పశ్చిమ్‌ బంగలోని కోల్‌కతా వేదికగా ప్రధాని మోదీ ప్రభుత్వంపై విపక్షాలు సమరశంఖం పూరించాయి. ఒకే వేదికపై చేరి ప్రతిపక్షాల ఐక్యతను చాటాయి. బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు భాజపాయేతర పార్టీల నేతలు ఐక్య ర్యాలీకి తరలివచ్చారు. ఒక్కొక్కరిగా ప్రసంగిస్తూ భాజపా ప్రభుత్వ పాలనపై విమర్శల వర్షం కురిపించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గున్నారు. బెంగాలీలో ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మోడీ రాష్ట్రానికి చేసిన అన్యాయం మరోసారి దేశం దృష్టికి తీసుకు వెళ్లారు. మోడీ, అమిత్ షా కలిసి దేశాన్ని ఎలా వెనక్కు తీసుకు వెళ్తున్నారో, చెప్పారు. భాజపా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటే విపక్షాలుగా మేం ఏకం చేయాలనుకుంటున్నామని చెప్పారు.

moditeam 19012019 2

విపక్షాల ఐక్యతకు గొప్ప వేదికను ఏర్పాటు చేశారంటూ తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీని ప్రశంసించారు. విభజించు పాలించు అనే రీతిలో భాజపా దేశాన్ని పాలిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. రైతుల కష్టాలు కేంద్రానికి పట్టడం లేదన్నారు. ఆర్థిక వ్యవస్థనూ కేంద్ర ప్రభుత్వం రాజకీయం చేసిందన్నారు. పెద్ద నోట్ల రద్దే అందుకు నిదర్శనమని చెప్పారు. రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని చంద్రబాబు దుయ్యబట్టారు. పెట్రోల్‌, గ్యాస్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని.. ధరల పెరుగుదలను నియంత్రించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రాల హక్కు కాలరాసి వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

moditeam 19012019 3

కర్ణాటకలోనూ ఎన్నికైన ప్రభుత్వాన్ని కుప్పగూల్చే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే కేంద్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మతాలు, కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని, విభజన రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. సీబీఐ, ఆర్బీఐ, న్యాయవ్యవస్థ నుంచి ప్రతి వ్యవస్థను కేంద్రం నీరుగారుస్తోందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు అదుపుతప్పుతున్నాయని అన్నారు. ఏమాత్రం అనుభవం లేని రిలయెన్స్‌కు రాఫెల్ డీల్ కట్టబెట్టడం ఏమిటని మోదీ సర్కార్‌ను నిలదీశారు. 2019లో కొత్త ప్రభుత్వాన్ని చూడబోతున్నామని జోస్యం చెప్పారు. మోదీ, అమిత్‌షాలను కోరుకుంటున్నారా? మార్పు కోరుకుంటున్నారా? అని ప్రజలను బాబు ప్రశ్నించారు. అప్పట్లో ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ పెట్టి, ఫస్ట్ మీటింగ్ విజయవాడలో పెట్టి, తరువాత మీటింగ్ కోల్‌కతాలో పెట్టారని, ఇప్పుడు ఫస్ట్ మీటింగ్ కోల్‌కతాలో పెట్టామని, తరువాత మీటింగ్ అమరావతిలో పెట్టి, మోడీ, అమిత్ షా లకు తగిన బుద్ధి చెప్తామని అన్నారు.

చంద్రబాబు ఏదైనా కొత్త పధకం కాని, ఉన్న పధకాలను పెంచటం కాని చేస్తున్నారు అంటే, ముందుగానే పేపర్ లో, మీడియాలో నెల రోజుల ముందు నుంచే ప్రచారం చేసేవారు. ప్రాధమికంగా దాని గురించి చర్చ జరగగానే వార్తా వచ్చేసేది. అలా ఈ అంశం పై, ఒక నెల రోజులు దాకా, వీటికి సంబంధించి, ఎదో ఒక వార్తా వస్తూ, చివరకు పధకం ఫైనల్ అయిన తరువాత అధికారికంగా చెప్పే వారు. అయితే, ఇలా చేస్తుంటే, ఎంత పెద్ద పధకం అయినా, ప్రజల్లో ఇంట్రెస్ట్ పోతుంది, ఎప్పటి నుంచి వార్తల్లో నానుతూ ఉండటంతో, చివరకు ప్రజల్లో పెద్దగా ఈ పధకం పై ఇంట్రెస్ట్ ఉండదు. పధకం వల్ల లబ్ది చేకురినా, సర్ప్రైజ్ ఫాక్టర్ అనేది మిస్ అయ్యి, ప్రజల్లో ఎమోషన్ గా పధకం వెళ్ళేది కాదు.

penshions 19012019

అయితే మొన్న చంద్రబాబు పెన్షన్ లు పెంచుతూ తీసుకున్న అనూహ్య నిర్ణయంతో, ప్రజలందరూ షాక్ అయ్యారు. ఎవరూ పెన్షన్లు పెంచుతారని అనుకోలేదు. ఇదో సర్ప్రైజ్ లాగా చంద్రబాబు నోటి వెంట రావటంతో, ప్రజల్లోకి బాగా వెళ్ళింది. పింఛన్ల కింద ఇచ్చే మొత్తాన్ని రెట్టింపు చేస్తూ తీసుకొన్న నిర్ణయానికి క్షేత్రస్థాయిలో వస్తున్న స్పందనపై టీడీపీ వర్గాల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది. ‘సార్వత్రిక ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందు అమలు చేసిన ఈ నిర్ణయం ఆటనే మార్చేసింది. మమ్మల్ని ముందు పీఠిలో నిలిపింది’ అని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పేదల్లో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, వృత్తిపని వారికి ఇస్తున్న పింఛన్ల మొత్తాన్ని రెట్టింపు చేస్తూ సీఎం చంద్రబాబు కొద్ది రోజుల కిందట నిర్ణయం ప్రకటించారు. వృద్ధులు, వితంతువులకు ప్రస్తుతం నెలకు రూ.1000 వంతున ఇస్తున్న పింఛన్‌ను రూ.2000 చేశారు. వికలాంగులకు రూ.1500వంతున ఇస్తున్న మొత్తాన్ని రూ.3000 చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం అన్ని విభాగాల్లో ఇటువంటి పింఛన్లు పొందుతున్న వారు 54లక్షల మంది ఉన్నారు. కొత్తగా మరో 3లక్షల మందికి పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

penshions 19012019

పింఛన్లను ఐదేళ్లలో రెండు దఫాలు పెంచడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. పొరుగున ఉన్న తెలంగాణలో కూడా పెంపు ప్రకటించినా వచ్చే ఏప్రిల్‌ నుంచి దానిని అమలు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఏడాదికి రూ.ఆరున్నర వేల కోట్లుగా ఉన్న పింఛన్ల ఖర్చు పెంచిన తరువాత ఏడాదికి రూ.13 వేల కోట్లకు చేరనుంది. సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం ప్రకటిస్తారని ఎవరూ ఊహించలేదు. ఆకస్మికంగా నిర్ణయం ప్రకటించడంతో లబ్ధిదారుల్లో ఆనందాశ్చర్యాలు వ్యక్తమయ్యాయి. ఈ నిర్ణయం క్షేత్ర స్థాయిలో బలమైన ప్రభావం చూపిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ‘అధికారంలో ఉన్న పార్టీపై రకరకాల అసంతృప్తులు ఉండటం సహజం. ఈ నిర్ణయం అటువంటి అసంతృప్తులను పక్కకు తోసేసింది. పేదవర్గాల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత పెంచింది. ప్రతిపక్ష పార్టీకి బలమైన ఓటు బ్యాంకులుగా ఉన్న వర్గాల్లో కూడా కొంత భాగం టీడీపీ వైపు ఈ నిర్ణయంతో మళ్లుతున్నాయి. వాతావరణం టీడీపీకి అనుకూలంగా మారుతోందన్న అభిప్రాయాన్ని ఈ నిర్ణయం కలిగిస్తోంది’ అని ఒక మంత్రి చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్లు భాజపా నేతలు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. 29సార్లు దిల్లీ వెళ్తే మొండిచేయి చూపడమే ప్రత్యేక ప్రాధాన్యమా? అని ఆయన ప్రశ్నించారు. గాయాలపై కారం చల్లడమే ప్రత్యేకతా ? అని నిలదీశారు. తెలుగుదేశం పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, గ్రామ, మండల, రాష్ట్ర పార్టీ బాధ్యులతో ‘ఎలక్షన్ మిషన్- 2019’పై చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కోల్‌కతా ర్యాలీకి 20కి పైగా పార్టీల నేతలు పాల్గొంటే.. భాజపాయేతర పక్షాల్లో తెరాస అధినేత కేసీఆర్‌, వైకాపా అధ్యక్షుడు జగన్‌ హాజరుకావడంలేదన్నారు. వీరిద్దరూ ప్రధాని మోదీ వెంటే ఉన్నారన్నది సుస్పష్టమవుతోందని చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ అసలు లేదు.. అదొక శూన్యం మాత్రమేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

moditeam 19012019 2

మోదీకి మద్దతు కోసమే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేశారని చంద్రబాబు అన్నారు. అది భాజపాకు ప్రతిపక్షమే కాదని విమర్శించారు. రాష్ట్రంపై తెరాస నేతల ద్వేషాన్ని విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేయాలని చంద్రబాబు సూచించారు. తెరాసతో అంటకాగుతున్న ప్రతిపక్ష నేత జగన్ వైఖరిని ఎండగట్టాలని నేతలకు పిలుపునిచ్చారు. వరంగల్‌లో రాళ్లేసిన వాళ్లతో జగన్ లాలూచీ పడ్డారని విమర్శించారు. కేసుల కోసం మోదీతో, అక్రమాస్తుల కోసం కేసీఆర్‌తో జగన్‌ లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. డబ్బు పెట్టే అభ్యర్థులను వైకాపా వెతుకుతోందని, ఆ పార్టీ అభ్యర్థులెవరూ ప్రజల్లో ఉండేవారు కాదని చంద్రబాబు విమర్శించారు. భాజపా దేశంలోని ఆలయాల్లో అశాంతిని సృష్టిస్తోందని.. దీనికి శబరిమలలో ఉద్రిక్తతలే ఉదాహరణగా చంద్రబాబు చెప్పారు.

moditeam 19012019 3

కర్ణాటకలో భాజపా దుర్మార్గపు రాజకీయాలు చేస్తోందన్నారు. కాంగ్రెస్‌, జేడీ(ఎస్) ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. రానున్న ఎన్నికల్లో తెదేపా చరిత్రాత్మక విజయం సాధించాలన్నారు. ఓటర్ల జాబితా అందరికీ అందుబాటులో ఉంచామని.. మార్పులు, చేర్పులపై అంతా శ్రద్ధ చూపాలని కోరారు. ఎన్టీఆర్ 23వ వర్థంతిని ఘనంగా నిర్వహించిన పార్టీ శ్రేణులను చంద్రబాబు అభినందించారు. ఇదే స్ఫూర్తితో మరింత ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో 25 పార్లమెంటు, 150 శాసనసభ స్థానాల్లో ఘన విజయం సాధించేలా అంతా సమష్టిగా పనిచేయాలని ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు.

కడపలో శుక్రవారం నిర్వహించిన రాయలసీమలోని 8 పార్లమెంటరీ నియోజకవర్గాల బీజేపీ శక్తి కేంద్రాల ఇన్‌చార్జ్‌ల సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామన్న విషయాన్ని ఏపీ ప్రజలకు తాను చెప్పదలుచుకున్నానని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ కాకుండా స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నట్టు చెప్పారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా మంత్రం జపిస్తూ కేంద్రానికి సరైన సలహాలు, సూచలను ఇవ్వడం లేదని ఆరోపించారు. ఏపీలో పదేళ్లలో సాధించాల్సిన ప్రగతిని కేవలం నాలుగున్నరేళ్ల కాలంలోనే 80 శాతం సాధించినట్టు రాజ్‌నాథ్ తెలిపారు.

rajnath 19012019

ఈ వ్యాఖ్యల పై చంద్రబాబు స్పందించారు. ఏపీకి స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చామని బీజేపీ అనడం హాస్యాస్పదమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో బాబు మాట్లాడుతూ 29సార్లు ఢిల్లీ వెళ్తే మొండిచేయి చూపడమే స్పెషల్‌ ట్రీట్‌మెంటా..? అని ఆయన ప్రశ్నించారు. గాయాలపై కారం జల్లడమేనా స్పెషల్‌ ట్రీట్‌మెంటా అని నిలదీశారు. దేశంలోని ఆలయాల్లో అశాంతిని బీజేపీ సృష్టిస్తోందని విమర్శించారు. శబరిమలలో ఉద్రిక్తతలు రెచ్చగొడుతోందని, రామాలయాన్ని మళ్లీ తెరమీదకు తెస్తోందని, కర్ణాటకలో బీజేపీ దుర్మార్గ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు తెరదీశారని సీఎం దుయ్యబట్టారు.

rajnath 19012019

కాంగ్రెస్‌, జేడీఎస్‌ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. బీజేపీ కుట్రలను పదిమందికి చెప్పాలని నేతలకు ఆదేశించారు. ప్రతి కార్యకర్త ఒక మొబైల్‌ మీడియాగా మారాలని, ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలని అన్నారు. ఓటర్లలో అవగాహన కల్పించాలని చంద్రబాబు సూచించారు. ఆదాయం ఉన్న తెలంగాణలో పల్లెలు ఎలా ఉన్నాయని, పట్టణాల్లో ఏం అభివృద్ధి జరిగిందని ప్రశ్నించారు. ఆదాయం లేకున్నా ఏపీలో పల్లెలను ఎలా చేశామో, పట్టణాల్లో వసతులు ఎన్ని పెంచామో.. ప్రచారం చేయాలని నేతలకు తెలిపారు. ట్రిపుల్ తలాక్‌ బిల్లులో ముస్లింలకు మద్దతుగా ఉన్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి భారీగా నిధులిచ్చామని చెప్పుకొచ్చారు. ఓటర్ల జాబితాలో మార్పులపై అందరూ శ్రద్ధ చూపాలన్నారు. ప్రత్యర్థుల కుట్రలను తిప్పికొట్టాలని నేతలతో సీఎం చంద్రబాబు అన్నారు.

Advertisements

Latest Articles

Most Read