ప్రస్తుతం సోషల్ మీడియా ఎంతటి విశ్వరూపం చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ నెట్వర్కింగ్ సైట్ల కారణంగా ఎన్నికలు సైతం ప్రభావితమవుతున్న ఉదంతాలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా, ఓటర్ నాడి పట్టడానికి, అతడిని ఆకర్షించడానికి సామాజిక మాధ్యమాన్ని మించింది లేదని ఆయా పార్టీలు ప్రత్యేకంగా విభాగాలు ఏర్పాటు చేసుకోవడం ఈ కోవలోకే వస్తుంది. అందుకే, కేంద్ర ఎన్నికల సంఘం ఓటరును ప్రలోభపెట్టే పార్టీలు, వ్యక్తులను నియంత్రించేందుకు కొత్త నియమావళిని రూపొందించింది. తాజాగా విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ సందర్భంగా అభ్యర్థులకు కొన్ని సూచనలు చేసింది.

ec 11032019

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో తప్పనిసరిగా తమ సోషల్ మీడియా అకౌంట్ల వివరాలను కూడా పొందుపరచాలని స్పష్టం చేసింది. అంతేకాదు, ఆన్ లైన్ లో దర్శనమిచ్చే రాజకీయ ప్రకటనలకు ఇకమీదట ముందస్తు ధ్రువీకరణ తప్పనిసరి అని, ఈ మేరకు గూగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్ సంస్థలు రాజకీయ ప్రకటనను పూర్తిగా పరిశీలించిన మీదటే అనుమతించాలని కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీచేసింది. ఇలాంటి రాజకీయ ప్రకటనలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ ఆఫీసర్ ను కూడా నియమిస్తున్నట్టు ఈసీ పేర్కొంది. అంతేకాదు, ఓ అభ్యర్థి సామాజిక మాధ్యమాల్లో చేసే రాజకీయ ప్రచారానికి అయిన ఖర్చును కూడా ఎన్నికల ఖర్చుల పట్టికలో రాయాల్సిందేనని స్పష్టం చేసింది.

వ్యూహ.. ప్రతివ్యూహాలు పదునెక్కుతూనే ఉన్నాయి. అస్త్రశస్త్రాలు ఏనాడో సిద్ధమయ్యాయి. ఎన్నికల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు అధికార తెలుగుదేశం.. విపక్ష వైసీపీ ఎప్పటి నుంచో కత్తులు నూరుతున్నాయి. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుండగా.. తెలుగు రాష్ట్రాల్లో తొలి విడతలో ఏప్రిల్ 11న ఒకే దఫాలో ఈ ప్రక్రియ ముగుస్తుంది. ఆ తరువాత ఎప్పుడో 42 రోజుల ఉత్కంఠ భరిత ఎదురు చూపుల తరువాత మే 23న ఫలితాలు వెలువడనున్నాయి. సాధారణంగా సమస్యల్లేని ప్రాంతాల్లో తొలి విడతనే పోలింగ్ పూర్తి చేస్తారు. ఇక్కడ ఎన్నికల నిర్వహణకు పెద్ద సంఖ్యలో సాయుధ సిబ్బంది అవసరం ఉండకపోవడం దీనికి ఒక కారణం.

prativyuham 11032019

ఈసారి కూడా అదే లెక్క ప్రకారం తొలివిడతలోనే ముహూర్తం నిర్ణయించినా.. వాతావరణం మాత్రం పూర్తి భిన్నంగా నెలకొనే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన తరువాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి. ఓట్ల తొలగింపు వంటి అంశాలతో ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే వేడెక్కింది. ఈ సారి టీడీపీని ఓడించడమే లక్ష్యంగా ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఏపీపై ప్రత్యేక దృష్టి సారించారు. మోదీ, కేసీఆర్, జగన్ ముగుసు తీసేసి ముగ్గురూ కలిసి పోటీకి రావాలని చంద్రబాబు సవాల్ విసురుతున్నారు. 2014 ఎన్నికలు జరిగిన వాతావరణం పూర్తిగా భిన్నమైనది.

prativyuham 11032019

అప్పుడు విభజన కష్టాలను అధిగమించడమే ప్రధాన అజెండాగా టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చారు. ఇప్పుడు సీన్ మారింది. ప్రత్యేక హోదాతో పాటు.. హామీలను నెరవేర్చలేదంటూ బీజేపీకి టీడీపీ కటీఫ్ చెప్పింది. రెండు పార్టీల మధ్య ఏడాదిన్నరగా యుద్ధం జరుగుతోంది. ఇక జగన్‌కు బీజేపీ పరోక్షంగా సహకరిస్తోందన్నది జగమెరిగిన సత్యమే. ఇక జనసేన విడిగా బరిలోకి దిగనుంది. వామపక్షాలతో మాత్రమే ఆయన స్నేహం చేయనున్నారు. గత ఎన్నికల్లో పూర్తి విభజన సెగలతో ఆవిరైపోయిన కాంగ్రెస్ ఇప్పుడు కొంతమేర ఓట్లు తెచ్చుకునే అవకాశం కనిపిస్తోంది.

 

 

ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్న కొద్దీ.. అన్ని ప్రధాన పక్షాల్లోనూ అలజడి రేగుతోంది. వచ్చేవారు.. వెళ్లే వారిపై దుమారం చెలరేగుతోంది. ఒకరిపై ఒకరికి అనుమానం పెరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నియోజకవర్గాల వారీగా మారుతున్న పరిణామాలు ఉత్కంఠగా మారాయి. ఓ మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధపడు తున్నారు. మరో మాజీ ఎమ్మెల్సీ దెందులూరు నియోజకవర్గంలో వైసీపీ టికెట్‌ కోసం ప్రయ త్నిస్తున్నారు. ఆచంటకు చెందిన ఒక సీనియర్‌ నేతతో కలిసి మంత్రి పితాని సీఎం చంద్రబాబుతో కలిసి భేటీ అయ్యారు. నిడదవోలులో అసమ్మతి వర్గం కాలు దువ్వితే.. గోపాలపురంలో కొందరు ఏకమై సీఎంను కలిసేందుకు రాజధాని పయనమయ్యారు. ఇలా ఒక్కొక్కటిగా.. రాజకీయ ఉత్కంఠ కలిగించే పరిణా మాలు.

mantri 11032019

ఒకేరోజు చోటు చేసుకున్నాయి. వీటన్నింటిపైనా తలో అభిప్రాయం. ఆఖరుకు మంత్రి పితానిని వదంతుల దుమారం వెంటాడుతోంది. మంత్రి పితాని సత్యనారాయణకు వ్యతిరేకంగా వదంతుల దుమారం ఇంకా కొనసాగుతోంది. ఆచంట నియోజకవర్గంలో ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. దీనికి విరుద్దంగా ఆయన ఫలానా పార్టీలో చేరబోతు న్నారని, ముహూర్తం కూడా ఖరారు చేశారంటూ ఆ నోటా ఈ నోటా ప్రచారం ముదిరింది. మంత్రి పితాని దీనిని ఖాతరు చేయకుండా తనపని తాను చేసుకు పోతున్నారు. ఇదిగో పులి.. మాదిరిగానే వైసీపీ మైండ్‌ గేమ్‌ ప్రారంభించింది. మంత్రి పితానిని ఇరికించే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రచారం చేస్తోంది. చంద్రబాబుకు సన్నిహితుడిగా.. ఉభయ గోదావరి జిల్లాల్లో సీనియర్‌ బీసీ నేతగావున్న ఆయనను దెబ్బ కొట్టేందుకు వీలుగా ప్రచారం చేస్తున్నట్లు ఆయన చెబుతున్నారు.

mantri 11032019

తెలుగుదేశం కేడర్‌ వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న స్పష్టం చేస్తున్నా రు. దీనికితోడు ఆచంట సీనియర్‌ నేత గొడవర్తి శ్రీరాములుతో కలిసి ఆయన మంగళవారం సీఎం చంద్రబాబును కలుసుకున్నారు. రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరగడానికి కొద్దిసేపు ముందుగా సీఎం నివాసంలో ఈ భేటీ జరిగింది. ‘తెలుగుదేశంలో నిర్విరామంగా పనిచేస్తున్నాను. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో పితాని భారీ మెజార్టీతో గెలిచేందుకు వీలుగానే.. మర్యాదపూర్వకంగా సీఎం చంద్రబాబును కలిశాం’ అని గొడవర్తి శ్రీరాములు అన్నారు. ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచారానికి తెరదించారు.

ప్రకాశం జిల్లాకు చెందిన బాపట్ల లోక్‌సభ సభ్యులు శ్రీరాం మాల్యాద్రిని శాసనసభకు పోటీ చేయించే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నాయంగా బాపట్ల లోక్‌సభ అభ్యర్థిత్వం కోసం పలువురి పేర్లుని కూడా పరిశీలన చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయమై కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి, ఎంపీ మాల్యాద్రితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా తాటికొండ అసెంబ్లీ అభ్యర్థి ఎంపికలో వచ్చిన సమస్య పరిష్కారానికి ఈ సరికొత్త వ్యూహాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. పోటీచేసే అభ్యర్థుల ఎంపికపైన, అలాగే నియోజకవర్గాలలో చెలరేగే అసంతృప్తులను చల్లార్చే విషయంలోను ముఖ్యమంత్రే ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రకాశం, గుంటూరు జిల్లాల అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికకై ఆయన సమీక్షలు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్నిచోట్ల అభ్యర్థుల ఎంపికపై నిజమైన సలహాలను సరికొత్త వ్యూహానికి ఆయన శ్రీకారం పలుకుతున్నారు.

cbn vyuham 11032019

అందులో భాగంగా గుంటూరు జిల్లాతో కూడా సంబంధం ఉన్న బాపట్ల ఎంపీ మాల్యాద్రిని వినియోగించుకోవాలని ఆయన ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమరావతి ప్రాంతంలోని తాటికొండ సిటింగ్‌ ఎమ్మెల్యే శ్రావణ్‌ కుమార్‌ని, ఆ నియోజకవర్గంలోని కొందరు పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ విషయాన్ని అటు సీఎం, ఇటు పార్టీ రాష్ట్ర నాయకులకు వారు తెగేసి చెప్పారు. ఎస్సీలకు కేటాయించిన ఆ నియోజకవర్గానికి ప్రత్యామ్నాయ అభ్యర్థిని ఆలోచిస్తూ శ్రావణ్‌ కుమార్‌కి మరో రూపంలో న్యాయం చేయాలన్న ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా సౌమ్యుడిగా, వివాద రహితుడిగా పేరొందిన బాపట్ల ఎంపి శ్రీరాం మాల్యాద్రిని వినియోగించుకోవాలన్న ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకే తాటికొండ అసెంబ్లీ నుంచి మాల్యాద్రిని రంగంలోకి దింపాలన్న ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. ఎంపీ మాల్యాద్రికి గాడ్‌ఫాదర్‌గా ఉన్న కేంద్ర మాజీమంత్రి సుజ నా చౌదరితో సీఎం చంద్రబాబు ముందుగా మాట్లాడినట్లు చెప్తున్నారు.

cbn vyuham 11032019

అన్నివిధాలా అర్హతలున్న మాల్యాద్రిని తాటికొండ అసెంబ్లీ నుంచి పోటీ చేయిద్దామని సూచించినట్లు తెలిసింది. ఎంపీగానే మాల్యాద్రి పార్టీకి బాగా ఉపయోగపడతాడన్న అభిప్రాయాన్ని సుజ నా చౌదరి వ్యక్తం చేసినట్లు సమాచారం. నిజమే కావచ్చు ప్రస్తుత అవసరాల దృష్ట్యా మనం కొన్ని మార్పులు చేయాలి, మాల్యాద్రికి భవిష్యత్తులో ప్రభుత్వపరంగా కూడా మంచి అవకాశం కల్పిద్దామన్న సంకేతాన్ని కూడా చంద్రబాబు ఇచ్చారని ఆ వర్గాలవారు అంటున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్‌గానే పరిశీలిస్తుండటంతో ఎంపీ మాల్యాద్రి కూడా తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. బాపట్ల లోక్‌సభలో తనకు అత్యంత సన్నిహితుడైన శ్రేయోభిలాషులతో ఆయన తాజా ప్రతిపాదనపై అభిప్రాయాలు తెలుసుకుంటున్నట్లు కూడా తెలిసింది. ఇదే సమయంలో బాపట్ల లోక్‌సభ అభ్యర్థి ఎంపికపై కూడా పలు పేర్లుని టీడీపీ అధిష్టానం పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుత తాటికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌ కుమార్‌ను బాపట్ల లోక్‌సభ నుంచి రంగంలోకి దించే ఆలోచన కూడా ఉన్నట్లు సమాచారం. అయితే అందుకు ఆయన అంగీకరిస్తాడా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఆయన అంగీకరించని పక్షంలో ఆయనకు ప్రత్యామ్నాయ అవకాశాన్ని చూస్తూనే బాపట్లకు ఎవరిని రంగంలోకి దించాలన్న అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని కొన్ని సర్వేలు కూడా ఆ పార్టీ చేస్తోంది. జిల్లాలో గతంలో కలెక్టర్‌గా పనిచేసి గత ఎన్నికల సమయంలోనే టీడీపీ టిక్కెట్‌ ఆశించి భంగపడిన దేవానంద్‌ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

 

Advertisements

Latest Articles

Most Read