2014 ఎన్నికల సమయంలో, మోడీ ఆంధ్రా వచ్చి, జగన్ మోహన్ రెడ్డిని తిట్టిన తిట్టు లేదు. చంద్రబాబు లాంటి అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వారికి మద్దతు ఇవ్వండి, దొంగలకు వద్దు అని చెప్పారు. స్కామంద్ర చేసిన వాడిని దూరం పెట్టమన్నారు. అవినీతి చేసిన వారిని లోపల వేస్తాను అన్నారు. ఇవన్నీ మోడీ ఇప్పుడు మర్చిపోయారు. ఇప్పుడు జగన్ వచ్చి, మోడీ ఒడిలో కూర్చున్నారు. విజయసాయి రెడ్డి ఏమి చేసారో కాని, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అనే క్రిమినల్, మోడీకి పెద్ద స్నేహితుడు అయ్యాడు. అందుకే మొన్న గుంటూరులో అంత పెద్ద మీటింగ్ పెట్టుకున్నా, జగన్ మోహన్ రెడ్డిని ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనలేదు. జగన్ అంటే ఎంత ప్రేమో ఇక్కడే తెలుస్తుంది.
జగన్ అవినీతి గురించి, జగన్ కేసుల గురించి, ఒక్క మాట కూడా మోడీ మాట్లాడ లేదు. మరో పక్క జగన్ మోహన్ రెడ్డి కూడా, మోడీ గుంటూరు వస్తే, ఎక్కడా నిరసన లేక పోగా, స్వాగతం పలికారు. మోడీ మీటింగ్ కు జనాన్ని తోలారు. నువ్వు నన్ను తిట్టద్దు, నేను నిన్న తిట్టను, ఇద్దరం కలిసి చంద్రబాబు మీద పడదాం అంటూ, ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలా దొంగతనంగా, చీకటి ఒప్పందం చేసుకుని, అందరూ కలిసి చంద్రబాబు మీద పడుతున్నారు. మోడికి అంటే ఆంధ్రప్రదేశ్ నాశనం అవ్వాలి, ఎదగితే గుజరాత్ కు పోటీ వస్తుంది అనే కుళ్ళు ఉంటుంది, కాని ఈ జగన్ మోహన్ రెడ్డికి ఏమైంది ? తన కేసుల కోసం, రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని, గుజరాతీ వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టాడు.
అయితే మోడీ వస్తే మాత్రం పిల్లలాగ మూల కూర్చున్న జగన్, ఏపిలో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పై మాత్రం, ప్రతాపం చూపిస్తున్నారు. ఈ రోజు నెల్లూరులో, కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా భరోసా యాత్ర చేపట్టింది. అయితే కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రను వైసీపీ నెల్లూరులో అడ్డుకుంది. వెంకటగిరి క్రాస్ రోడ్స్ సెంటర్‌లో కాంగ్రెస్ చేపట్టిన ప్రత్యేక హోదా భరోసా యాత్రను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. రాష్ట్ర విభజన ద్రోహి-కాంగ్రెస్ గో బ్యాక్ అంటూ నల్లజెండాలతో వైసీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. దీంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్-వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు. అయితే మోడీ పై మాత్రం, ఒక్క మాట మాట్లాడని జగన్, ఏపిలో అడ్డ్రెస్ లేని కాంగ్రెస్ పై మాత్రం, ప్రతాపం చూపిస్తూ, తాను ఎంత బలహీనుడినో మరోసారి రుజువు చేసుకున్నారు.