ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటన వెలువడ్డ నేపథ్యంలో టీడీపీ ఎన్నికల ప్రచారానికి సమాయత్తమవుతోంది. తిరుపతి నుంచి టీడీపీ ఎన్నికల శంఖారావం పూరించనున్నట్టు చంద్రబాబు చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇక్కడి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 16 లేదా 17 తేదీల్లో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇదిలా ఉండగా, రేపు సాయంత్రం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను టీడీపీ బృందం కలవనుంది. ఫారం-7, డేటా చోరీ అంశాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. ఈసీని కలవనున్న ఈ బృందంలో మంత్రులు నక్కా ఆనంద్ బాబు, కాలవ శ్రీనివాసులు, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఉన్నారు.

tirupati 11032019

తమ కులదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని తిరుపతి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని చంద్రబాబు తెలిపారు. ‘మొదట ఎన్నికల యుద్ధానికి పార్టీ కేడర్‌ను సిద్ధం చేయాలి. ప్రతి జిల్లాలో బూత్‌ కన్వీనర్ల స్థాయి వరకూ వేల మందితో సమావేశాలు నిర్వహిస్తా. ఆ తర్వాత జనంలోకి వెళతా’ అని చెప్పారు. పార్టీవర్గాల సమాచారం ప్రకారం... సీఎం ఈ నెల 16నగానీ, 17నగానీ తిరుపతికి వెళతారు. అదే రోజు శ్రీకాకుళం జిల్లాలోనూ సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత మూడు రోజుల్లో అన్ని జిల్లాల్లో పార్టీ సమావేశాలు పూర్తి చేస్తారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు.

tirupati 11032019

రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలూ శ్రమిస్తూ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న తెదేపాకు ఓటేస్తారో? డబ్బుల కక్కుర్తితో, కేసుల మాఫీ కోసం నరేంద్ర మోదీ, కేసీఆర్‌లకు ఊడిగం చేస్తున్న జగన్‌కు ఓటేస్తారో? రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఇది 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని, ప్రజలు విజ్ఞతతో నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ‘నేను మీకు సేవ చేశా. మిమ్మల్ని ఓటు అడిగే హక్కు నాకుంది. రాబోయే 30 రోజులు మీ కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం మనస్సాక్షిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి’ అని కోరారు. ‘మీ భవిష్యత్తు- నా బాధ్యత’ అనేది ఈ ఎన్నికల్లో తమ నినాదంగా పేర్కొన్నారు. ఆదివారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు.

‘‘ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు నాదీ బాధ్యత! రాష్ట్ర ప్రజలందరికీ ఇదే నా మనవి! భావితరాల కోసం, మీ భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీకి ఓటేయండి. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఒక గాడిన పెడుతున్నాం. అభివృద్ధి, సంక్షేమంతో అన్ని వర్గాలను ఆదుకున్నాం. రాబోయే ఐదేళ్లలో సీమాంధ్రను తెలంగాణకంటే... దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాది’’ అని తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూలు వెలువడిన నేపథ్యంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలన్నీ కొనసాగుతాయని తెలిపారు. "మీ భవిష్యత్తుకు నాదీ బాధ్యత" అనేది మా ఎన్నికల నినాదం అంటూ చంద్రబాబు ప్రకటన చేసారు.

election 11032019

‘‘మీకు అండగా ఉండే ప్రభుత్వానికే ఓటు వేయండి. ఐదేళ్లు ప్రతి నిమిషం కష్టపడ్డా. ఇప్పుడు పరీక్ష ఎదుర్కొనే సమయం! ఇది నా ఒక్కడికే కాదు... రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ పరీక్ష. ఇది అందరి భవిష్యత్తుకు చెందిన అంశం’’ అని తెలిపారు. ఐదేళ్ల ప్రభుత్వ కష్టం వల్ల ప్రజలందరికీ వెసులుబాటు వచ్చిందని తెలిపారు. ‘‘హుద్‌హుద్‌ తుఫాను బీభత్సం సృష్టించినా... వారంలో విశాఖపట్నం కోలుకునేలా చేశాం. తితలీ తుఫానులో సాయం చేశాం. నాయకుడిగా ప్రతి ఒక్కరినీ అవసరానికి ఆదుకున్నా! పెద్దకొడుకుగా పింఛను పెంచాను. అన్నగా పసుపు-కుంకుమ ఇచ్చాను. పెద్ద రైతుగా రుణమాఫీ చేశాం. నంబర్‌ వన్‌ డ్రైవర్‌గా డ్రైవర్లందరికీ బీమా ఇచ్చాం. ఇలా ఏ ఒక్కరినీ విస్మరించకుండా అన్ని వర్గాలకు సంక్షేమం అందించాం. మరింత చేస్తాం’’ అని చంద్రబాబు తెలిపారు.

election 11032019

ఇది ఆత్మగౌరవ సమస్య.. ఈ ఎన్నికలు ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించినవని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘కేసీఆర్‌ పంచన చేరి, తెలంగాణకు ఊడిగం చేసే జగన్‌తో కాదు! జగన్‌ను ముందు పెట్టి ఆంధ్రపై పెత్తనం చేద్దామనుకుంటున్న కేసీఆర్‌తోనే పోటీ! కేసీఆర్‌ కావాలా? చంద్రబాబు కావాలా?’’ అని ప్రశ్నించారు. అసలు జగన్‌కు ఉన్న అర్హత ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. ఆయన అవినీతి గురించి అంతర్జాతీయ ప్రసిద్ధి పొందిన హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో పేపర్‌ ప్రజెంట్‌ చేశారని తెలిపారు. ‘‘తండ్రి అధికారం అండతో కొడుకు సంపాదన, అవినీతిపై హార్వర్డ్‌లో కేస్‌ స్టడీ చేశారు. నేరస్తుల మానసిక స్థితి ఎలా ఉంటుందన్న విషయాలను ప్రజంటేషన్‌లో పేర్కొన్నారు. ఉమ్మడి రాజధానిగా పదేళ్లు హైదరాబాద్‌లో ఉండే అవకాశం ఉన్నప్పటికీ... సొంతగడ్డపై ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని వెంటనే అమరావతికి తరలి వచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు. ‘‘తొలిరోజు బస్సులోనే నా కార్యాలయం. ఆ తర్వాత విజయవాడలో ఇరిగేషన్‌ కార్యాలయాన్ని నా ఆఫీసుగా చేసుకున్నా. డబ్బుల్లేవు. నా పిలుపుతో రైతులు 34వేల ఎకరాలు రైతులిచ్చారు. తొమ్మిది నెలల్లో సచివాలయం, అసెంబ్లీ నిర్మించాం. హైకోర్టు ప్రారంభించాం. రాజధానిలో పలు నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. కానీ, జగన్‌ హైదరాబాద్‌ను ఎందుకు వదిలిరాలేదు? లోట్‌సపాండ్‌లో కేసీఆర్‌ సహకారంతో ఆంధ్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి కుట్రలు చేశారు. కేసీఆరే వీళ్ల అభ్యర్థుల్ని ఎంపికచేశారు. హైదరాబాద్‌లో ఆస్తులున్న వారిని బెదిరించి వైసీపీ తరఫున పోటీచేయాలని అంటున్నారు. అసలు ఈ గడ్డపై ఉండటమే ఇష్టంలేని జగన్‌కు ఓటెందుకు వేయాలి?’’ అని ప్రశ్నించారు. ఆయనకు ఇక్కడ పోటీచేసే అర్హతే లేదన్నారు. తెలంగాణలోనే ఉండి... కేసీఆర్‌తోనే పొత్తు పెట్టుకుని ఒక 10 స్థానాలు తీసుకుని అక్కడే పోటీ చేయాలని సలహా ఇచ్చారు.

 

‘మీకు నేను కావాలా.. కేసీఆర్‌ కావాలా’ అని నవ్యాంధ్ర ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వైసీపీకి కూడా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ‘రాష్ట్రంలో ఎన్నికల కోసం వైఎస్‌ జగన్‌కు ఇప్పటికే వెయ్యి కోట్లు పంపించేశారు. కేసీఆర్‌ సంపాదించిన సొమ్మును మన రాష్ట్రంలో ఎందుకు పెట్టుబడి పెడుతున్నారు? నీకో సామంతరాజ్యం కావాలి. ఆంధ్రను సామంతరాజ్యంగా ఏలాలి. ఇది కేసీఆర్‌ కోరిక. కానీ మన ఐదు కోట్ల మంది ప్రజలకు ఆత్మాభిమానం ఉంది. మేమేంటో చూపిస్తాం. జగన్‌కు వెయ్యికోట్లు ఇవ్వడం.. నన్ను ఓడించడమే కేసీఆర్‌ నాకిచ్చే రిటర్న్‌ గిఫ్ట్‌. దానికి తిరుగుటపాలో జగన్‌ ఓటమిని పంపిస్తాం. ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంఽధించిన అంశం. నీ కేసుల కోసం నువ్వు.. స్వార్థం కోసం కేసీఆర్‌ ఏదైనా చేస్తే ఖబడ్దార్‌..’ అని హెచ్చరించారు.

cbn press 10032019

ఐదేళ్లపాటు సంక్షేమ కార్యక్రమాలను అందరికీ అందించామని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషికి 720 అవార్డులు వచ్చాయన్నారు. విభజన కష్టాలున్నా ముందుకెళ్తున్నామని ఆయన వివరించారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉంది. వైకాపా అధ్యక్షుడు జగన్‌..శాసనసభకు రారు.. భవిష్యత్తులో వచ్చే అవకాశం కూడా ఉండదు. విభజన హామీలు నెరవేర్చాలని కోరితే మాపైనే దాడులు చేస్తున్నారు. కాంగ్రెస్‌ పాలనలో పదేళ్లపాటు చాలా కష్టాలు ఎదుర్కొన్నాం. తాగునీరు, సాగునీరు, విద్యుత్‌ కోసం ఇబ్బందులు పడ్డాం. తెదేపా అధికారంలోకి వచ్చాక రైతులకు రూ.24,500 కోట్ల రుణమాఫీ చేశాం. అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఆర్థిక సాయం చేశాం. దేశంలో ఎక్కడాలేని విధంగా మౌలిక వసతులు కల్పించాం’’ అని చంద్రబాబు చెప్పారు.

cbn press 10032019

‘‘ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రా వాళ్ల పాలన కావాలా అని అడిగారు. అలాంటప్పుడు ఏపీలో తెలంగాణ పాలన కావాలా? ఏపీ ప్రజలు తెలివైన వాళ్లు. తెరాసకు ఊడిగం చేసే జగన్‌కు ఓటేయాలా? కులం, మతం, ప్రాంతాలను రెచ్చగొడుతున్నారు. ఎంతో కష్టపడి సంపద సృష్టించాం.. దాంతో సమకూరిన ఆదాయాన్ని పంపిణీ చేస్తున్నాం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రానికి కేసీఆర్‌ లేఖ రాయాలి. ఈ విషయంలో కేసీఆర్‌ను జగన్‌ ఒప్పించాలి’’ అని సీఎం అన్నారు.

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వేడి మొదలైంది. గత కొద్దిరోజులుగా లోక్‌సభ నియోజకవర్గాల వారీగా తెదేపా అధినేత చంద్రబాబు సమీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థుల మొదటి జాబితా రెడీ అయినట్టు సమాచారం. అసెంబ్లీకి పోటీ చేసే 115 మంది అభ్యర్థుల తొలి జాబితా తెలుగుదేశం సిద్ధం చేసింది. ఏ క్షణమైనా ఈ లిస్టు విడుదల అయ్యే అవకాసం ఉంది. మిగిలిన అభ్యర్ధులను ఈ నెల 12 లేదా 13వ తేదీల్లో విడుదల చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. కొన్ని వివాదాలు ఉన్న స్థానాలను తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు పెండింగ్‌లో ఉంచారు. ఆ వివాదాల పరిష్కారానికి పార్టీ అధినేత ఓ కమిటీని ఏర్పాటు చేశారు. మంత్రి యనమల నేతృత్వంలో సుజనా చౌదరి, బుద్ధా వెంకన్న, వర్ల రామయ్య సభ్యులుగా ఏర్పడిన కమిటీ.. ఆయా నియోజకవర్గాల్లోని అసమ్మతి నేతలతో మాట్లాడనుంది.

శ్రీకాకుళం:- 1. ఇచ్చాపురం- బెందాళం అశోక్ 02. పలాస - గౌతు శిరీష 03. టెక్కలి - అచ్చెన్నాయుడు 04. నరసన్నపేట - రమణమూర్తి 05. ఆముదాలవలస - కూన రవికుమార్ 06. శ్రీకాకుళం - గుండ లక్ష్మీ దేవి 07. రాజాo - కొండ్రు మురళి
08. ఎచ్చెర్ల - కళా వెంకట్రావు

విజయనగరం:- 01. బొబ్బిలి - సుజయ్ కృష్ణ రంగారావు 02. ఎస్.కోట- కోళ్ల లలిత కుమారి 03. సాలూరు- భాంజ్ దేవ్

విశాఖ పట్టణం:- 01. విశాఖపట్నం తూర్పు- వెలగపూడి రామకృష్ణ 02. విశాఖపట్నం దక్షిణo- వాసుపల్లి గణేష్ 03. విశాఖపట్నం పశ్చిమం- గణబాబు 04. గాజువాక- పల్లా శ్రీనివాసరావు 05. పెందుర్తి - బండారు సత్యనారాయణమూర్తి 06. యలమంచిలి- పంచకర్ల రమేష్‌ 07 నర్సీపట్నం - అయ్యన్నపాత్రుడు 08. అరకు- కిడారి శ్రావణ్ కుమార్ 09. పాడేరు- గిడ్డి ఈశ్వరీ

తూర్పు గోదావరి:- 01. కాకినాడ అర్బన్- వనమాడి కొండబాబు 02. కాకినాడ రూరల్- పిల్లి అనంతలక్ష్మీ 03. పెద్దాపురం- చినరాజప్ప 04. తుని- యనమల కృష్ణుడు 05. జగ్గంపేట- జ్యోతుల నెహ్రు 06. పత్తిపాడు- వరుపుల రాజా 07. పిఠాపురం- వర్మ 08. రాజానగరం - పెందుర్తి వెంకటేష్ 09. రాజమండ్రి రూరల్ - గోరంట్ల బుచ్చయ్య చౌదరి 10. అనపర్తి - రామకృష్ణరెడ్డి 11. మండపేట - జోగేశ్వరరావు 12. రామచంద్రాపురం- తోట త్రిమూర్తులు 13. రాజోలు- గొల్లపల్లి సూర్యారావు 14. కొత్తపేట- బండారు సత్యానందరావు 15. ముమిడివరం - దాట్ల సుబ్బరాజు

పశ్చిమ గోదావరి:- 01. ఏలూరు- బడేటి బుజ్జి 02. దెందులూరు- చింతమనేని ప్రభాకర్ 03. ఉంగుటూరు- గన్ని వీరాంజనేయులు 04. నర్సాపురం-మాధవ నాయుడు 05. ఆచంట- పితాని సత్యనారాయణ 06. ఉండి- శివరామరాజు
07. తణుకు- ఆరుమిల్లి రాధాకృష్ణ 08. పాలకొల్లు -రామా నాయుడు 09. భీమవరం- పులపర్తి రామాంజనేయులు 10. తాడేపల్లి గూడెం - ఈలి నాని

కృష్ణా:- 01. విజయవాడ తూర్పు- గద్దె రామ్మోహన్ 02. విజయవాడ సెంట్రల్- బోండా ఉమా 03. విజయవాడ వెస్ట్- షబానా ఖాతూన్ 04. జగ్గయ్యపేట- శ్రీరాం తాతయ్య 05. నందిగామ- తంగిరాల సౌమ్య 06. మైలవరం- దేవినేని ఉమ 07.గన్నవరం- వల్లభనేని వంశీ 08. పెనమలూరు-బోడె ప్రసాద్ 09. అవనిగడ్డ- మండలి బుద్ద ప్రసాద్ 10. బందరు -కొల్లు రవీంద్ర 11. గుడివాడ -దేవినేని అవినాష్

గుంటూరు:- 01. రేపల్లె- అనగాని సత్య ప్రసాద్ గౌడ్ 02. వేమూరు- నక్కా ఆనందబాబు 03. పొన్నూరు- ధూళిపాళ్ల నరేంద్ర 04. తెనాలి- ఆలపాటి రాజా 05. చిలకలూరిపేట- పత్తిపాటి పుల్లారావు 06. గురజాల- యరపతినేని శ్రీనివాస్ 07. వినుకొండ- జీవీ ఆంజనేయులు 08. పెదకూరపాడు- కొమ్మాలపాటి శ్రీధర్ 09. సత్తెనపల్లి- కోడెల శివప్రసాద్

ప్రకాశం:- 01. ఒంగోలు- దామచర్ల జనార్ధన్ 02. గిద్దలూరు- అశోక్ రెడ్డి 03. అద్దంకి- గొట్టిపాటి రవికుమార్ 04. పర్చూరు- ఏలూరు సాంబశివరావు 05. దర్శి- శిద్దా రాఘవరావు 06. కొండెపి- బాల వీరాంజనేయ స్వామి 07. మార్కాపురం- కందుల నారాయణ రెడ్డి 08. కందుకూరు- పోతుల రామారావు 09. చీరాల- కరణం బలరాం

నెల్లూరు:- 01. నెల్లూరు అర్బన్ - నారాయణ 02. నెల్లూరు రూరల్ - ఆదాల ప్రభాకర్ రెడ్డి 03. సర్వేపల్లి- సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 04. కోవూరు- పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి 05. కావలి - బీదా మస్తాన్ రావ్ 06. వెంకటగిరి -కురుగొండ్ల రామకృష్ణ 07. ఆత్మకూరు- బొల్లినేని కృష్ణయ్య 08. గూడూరు- పాశం సునీల్

కడప:- 01. రాజంపేట- బత్యాల చెంగల్రాయుడు 02. రైల్వే కోడూరు- నర్శింహా ప్రసాద్ 03. రాయచోటి- రమేష్ కుమార్ రెడ్డి 04. మైదుకూరు- పుట్టా సుధాకర్ యాదవ్ 05. కమలాపురం- పుత్తా నర్శింహా రెడ్డి 06. జమ్మలమడుగు- రామసుబ్బారెడ్డి 07. పులివెందుల- సతీష్ రెడ్డి

కర్నూల్:- 01. డోన్‌- కేఈ ప్రతాప్‌ 02. పత్తికొండ -కేఈ శ్యామ్‌బాబు 03. మంత్రాలయం - తిక్కారెడ్డి 04. ఎమ్మిగనూరు- బీవీ జయనాగేశ్వరరెడ్డి 05. బనగానపల్లె- బీసీ జనార్ధన్‌రెడ్డి 06. ఆళ్లగడ్డ- అఖిల ప్రియ 07. పాణ్యం- గౌరు చరితా రెడ్డి 08 శ్రీశైలం- బుడ్డా రాజశేఖర్ రెడ్డి 09. నంద్యాల- భూమా బ్రహ్మనంద రెడ్డి

అనంతపురం:- 01. అనంతపురం సిటీ- ప్రభాకర్‌ చౌదరి 02. తాడిపత్రి- జేసీ అస్మిత్‌రెడ్డి 03. ఉరవకొండ- పయ్యావుల కేశవ్‌ 04. రాయదుర్గం- కాల్వశ్రీనివాసులు 05. హిందూపురం- నందమూరి బాలకృష్ణ 06. రాప్తాడు- పరిటాల సునీత 07. ధర్మవరం- గోనుగుంట్ల సూర్యనారాయణ 08. పెనుగొండ- డి.కె.పార్థసారధి 09. మడకశిర- వీరన్న 10. పుట్టపర్తి- పల్లెరఘునాథ్ రెడ్డి

చిత్తూరు:- 01. పీలేరు- నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి 02. పుంగనూరు- అనూషా రెడ్డి 03. కుప్పం- నారా చంద్రబాబునాయుడు 04. పలమనేరు- అమర్నాథ్‌రెడ్డి 05. చంద్రగిరి- పులవర్తి నాని 06. చిత్తూరు- సత్య ప్రభ 07. చిత్తూరు- సుగుణమ్మ

Advertisements

Latest Articles

Most Read