‘టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు సొంత నియోజకవర్గం గుడివాడ. పార్టీ స్థాపించిన తర్వాత మొదటిసారి 1983లో ఎన్టీఆర్‌ అక్కడి నుంచే పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 1985లోనూ అక్కడి నుంచే పోటీ చేసి గెలుపొందారు. అలాంటి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరాలి. అందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయండి. అదే ఎన్టీఆర్‌కు మనం అర్పించే నివాళి..’ అని టీడీపీ అధినేత చంద్రబాబు గుడివాడ టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా దేవినేని అవినాష్‌ను ప్రకటించడంపై స్థానిక టీడీపీ నేతల్లో వ్యక్తమైన అసంతృప్తిని సీరియస్‌గా తీసుకున్న చంద్రబాబు సోమవారం వారిని పిలిపించి మాట్లాడారు. టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు నియోజకవర్గం గుడివాడలో దేవినేని అవినాష్‌ను గెలిపించి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుడివాడ పార్టీ నేతలను ఆదేశించారు.

modi 12032019

గుడివాడ అసెంబ్లీ అభ్యర్థిగా దేవినేని అవినాష్‌ను ప్రకటించడంపై గుడివాడ నియోజకవర్గ టీడీపీలో అసంతృప్తి వ్యక్తమైంది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న చంద్రబాబు సోమవారం గుడివాడ నియోజకవర్గ టీడీపీ నేతలను పిలిపించుకుని మాట్లాడారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సుమారు గంటకుపైగా గుడివాడ నియోజకవర్గ సమన్వయ కమిటీ భేటీ జరిగింది. తొలుత అసెంబ్లీ అభ్యర్థుల స్ర్కీనింగ్‌ కమిటీ సభ్యులు సమన్వయ కమిటీ సభ్యులతో చర్చించారు. చర్చల సారాంశాన్ని తెలుసుకున్న సీఎం చంద్రబాబు అనంతరం గుడివాడ టీడీపీ నేతలతో మాట్లాడారు. గుడివాడ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట లాంటిదని, టీడీపీ ఆవిర్భావం తర్వాత మొత్తం తొమ్మిది సార్లు ఎన్నికలు జరగ్గా కేవలం రెండు సార్లు మాత్రమే టీడీపీయేతర అభ్యర్థులు గెలుపొందారని, ఈసారి ఎలాగైనా టీడీపీ జెండా ఎగరాల్సిందేనని చంద్రబాబు నాయకులకు స్పష్ట చేశారు.

modi 12032019

నియోజకవర్గ నేతలు కలిసి కట్టుగా పనిచేయాలని, పార్టీ అభ్యర్థి దేవినేని అవినాష్‌ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని నాయకులకు స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఎలాంటి అసమ్మతిని సహించేది లేదని, పార్టీకి నష్టం కలిగించాలని చూసే నాయకుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. నాయకులందరూ కలిసి కట్టుగా పనిచేసి పార్టీని గెలిపిస్తే, అందరికీ న్యాయం చేసే బాధ్యత తాను తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అవినాష్‌ గెలుపునకు తీసుకోవాల్సిన చర్యలను నాయకులంతా కలిసి చర్చించుకుని వాటిని క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, బూత్‌ కమిటీ సభ్యులను క్రియాశీలం చేసి వారి సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. సీఎం చంద్రబాబు ఆదేశం మేరకు అందరం ఐక్యంగా గుడివాడలో టీడీపీ విజయానికి కృషి చేస్తామని టీడీపీ నేతలు దేవినేని అవినాష్‌కు హామీ ఇచ్చారు. మాజీ శాసనసభ్యుడు రావి వెంకటేశ్వరరావు కు ఎలాంటి అన్యాయం చేయబోనని చంద్ర బాబు స్పష్టం చేశారు. రావికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని.. ఈ బాధ్యత తనదేనని అధినేత స్పష్టమైన హామీ ఇచ్చారు.

 

 

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విజయవాడలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆవేశపూరితంగా ప్రసంగించారు. ఘంటా మురళి పార్టీలో చేరిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఆయన తన ప్రసంగం ఆద్యంతం కేసీఆర్, జగన్, మోదీ త్రయంపై నిప్పుల వర్షం కురిపించారు. తెలంగాణ సీఎం ఓ పెద్ద నాయకుడిలా మాట్లాడుతున్నాడని, ఏపీ డేటాతో తనకేం పని? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీ డేటా పోతే బాధపడాల్సింది తామని, కానీ కేసీఆర్ కు బాధ కలుగుతోందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తెలంగాణలో 27 లక్షల ఓట్లు తీసేయిస్తే ఎవరూ మాట్లాడలేదని, కానీ ఏపీలో కూడా అదే తరహాలో దౌర్జన్యం చేయాలనుకుంటున్నాడని, కానీ ఆయన ఆటలు ఇక్కడ సాగవన్న విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

modi 12032019

"నువ్వేదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటున్నావు, కానీ నీకు 100 రిటర్న్ గిఫ్ట్ లు ఇచ్చే సత్తా నాకుంది. నా దగ్గర పనిచేసిన నీకే ఇంత రోషం ఉంటే నాకెంత ఉండాలి? హైదరాబాద్ లో ఇవాళ ఆదాయం వస్తోందంటే అది నీ శ్రమ కాదు, మా కష్టార్జితం" అంటూ మండిపడ్డారు చంద్రబాబు. ‘జగన్‌కు ఈ గడ్డపై నమ్మకం లేదు.. ఇక్కడి ప్రజలపై విశ్వాసంలేదు. అమరావతిపై అభిమానం లేదు’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘పాదయాత్ర సమయంలో తప్పితే ఎప్పుడూ రాష్ట్రంలో ఆయన బస చేయలేదు. గత అయిదేళ్లలో ఆయన రాష్ట్రంలో ఎన్నాళ్లున్నారు’ అని నిలదీశారు. సోమవారం చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు సంపాదించిన ఆయన ఇప్పుడు నీతి నిజాయతీల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

modi 12032019

రెండు మూడు రోజుల్లో అభ్యర్థులపై ఒక స్పష్టత వస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. అనంతరం పార్టీ కేడర్‌ను సంసిద్ధం చేసేందుకు వారితో సమావేశమవుతానన్నారు. తిరుపతితో ప్రారంభించి 4 రోజుల్లో అన్ని జిల్లాల్లో పార్టీ కార్యకర్తల సమావేశాలు పూర్తి చేస్తామని తెలిపారు. జగన్‌ గతంలో తండ్రిని అడ్డు పెట్టుకుని అక్రమంగా సంపాదించి దొరికిపోయి అందర్నీ జైలుకు తీసుకెళ్లారని, ఆయన మళ్లీ అధికారంలోకి వస్తే అందరూ జైలు పాలవుతారని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్‌కు ముఖ్యమంత్రి కావాలన్న కల తప్ప, ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన లేదని ధ్వజమెత్తారు. తెరాస, భాజపాలతో కుమ్మక్కై బందిపోట్లలా రాష్ట్రం మీదకు వస్తున్నారన్నారు. ఐదేళ్లలో అమరావతికి వచ్చి ఒక్క రాత్రి కూడా ఉండని జగన్‌ ఈ రాష్ట్రంపై ఏం శ్రద్ధ చూపుతారని ప్రశ్నించారు.

ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్ పోటీ స్థానంపై స్పష్టత వచ్చింది. ఇప్పటి వరకూ భీమిలీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని పుకార్లు వచ్చినప్పటికీ వాటన్నింటికీ మంగళవారం మధ్యాహ్నం అధిష్టానం ఫుల్‌స్టాప్ పెట్టేసింది. విశాఖ నార్త్‌ నుంచి నారా లోకేష్‌ పోటీ చేస్తారని ఆయన పేరును చంద్రబాబు ఖరారు చేశారు. కాగా... లోకేశ్‌ భీమిలి లేదా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. విశాఖ ఉత్తర టిక్కెట్‌ ఆశిస్తున్నవారు పలువురు సోమవారం రాత్రి పార్టీ అధినేతను కలవగా..లోకేశ్‌ పోటీ చేస్తున్నారని, ఆయనకు సహకరించాలని సూచించినట్టు తెలిసింది. దాంతో ఆ స్థానంపై కూడా సందిగ్ధత తొలగిపోయింది. ఈ టిక్కెట్‌ను ఆశించిన మాజీ ఎంపీ సబ్బం హరి పేరును మాడుగులకు పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ముఖ్యమంత్రి తనయుడే పోటీ చేస్తుండడంతో స్వాతి కృష్ణారెడ్డి కూడా వెనక్కి తగ్గారు.

modi 12032019

అయితే విశాఖ నార్త్‌ నుంచి నారా లోకేష్‌ పోటీ చేస్తారని తెలియటంతో, కార్యకర్తలు షాక్ అయ్యారు. ఎందుకంటే లోకేష్ లాంటి హై ప్రొఫైల్ ఫిగర్ ఉన్న నాయకులు రిస్క్ తీసుకోరు. సేఫ్ సీట్ ఎక్కడ ఉందో చూసుకుంటారు. సామాజికవర్గం ఎక్కువ ఉన్న చోట, అన్నీ అనుకులతలు ఉన్న చోట చూసుకుని పోటీ చేస్తారు. కాని లోకేష్ మాత్రం, విశాఖ నార్త్‌ నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ సామాజిక సమీకరణాలు అంత తేలికగా ఉండవు. రిస్క్ తో కూడు కున్న పని. కాని, లోకేష్ చేసిన పనులే అక్కడ గెలుపుకు పునాది అవుతుందని, అన్ని సామాజిక వర్గాల ప్రజలు సమానంగా ఉండే చోటు నుంచి, ఎన్నిక అయ్యారు అనే పేరు వస్తుందని, ఇది సహసోపేత నిర్ణయమని అంటున్నారు. జగన రెడ్డిలు ఎక్కువగా ఉండే పులివెందుల నుంచి, పవన్ కాపులు ఎక్కువగా ఉండే చోటు నుంచి పోటీకి రెడీ అవుతుంటే, లోకేష్ ఇలా చెయ్యటం నిజమైన నాయకుడి లక్షణం అంటున్నారు.

modi 12032019

ఇదిలా ఉంటే.. ఆయన నార్త్‌ నుంచి పోటీ చేస్తే.. గంటా విశాఖ ఎంపీగా వెళుతున్నారు. ఇప్పుడు భీమిలిలో తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే కేంద్ర మాజీ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు కుమార్తె అదితి పేరు కూడా వినిపిస్తోంది. గతంలో భీమిలి నుంచి అశోక్‌గజపతిరాజు తండ్రి పీవీజీ రాజు, సోదరుడు ఆనందగజపతిరాజు భీమిలి నుంచి ప్రాతినిథ్యం వహించారు. ఈ నేపథ్యంలో ఆమెకు కేటాయిస్తారా లేక ఇటీవల పార్టీలో చేరిన కర్రి సీతారామ్‌కు అవకాశం ఇస్తారా? లేదంటే మరెవరినైనా దించుతారా? అనేది రెండు, మూడు రోజుల్లో తేలుతుంది.

ఎన్నికల టికెట్ల వ్యవహారం వైసీపీలోనూ కాక పెంచుతోంది. సీటుపై గ్యారెంటీ లేని నేతలు, అనుచరులు హైదరాబాద్‌కు క్యూ కట్టారు. లోటస్ పాండ్‌ ఎదురు ఆందోళనలకు దిగారు. మంగళవారం జగన్ నివాసం దగ్గర ఇదే సీన్ కనిపించింది. ఉరవకొండ అసెంబ్లీ టికెట్‌ను శివరామిరెడ్డికి ఇవ్వాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. లోటస్‌పాండ్ దగ్గర బ్యానర్లతో నినాదాలు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డికి టికెట్ ఇస్తే సహకరించేది లేదని.. ఓడించి తీరుతామని హెచ్చరిస్తున్నారు. శివరామిరెడ్డి అనుచరులు జగన్ చిన్నాన్న వివేకానంద రెడ్డి కారును కూడా అడ్డగించారు. బాపట్ల నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు కూడా నిరసనకు దిగారు.

modi 12032019

కావాలి జగన్.. రావాలి జగన్.. వెళ్లాలి కోన అంటూ ఎమ్మెల్యే రఘుపతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గోవర్ధన్‌రెడ్డికి సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. రెబల్స్ బెడద వైసీపీకి కూడా తప్పేలా లేదు. ఇటు అసంతృప్త నేతల్ని బుజ్జగించేందుకు ఎంపీ విజయసాయిరెడ్డి, జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి రంగంలోకి దిగారు. ఇది ఇలా ఉంటే, వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి వాహనాన్ని వైసీపీ శ్రేణులు మంగళవారం అడ్డుకున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ అసెంబ్లీ సీటు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన విశ్వేశ్వర్‌రెడ్డికి ఇవ్వొద్దంటూ.. లోటస్‌పాండ్‌ వద్ద శివరామిరెడ్డి అనే మరో వైసీపీ నేతతోపాటు ఆయన అనుచరులు నినాదాలు చేశారు.

modi 12032019

ఆ సమయంలో లోటస్‌పాండ్ వద్దకు వచ్చిన జగన్ బాబాయి అయిన వైఎస్ వివేకానందరెడ్డి వాహనాన్ని శివరామిరెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. కాగా... విశ్వేశ్వర్‌రెడ్డికి టికెట్‌ ఇస్తే ఓడిపోతామని, సిట్టింగ్ స్థానాన్ని కోల్పోతామని ఆ నియోజకవర్గానికి చెందిన పలువురు కార్యకర్తలు పేర్కన్నారు. మరో పక్క, పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కు చేదు అనుభవం తప్పలేదు. ఈసారి తనకు సీటు దక్కకపోవచ్చనే ఊహాగానాలు రావడంతో సునీల్ అప్రమత్తమయ్యారు. తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం లోటస్‌పాండ్‌కు వచ్చారు. రెండు గంటలపాటు జగన్‌ను కలిసేందుకు ప్రయత్నించినా కుదరలేదు. అప్పుడే మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ నివాసం దగ్గరకు రాగా.. సునీల్ ఎదురుపడినా పట్టించుకోకుండా లోపలికి వెళ్లిపోయారు. రామచంద్రారెడ్డి చూసీ చూడనట్లు వ్యవహరించడంతో సునీల్ మనస్తాపంతో ఉన్నారు.

Advertisements

Latest Articles

Most Read