రాష్ట్రంలో ఎన్నికల వేళ, అతి దారుణమైన గేమ్ నడుస్తుంది. ముఖ్యంగా జగన్, కేసీఆర్, విజయసాయి చేస్తున్న కుట్రలు, అమిత్ షా, మోడీ డైరెక్షన్ చూసి, ఏపి ప్రజలు ఛీదరించుకుంటున్నారు. గత పది పదిహేను రోజులుగా, వోట్లు స్కాం, డేటా వార్ ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. 8 లక్షల ఓట్లు తీసివెయ్యమని, నేనే ఫారం-7 ఇచ్చాను అంటూ జగన్ మోహన్ రెడ్డి బహిరంగంగా ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒక పక్క తెలుగుదేశం ఓట్లు తొలగిస్తుంది అంటూనే, ఇప్పుడు ఏకంగా నేనే ఓట్లు తీపిస్తున్నా అని చెప్పూరు. అయితే ఫారం-7 ద్వా ఓట్లు తొలగించటానికి, ఒక సర్వే చేస్తున్నారు. ఇదంతా ప్రశాంత్ కిశోరే స్కెచ్ ప్రకారం జరుగుతూ వస్తుంది. అయితే, ఇప్పుడు ఏబీఎన్ ఛానల్ ని, సర్వే కోసం వాడుతూ దొరికిపోయారు.
ఏబీఎన్‌ను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఏబీఎన్ సర్వే పేరుతో ఏపీలో ఫేక్‌కాల్స్ కలకలం సృష్టిస్తున్నాయి. ఏబీఎన్ పేరుతో సర్వే చేస్తున్నామంటూ కొందరికి ఫోన్‌కాల్స్ రావడంపై యాజమాన్యానికి ఫిర్యాదులు అందాయి. ఎవరికి ఓటేస్తారో చెప్పాలంటూ సమాచార సేకరణకు అగంతకులు పాల్పడుతున్నట్లు సంస్థ దృష్టికి వచ్చింది. ఇలాంటి కాల్స్‌తో ఏబీఎన్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నామని, ఫేక్‌కాల్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఏబీఎన్ హెచ్చరించింది. ఫేక్ కాల్స్ చేసేవారిని ఉపేక్షించబోమని ఏబీఎన్ యాజమాన్యం స్పష్టం చేసింది.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. రచ్చ బండల దగ్గర్నుంచి రాజకీయ వర్గాల దాకా సర్వత్రా ఇదే చర్చ. ఈ నేపథ్యంలో ఓ జాతీయ దినపత్రిక తాజాగా ఓ సర్వేను విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం... టీడీపీ ప్రభుత్వ పాలన సంతృప్తికరంగా ఉందని 52.7 శాతం మంది ప్రజలు స్పష్టం చేశారు. అదే సమయంలో టీడీపీ పాలనపై 47.3 శాతం మంది పెదవి విరిచినట్లు సర్వే పేర్కొంది. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే జనసేన పార్టీ కీలక భూమిక పోషించే అవకాశముందని సర్వే తెలిపింది. సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ, పసుపు-కుంకుమ, నిరుద్యోగ భృతి పెంపు, ఫించను పెంపు అంశాలు టీడీపీపై సానుకూలతను పెంచాయని సర్వే స్పష్టం చేసింది. ఇది మార్చి 2 నుంచి 8వ తేదీలోపు జరిగిన సర్వేగా ఆ మీడియా సంస్థ పేర్కొంది.