తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని, దేశ ప్రధాని మోడీ ఈ దేశ ప్రజలను నిలువెత్తున మోసం చేశాడని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఇచ్చిన మాట తప్పారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. తిరుపతిలో శుక్రవారం సాయంత్రం స్థానిక తారకరామ స్టేడియంలో జరిగిన ప్రత్యేక హోదా భరోసా యాత్ర బహిరంగ సభలో రాహుల్‌గాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మోడీపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఇదే వేదికనుంచి ప్రధాని మోడీ 2014లో శ్రీవారి సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ప్రత్యేక హోదాపై నిధులపై హామీ ఇచ్చి నేడు మాటతప్పారని విమర్శించారు. ఆయన్ను కేవలం తన సొంత వారికే దోచిపెట్టేందుకే ప్రధానిగా కొనసాగారని, మోడీ తాను ఈ దేశ కాపలాదారునిగా పేర్కొంటారని, కానీ ఆయన కాపలా దారుడు కాదని, ఈ దేశానికి ఓ దొంగలా తయారయ్యారంటూ రాహుల్‌ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.

rahul 23022019

అదేవిధంగా రైతులకు ఇచ్చిన మాట తప్పారని, రుణమాఫీ విషయంలో వెనకడుగు వేశారని, నిరుద్యోగులకు ప్రతియేటా లక్షలాది ఉద్యోగాలంటూ వారిని నట్టేట ముంచడమేగాక ఉన్నవారి ఉద్యోగాలు కూడా నేడు ఊడుతున్నాయంటూ రాహుల్‌ ఎద్దేవా చేశారు. అదేవిధంగా రూ.30 వేల కోట్ల కొనుగోళ్లలో తన అనుచర పారిశ్రామిక వేత్తలైన అంబానీ, ఆదానీలకు అప్పనంగా దోచిపెట్టారంటూ రాహుల్‌ విమర్శించారు. ఈ దేశ సార్వభౌమత్వాన్ని పారిశ్రామిక వేత్తల ఎదుట మోడీ తాకట్టు పెట్టారంటూ రాహుల్‌ విమర్శించారు. ఒక దేశ ప్రధానిగా వుంటూ అన్నీ అసత్యాలే మాట్లాడుతున్నారని, మోడీ జీవితంలో నిజాలు పలకడం లేదని రాహుల్‌ విమర్శించారు. తాము ఇటీవల జరిగిన ఉత్తరాది ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాలని పడగొట్టి కాంగ్రెస్‌ అధికారం చేపట్టిందంటే అందుకు ప్రధాన కారణం బీజేపీపై, మోడీపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిందని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లు వేసేందుకు సిద్ధంగా వున్నారని, తాను ప్రధాని కావడం ఖాయమంటూ రాహుల్‌ తిరుపతి నుంచి తన ఎన్నికల శంఖారావాన్ని పూరించారు.

rahul 23022019

తాను ఈ దేశ ప్రధాని కావడం ఖాయమని, శ్రీవారి ఆశీస్సుల కోసం తాను తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకున్నానని, శ్రీవారి దర్శనంతో తనకు ఓ అనుభూతి కలిగిందని, తనకు శ్రీవారి ఆశీస్సులతో పాటు దేశ ప్రజల ఆశీస్సులున్నాయని, ఈ ఎన్నికల్లో దుష్టశక్తులను ఓడించి దేశ సమగ్రతను కాపాడే కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిఒక్కరూ ఓటెయ్యాలని తిరుపతి సభనుంచి రాహుల్‌గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. తిరుపతి సభలో మోడీ ఏపికి ప్రత్యేక హోదా మాటివ్వడం ఓ ప్రధానిగా కాదని, ఆయన శ్రీవారి పాదాల సాక్షిగా ఇచ్చిన మాటను నేడు ఆయన మాట తప్పారని, తానుమాత్రం తప్పక తన తొలి సంతకాన్ని ప్రధాని అయిన వెంటనే చేస్తానంటూ సభికుల హర్షధ్వానాల మధ్య రాహుల్‌ ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలవడం ఖాయమని, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు నిధుల మంజూరు విషయంలో న్యాయం చేస్తామంటూ పేర్కొన్నారు. ఏపిలో రానున్న ఎన్నికల్లో ఏపార్టీ అధికారంలోకి వచ్చినా తాము హోదా విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.

రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను ఖరారు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు... పలు సీట్ల విషయంలో ఇప్పటికే అభ్యర్థులను క్లారిటీ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో తమకు సీటు ఖరారైందని... ఆయా నేతలు మీడియాలో ప్రకటనలు కూడా చేస్తున్నారు. ఇది కొంతమంది ఆశావాహుల అసంతృప్తికి కారణమవుతోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు విషయంలోనూ ఇలాంటి పంచాయతీనే నడుస్తోంది. వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన జలీల్ ఖాన్... ఇక్కడి నుంచి తన కుమార్తె షబానా ఖాతూర్‌కు టికెట్ ఇవ్వాలని కోరడం... ఇందుకు చంద్రబాబు ఓకే చెప్పడం జరిగిపోయాయి.

cbn 23022019

అయితే ఈ స్థానం నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్న టీడీపీ నేత నాగుల్ మీరా... జలీల్ ఖాన్ కుమార్తెకు టీడీపీ టికెట్ ఇవ్వడంపై అసంతృప్తితో ఉన్నారు. తనకు కాకుండా జలీల్ ఖాన్ కూతురికి టికెట్ ఎలా కేటాయిస్తారంటూ ఆయన పార్టీ ముఖ్యనేతల దగ్గర వాపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవిలో ఉన్న నాగుల్ మీరా... త్వరలోనే తన పదవికి, పార్టీకి రాజీనామా చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు ప్రచారం కూడా జరిగింది. దీంతో నాగుల్ మీరాను వెంటపెట్టుకుని చంద్రబాబును కలిశారు ఎంపీ కేశినేని నాని. అయితే విజయవాడ పశ్చిమ సీటును నాగుల్ మీరాకు ఇవ్వాలని ఎంపీ నాని కూడా చంద్రబాబును కోరారని కొందరు చర్చించుకుంటున్నారు.

cbn 23022019

మరికొందరు మాత్రం నాగుల్ మీరాను ఎంపీ నాని బుజ్జగించి చంద్రబాబు దగ్గరకు తీసుకెళ్లారని చెబుతున్నారు. మొత్తానికి విజయవాడ పశ్చిమ సీటు ఆశించి భంగపడ్డ నాగుల్ మీరా... చంద్రబాబు బుజ్జగింపులతో మెత్తబడతారా లేక పార్టీని వీడతారా అన్నది చూడాలి. పార్టీ వీడేందుకు నాగుల్ మీరా స‌మావేశం ఏర్పాటు చేశారంటూ వార్త‌లు వ‌చ్చాయి.. అయితే వాటిని నాగుల్ మీరా తోసిపుచ్చారు. అసంతృప్త ఉన్న మాట వాస్తవ‌మేన‌ని, కానీ పార్టీని వీడేది లేద‌ని తేల్చి చెప్పారు. అధినేత ప్రకటించకుండా జలీల్ ఖాన్ సొంతంగా సీటు ఎలా ప్రకటించుకుంటాంటూ ప్ర‌శ్నించారు. బోండా ఉమ, గద్దె రామ్మోహన్ ప్రకటించుకోలేదే అంటూ నిల‌దీశారు. ఏది ఏమైనా చంద్రబాబు ప్రకటిస్తే త‌మ‌తో ముందుగా మాట్లాడి, వారితో కలిసి పని చేయాలని చెప్పేవార‌ని, ఇంత వ‌ర‌కూ అటువంటి పిలుపు ఆయ‌న నుంచి రాలేద‌న్నారు. అధినేత సీటు ఇస్తే పోటీ చేస్తాన‌ని, లేకుంటే పార్టీలోనే కొన‌సాగుతాన‌ని నాగుల్ మీరా చెప్పారు.

షెడ్యూలు ప్రకటించక ముందే కేంద్ర ఎన్నికల కమిషన్‌ తన అధికారులను ఏపి ప్రభుత్వం పై చూపించింది. కోడ్‌ రాకముందే ఇలా ఎందుకు దూకుడు ప్రదర్శించిందో, ఎవరి ఒత్తిడితో చేసిందో ఎవరికీ అర్ధం కాలేదు. పట్టుపట్టి మరీ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ రామారావును బదిలీ చేయించింది. జిల్లా కలెక్టర్‌గా ఆయన ఈనెల 9న బాధ్యతలు స్వీకరించారు. అంతలోనే ఆకస్మికంగా బదిలీ చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. దీనికి కారణాలేమిటని ఆరా తీసినప్పుడు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. సీఈసీ సునీల్‌ అరోరా ఈనెల 12న అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో విజయవాడలో సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణ సన్నద్ధత, పోలింగ్‌ సిబ్బంది అందుబాటు, శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్షించారు.

ec 23022019 2

ఈ సందర్భంగా కలెక్టర్లు తమ జిల్లాల్లో పరిస్థితిపై ప్రజంటేషన్‌ ఇచ్చారు. కానీ... శ్రీకాకుళం కలెక్టర్‌ రామారావు తన ప్రజంటేషన్‌ సరిగ్గా ఇవ్వలేకపోయారు. దీనిపై అప్పుడే ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి మూడు రోజులే అయ్యిందని, వివరాలన్నీ సమగ్రంగా తెలుసుకుంటానని రామారావు వివరణ ఇచ్చారు. అయినా ఈసీ సంతృప్తి చెందలేదు. ఢిల్లీకి వెళ్లగానే ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. ‘శ్రీకాకుళం కలెక్టర్‌ పని తీరు బాగలేదు. అక్కడ మరొకరిని నియమించండి’ అని సూచించింది. కొత్తగా బాధ్యతలు చేపట్టినందునే సరిగ్గా ప్రజెంటేషన్‌ ఇవ్వలేకపోయారని ప్రభుత్వం వివరించింది. అయినా... ఈసీ పట్టించుకోలేదు. ‘కలెక్టర్‌ను మార్చాల్సిందే’ అని పేర్కొంది. ఈసీతో ఘర్షణ ఎందుకనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అందుకు సమ్మతించింది.

ec 23022019 3

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ను బదిలీ చేసి... ఆయన స్థానంలో మరొకరిని నియమించేందుకు ముగ్గురు పేర్లతో జాబితా పంపాలని ఈసీ కోరింది. నిజానికి... ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన తర్వాత కలెక్టర్‌ లేదా ఎస్పీని మార్చాల్సి వస్తేనే ఈసీకి ఇలాంటి అధికారం ఉంటుంది. కానీ... ఇప్పటి నుంచే ఈసీ ఈ అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురి పేర్లతో జాబితా పంపగా... విజయవాడ కమిషనర్‌గా ఉన్న నివా్‌సను ఈసీ ఎంపిక చేసింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) సిసోడియాను కూడా ఇటీవల ఈసీ మార్చేయడం గమనార్హం. సిసోడియా చురుగ్గా వ్యవహరించలేకపోతున్నారని, మరొకరిని నియమించాలని ఈసీ కోరింది. దాంతో ప్రభుత్వం ద్వివేదీని సీఈవోగా నియమించింది. ఇప్పుడు... పరిస్థితిని వివరించినప్పటికీ ఈసీ ఏమాత్రం పట్టించుకోకుండా శ్రీకాకుళం కలెక్టర్‌ను మార్పించడం గమనార్హం.

రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగదారులకు ఊరట లభించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి కరెంటు చార్జీలను ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) స్వల్పంగా తగ్గించింది. దీంతో దాదాపు 40లక్షల మంది వినియోగదారులు లబ్ధి పొందనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్‌ టారి్‌ఫలను సమీపపు 5/10పైసలకు సరిచేసి కుదించినట్లు ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ భవానీప్రసాద్‌ వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఏపీఈఆర్‌సీ కార్యాలయంలో 2019-20 విద్యుత్‌ టారిఫ్‌ ఉత్తర్వును సభ్యులు పి.రామ్మోహన్‌, పి.రఘుతో కలసి ఆయన విడుదల చేశారు. ఈసందర్భంగా జస్టిస్‌ భవానీప్రసాద్‌ మాట్లాడుతూ, ఆదాయపు పన్ను పరిధిలోకి రాని రైతులకు 9గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తామన్నారు.

currentcharges 230222019

లోడ్‌ ఫ్యాక్టర్‌ ఇన్సెంటీవ్‌ స్కీమ్‌ కింద పరిశ్రమలకు ప్రోత్సాహకాన్ని తిరిగి ప్రవేశపెడుతున్నామని, దీనిద్వారా యూనిట్‌కు 50పైసల మేర ప్రయోజనం కలుగుతుందన్నారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ప్రైవేటు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా నీటిని పొందుతున్న రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ సరఫరా పరిమితిని ఏడాదికి 1,200నుంచి 1,500యూనిట్లకు పెంచామన్నారు. విద్యుత్‌ టారి్‌ఫలోని కొన్ని ప్రధానాంశాలు: వ్యవసాయానికి ఉచితంగా 9గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలని నిర్ణయించడం వల్ల ప్రభుత్వంపై రూ.7,064.27కోట్ల సబ్సిడీ భారం పడింది. ఈ నిర్ణయంతో ఇప్పటికే లబ్ధి పొందుతున్న 17లక్షల మందికి మరో 3లక్షల మంది కలసి మొత్తం 20లక్షల మంది ఉచిత విద్యుత్‌ పరిధిలోకి వస్తారు. గ్రామీణ ఉద్యాన నర్సరీలకు, దోభీఘాట్‌లకు ప్రభుత్వ సబ్సిడీతో పాటు నెలకు 150యూనిట్లు, స్వర్ణకారులకు నెలకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందుతుంది. రైల్వే ట్రాక్షన్‌ టారి్‌ఫను యూనిట్‌ ధర 3.50నుంచి3.75కు పెంచారు. అప్పటికీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో చార్జీలే చాలా తక్కువ. ఉప్పు తయారీ యూనిట్‌ ధర 1.20కి పరిమితం చేయడం వల్ల రూ.3.70దాకా తగ్గుదల ఉంటుంది.

currentcharges 230222019

పరిశ్రమలకు పీక్‌ టైం, టైమ్‌ ఆఫ్‌డే చార్జీలు యూనిట్‌కు రూ.1.05నుంచి రూపాయికి తగ్గాయి. పుట్ట గొడుగుల పరిశ్రమకు యూనిట్‌కు రూ.5.91నుంచి రూ.2..16కు కుదించారు. కోళ్ల పెంపకందార్లకు యూనిట్‌ ధర 1.04కు కుదించడంతో 3.85నుంచి 4.85దాకా తగ్గింది. హెచ్‌టీ పరిశ్రమలకు లోడ్‌ ఆధారంగా 50పైసలు తగ్గించారు. ఆఫ్‌పీక్‌ సమయంలో యూనిట్‌కు రూపాయి చొప్పున రాయితీ లభిస్తుంది. విద్యుత్‌ వాహనాల వాడకం పెంచేందుకు యూనిట్‌ ధర 6.95 నుంచి 5కు తగ్గించారు. ఆక్వా కల్చర్‌, పశుసంవర్థక, కోళ్ల పెంపకం, కోళ్ల మిక్సింగ్‌ యూనిట్లను వ్యవసాయ ఆధారిత కేటగిరీలోకి తెచ్చారు. పట్టు పరిశ్రమకు 10నుంచి 15హెచ్‌పీ వరకూ బిల్లులు చేయడంతో సబ్సిడీకి అర్హులయ్యారు. రైతులకు అత్యవసర సరఫరా కోసం యూనిట్‌కు చెల్లించే ధర 10.50నుంచి 3.75కు తగ్గించారు. అనాథాశ్రమాలు, ధార్మిక సంస్థలకు ఉచిత విద్యుత్‌ అందిస్తారు. చక్కెర పరిశ్రమకూ రాయితీ వర్తిస్తుంది. పరిహారం చెల్లింపునకు డిస్కమ్‌లు రూ.10కోట్ల వరకూ వినియోగించుకునే అవకాశం కల్పించారు.

Advertisements

Latest Articles

Most Read