ఏపి, తెలంగాణా రాజకీయాల్లో ఎంతో మంది లేకి మంద, చంద్రబాబుని పర్సనల్ గా తిడుతూ, ఆయన వయసు, రాజకీయ అనుభవం కూడా పరిగణలోకి తీసుకోకుండా, ఆయన పని చేసిన వెకిలి విమర్శలు అన్నీ ఇన్నీ కావు. అయితే ఇలాంటి లేకి మందకి చంద్రబాబు ఎప్పుడూ రియాక్ట్ అయ్యే వారు కాదు. ఏదన్నా విషయం మీద అయితే మాట్లాడే వారు కానీ, ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలు చేసిన దాఖలాలు లేవు. వారికి సమాధానం చెప్పలేక కాదు, వారి స్థాయి అదే అని, వారి స్థాయికి దిగజారటం ఇష్టం లేక. అయితే ఇలాంటి చంద్రబాబు, గత రెండు రోజుల నుంచి, మోడీ పై విరుచుకు పడుతున్నారు. దీనికి కారణం మోడీ గుంటూరు పర్యటనలో చేసిన వ్యక్తిగత విమర్శలు. ప్రధాని స్థాయి వ్యక్తే ఇలా మాట్లాడితే, ఇక ఇలాంటి వారికి, ఇలాంటి భాషలోనే సమాధానం చెప్పాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నారు.
ప్రధాని స్థాయి వ్యక్తి బిలో ది బెల్ట్ ఆరోపణలు చేస్తే, దానికి చంద్రబాబు రియాక్షన్ ఇలాగే ఉంటుంది మరి. మొన్నటికి మొన్న లోకేష్ కి పితా అంటూ ప్రధాని సంభోదిస్తే, నిన్ను జశోదా బెన్ భర్త మోడీ అని నేను సంబోధిస్తే తలకాయి ఎక్కడ పెట్టుకుంటారు అంటూ ఘాటుగా బదులిచ్చారు. అయితే నిన్న ఢిల్లీలో ఇదే ఫ్లో కంటిన్యూ చేసారు. మోడీ చదువుపై అనేక సందేహాలు ఉన్నాయి. నన్నడిగితే నేను వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి డిగ్రీ పుచ్చుకున్నానని గర్వంగా చెబుతా. కేజ్రీవాల్‌ను అడిగినా చెప్పగలుగుతారు. మరి మోడీ ఎక్కడ చదివారు, ఎక్కడ డిగ్రీ తీసుకున్నారు అంటే, ఆయన దగ్గర సమాధానం లేదు అంటూ, మోడీ భాషలోనే చంద్రబాబు ర్యాగింగ్ చేస్తున్నారు.
ప్రధాని మోదీకి కౌంట్‌డౌన్ మొదలైందని, మరో 80 రోజుల్లో ఆయన మాజీ కావడం ఖాయమని చంద్రబాబునాయుడు ప్రకటించారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఆర్థిక వ్యవస్థను, వ్యవసాయాన్ని, నిరుద్యోగుల భవితను దెబ్బతీసిన ఘనత ఈ ప్రధానమంత్రికే చెందుతుందని తీవ్రంగా ధ్వజమెత్తారు. అయిదేళ్ల క్రితం జాతీయ రాజకీయాల్లోకి వచ్చిన మోదీ, అమిత్‌షాలు తామేదో పెద్ద నేతలుగా చెప్పుకుంటున్నారని, పెద్ద వాళ్లు మంచి పనులు చేయాలి తప్పితే తప్పుడు పనులు కాదని విమర్శించారు. బుధవారం దిల్లీలోని జంతర్‌మంతర్‌లో తానాషాహి హటావో..దేశ్ బచావో పేరుతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్వహించిన సత్యాగ్రహ సభలో పశ్చిమబంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌అబ్దుల్లా, బీజేపీ ఎంపీ శతృఘ్నసిన్హా, కాంగ్రెస్ నేత ఆనంద్‌శర్మలతో కలిసి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ అయిదేళ్ల పాలనను తూర్పారబట్టారు.