సోషల్ మీడియాలో వచ్చే వార్తలు, ఏది నిజమో, ఏది అబద్ధమో నమ్మలేని పరిస్థితి. అయితే ఇప్పుడు మీడియా, పపెర్లు కూడా ఇలాగే తయారయ్యాయి. ఎదో వార్తా, మాకు వచ్చిన సమాచారం ఇది అని చెప్పటం, ప్రజల మీదకు వదిలెయ్యటం, ప్రజలు అదే నిజం అని, సోషల్ మీడియాలో తిప్పటం. ఇవన్నీ సాధారణంగా జరిగే విషయాలు. ఇక్కడ ఎవరినీ తప్పు బట్టటానికి కూడా లేదు. ప్రజలు అలా ఉన్నారు, మీడియా కూడా అలాగే ఉంది. అందుకే ఆరోగ్య విషయంలో కూడా, ఎవరో ఎదో చెప్తే, అదే నిజం అనుకుని, మెడికల్ ఎక్స్పర్ట్ ఎవరూ చెప్పకపోయినా, గుడ్డిగా ఫాలో అయిపోతూ ఉంటాం. అది నిజంగా మంచి జరుగుతుందా, ఏమన్నా ఇబ్బందులు ఉంటాయా అనే సోయ కూడా ఉండదు. మన బలహీనతే, మీడియా సంస్థలకు పెట్టుబడి అన్నట్టు ఉంది పరిస్థితి.

narasimhan 25012019

ఇక రాజకీయాలు, సినిమాల విషయాలకు వస్తే, ఈ పుకార్లకు అడ్డే ఉండదు. తాజగా ఇలాంటి అతి పెద్ద వైరల్ స్టొరీ, కిరణ్ బేడీ ఏపి గవర్నర్ గా వస్తున్నారని. ఎప్పటి నుంచో, కిరణ్ బేడీ మన రాష్ట్రానికి గవర్నర్ గా వస్తారంటు వార్తాలు వస్తున్నా, అది వాస్తవ రూపం దాల్చలేదు. అయితే ఏమైందో ఏమో కాని, ఒక వారం రోజుల క్రితం, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ వార్తా రావటం, రెండు రోజుల క్రితం నుంచి, బ్రేకింగ్ న్యూస్, కిరణ్ బేడీ ఏపి గవర్నర్ అంటూ, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్స్ అప్ లలో, ఇదే ట్రేండింగ్ వార్తా అయ్యింది. చాలా మంది ప్రజలు, ఇది నిజం అని కూడా నమ్మారు. ఎన్నికల ముందు గవర్నర్ మార్పు అంటూ, విశ్లేషణలు కూడా మొదలు పెట్టారు.

narasimhan 25012019

అయితే ఈ విషయం పై, నేరుగా కిరణ్ బేడీ స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా తనను నియమిస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీ ఖండించారు. అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. ఏడాది కాలంగా ఇలాంటి వార్తలు వస్తున్నాయని, అవన్నీ వదంతులేనని గురువారం పేర్కొన్నారు. దీంతో ఇక ఈ వదంతులకు ఫుల్ స్టాప్ పడింది. అయితే గవర్నర్ నరసింహన్ పై మాత్రం, ఏపిలో చాలా మందికి వ్యతిరేకత ఉంది. చంద్రబాబుకి వ్యతిరేకంగా ఆడుతున్న గేంలో, ఈయన పాత్ర పై కూడా అనేక వార్తలు వచ్చాయి. గవర్నర్ నరసింహన్ పదవీ కాలం ఎప్పుడో ముగిసినప్పటికీ, ఇంకా ఆయన్నే రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా కొనసాగించటం పై, తెలుగుదేశం పార్టీ కూడా అభ్యంతరం చెప్తూ వస్తుంది. అయితే ఎన్నికలు అయ్యే వరకు నరసింహన్ కొనసాగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి.

ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే హంగ్‌ ఏర్పడుతుందని ఇండియా టుడే-కార్వీ ఇన్‌సైట్స్‌ సర్వేలో వెల్లడైంది. ‘మూడ్ ఆఫ్‌ ది నేషన్‌ పోల్‌’ పేరుతో చేసిన ఈ సర్వే ఫలితాల ప్రకారం.. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)కి లోక్‌సభలో సీట్లు భారీగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఆ కూటమికి 237 సీట్లు మాత్రమే వస్తాయని వెల్లడైంది. యూపీఏకి 166, ఇతరులకి 140 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్‌ ఫిగర్‌‌ 272ని ఎన్డీఏ అందుకునే అవకాశాలు లేవు. 2014 కన్నా ఆ కూటమి 99 సీట్లను తక్కువగా వస్తాయట. యూపీఏ కంటే ఎన్డీఏకి ఓట్ల శాతం కాస్త అధికంగా వస్తుంది. యూపీఏకి 2014 కన్నా 106 సీట్లు అధికంగా వస్తాయి. ఈ రెండు కూటముల్లో లేని వారు గత ఎన్నికల్లో కంటే 13 సీట్లను కోల్పోతారు.

indiatoday 24012019

‘మూడ్ ఆఫ్‌ ది నేషన్‌ పోల్‌’ ప్రకారం.. ఎన్డీఏ 35 శాతం, యూపీఏ 33 శాతం ఓట్లు కైవసం చేసుకుంటుంది. గత ఎన్నికల్లో భాజపా 282 స్థానాలు గెలుచుకుని మిత్రపక్షాల అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ సాధించిన విషయం తెలిసిందే. హంగ్‌ పార్లమెంట్‌ ఏర్పడితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మెజార్టీ కోసం యూపీఏయేతర పార్టీల మద్దతు కోసం ఎన్డీఏ ప్రయత్నాలు జరపాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఇతరులు కూడా ప్రధాన మంత్రి పదవి కోసం డిమాండ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికలు ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగి, మేలో ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి కేవలం 44 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇండియాటుడే-కార్వీ ఇన్‌సైట్స్‌ సర్వే ఫలితాల్లో వెల్లడైనట్లు యూపీఏకి 166 సీట్లు వస్తే ఆ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రెండు అవకాశాలు ఉన్నాయి. యూపీఏ కూటమికి పీపుల్స్‌ డెమొక్రాటిక్‌ పార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ, సమాజ్‌ వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ మద్దతు తెలపాల్సి ఉంటుంది. 543 సీట్లకు ఎన్నికలు జరగనుండగా ప్రభుత్వ ఏర్పాటుకు 272 సీట్లు అవసరం అవుతాయి.

indiatoday 24012019

ఈ నాలుగు పార్టీలు యూపీఏకి మద్దతు తెలిపితే ఆ కూటమి ఓట్ల శాతం 44 శాతంగా నమోదవుతుంది. అలాగే, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 272 సీట్లను పొందగలుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఎన్డీఏకి 234 సీట్లు, ఇతరులకి (ఎన్డీఏ, యూపీఏ కూటమిలో లేని పార్టీల వద్ద) 37 సీట్లు ఉంటాయి. ఇరు పార్టీల కూటములకు మద్దతు తెలపని పార్టీలు ఒకవేళ చివరి నిమిషంలో ఎన్డీఏకి మద్దతు తెలిపినప్పటికీ ఆ కూటమికి 271 సీట్లు మాత్రమే దక్కుతాయి. ప్రభుత్వ ఏర్పాటుకు మరో సీటు కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏ కూటమికీ మద్దతు తెలపకుండా ఉంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి, బీజూ జనతా దళ్‌, అన్నాడీఎంకే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల తరువాత భాజపాకు మద్దతు తెలిపినప్పటికీ యూపీఏనే ముందంజలో ఉంటుంది. ఈ నాలుగు పార్టీలు ఎన్డీఏకి మద్దతు తెలిపితే ఈ కూటమి సీట్ల సంఖ్య 257కి పెరుగుతుంది. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎవరికీ ఆధిక్యం దక్కని పరిస్థితే ఏర్పడితే ఎన్డీఏ.. ఇతర పార్టీలను తమ వైపునకు ఎలా ఆకర్షించగలదో చూడాల్సిందే.

డ్వాక్రా సంఘాల సభ్యులతో రాష్ట్ర వ్యాప్తంగా పసుపు-కుంకుమ మహాసభలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈనెల 25న రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకేరోజు ఈ మూడు సభలకు హాజరై స్వయం సహాయక బృంద సభ్యులనుద్దేశించి ప్రసంగిస్తారు. అమరావతిలో నిర్వహించే సభకు ముఖ్యమంత్రి ఉదయం 10.30 గంటలకు హాజరవుతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కడప సభకు, సాయంత్రం 3.30 గంటలకు విశాఖ సభకు హాజరు కానున్నారు. సీఎం ఇటీవల పెన్షన్లు రెట్టింపు చేయడంతోపాటు డ్వాక్రా సంఘాలకు భారీగా వరాలు ప్రకటించారు. ఒక్కో డ్వాక్రా మహిళకు మరలా రూ.10వేలు పెట్టుబడి నిధి ఇస్తామని చెప్పారు. దీంతోపాటు ఒక స్మార్ట్‌ ఫోన్‌ అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రకటనల ద్వారా లబ్ధి పొందుతున్న వర్గాలను స్వయంగా కలిసి మాట్లాడాలని సీఎం ఆకాంక్షించడంతో ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.

three meetings 24012019

పాత గ్రూపు సభ్యులకే కాకుండా, ఈ మధ్యకాలంలో ఏర్పడిన అన్ని సంఘాలకు, వాటిలోని సభ్యులకు కూడా ఈ నగదు మొత్తాన్ని ఇవ్వనుంది. వచ్చే నెల మొదటి వారంలో ఏకకాలంలో చెక్‌ల రూపంలో ఈ నగదును అందించి, మహిళల మోముల్లో చిరునవ్వులు పూయించనుంది. ప్రభుత్వం అందిస్తున్న ఈ భారీ కానుక వల్ల జిల్లాలో దాదాపు 6లక్షల14వేల మంది మహిళలకు మేలు కలుగుతుంది. అంతేకాకుండా ప్రతి సభ్యురాలికి రూ.4వేల విలువచేసే స్మార్ట్‌ఫోన్‌ను కూడా అందించేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది. ప్రభుత్వం ఇంత పెద్ద తరహాలో లబ్ధి చేకూర్చుతుండటంతో మహిళల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

three meetings 24012019

డ్వాక్రా మహిళల ప్రగతి కోసం సీఎం చంద్రబాబు ఇప్పటికే ఒక దశ నగదును పంపిణీ చేసేశారు. పెట్టుబడి నిధి, చంద్రన్న చేయూత, పసుపు-కుంకుమ కింద నాలుగు విడతల్లో డ్వాక్రా సభ్యులకు చెల్లింపులు చేశారు. తొలి రెండు విడతల్లో రూ.3వేల చొప్పున జమ చేయగా, మలి రెండు విడతల్లో మరో రూ.2వేలను సభ్యురాలి ఖాతాలోకి జమ చేశారు. మొత్తంగా నాలుగు విడతల్లో ప్రతి ఒక్క సభ్యురాలికి రూ.10వేలను వారి ఖాతాలో వేశారు. 2014, మార్చి 31 నాటికి ఉన్న గ్రూపులకు, అందులోని సభ్యులకు మాత్రమే ఎన్నికల హామీలో భాగంగా ఈ నగదును అందించారు. అప్పుడు మొత్తం 56,408 గ్రూపుల్లోని దాదాపు 5లక్షల70వేల మందికి రూ.570 కోట్ల మేర ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది.

బహుళార్ధ సాధక పోలవరం ప్రాజెక్టుకు నిర్మాణ దశలోనే తిలకించేందుకు సందర్శకుల తాకిడి ఎక్కువైంది. రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన సందర్శకులతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పర్యాటక ప్రాంతంగా మారింది. ప్రభుత్వం పనిగట్టుకుని మరీ విద్యార్థులు, రైతులు, డ్వాక్రా సంఘాలకు ఆతిధ్యమిచ్చి మరీ పోలవరానికి ఆహ్వానిస్తోంది. ఆర్టీసీకిదో ఆదాయంగా మారింది. దూర ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో విద్యార్థులను, మహిళలను, డ్వాక్రా మహిళలను ప్రాజెక్టు వద్దకు తీసుకొచ్చి వారికి ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని ఆధ్యంతం చూపించి అక్కడనే భోజనం పెట్టి మరీ సందర్శకులను సాగనంపుతున్నారు. ఇక్కడ సందర్శకులకు ప్రాజెక్టుపై వివరించేందుకు జల వనరుల శాఖకు చెందిన కొంత మంది అధికారులు ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా భోజనాలు పెట్టేందుకు ప్రత్యేక కాంట్రాక్టు అప్పగించారు. రాష్ట్రం నలుమూలల నుంచి బుధవారం ఒక్కరోజే 275 బస్సుల్లో సుమారు 14వేల మంది తరలిరావడంతో ఈ ప్రాంతం తిరునాళ్లను తలపించింది.

polavaram 24012019

ఈ పోలవరం ప్రాజెక్టుపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకించి విద్యార్థులు, రైతులను ఆహ్వానిస్తున్నారు. రాష్ట్రంలోని పదమూడు జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు, రైతులు, స్వయంగా వచ్చిన వారితో కలిపి గత ఏడాది ఏప్రిల్ 23వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు 330370 మంది సందర్శించారు. అమరావతి నుంచి 576 మంది, అనంతపురం జిల్లా నుంచి 5960 మంది, చిత్తూరు జిల్లా నుంచి 4868, తూర్పు గోదావరి జిల్లా నుంచి 7650 మంది, గుంటూరు నుంచి 56676 మంది, కడప 3934, కృష్ణా 178794, కర్నూల్ జిల్లా నుంచి 3513, నెల్లూరు నుంచి 1694, ప్రకాశం 8814, శ్రీకాకుళం జిల్లా నుంచి 3160, విశాఖపట్నం నుంచి 4230, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 20772, ఇతరులు, విద్యార్ధులు కలిపి 12720 మంది వెరసి దాదాపు 3.50 లక్షల మంది వరకు ప్రాజెక్టు నిర్మాణాన్ని సందర్శించారు.

polavaram 24012019

మొత్తం 241 రోజుల్లో 3,50,090 మంది సందర్శించారు. స్థానిక నాయకులు ప్రతీ వారం వారం ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి డ్వాక్రా మహిళలను ప్రాజెక్టుకు తీసుకొచ్చి వారికి ప్రాజెక్టు ప్రత్యేకతను వివరించి భోజనాలు పెట్టి పంపిస్తున్నారు. ఇక్కడ భోజన ఏర్పాట్లను నిర్వహించేందుకు రూ. కోట్ల ఖర్చుతో కాంట్రాక్టు అప్పగించినట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ పోలవరం ప్రాజెక్టు పూర్తవకుండానే పర్యాటక ప్రాంతంగా మారిందని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి పాల్గొనే సభల్లో కూడా డ్వాక్రా మహిళలు పోలవరం ప్రాజెక్టు వివరాలపై అనర్గళంగా మాట్లాడే విధంగా అవగాహన కల్పించడంలో టీడీపీ నాయకులు కృతకృత్యులయ్యారని చెప్పొచ్చు.

Advertisements

Latest Articles

Most Read