంచి వివేకానందరెడ్డికి అర్ధరాత్రి 1:30 గంటలకు ఒక మెసేజ్‌ వచ్చింది. ‘‘నీ కూతురు వల్ల మేం నాశనమయ్యాం. ఇందుకు తగిన శిక్ష అనుభవిస్తావు. దేవుడు ఉన్నాడు’’ అన్నది ఆ సందేశం సారాంశం.

108 26112018 1

దీన్ని ఒక రెడ్డిగారు పంపారు. ఆ తర్వాత మరో మూడు మెసేజ్‌లు కూడా వివేకానందకు వచ్చాయి. అప్పటికే తెల్లవారుజామున మూడున్నర గంటలు అయింది. అయితే ఈ మూడు మెసేజ్‌లను వివేకా తొలగించారు. ఆ మెసేజ్‌ల సారాంశం ఏమిటన్నది పోలీసుల దర్యాప్తులో కానీ తేలదు. దీన్నిబట్టి తెల్లవారుజామున మూడున్నర గంటల వరకు వివేకానంద జీవించే ఉన్నారని భావించవలసి ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది తేలాల్సి ఉంది. బెడ్‌రూములో హత్య చేసి మృతదేహాన్ని బాత్‌రూమ్‌కు తరలించారు. ఈ క్రమంలో ఆయన శరీరంపై ఉన్న దుస్తులను కూడా మార్చారని పోలీసులు అనుమానిస్తున్నారు. శవం బెడ్‌రూమ్‌లో కాకుండా బాత్‌రూమ్‌లో ఎందుకు పడి ఉంది? బెడ్‌రూమ్‌లో ఉన్న రక్తపు మరకలను శుభ్రపరిచింది ఎవరు? ఆ అవసరం ఎవరికి ఉంది? శరీరంపై అన్ని గాయాలున్న విషయం తెలిసి కూడా వివేకానందది సహజ మరణం అని ప్రచారం చేయవలసిన అవసరం ఏమిటి? ఇలాంటి పలు ప్రశ్నలకు సమాధానాలు లభించిన తర్వాతే ఈ మిస్టరీ వీడుతుంది. వివేకానంద మరణవార్త తెలిసిన తర్వాత ఆయన బంధువులే హత్య జరిగిన ఇంట్లోకి వెళ్లారు. వారెవ్వరికీ ఆయన హత్యకు గురయ్యారన్న విషయం ఎలా తెలియలేదు? తీవ్ర గాయాలతో చనిపోయి ఉన్న వివేకానంద భౌతికకాయాన్ని పోలీసులకు అప్పగించకుండా బంధువులే ఆస్పత్రికి ఎందుకు తరలించారు? బంధువుల చర్యను స్థానిక పోలీసులు ఎందుకు అడ్డుకోలేదు? మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించిన తర్వాత కూడా హత్య జరిగిందని ఫిర్యాదు ఇవ్వకపోవడానికి కారణం ఏమిటి? వంటి పలు ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది.

 

 

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఏలూరులో తాను నమోదు చేసుకున్న ఓటు తొలగించాలని ఎన్నికల సంఘం అధికారులను కోరినా ఆ ఓటు తొలగించలేదు. విజయవాడ తూర్పులో తాజాగా ఓటు నమోదు చేయించుకోవడంతో ప్రస్తుతం రెండు చోట్ల ఆయనకు ఓటు ఉన్నట్లయింది. పవన్‌ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్‌ ఒక ప్రకటనలో ఈ విషయం పేర్కొన్నారు. సర్వర్‌ సరిగా పనిచేయకపోవడం వల్ల తాము రెండో ఓటు తొలగించలేకపోతున్నామని అధికారులు చెబుతున్నట్లు ఆ ప్రకటన స్పష్టం చేసింది. సాక్షాత్తూ ఒక పార్టీ అధినేతకే ఈ పరిస్థితి ఎదురయితే సామాన్య ఓటరు సంగతి ఏమిటోనని ఆ ప్రకటనలో విమర్శించారు. పవన్‌కల్యాణ్‌ తొలుత తన ఓటును ఏలూరు నియోజకవర్గంలో నమోదు చేయించుకున్నారు.

108 26112018 1

ఆ తర్వాత ఓటును విజయవాడ తూర్పు నియోజకవర్గానికి బదిలీ చేయాలని కోరారు. ఆయన కోరిక మేరకు విజయవాడ తూర్పునకు ఓటు బదిలీ చేసినా ఏలూరు నియోజకవర్గంలో తొలగించలేదు. దీంతో రెండు చోట్ల ఆయన ఓటు కనిపిస్తోంది. ఈ విషయమై ఎన్నికల ముఖ్య కార్యనిర్వహణాధికారికి విన్నవించిన మీదట ఆయన పశ్చిమగోదావరి కలెక్టర్‌కు సిఫార్సు చేశారని జనసేన ఆ ప్రకటనలో పేర్కొంది. తాము తొలగించాలని ప్రయత్నిస్తున్నా ఎన్నికల సంఘం సర్వర్‌ సహకరించడం లేదని కలెక్టర్‌ చెబుతున్నట్లు జనసేన పేర్కొంది. అయితే, పవన్ కల్యాణ్ అధికారుల నుంచి వచ్చిన సమాధానంతో అసహనానికి గురయ్యారు.

108 26112018 1

మొదట ఆయన ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు నమోదు చేయించుకున్నారు. ఆ తర్వాత విజయవాడ తూర్పు నియోజకవర్గానికి తన ఓటును బదిలీ చేయించుకోవాలని భావించి దరఖాస్తు చేసుకున్నారు. పవన్ విజ్ఞప్తి మేరకు ఓటును విజయవాడ బదిలీ చేశారు. కానీ ఏలూరులో ఉన్న ఓటును మాత్రం అలాగే ఉంచారు. దాంతో పవన్ కు రెండు ఓట్లు ఉన్నట్టయింది. రెండు చోట్ల ఓటర్ల జాబితాలో పవన్ కల్యాణ్ పేరు కనిపిస్తోంది. ఈ విషయమై ఎన్నికల అధికారికి పవన్ విజ్ఞప్తి చేయగా, ఆయన జిల్లా కలెక్టర్ కు విషయం చెప్పారు. అయితే, సర్వర్ పనిచేయడం లేదని, అందుకే మీ ఓటు బదిలీ చేయలేకపోతున్నామంటూ కలెక్టర్ సమాధానమిచ్చారు. దాంతో పవన్ కల్యాణ్, ఓ పార్టీకి అధ్యక్షుడ్నయిన తనకే ఇలాంటి పరిస్థితి వస్తే సామాన్యుల సంగతేంటని అసంతృప్తి వ్యక్తం చేశారు.

తెదేపా రెండో విడత అభ్యర్థుల జాబితాను శనివారం అర్థరాత్రి దాటిన తరువాత విడుదల చేసింది. మొత్తం 15 శాసనసభ నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. మరో 34 నియోజకవర్గాలను పెండింగ్‌లో పెట్టింది. చిత్తూరు నియోజకవర్గానికి సిట్టింగ్‌ ఎమ్మెల్యే సత్యప్రభ స్థానంలో ఏఎస్‌ మనోహర్‌కు చోటు కల్పించారు. ఈ నేపథ్యంలో సత్యప్రభను రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించే అవకాశం ఉంది. మదనపల్లె తనకు కేటాయించాలని వైకాపా సిట్టింగ్‌ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి చంద్రబాబును సంప్రదించినా తెదేపాకు చెందిన దమ్మాలపాటి రమేష్‌కే అభ్యర్థిత్వం దక్కింది. అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కొన్ని శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థుల్ని మార్చాలని జేసీ దివాకర్‌రెడ్డి ఒత్తిడి చేయడంతో 4 స్థానాలను పెండింగ్‌లో పెట్టి, దాని పరిధిలోని 3 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. మిగతా వాటిలో మెజార్టీ స్థానాలకు సిట్టింగ్‌లకే పార్టీ అవకాశం కల్పించింది.

harsha 17032019

రెండో జాబితా వివరాలు 1. పాలకొండ- నిమ్మల జయకృష్ణ 2. పిఠాపురం- ఎన్‌వీఎస్‌ఎన్‌ వర్మ 3. రంపచోడవరం- వంతల రాజేశ్వరి 4. ఉంగుటూరు- గన్ని వీరాంజనేయులు 5. పెడన- కాగిత వెంకటకృష్ణ ప్రసాద్‌ 6. పామర్రు- ఉప్పులేటి కల్పన 7. సూళ్లూరుపేట- పరసావెంకటరత్నం 8. నందికొట్కూరు- బండి జయరాజు 9. బనగానపల్లె- బిసి జనార్దన్‌రెడ్డి 10. రాయదుర్గ్‌- కాల్వ శ్రీనివాసులు 11. ఉరవకొండ- పయ్యావుల కేశవ్‌ 12. తాడిపత్రి- జేసీ అస్మిత్‌రెడ్డి 13. మడకశిర- కె.ఈరన్న 14. మదనపల్లి- దమ్మాలపాటి రమేష్‌ 15. చిత్తూరు- ఏఎస్‌ మనోహర్‌

‘‘జగనన్నా.. ఈ నిందలు భరించలేను. నేను చనిపోతున్నా’’ అంటూ సెల్ఫీ వీడియోను సోషల్‌ మీడియాలో విడుదల చేసిన కొద్ది సమయంలోనే వైసీపీ ఎమ్మెల్యే సునీల్‌ కుమార్‌ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అధిక డోసేజ్‌లో మత్తు ఇంజక్షన్‌ చేసుకుని, చేతి మణికట్టు వద్ద కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పూతలపట్టు నుంచి వైసీపీ టికెట్‌పై విజయం సాధించిన సునీల్‌కు తాజా ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్టు ఇవ్వదని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో 4 రోజుల కిందట సునీల్‌ హైదరాబాద్‌లో లోట్‌సపాండ్‌లో జగన్‌ను కలిసేందుకు తన భార్య డాక్టర్‌ మమతారాణితో కలసి వెళ్లారు. అయితే జగన్‌ను కలిసేందుకు అనుమతించలేదు. దీంతో సునీల్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

108 26112018 1

తనపై ఎంత రాజకీయ ఒత్తిడులు వచ్చినా పార్టీకి విధేయుడుగా ఉన్నప్పటికీ తనకు అవకాశం ఇవ్వకపోవడంతో సునీల్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీనికి ముందు తాను పడిన మానసిక ఒత్తిడి, అవమానాలపై సునీల్‌ ఓ సెల్ఫీ వీడియోను తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో దీనిని చూసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సీఐ ఈదురుబాషా, ఎస్‌ఐ చంద్రమోహన్‌ హు టాహుటిన సిబ్బందితో కలసి పలమనేరులోని సునీల్‌ ఇంటికి చేరుకున్నారు. అయితే, ఇంటికి తాళాలు వేసి ఉండడంతో సునీల్‌కు ఫోన్‌ చేశారు. ఫోన్‌ మమతారాణి తీసుకొని తాము క్షేమంగానే ఉన్నామని సమాధానం చెప్పి ఫోన్‌ కట్‌ చేసేశారు. అయితే, స్థానికుల సమాచారం మేరకు ఓ చర్చిలో ఉన్నట్లు తెలుసుకుని, అక్కడకు వెళ్లి పరిశీలించగా అక్కడ సునీల్‌ ఎడమచేతి మణికట్టు వద్ద బ్యాండేజ్‌ కట్టి ఉండడంతో పాటు సెలైన్‌ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన క్యాన్‌లా కుడి చేతికి ఉండడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, ఈ ప్రయత్నాన్ని సునీల్‌ భార్య అడ్డుకున్నారు. తాను డాక్టర్‌నని, వైద్యం చేసుకుంటానని బదులివ్వడంతో పోలీసులు వెనుదిరిగి, అక్కడ కాపలా ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే సునీల్‌ ఆత్మహత్యాయత్నానికి ముందు పూతలపట్టు నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల నుంచే తనకు అనేక అవమానాలు ఎదురయ్యాయని రోదించారు.

 

108 26112018 1

శనివారం సాయంత్రం సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఆవేదన ఆయన మాటల్లోనే.. ‘జగన్‌మోహన్‌రెడ్డి గారికి నమస్కారం. అన్నా.. మీరంటే నాకు చాలా ప్రేమ. మొదటిసారి నాకు టికెట్టు ఇప్పించారు. డాక్టర్‌ అనే గౌరవంతో నాకు ప్రజాసేవ చేసుకునేందుకు ఓ అవకాశం ఇచ్చారు. మీరంటే ఎంత పిచ్చంటే.. నా లోకమే మీదైపోయింది. లేచినప్పటి నుంచి పేపర్లో, టీవీల్లో మీ ముఖం చూస్తే గానీ ఆ రోజు నాకు గడవదు. ఎంతగా నా జీవితం మీతో పెనవేసుకుపోయిందో నేను చెప్పలేను. మీ దగ్గరగా వచ్చినప్పుడు రెండు మూడు మాటల కంటే ఎక్కువ మాట్లాడలేను. అదొక ఆనందం. నేను ప్రేమించే వ్యక్తి, నేను ఆరాధించే వ్యక్తిని దగ్గరగా చూసినప్పుడు నాకు మాటొచ్చేది కాదన్నా. కానీ, గత 10 రోజులుగా నా ప్రమేయం లేకుండా మీడియాలో వచ్చిన కథనాలు, కొంతమంది సొంత పార్టీ నాయకులు ‘ఈ అబ్బాయి టీడీపీ వాళ్లతో అమ్ముడుపోయేందుకు రెడీ అయ్యాడు కాబట్టే.. జగన్‌ గారు టికెట్టు ఇవ్వడం లేదు. ఇతన్ని దూరం పెడుతున్నాడ’ని ప్రచారం చేశారన్నా. నిజంగా నా మనసు చాలా బాధపడుతోందన్నా. మిమ్మల్ని కలిసి, అన్నా నాకు టికెట్టు కూడా అవసరం లేదు. నేను మీ మనిషిగా ఉంటాను. నేను అలాంటి తప్పుడు పని చేయను. నేను కూడా మీరు నమ్మే ఏసు ప్రభువునే ఇష్టపడతాను. ప్రార్థన చేస్తాను. అలాంటిది నా మనసు కుంగిపోయిందన్నా. గత వారం పది రోజులుగా చాలా కన్నీళ్లతో(విలపిస్తూ..) బాధ పడ్డాను. నేను ప్రేమించే వ్యక్తి విశ్వాసాన్ని నేను చూరగొనలేకపోయాను అనే ఒక బాధ. ‘ఈ అబ్బాయి చేతులారా చేసుకున్నాడు. జగన్‌ నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు’ అని మా నాయకులు అంటున్నారు. ఇది తట్టుకోలేకపోతున్నా అన్నా. నాకు ఇద్దరు పిల్లలు. నాకు మంచి జీవితం ఉంది. డాక్టరుగా సంపాదించుకోగలుగుతాను. నేను కచ్చితంగా రాజకీయాల్లో కొనసాగాల్సిన అవసరం లేదు. కానీ, ఈ నిందను భరించలేకపోతున్నా అన్నా. నేను చనిపోదామని నిర్ణయం తీసుకున్నా అన్న. చనిపోయే వ్యక్తి నిజమే మాట్లాడతాడు అని లోకం నమ్ముతుంది.. కాబట్టి నేను చనిపోదలుచుకున్నాను. దయచేసి మిమ్మల్ని అభిమానించే వ్యక్తిగా మీరు నన్ను గుర్తు పెట్టుకుంటే చాలు’

Advertisements

Latest Articles

Most Read