తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు మళ్లీ టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గత నెలరోజుల క్రితం ఎంపీ రవీంద్రబాబు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. అయితే.. వైసీపీలో చేరిన కొద్ది రోజులుకే, పండుల రవీంద్రబాబుని తీవ్రంగా అవమానాలు ఎదుర్కున్నరాని తెలుస్తుంది. అటు జగన్, ఇటు విజయసాయి రెడ్డి ఇద్దరూ కలిసి, రవీంద్రబాబుని బాగా అవమానించారని సమాచారం. కేవలం చంద్రబాబుని సాధించటం కోసం, రవీంద్రబాబుకి నచ్చ చెప్పి, బెదిరించి పార్టీలో చేర్చుకున్నారు. నీకు సీట్ ఇస్తాం, ముందు వచ్చి పార్టీలో చేరండి అని చెప్పటంతోనే, ఆయన జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.

ravindrababu 1203219

అయితే ఇప్పుడు అవమానాలు భరిస్తూనే, సీటు కోసం జగన్ దగ్గరకు వెళ్ళగా తీవ్రంగా అవమానించారని సమాచారం. సిట్టింగ్ ఎమ్మల్యేగా అక్కడే గెలవలేవు అని టిడిపి చెప్తుంది, ఇంకా నీకు సీటు ఇచ్చి నేను ఏమి అవ్వాలి, మీకు సీట్ ఇచ్చేది లేదు, పార్టీకి సహకరించండి, నెక్స్ట్ నేనే సియం, అప్పుడు ఏదో ఒకటి మీకు చూస్తాను అని జగన్ చెప్పినట్టు సమాచారం. అవమాలు పడటం, కోరుకున్న సీటు దక్కకపోవడంతో మళ్లీ టీడీపీలోకి వస్తానంటూ టీడీపీ పెద్దలతో అన్నట్లు తెలిసింది. ఇప్పటికే పలువురు టీడీపీ పెద్దలతో టచ్‌లోకి వచ్చినట్లు సమాచారం. అయితే చంద్రబాబు మాత్రం, ఇలాంటి వారిని ఎంకరేజ్ చెయ్యవద్దు అని, పెండింగ్ లో పెట్టేసారని తెలుస్తుంది.

ravindrababu 1203219

పండుల రవీంద్రబాబు రాకను టీడీపీ శ్రేణులు నిరాకరిస్తున్నట్లు సమాచారం. దీంతో చంద్రబాబు కూడా, అతని పట్ల అసలు ఇంటర్స్ట్ చూపించటం లేదు. ఇప్పుడు రవీంద్ర బాబు, అటు జగన్ దగ్గర దిక్కు లేక, ఇటు చంద్రబాబు పట్టించుకోక, ఏకాకిగా మిగిలిపోయారు. చక్కగా చంద్రబాబు చెప్పినట్టు వింటే, ఎదో ఒక గౌరవ పదవి ఇచ్చేవారు. గౌరవం చూసుకునే వారు. కాని ఆత్మగౌరవం చంపుకుని, జగన్ దగ్గరకు వెళ్ళినందుకు, తగిన శాస్తి జరిగింది అంటూ, రవీంద్ర బాబు బాధ పడుతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి, జగన్, విజయాసాయి ఖాతాలో, మరొక బకరా బలి అయ్యాడు.

వైసీపీకి గుడ్‌బై చెప్పిన తరువాత టీడీపీలో చేరే విషయంలో ఆలోచనలో పడ్డ మాజీ ఎమ్మెల్యే, వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా... నేడు అధికారికంగా టీడీపీ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. సోమవారం అర్థరాత్రి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌తో కలిసి ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమైన వంగవీటి రాధ... ఆయనతో పలు అంశాలపై చర్చించినట్టు టాక్ వినిపిస్తోంది. విజయవాడలోని పేదల ఇళ్ల పట్టాలకు సంబంధించి వారి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించడంతో... నేడు మరోసారి చంద్రబాబును కలిసి అధికారికంగా టీడీపీలో చేరాలని వంగవీటి రాధాకృష్ణ నిర్ణయించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

vangaveet 12032019

రాజీనామా చేసిన రెండ్రోజులకే ఆయన పసుపు కండువా కప్పుకుంటారని వార్తలు వచ్చినప్పటికీ అవన్నీ పుకార్లేనని తేలిపోయింది. అంతేకాదు రాధా టీడీపీలోకి వస్తున్నారని.. అందరూ సహకరించి కలిసి మెలిసి పనిచేయాలని స్వయానా సీఎం చంద్రబాబే చెప్పారు. అయితే ఈ మధ్యలో ఏం జరిగిందో ఏమోగానీ మళ్లీ సైకిలెక్కకుండా సైలెంట్ అయిపోయారు. దీంతో మరోసారి విజయవాడకు చెందిన వైసీపీ కీలకనేతలు రంగంలోకి దిగి పార్టీలోకి రీ-ఎంట్రీ ఇవ్వాలని మంతనాలు కూడా జరిపారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. సోమవారం అర్ధరాత్రి సీఎం చంద్రబాబు నివాసానికి వంగవీటి రాధా వెళ్లారు. మాజీ ఎంపీ లగడపాటితో కలిసి రాధా .. సీఎంతో భేటీ అయ్యారు.

vangaveet 12032019

సుమారు రెండుగంటలపాటు రాధా తన రాజకీయ భవిష్యత్‌పై సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని రాదా కోరినట్టు సమాచారం. దీని పై కసరత్తు చేస్తున్న చంద్రబాబు, ఆయనకు మచిలీపట్నం ఎంపీ సీటు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. విజయవాడలో ఎమ్మెల్యే సీట్లకు అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసిన నేపథ్యంలో... ఆయనను మచిలీపట్నం ఎంపీగా బరిలోకి దింపాలని టీడీపీ భావిస్తోంది. ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా ఉన్న టీడీపీ నేత కొనకళ్ల నారాయణను ఎమ్మెల్యే పోటీ చేయించి... రాధాను ఎంపీగా బరిలోకి దింపాలని చంద్రబాబు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇందుకు రాధా కూడా అంగీకరించినట్టు ప్రచారం జరుగుతోంది.

వైసీపీ లోక్‌సభ అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. ఒంగోలులో తన బాబాయి వైవీ సుబ్బారెడ్డికి అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మొండిచేయి చూపించారు. ఆ లోక్‌సభ స్థానంలో పార్టీ టికెట్‌ను ఆయనకు నిరాకరించారు. అక్కడి నుంచి నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిని బరిలోకి దించాలని నిర్ణయించారు. పార్టీలో అధికారికంగా చేరని మాగుంట శ్రీనివాసులురెడ్డిని నెల్లూరు నుంచి పోటీ చేయించనున్నారు. శనివారమే పార్టీలో చేరిన మోదుగుల వేణుగోపాలరెడ్డికి గుంటూరు, దాసరి జైరమేశ్‌కు విజయవాడ లోక్‌సభ స్థానాలు ఖరారు చేశారు. దువ్వాడ శ్రీనివా్‌స(శ్రీకాకుళం), బొత్స ఝాన్సీ (విజయనగరం), ఎంవీవీ చౌదరి(విశాఖ), వరుదు కల్యాణి(అనకాపల్లి), గంజి అశోక్‌(కాకినాడ), మార్గాని భరత్‌ (రాజమహేంద్రవరం), చింతా అనూరాధ (అమలాపురం), రఘురామకృష్ణంరాజు(నరసాపురం), కోటగిరి శ్రీధర్‌(ఏలూరు), బాలశౌరి(మచిలీపట్నం), లావు శ్రీకృష్ణ దేవరాయలు(నరసరావుపేట), పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి(రాజంపేట), వైఎస్‌ అవినాశ్‌రెడ్డి(కడప), గోరంట్ల మాధవ్‌(హిందూపురం), పి.డి.రంగయ్య(అనంతపురం), బ్రహ్మానందరెడ్డి(నంద్యాల) అభ్యర్థిత్వాలు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది.

babai 11032019

అధికారికంగా వీరి పేర్లు ప్రకటించకున్నా.. అభ్యర్థులు మాత్రం ప్రస్తుతానికి వీరేనని వైసీపీ నేతలు అంటున్నారు. ఎన్నికల నాటికి వీరికంటే బలమైన వ్యక్తులు పార్టీలోకి వస్తే వీరిని తప్పించి.. కొత్తవారికి ఇవ్వాలని జగన్‌ భావిస్తున్నారని తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో ఇంతకాలం పార్టీని నమ్ముకున్న నేతలు తమను కరివేపాకులా తీసేశారని గుర్రుగా ఉన్నారు. కాగా, ఒంగోలు ఎంపీగా, తనకు రాజకీయ సలహాదారుగా చేదోడువాదోడుగా ఉంటూ వచ్చిన బాబాయి వైవీ సుబ్బారెడ్డిని జగన్‌ ఈ దఫా ఎన్నికలకు దూరంగా ఉంచడంపై పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. ఒంగోలు సీటు తనకివ్వకపోవడంపై వీరిద్దరి మధ్య రగడ జరిగిందని.. అందుకే తాడేపల్లిలో జగన్‌ గృహప్రవేశానికి సుబ్బారెడ్డి హాజరు కాలేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అంటే తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ఆయన ఇద్దరు కొడుకులు, అంటే ఒకరు సొంత కొడుకు జగన్, మరొకరు దేవుడిచ్చిన పెద్ద కొడుకు గాలి జనార్ధన్ రెడ్డిల అక్రమ సంపాదన గుట్టు బయటకు లాగి, వాళ్ళు తిన్నది అంతా కక్కించటానికి చేసిన ప్రయత్నం అందరికీ గుర్తుండే ఉంటుంది. కోర్ట్ ల్లో దాదపుగా ఇద్దరూ దోషులుగా మిగిలిపోయారు. ఇద్దరూ చిప్ప కూడు తిని, కండీషనల్ బెయిల్ పై బయట తిరుగుతున్నారు. అయితే, ఇప్పుడు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన సొంత పార్టీ పెడతారానికి, జనసేనలోకి వెళ్తారని, ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి.

lakshminarayana 12032019

అయితే ఇప్పుడు వస్తున్న తాజా సమాచారం ప్రకారం, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ త్వరలో చంద్రబాబును కలిసి, ఆయన సారధ్యంలో రాష్ట్రానికి, ముఖ్యంగా రైతులకు సేవ చెయ్యటానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటించి, రైతు సమస్యల పై అవగహన చేసుకున్నారు. నేను సొంత పార్టీ పెట్టినా, ఏదైనా పార్టీలో చేరినా, రైతులకు మేలు చెయ్యటమే నా ఎజెండా అని ఇప్పటికే ఆయన చెప్పారు. ఈ నేపధ్యంలోనే, చంద్రబాబు రైతులకు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ లకు ఇస్తున్న ప్రాధాన్యత చూసి, చంద్రబాబుతో కలిసి ప్రయాణం చేసే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపదంలోనే, లక్ష్మీనారాయణ, సీనియర్‌ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు.

lakshminarayana 12032019

ఈ సందర్భంగా ఆయన తెదేపాలోకి వచ్చేందుకు సుముఖత చూపారని, రెండు, మూడు రోజుల్లో చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశముందని పార్టీ వర్గాల సమాచారం. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికల బరిలో నిలిచే అవకాశముంది. తొలుత ఇక్కడి నుంచి మంత్రి లోకేశ్‌ పోటీ చేయాలని భావించినా.. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గంనుంచి పోటీచేసే యోచన చేస్తున్నట్లు సమాచారం. కాగా ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గం నుంచి సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్‌ భీమిలి నుంచి పోటీ చేస్తారని.. ప్రస్తుతం ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు ఎంపీగా పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే విశాఖ ఉత్తర నుంచి లోకేశ్‌ను పోటీ చేయించాలని చంద్రబాబు ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.

Advertisements

Latest Articles

Most Read