టీడీపీ డేటాను దొంగిలించిన వారు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారని ఏపీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీకి చెందిన సమాచారాన్ని చోరీ చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుందని, అది ఆదిలోనే గంగపాలైందని ఆయన అన్నారు. తెలుగుదేశంతో పెట్టుకున్నోళ్లు ఎవరూ బాగుపడలేదని, అలాగే ఆంధ్రప్రదేశ్‌తో పెట్టుకుంటే ఎవరూ బాగుపడరని, టీడీపీ డేటా దొంగలు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. టీడీపీ డేటా చోరీ విషయంలో సాక్ష్యాలన్నీ తుడిచేశామని నేరగాళ్లు అనుకుంటారని, కానీ ఎక్కడో, ఏదో ఒక సాక్ష్యాన్ని వదిలేస్తారన్నారు. వైసీపీ దొంగల ముఠా వదిలేసిన సాక్ష్యం టీడీపీ చేతుల్లో ఉందన్నారు.. , మధ్యాహ్నం ఒంటి గంటకు ఆ సాక్ష్యాన్ని బయటపెడతానని వెల్లడించారు. ఈ మేరకు మీడియాను ఆహ్వానించానని అన్నారు.

explosive 09032019

ఈ ఉదయం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడిన ఆయన, మరో రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని, ఇక ప్రచారం, రాష్ట్రవ్యాప్త ప్రచారం, బహిరంగ సభలపై దృష్టిని సారిస్తామని ఆయన స్పష్టం చేశారు. టికెట్లు ఖరారైన అభ్యర్థులంతా విస్తృతంగా ప్రజల్లో తిరగాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ రాష్ట్రం నుంచి రూ. 11,278 కోట్ల విద్యుత్ బకాయిలు రావాల్సి వున్నాయని, వాటి వసూలుకు అధికారులు కృషి చేస్తారని అన్నారు. జగన్‌కు ఓటేస్తే కేసీఆర్‌కు, నరేంద్రమోదీకి ఓటేసినట్లేనని చంద్రబాబునాయుడు అన్నారు. ఫారం-7లో 95శాతం బోగస్ అని ఈసీ అధికారే చెప్పారన్నారు.

explosive 09032019

ఓట్ల తొలగింపు కుట్రలను ప్రజలే అడ్డుకోవాలని, మా ఓట్లు తొలగించి మమ్మల్నే ఓటడుగుతారా..? అని... వైఎస్సార్ కాంగ్రెస్‌ నేతలను ప్రజలంతా నిలదీయాలన్నారు. అంతేగాక మమ్మల్ని బతికుండగానే చంపేస్తారా అని ప్రశ్నించాలని, రేపు మా ఆస్తులు కూడా ఇలాగే గల్లంతు చేస్తారా..? అని... రేపు బూత్‌ల వద్ద ఓటర్లే వైసీపీని నిలదీయాలన్నారు. ఏపీ నీళ్లకు మోకాలడ్డే కేసీఆర్‌తో జగన్ దోస్తీ చేస్తున్నారని, సొంత ప్రాంతానికి నీళ్లిచ్చినా జగన్‌కు కంటిమంటేనని చంద్రబాబునాయుడు అన్నారు. నీళ్లు సముద్రంలో కలిసినా టీఆర్ఎస్‌కు ఇష్టమేనని, కానీ వృథాగా పోయే నీళ్లు వాడుకున్నా కేసీఆర్‌ ఓర్వలేకపోతున్నారన్నారు. ‘వాళ్లు కాళేశ్వరం కట్టుకోవచ్చు.. కానీ మనం ఏపీలో ప్రాజెక్టులు మాత్రం కట్టుకోకూడదు..’ అని అన్నారు. గోదావరి-పెన్నా అనుసందానానికి టీఆర్ఎస్ అడ్డంకులు సృష్టిస్తొందని, ఏపీ నదుల అనుసందానంపై దేశం మొత్తం ప్రశంసిస్తుండగా కేసీఆర్, జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రం తట్టుకోలేకపోతున్నారన్నారు. ఆంధ్రావాళ్లు ఊడిగం చేయాలనేది కేసీఆర్ ఆలోచన అని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబుని ఇరికిద్దామనుకుని చేసిన డేటా చోరీ వ్యవహారం పై ప్రముఖ సినీనటుడు శివాజీ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, డేటా దుర్వినియోగం అంటూ ఆరోపణలు చేస్తున్న పార్టీలన్నీ ఆ కోవకు చెందినవేనని ఆరోపించారు. కేసీఆర్, అమిత్ షా ల పై సంచలన ఆరోపణలు చేసారు. డేటా చోరీ జరిగిందని ఆరోపిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుగా తన ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఓడించి జగన్‌ను సీఎం చేయాలనే లక్ష్యంగా కేసీఆర్‌ వ్యూహాలు రచిస్తున్నారని శివాజీ ఆరోపించారు. ఇక కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను తన పార్టీకి అనుకూలంగా కేసీఆర్ వాడుకున్నారని ఆరోపించారు.

sivaji 08032019

‘‘గ్రేటర్‌ పరిధిలో 40 లక్షలకు పైగా సెటిలర్లు ఉన్నారు. ఈసీని కలవడానికి ముందే సమగ్ర సర్వే చేశారు. సమగ్ర సర్వేలో ప్రతి ఒక్కరి వివరాలు తీసుకున్నారు. ఎస్‌ఆర్‌డీహెచ్‌ అప్లికేషన్‌ తెలంగాణ పోలీస్ శాఖ తయారు చేసింది. అప్లికేషన్‌ కోసం టెండర్లు కూడా పిలిచారు. ఈసీ, సీఎస్‌, గ్రేటర్‌ కమిషనర్‌ కలసి పైలెట్ ప్రాజెక్టు చేపట్టాలనుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం, ఈసీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఓట్లను తొలగించడానికి ఓ ప్రణాళికను తయారు చేశారు. ఈసీ వద్ద నుంచి ఆధార్‌ డేటా, ఓటర్ లిస్టును తీసుకున్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న సమగ్ర సర్వే వివరాలను ఈసీ దగ్గరున్న జాబితాతో పోల్చి ఓట్లను తొలగించారు. డేటా చోరీ జరిగిందని గుండెలు బాదుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం మా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. నిబంధనల ప్రకారమే వెళ్తున్నామంటూ రజత్‌కుమార్‌ వ్యూహాత్మకంగా కేసీఆర్‌కు సహకరించారు. మర్రి శశిధర్‌రెడ్డి ఫిర్యాదులో వివరాలన్నీ ఉన్నాయి. కేంద్రం నుంచి టీఆర్‌ఎస్‌కు పూర్తి సహాయ సహకారాలున్నాయి. ఓట్ల తొలగింపు స్మూత్‌గా సాగిపోయింది. అదే తరహాలో ఏపీపై కేసీఆర్‌ గురిపెట్టారు’’ అని ఆరోపణలు చేశారు.

sivaji 08032019

ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందుతున్న వారి వివరాలు అడిగి తెలుసుకోవడం నేరమైతే అందరికంటే ముందు నేరస్థుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షానే అని నటుడు శివాజీ విమర్శలు కురిపించారు. తనకు ఎవరిపైనా అక్కసు లేదని, ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు కూడా లేవని ఆయన అన్నారు. ఒక పౌరుడిగా తనాు నిజాలు మాట్లాడాలనుకుంటున్నట్లు శివాజీ చెప్పుకొచ్చారు. ఆగస్టు 28న మీటింగ్‌లో అమిత్‌ షా స్వయంగా సీఎంలను అడిగారని, తమ పథకాలతో లబ్ధి పొందుతున్న వారి వివరాలు తెలియజేయాల్సిందిగా అమిత్‌షా కోరారని శివాజీ వెల్లడించారు. లబ్ధిదారుల సమచారం దగ్గర పెట్టుకోవడం నేరం అయితే అందరి కంటే ముందు నేరం చేసిన వ్యక్తి అమిత్‌షానే అవుతారని ఆరోపించారు. 22 కోట్ల కుటుంబాల డేటా అమిత్‌షా దగ్గరుందని, అది డాటా చౌర్యం కాదా? అని శివాజీ ప్రశ్నించారు.

ప్రధాని నరేంద్ర మోదీ నియంతృత్వ పాలనను ప్రశ్నిస్తే ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)తో, సీఎం చంద్రబాబు పాలనను పొగిడితే ఆదాయపు పన్ను (ఐటీ) శాఖతో దాడులు చేయిస్తున్నారని మంత్రి నారా లోకేశ్‌ విమర్శించారు. బోధన రుసుముల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, సీఎం చంద్రబాబు చొరవను ప్రశంసిస్తూ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాల యాజమాన్యాల సంఘం (అపెక్మా) అధ్యక్షుడు ఎం.శాంతిరాముడు ప్రకటన విడుదల చేసిన అయిదు రోజులకే ఆయనపై ఐటీ దాడులు జరిగాయని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల కంటే ఎంతో మెరుగ్గా ఏపీలో బోధన రుసుముల పథకం అమలవుతోందని లోకేష్ చెప్పారు.

lokes 08032019

2014లో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టే వరకు రాష్ట్రంలో బోధన రుసుముల బకాయిలు రూ.5000 కోట్లు ఉండగా వీటిని చెల్లించడంతోపాటు ఏ ఏడాదికి ఆ ఏడాది ఇస్తూ వస్తున్నారని ఇటీవల అపెక్మా విడుదల చేసిన ప్రకటన పేర్కొందని వివరించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అంశాలు, హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేసిన ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిని లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు. కడప ఉక్కు పరిశ్రమ కోసం ఆందోళనకు దిగిన సీఎం రమేష్‌పై ఐటీ దాడులు చేశారని, ఏపీకి న్యాయం చేయాలని పార్లమెంటు వేదికగా ప్రశ్నించిన ఎంపీ గల్లా జయదేవ్‌కు ఈడీ నోటీసులు పంపారని తెలిపారు. ఏపీపై కేంద్రం కక్ష కట్టినట్లు వరస ఘటనలతో తేటతెల్లమవుతోందని లోకేశ్‌ వెల్లడించారు.

కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్‌ పనిచేసిన ‘ప్యూజన్‌ ఫుడ్‌ అండ్‌ హోటల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సంస్థ కాంట్రాక్టును రద్దు చేస్తూ ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) జారీచేసిన ఆదేశాలను హైకోర్టు నిలిపేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏఏఐ ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఫ్యూజన్‌ ఫుడ్‌ ఎండీ టి.హర్షవర్దన్‌ ప్రసాద్‌ మంగళవారం హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ వేశారు. న్యాయమూర్తి జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌ దీనిని విచారించారు. ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది లలిత వాదనలు వినిపిస్తూ.. ‘విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి చేసిన శ్రీనివాస్‌ ఫ్యూజన్‌ ఫుడ్‌ హోటల్‌ ఉద్యోగిగా ఉన్నాడు. ఈ దాడికి, పిటిషనర్‌కు ఎలాంటి సంబంధం లేదు. అయినా నిబంధనల ఉల్లంఘన, దుష్ప్రవర్తన తదితర కారణాలు ప్రస్తావిస్తూ హోటల్‌ కాంట్రాక్టును రద్దు చేస్తూ గత నెల 18వ తేదీన ఏఏఐ ఏకపక్షంగా ఆదేశాలు జారీ చేసింది.

kodikatti 08032019 1

దాడి జరిగిన రోజు ఉదయం 11.30 గంటలకే డ్యూటీ ముగియడంతో నిందితుడు శ్రీనివాస్‌ వెళ్లిపోయాడు. అలాంటప్పుడు ఆ దాడితో పిటిషనర్‌కేం సంబంధం? నిందితుడు దాడికి ఉపయోగించిన వస్తువు కూడా హోటల్‌కు సంబంధించినది కాదు. ఒప్పందం మేరకు 180 రోజులు ముందుగా నోటీసులు ఇవ్వాల్సివుండగా ఏఏఐ వాటిని పట్టించుకోలేదు. పిటిషనర్‌ సంస్థ సిబ్బందిని రకరకాలుగా వేధిస్తున్నారు. వారిని విమానాశ్రయంలోకి అనుమతించడం లేదు. హోటల్లో 24 మంది పని చేస్తున్నారు. వారి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి’ అని అభ్యర్థించారు. ప్రతివాది తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘ఫ్యూజన్‌ ఫుడ్‌ హోటల్‌ ఒప్పందంలోని నిబంధనలను అతిక్రమించింది. ఇది శాంతిభద్రతలకు సంబంధించిన వ్యవహారం. ఒప్పందం మేరకే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

 

kodikatti 08032019 1

ఆర్బిట్రేషన్‌ క్లాజ్‌ ఉన్నందున పిటిషనర్‌ ఆర్బిట్రేషన్‌ కోర్టుకు వెళ్లాలి. హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయడానికి వీల్లేదు’ అని తెలిపారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ‘నిందితుని గత నేరచరిత్ర యజమానికి ఎలా తెలుస్తుంది? బస్టాండులో ఉద్యోగి ప్రయాణికులపై రాయి వేస్తే సదరు రవాణా సంస్థ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటారా?’ అని ప్రశ్నించారు. రెండు పక్షాల వాదనలు విన్న అనంతరం ఫ్యూజన్‌ సంస్థ కాంట్రాక్టును రద్దు చేస్తూ ఏఏఐ జారీ చేసిన ఆదేశాలను హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హోటల్‌ సిబ్బందిని సహజ షరతులతో విమానాశ్రయంలోకి అనుమతించాలని కూడా సంబంధిత అధికారులను కోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంలో తగిన వివరణ ఇవ్వాలని కేంద్ర పౌర విమానయాన శాఖ ముఖ్య కార్యదర్శిని, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ను, ఏఏఐ రీజనల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ని, విశాఖ విమానాశ్రయ డైరెక్టర్‌ని, పౌరవిమానయాన భద్రతా విభాగ రీజనల్‌ డైరెక్టర్‌ని, ఏపీ డీజీపీని, విశాఖ పోలీసు కమిషర్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది.

Advertisements

Latest Articles

Most Read