అధికార తెలుగుదేశం పార్టీలో ఎన్నికల కసరత్తు గతానికంటే భిన్నంగా, జోరుగా సాగుతోంది. ఎన్నికల షెడ్యూలుకంటే మెజారిటీ అభ్యర్థులపై స్పష్టత వస్తోంది. అంతేకాదు... ఈ మొత్తం కసరత్తును పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఒంటిచేత్తో లాగిస్తున్నారు. టీడీపీలో ఎమ్మెల్యే అభ్యర్థులపై ప్రతిసారీ చివరి నిమిషం దాకా సస్పెన్స్‌ కొనసాగేది. నామినేషన్ల ప్రక్రియ ఆఖరు దశకు చేరుకున్నాక కూడా కొన్ని స్థానాలపై స్పష్టత వచ్చేది కాదు. ఇప్పుడు ఈ దృశ్యం మారింది. చంద్రబాబు ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా దాదాపు సగం స్థానాలపై స్పష్టత ఇచ్చేశారు. అంతా బాగుందనుకున్న చోట సిట్టింగ్‌లు, ఇన్‌చార్జులను పనిచేసుకోవాలని చెప్పేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ... వర్గ తగాదాలు, సిట్టింగ్‌లపై తీవ్ర అసంతృప్తి ఉన్న స్థానాల్లో ఎంపికను వాయిదా వేయడంపైనే పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇలాంటి స్థానాలపై చంద్రబాబు పార్టీ సీనియర్లతో కమిటీ వేసి... విషయాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చేవారు. చివరగా తానే నిర్ణయం తీసుకున్నవారు. ఈసారి మాత్రం ‘అన్నీ తానై’ అన్నట్లుగా మొత్తం వ్యవహారాలను చంద్రబాబే పర్యవేక్షిస్తున్నారు.

జిల్లాల్లో పర్యటనలు, ప్రభుత్వ కార్యకలాపాలకు తోడు... అభ్యర్థుల ఎంపిక ప్రక్రియతో చంద్రబాబు బిజీబిజీగా గడుపుతున్నారు. ఒక పక్క కుట్రలను ఎదుర్కుంటూనే, గత కొన్నిరోజులుగా రాత్రి 1.30 గంటల వరకు సమీక్షల్లో మునిగి తేలుతున్నారు. ఎన్నికల వ్యూహాలు, మ్యానిఫెస్టోలో పెట్టే అంశాలు, ప్రత్యర్థుల దాడిని తట్టుకునే మార్గాలు, ప్రభుత్వ పాలన అన్నీ ఆయన చూసుకోవాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో గ్రూపులు ఉన్న నియోజకవర్గాల వ్యవహారం కూడా స్వయంగా ఆయనే చూడడం కష్టంగా మారింది. అసంతృప్తులను నేరుగా ఆయన ముందుకు తీసుకొచ్చినా అప్పటికప్పుడు రాజీ కుదర్చడానికి గంటల కొద్దీ సమయం వెచ్చించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబుకు అది కుదరని పని. ఈ నేపథ్యంలో ఇలాంటి నియోజకవర్గాల వివాదాలను సర్దుబాటు చేసేందుకు కొందరు సీనియర్‌ నేతలను ఎంపికచేసి... ఆ బాధ్యతలు వారికి అప్పగిస్తే బాగుంటుందన్నది పార్టీ వర్గాల మాట! కొన్నిచోట్ల టికెట్‌ రేసులో ఇద్దరు, ముగ్గురు నేతలుండగా... సిట్టింగ్‌లు ఉన్న చోట అసమ్మతి ఉంది. రేసులో ఉన్న వారికి సర్దిచెప్పడం సులువుగా ఉన్నప్పటికీ.. సిట్టింగ్‌లపై అసమ్మతి జ్వాలలు ఉన్న స్థానాల్లో మాత్రం పరిస్థితి క్లిష్టంగానే ఉంది. రెండు వర్గాలను సముదాయించి ముందుకెళ్తేనే పార్టీ విజయానికి భరోసా ఉంటుంది. దీనికోసం సీనియర్లతో కూడిన కమిటీని నియమించి... నియోజకవర్గాల వారీ బాధ్యతలను వారికి అప్పగించాలనే వాదన వినిపిస్తోంది. గత ఎన్నికల సందర్భంగా కూడా ఇలా సీనియర్‌ నేతలను జిల్లాలకు పంపడం, లేదా ఒక కమిటీని ఏర్పాటుచేసి పరిష్కారం కనుగొనడం... చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోవడమనే పద్ధతినే అనుసరించారు.

పింఛన్లు రెట్టింపు చేయడం, పసుపు-కుంకుమ కింద రెండోసారి డ్వాక్రా మహిళలకు రూ.10వేల చొప్పున ఇవ్వడం, అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా రైతులకు సహాయం... వంటి చర్యలతో క్షేత్రస్థాయిలో తెలుగుదేశానికి అనుకూల వాతావరణం ఏర్పడింది. ‘‘ప్రభుత్వం ఏ వర్గాన్నీ వదలకుండా లబ్ధి చేకూర్చింది. ఇక అడగడానికి ఏమున్నాయి అనే స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. అయితే ఆ పథకాలు, చంద్రబాబు కారణంగా వచ్చిన సంతృప్తిని కిందిస్థాయిలో నేతలు కొనసాగిస్తే సరిపోతుంది. కానీ, చాలామంది ఆ పనికూడా చేయడం లేదు. నియోజకవర్గాల్లో ఇగోలకు వెళ్లడం, కష్టించి పనిచేసే వారిని పక్కన పెట్టడం, గ్రూపులు కట్టడంతో కార్యకర్తల్లో స్తబ్ధత ఏర్పడింది. రాబోయే రోజులు కార్యకర్తలవే అన్న భరోసా వీరిలో కల్పించాలి. కిందిస్థాయిలో నియోజకవర్గ నేతలు, ఎమ్మెల్యేలే ఈ పని చేయాలి. అందరినీ కలుపుకొని, కార్యకర్తల్ని చైతన్యపరిచి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థిపైనే ఉంటుంది’’ అని ఒక సీనియర్‌ నేత పేర్కొన్నారు. ఇలాంటి సమస్య కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే ఉందని, అది కూడా త్వరలోనే పరిష్కారమవుతుందని తెలిపారు.

 

 

తెలంగాణ ప్రభుత్వం హద్దులు దాటి ప్రవర్తిస్తోందని, ఇలాగే వ్యవహరిస్తే రాష్ట్రాలకు పరిశ్రమలు రావని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. మంగళవారం ఆయన పలువురు టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... టీడీపీ డేటానే టీఆర్‌ఎస్‌ దొంగిలించే ప్రయత్నం చేసిందన్నారు. డేటా విషయంలో సిల్లీ వాదనలు చేస్తున్నారని, ఏపీ చేస్తున్న మంచిపనులు, కేంద్రం, వైసీపీ చేస్తున్న తప్పుడు పనులపై చర్చ జరగకుండానే ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని, విశాఖ జోన్‌ విషయంలో కేంద్రం చేసిన అన్యాయంపై చర్చ జరగకుండా డేటా అంశాన్ని తెరపైకి తెచ్చారని చంద్రబాబు అన్నారు. అహంభావంతో కేసీఆర్‌, ఫ్రస్టేషన్‌తో జగన్‌ దుర్మార్గాలు చేస్తున్నారని, వ్యక్తికైనా, సంస్థకైనా డేటా అనేది ఒక ఆస్తి అని, ఆస్తులకే హైదరాబాద్‌లో రక్షణ లేదన్నారు.

cbn teleconf 05032019

అహంకారం నెత్తికెక్కి తెరాస విపరీత చేష్టలకు పాల్పడుతోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దుయ్యబట్టారు. ఏ వ్యక్తికైనా, సంస్థకైనా సమాచారమే కీలక ఆస్తి అని.. అలాంటి ఆస్తికి హైదరాబాద్‌లో రక్షణ లేకుండా పోయిందని సీఎం మండిపడ్డారు. పిల్లచేష్టలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు నష్టం కలిగిస్తున్నారని.. ఎవరైనా సమాచారాన్ని ఇకపై హైదరాబాద్‌లో పెడతారా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. వాళ్లకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకొని హద్దులు దాటి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏ పార్టీకి లేని సాంకేతిక తెదేపా సొంతమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ 24 ఏళ్లు కష్టపడి కార్యకర్తల సమాచారం సేకరిస్తే.. దానిని దొంగిలించి వైకాపాకి ఇచ్చారని సీఎం దుయ్యబట్టారు. ప్రభుత్వ సమాచారమని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. తెదేపా సమాచారం కొట్టేసి పార్టీపైనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

cbn teleconf 05032019

మోదీ, కేసీఆర్‌, జగన్‌ ముసుగు తీసి ప్రచారం చేయాలని.. ప్రజలే మీ అరాచకాలకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. కేసీఆర్‌కు సామంత రాజుగా జగన్ మారారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌ని సామంత రాజ్యం చేయాలనేదే కేసీఆర్‌ కుట్ర అని ఆరోపించారు. జగన్‌ను లొంగదీసుకుని ఏపీపై దాడులకు తెగబడ్డారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మూలాలపై దాడులు చేయడం హేయమైన చర్య అని సీఎం మండిపడ్డారు. అధికారంతో ఏదైనా చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఫారమ్ 7 దుర్వినియోగం చేయడం నేరమని పేర్కొన్నారు. నేరస్థుల ఆలోచనలు ఎప్పుడూ నేరాలపైనే ఉంటాయని చంద్రబాబు మండిపడ్డారు. గుంటూరులో నాలుగు చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలు ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే జగన్‌ అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు.

యశ్వంత్‌పూర్‌-టాటానగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అగ్నిప్రమాదం సంభవించింది. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు రైల్వేస్టేషన్‌ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు మధ్యలో ఉన్న వంట చేసే బోగీ నుంచి ఒక్కసారిగా మంటలు రావటంతో పక్కబోగీలో ఉన్న ప్రయాణికులు చైన్‌ లాగి రైల్‌ను నిలిపివేశారు. వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన రైల్వే అధికారులు రెండు బోగీలను తప్పించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో వంట చేసే బోగీ పూర్తిగా కాలిపోయింది. దీని పక్కన ఉన్న బోగీ కూడా పాక్షికంగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో రైల్వే సిబ్బంది ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం నుంచి ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడ్డారు.

train 05032019 2

రైలు ప్రమాదంతో ఒకే లైన్‌ ద్వారా అధికారులు రైళ్ల రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక యంత్రం చేరేందుకు సరైన మార్గం లేకపోవటంతో మంటలు ఆర్పేందుకు ఆలస్యమైందని సిబ్బంది పేర్కొన్నారు. సుమారు 2.15 గంటల సమయంలో రైల్లోని ప్యాంట్రీకారులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. రైలులో మొత్తం 23 బోగీలు ఉండగా 9వ బోగీ అయిన పాంట్రీకార్ మంటలు వచ్చాయి. వీటిని గుర్తించిన ప్రయాణికులు వెంటనే చైన్ లాగారు. ఆపై రైల్వే సిబ్బంది కూడా బోగీలను వేరుచేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులంతా క్షేమంగా భయటపడ్డారు. అగ్నిప్రమాదంతో విజయవాడ-విశాఖ మధ్య పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

బీజేపీ శాసనసభాపక్ష నేత, విశాఖ నార్త్ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు గత కొన్నాళ్లుగా అటా?, ఇటా? అన్నట్టు తర్జనభర్జన పడుతున్నారు. ఒకానొక దశలో తెలుగుదేశం పార్టీలో చేరి, మళ్లీ విశాఖ నార్త్ నుంచే పోటీ చేయాలని భావించారు. అయితే ప్రధాని విశాఖ పర్యటన తరువాత తాను ఒక నిర్ణయానికి వస్తానని ఆయన చెప్పుకొచ్చారు. విశాఖపట్నానికి కొత్త రైల్వేజోన్‌ ప్రకటిస్తే, బీజేపీకి మైలేజీ వస్తుందని, అప్పుడు పార్టీ అభ్యర్థిగా మళ్లీ విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని తన మనసులో మాట చెప్పారు. ఒకవేళ రైల్వేజోన్‌ ప్రకటించకపోతే ఏమిటనేది ఆలోచిస్తానని వివరించారు. ఆయన ఆశించినట్టుగానే ప్రధాని విశాఖ పర్యటనకు ముందే కేంద్రం విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ప్రకటించింది.

vishnu 053022019 1

అందులో వాల్తేరు డివిజన్‌ లేకపోయినప్పటికీ ‘జోన్‌ తెస్తామని మాట ఇచ్చాము...తెచ్చాము. హామీ నిలుపుకొన్నాము’ అంటూ సమర్థించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారబోరని మరోసారి విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే విష్ణుకుమార్‌రాజు మాత్రం ఇంకా ఎటూ తేల్చులేకపోతున్నారని విశ్వసనీయ సమాచారం. ఇప్పుడు ప్రకటించిన జోన్ బీజేపీకి మైలేజీ తేక పోగా, అది ఎక్కువ డ్యామేజ్ చేసిందని, అయినా ఈ జోన్ విషయం స్థానికంగా గెలుపునకు దోహదపడుతుందా? లేదా? అనే మీమాంసలో వున్నట్టు తెలుస్తోంది. జోన్ విషయం ప్రకటించిన తరువాత, బీజేపీ పై ఆగ్రహావేశాలు వచ్చాయి. ప్రజలు పనికిరాని జోన్ ఇచ్చారనే ఉద్దేశంలో ఉన్నారు.

vishnu 053022019 1

దీంతో విష్ణుకుమార్‌రాజు మళ్ళీ పార్టీ మార్పు పై ఆలోచనలో పడ్డారు. బీజేపీలో ఉంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేక భావం ఉన్న పరిస్థుతుల్లో, ఒక వైపు బీజేపీ తరఫున పోటీకి సిద్ధపడుతూనే...మరో వైపు తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఒకసారి కలిసి తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాలని ఆయన యోచిస్తున్నట్టు తెలిసింది. ఒకటి, రెండు రోజుల్లో చంద్రబాబును కలవడానికి విష్ణుకుమార్‌రాజు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆ తరువాతే ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది స్పష్టమవుతుంది. ఒకవేళ విశాఖ ఉత్తరం నుంచి విష్ణుకుమార్‌రాజు పోటీ చేయకపోతే పార్టీ నగర అధ్యక్షుడు ఎం.నాగేంద్ర అభ్యర్థి అవుతారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisements

Latest Articles

Most Read