వైసీపీ కీలకనేత, విజయవాడలో గట్టి పట్టున్న నేత వంగవీటి రాధాకృష్ణ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఏ పార్టీలో చేరతారు..? ఎక్కడ్నుంచి పోటీ చేస్తారు..? అని జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రెండ్రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని రాధా స్పష్టం చేశారు. అంత వరకూ అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు సహకరించాలని కోరారు. ఇదిలా ఉంటే.. ఈనెల 24 లేదా ఆ తర్వాత వంగవీటి రాధా టీడీపీలో చేరే అవకాశం ఉందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొందరు టీడీపీ కీలకనేతలు రాధాతో టచ్‌లో ఉన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని టీడీపీ ప్రతిపాదించినట్లు సమాచారం. రెండ్రోజుల్లో అనుచరులతో మాట్లాడి ఈ నెల 24 లేదా ఆ తర్వాత రాధా పార్టీలో చేరతారని టీడీపీ నేతలు చెబుతున్నారు.

cbn radha 20012019

విజయవాడ సెంట్రల్‌, విజయవాడ తూర్పు, అవనిగడ్డలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉండటంతో టికెట్‌ ఇచ్చే అవకాశం లేక ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని టీడీపీ ప్రతిపాదించిందని తెలుస్తోంది. అయితే టీడీపీ ప్రతిపాదనతో రాధా సుముఖత వ్యక్తం చేశారని టీడీపీ వర్గాలు చెబుతాయి. అయితే, నిజంగానే ఆయన టీడీపీ కండువా కప్పుకుంటారా..? లేకుంటే జనసేన కండువా కప్పుకుంటారా..? అనేది తెలియాల్సి ఉంది. కాగా గత కొద్దిరోజులుగా రాధా.. జనసేనలో చేరతారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన టీడీపీలో చేరతారని ప్రచారం సాగుతోంది. ఏ పార్టీలో చేరతారనేదానిపై క్లారిటీ రావాలంటే మరో రెండ్రోజులు వేచి చూడాల్సిందే మరి.

cbn radha 20012019

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరితే స్వాగతిస్తామని ఎమ్మెల్సీ, తెదేపా విజయవాడ అర్బన్‌ అధ్యక్షుడు బుద్దా వెంకన్న తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాధా కృష్ణ తెదేపాలో చేరుతారన్న ప్రచారం ఇప్పటి వరకూ తమ దృష్టికి రాలేదన్నారు. సీఎం చంద్రబాబు ఎవరిని పార్టీలోకి తీసుకున్నా.. కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాధాకృష్ణ తెదేపాలో చేరితే పార్టీ మరింత బలపడుతుందని అన్నారు. ఎవరు వచ్చినా తమకు బలమేనని.. చంద్రబాబు ఎవరిని స్వాగతించినా.. తాము కట్టుబడి ఉంటామన్నారు. విజయవాడ టీడీపీలో ఎవరికీ, ఎవరూ చెక్ కాదని.. అందరం కలిసే పని చేస్తామన్నారు. రాధాకు కానీ, టీడీపీ తెలుగు యువత అధ్యక్షుడు అవినాష్‌లకు కానీ.. పాత గొడవలతో సంబంధం లేదన్నారు. రాధా టీడీపీలోకి వస్తే.. అందరం కలిసి పనిచేస్తామని తెలిపారు.

వైసీపీ కీలకనేత వంగవీటి రాధాకృష్ణ గత కొన్నిరోజులుగా అధిష్టానంపై అలకబూనిన సంగతి తెలిసిందే. విజయవాడ సెంట్రల్ సీటును నిరాకరించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్.. విజయవాడ తూర్పునుంచి పోటీ చేయాలని ఆదేశించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన రాధా పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆఖరికి వైఎస్ జగన్ పాదయాత్ర ముగింపునకు ఇచ్ఛాపురానికి కూడా వెళ్లలేదు. దీంతో అప్పట్లో ఆయన వైసీపీని వీడి జనసేన కండువా కప్పుకుంటారని కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకూ ఆయన ఈ విషయమై మీడియా ముందుకు రాలేదు.

botsa 20012019

పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలుసుకుని అలెర్టయిన వైసీపీ అధిష్టానం రాధాతో మంతనాలు ప్రారంభించింది. ఆదివారం సాయంత్రం వైసీపీ సీనియర్ బొత్స సత్యనారాయణ.. వంగవీటి రాధాతో భేటీ అయ్యారు. సుమారు అరగంటకు పైగా టికెట్‌‌తో పాటు పలువిషయాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. పార్టీలో క్రియాశీలకంగా ఉండాలని రాధాను బొత్స కోరినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో తాను తూర్పునుంచి పోటీ చేయనని తేల్చిచెప్పారని సమాచారం. అయితే ఇదే విషయం జగన్ తో బొత్సా చెప్పగా, అవేమీ కుదరవు అని, ఆ నిర్ణయాలు అన్నీ అయిపోయాయని, జగన్ తేల్చి చెప్పటం, అలాగే కొన్ని అవమానకర మాటలు మాట్లాడటంతో, రాధా ఉన్నట్టు ఉండి, వైసీపీన్ వీడాలని నిర్ణయం తీసుకున్నారు.

botsa 20012019

ఇక మీతో మాట్లాడేది ఏమి లేదు, మీరు బయలుదేరండి, కొద్ది సేపట్లో టీవీలో వార్తలు చూడండి అని బొత్సాకు తేల్చి చెప్పారు, రాధా. దీంతో బొత్సా, జగన్ కు, విజయసాయి రెడ్డికి ఇక చేసేది ఏమి లేదని, పరిస్థితి చేయి దాటిపోయిందని, చెప్పినట్టు సమాచారం. అన్నట్టుగా, రాధా వెంటనే రాజీనామాను ప్రకటించారు. ఈ భేటీ అయిన అరగంటకే రాధా రాజీనామా చేయడం గమనార్హం. రాధా ఏ పార్టీలో చేరతారనే విషయంపై ఇంత వరకూ స్పష్టత రాలేదు. తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్‌కు పంపించారు. రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన కార్యాచరణ రెండు రోజుల్లో వెల్లడిస్తానని తెలిపారు. రాజీనామాకు కారణాలేంటన్నదానిపై స్పష్టత ఇస్తానన్నారు. ఈ రెండు రోజులు సహకరించాలని అభిమానులను, అనుచరులను కోరారు. తనది ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడే మనస్తత్వం కాదన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా బదులు ప్రధాని మోదీ స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇచ్చారంటూ కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కడపలో చెప్పటం హాస్యాస్పదంగా ఉందని పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్ తులసీరెడ్డి శనివారం ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. మోదీ ఇచ్చింది స్పెషల్ ట్రీట్‌మెంట్ కాదు... స్పెషల్ పనిష్‌మెంట్ అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన రాజధాని నగరం హైదరాబాద్ తెలంగాణకు దక్కినందున ఆ మేరకు సీమాంధ్ర నష్టపోకుండా నాటి మన్మోహన్‌సింగ్ మూడు వరాలు ప్రకటించిందన్నారు. గత నాలుగున్నర ఏళ్లలో అవి అమలయి ఉంటే సీమాంధ్ర ఈ పాటికి స్వర్ణాంధ్ర అయి ఉండేదన్నారు. దురదృష్టవశాత్తు కేంద్రంలో మోదీ అధికారంలోకి రావడంతో ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదన్నారు. రాష్ట్రానికి సంజీవని లాంటి మొదటి వరం ప్రత్యేక హోదా ముగిసిన అధ్యయమని చెప్పిన మోదీ ఈ రాష్ట్రానికి స్పెషల్ పనిష్‌మెంట్ ఇచ్చారని అన్నారు.

modi 200102019

రెండో వరం వెనుకబడిన ఏడు జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద రావాల్సిన రూ. 24,350 కోట్లకు పిల్లికి భిక్షం వేసినట్లు కేవలం రూ. 1050 కోట్లిచ్చి స్పెషల్ పనిష్‌మెంట్ ఇచ్చారన్నారు. ఇక మూడో వరం కింద రెవెన్యూ లోటు భర్తీ, పోలవరం, రాజధాని పన్ను రాయితీలు, 11 కేంద్ర సంస్థలు, కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీ, కొత్త ఓడరేవు, కొత్త రైల్వేజోన్, వీటన్నింటికీ దాదాపు రూ. 5 లక్షలకోట్లు ఇవ్వాల్సి ఉంటే ఎంగిలి మెతుకులు విదిల్చినట్లు కేవలం రూ. 14,500 కోట్లు (రెండు శాతం) ఇచ్చి చేతులు దులుపుకున్నారని అన్నారు. తాము అడిగిన సమాచారం ఇవ్వనందునే కడపలో ఉక్కు కర్మాగారం స్థాపనలో జాప్యం జరుగుతున్నదని రాజ్‌నాథ్ సింగ్ చెప్పటం కేవలం సాకు మాత్రమేనని తులసీరెడ్డి విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో మోదీని గద్దె దించి కాంగ్రెస్‌కు అధికారం అప్పచెప్పటమే ఏకైక పరిష్కారన్నారు.

modi 200102019

రాష్ట్రానికి కేంద్రం స్పెషల్ ట్రీట్‌మెంట్ అవసరం లేదని, ప్రత్యేక హదా కావాలని ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ అన్నారు. విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌తో కలిసి రాష్ట్రాన్ని విభజించిన బీజేపీ, ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించిందన్నారు. ఎన్నికల ముందు బీజేపీ ప్రధాని అభ్యర్థిగా హామీలు గుప్పించిన నరేంద్రమోదీ గెలిచిన తరువాత రాష్ట్ర ప్రజలను నిలువునా వంచించారన్నారు. తాజాగా కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి రాష్ట్రం అసలు సమాచారమే ఇవ్వలేదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పటం వాస్తవ విరుద్ధమన్నారు. కేంద్రం చెప్పే మాయమాటలు నమ్మేందుకు రాష్ట్రంలో ఎవరూ చెవుల్లో క్యాలిఫ్లవర్ పూలు పెట్టుకోలేదన్నారు.

వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈమేరకు ఆయన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్‌కు పంపినట్లు సమాచారం. విజయవాడ సెంట్రల్ సీటుపై హామీ రాకపోవడంతో ఆయన పార్టీ మారినట్లు సమాచారం. రాధాకృష్ణ వైకాపా వీడేందుకు సిద్ధమయ్యారన్నసమాచరంతో సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగారు. అసంతృప్తితో ఉన్న రాధాకృష్ణతో చర్చలు జరిపి బుజ్జగించారు. అయినా, రాధాకృష్ణ శాంతించలేదు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రాధాకృష్ణ సిద్ధమైన తరుణంలో సెంట్రల్‌ నియోజకవర్గ బాధ్యతలను వైకాపా అధ్యక్షుడు జగన్‌ ... మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు అప్పగించారు.

jagan 200120199

దీంతో తీవ్ర అసంతృప్తికి గురైనా రాధాకృష్ణ పార్టీ నిర్ణయంపై గతంలోనే నిరసన వ్యక్తం చేశారు. రాధాకృష్ణకు సన్నిహితంగా ఉండే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో పాటు, పలువురు వైకాపా నేతలు బుజ్జగించడంతో రాధాకృష్ణ కొంతకాలం మౌనంగా ఉన్నారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో అంటీ ముట్టనట్లు వ్యవహారిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో మళ్లీ సెంట్రల్‌ టిక్కెట్‌ వ్యవహారం తెరపైకి వచ్చింది. వైకాపా అధిష్టానం రాధాకృష్ణను మచిలీపట్నం పార్లమెంట్‌ అభ్యర్థిగా బరిలో నిలపాలని భావిస్తున్నట్లు సమాచారం. కానీ రాధాకృష్ణ తనకు సెంట్రల్‌ టిక్కెట్‌ ఇవ్వాల్సిందేనని గట్టిగా పట్టుబట్టారు. అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడం చివరికి రాధాకృష్ణ వైకాపాను వీడారు.

jagan 200120199

‘‘పేద ప్రజల స్ఫూర్తి, ఆకాంక్షలకు అనుగుణంగానే నా ప్రయాణం. ప్రజల ఆశయాలను కొనసాగించే దిశలో ప్రయాణం సాగించాలన్నదే నా ఆకాంక్ష. సీఎం కావాలన్న మీ కాంక్ష నెరవేరాలంటే వైకాపాలో అందరికీ ఆంక్షలు విధించడం తప్పనిసరి. నా ఆకాంక్ష నెరవేరాలంటే ఆంక్షలు లేని ప్రజా ప్రయాణం తప్పనిసరి’’ అని రాధాకృష్ణ.. జగన్‌కు రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తదుపరి కార్యాచరణ రెండ్రోజుల తర్వాతే చెబుతానని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తెలిపారు. వైకాపాకు రాజీనామా చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాలు వీడుతానని ఎప్పుడూ చెప్పలేదని.. రాజకీయాల్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. అందరితో చర్చించి రెండ్రోజుల తర్వాత మళ్లీ మీడియాముందుకు వస్తానని చెప్పారు. తాను తీసుకున్న నిర్ణయానికి గల కారణాలపై అందరితో చర్చించాల్సి ఉందన్నారు.

Advertisements

Latest Articles

Most Read