దేశంలో ఎన్నికల నగరా మోగింది. ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 11న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుందని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరా ప్రకటించారు. ఈ ప్రకటన అనంతరం అందుబాటులో ఉన్న సీనియర్ నేతలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో అత్యవసరంగా సమావేశమయ్యారు. సమావేశంలో ఎన్నికల షెడ్యూల్, తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా సమావేశం అనంతరం సీనియర్ నేతలు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు హైదరాబాద్ లో కూర్చుని మాట్లాడటం ఎంతో ఎవరికీ అర్ధం కావటం లేదు. కేసీఆర్ సామంతుడు అని మరోసారి రుజువైంది.
అయితే జగన్ హైదరాబాద్ లో , ఏపి ఎన్నికల పై సమీక్ష చెయ్యటం పై, లోకేష్ ట్విట్టర్ లో స్పందించారు. ఇది లోకేష్ ట్వీట్ "ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 11న పోలింగ్ నిర్వహించనున్నట్టు ఈసీ ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. తెలంగాణలోని లోటస్‌పాండ్(హైదరాబాద్)లో వైకాపా నేతలతో జగన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌కి ఎవరు రావాలి? ఎవరు కావాలో మీరే తేల్చుకోండి.." "*కలువ కుంట జగన్ మోడీ రెడ్డి గారు* ఏపీలో అన్ని వ్యవస్థలపైన నమ్మకంలేదని ఇదివరకే ప్రకటించారు.అలాగే ప్రవర్తించారు.కలువ కుంట కే పరిమితం అయ్యారు. ఎన్నికల నగారా మోగడంతో తెలంగాణలోని లోటస్‌పాండ్‌లో పార్టీనేతలతో సమావేశమయ్యారు. ఏపీ ఎన్నికల కమిషన్‌పై నమ్మకంలేదని నామినేషన్లు కూడా తెలంగాణలో వేస్తారా?" అంటూ లోకేష్ ట్వీట్ చేసారు.
లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా స్పందించారు. ఏప్రిల్ 11న ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, అయితే ఓటు దొంగలు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా తమ ఓటును కాపాడుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు. ఓటు వేయడం ప్రతి పౌరుడి హక్కు అనీ, దాన్ని సద్వినియోగం చేసుకోవాలనీ సూచించారు. ప్రజలు తమ ఓటు ఉందో లేదో జాబితాలో చూసుకుని, ఒకవేళ లేకపోతే ఫారం-6 ద్వారా ఓటు పొందాలని తెలిపారు. ఓట్లు తొలగించేందుకు ఓటు దొంగలు వచ్చారని, వారి నుంచి ప్రజలు తమనుతాము కాపాడుకోవాలని పేర్కొన్నారు. బిడ్డల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని ఓటేయాలని పిలుపునిచ్చారు చంద్రబాబు.