బిహార్‌ సీఎం నితీష్‌‌కుమార్‌కి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి బిహార్‌కి చేపలు, రొయ్యల ఎగుమతులను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. సముద్ర ఉత్పత్తులను నిల్వ ఉంచేందుకు ఫార్మాలిన్‌ వాడుతున్నారన్న ఆరోపణలతో ఎగుమతులు నిలిపివేశారని లేఖలో చంద్రబాబు వివరించారు. ప్రభుత్వ తనిఖీల్లో ఫార్మాలిన్‌ వాడటం లేదని తేలిందని స్పష్టం చేశారు. టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. అవసరమైతే బిహార్‌ నుంచి అధికారుల బృందాన్ని పంపించి తనిఖీ చేసుకోవచ్చని సూచించారు. వెంటనే ఎగుమతులను పునరుద్ధరించాలని నితీష్‌కుమార్‌ను చంద్రబాబు కోరారు.

bihar cm 21012019

అసలు ఏమి జరిగింది ?దేశం నలుమూలలకు ఎగుమతవుతున్న ఏపీ చేపల్లో ప్రమాదకర ‘ఫార్మాలిన్‌’ అవశేషాలున్నాయని ప్రచారం ఎందుకు జరిగింది? 1976 నుంచి ఏపీ చేపలు ఎగుమతి అవుతున్నాయి. పకడ్బందీగా ప్యాకింగ్‌ చేసి పంపుతున్న చేపలపై ఫార్మాలిన్‌ పూత పూస్తున్నామన్న అపవాదు ఎలావచ్చింది? మన చేపల అమ్మకాన్ని ఆ ఐదు రాష్ట్రాలు ఎందుకు నిరాకరించాయి. ఇదీ ఏపీ ప్రభుత్వ అధికారులు, చేపల ఉత్పత్తి, ఎగుమతిదారుల్లో నెలకొన్న సందేహం. ఏపీ చేపల దిగుమతుల నిషేధం వెనుక రాజకీయ కుట్ర ఉందన్న వాదనకు బలం చేకూరుతోంది. ఏపీ చేపల పై అభ్యంతరాలు రావడం వెనుక మర్మం ఏమిటనే కోణం లో పరిశీలిస్తే.. రాజకీయ కుట్రే కారణమని అధికార వర్గాలు అంటున్నాయి.

bihar cm 21012019

ఏపీ చేపలపై ప్రమాదకర రసాయన పూతలు ఏమీ పూయట్లేదని భరోసా ఇస్తూ, ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాయడంతో మూడు రాష్ట్రాలు మెత్తబడ్డాయి. అయినా నాగాలాండ్‌ మాత్రం భీష్మించింది. వ్యవసాయ ఉత్పత్తుల్లో నాణ్యతకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా సాగులోనూ యాంటీబయోటిక్స్‌ వినియోగంపై నిషేధం అమలు చేస్తున్నది. అయినా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేందుకే ఫార్మాలిన్‌ పేరిట దుష్ప్రచారంతో కొన్ని రాష్ట్రాల్లో మన చేపలపై నిషేధం విధించారన్న సందేహం మన అధికారుల్లో ఏర్పడింది. మొత్తం ఈశాన్య రాష్ట్రాలకు రోజూ మన చేపలు 52 ట్రక్కుల్లో వెళ్తాయి. అలాగే పశ్చిమబెంగాల్‌కు 150, ఒడిసాకు 30, బిహార్‌కు 50 యూపీకి 30, ఢిల్లీ+పంజాబ్‌లకు 20, ముంబైకి ప్రత్యేకంగా 6 ట్రక్కులు వెళ్తున్నాయి.

తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొన్ని రోజుల క్రిందట, విజయవాడ వచ్చి, కులాల కుంపట్లు రగిలించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో, తలసాని మాట్లాడుతూ, ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ ఏమి చెయ్యబోతున్నారు అనే, అంశంపై ఓ చిన్న క్లూ ఇచ్చారు. కనీసం ఒక్క శాతం ఓట్ బ్యాంక్‌ను ప్రభావితం చేసినా మొత్తం తారు మారు అవుతుందని ఆయన చెప్పారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ మీద ప్రధానంగా దృష్టిపెట్టాలని డిసైడైనట్టు కనిపిస్తోంది. ఇదే విషయం చంద్రబాబు ఈ రోజు ప్రస్తావించారు. తెదేపా నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడారు. బీసీల్లో అపోహలు తేవాలని వైకాపా, తెరాస కుట్రలు చేస్తున్నాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. మోదీ డైరెక్షన్‌లోనే ఇవన్నీ చేస్తున్నారని మండిపడ్డారు.

srinivas 21012019

బీసీలను తెదేపాకు దూరం చేయాలనే కుతంత్రాలు చేస్తున్నారని.. ఆ మూడు పార్టీల కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. బీసీలే సంఘటితంగా కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు. చిత్తూరుకు కృష్ణా జలాలు రావడం ఒక చరిత్ర అని.. కృష్ణా జలాలకు రాయలసీమ ప్రజలు హారతులు పడుతున్నారని చెప్పారు. నాలుగు సీమ జిల్లాలకు నీళ్లు ఇవ్వగలిగామని, అసాధ్యాలను సుసాధ్యం చేశామన్నారు. ప్రతిపక్షం పూర్తిగా డీలాపడిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలపై ఈరోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

srinivas 21012019

ఏం మేలు చేశారని కేంద్ర మంత్రులు వారానికొకరు రాష్ట్రానికి వస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. కోల్‌కతాలో నిర్వహించిన విపక్షాల సభకు 10లక్షల మందికి పైగా తరలివచ్చారని.. అమరావతిలో నిర్వహించే ధర్మపోరాట సభను దీనికి దీటుగా నిర్వహించాలని నేతలకు సూచించారు. ప్రధాని మోదీ పాలనలో సంక్షేమం పడకేసిందని, భాజపా పాలిత రాష్ట్రాల కన్నా చాలా తక్కువ నిధులు ఏపీకి కేటాయించారని చంద్రబాబు ఆరోపించారు. గతంలో వైఎస్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిందించారని.. ‘రాజా ఆఫ్‌ కరప్షన్‌’ పుస్తకంపై కేసీఆర్‌దే రెండో సంతకమని దుయ్యబట్టారు. ఇప్పుడు అదే కేసీఆర్‌ వైఎస్‌ను పొగుడుతున్నారని విమర్శించారు.

దేశ వ్యాప్తంగా బీజేపీ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలని కూల్చే ప్రయత్నాలు చూస్తున్నాం, గవర్నర్లను అడ్డు పెట్టుకుని రాష్ట్రాన్ని ఎలా నాశనం చేస్తున్నారో చూస్తున్నాం, వ్యవస్థలను అడ్డు పెట్టుకుని, రాష్ట్రాల పై ఎలా కక్ష సాదిస్తున్నారో చూస్తున్నాం. ప్రత్యేక్ష ఉదాహరణ కర్నాటకలో జరుగుతున్న రచ్చ. అక్కడ కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, ఆ ప్రభుత్వాన్ని పడేయటానికి ఎంతో రచ్చ చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మల్యేలను కొనే బాధ్యత ఏకంగా ఢిల్లీ పెద్దలే తీసుకున్నారు. ఇక మన ఆంధ్రప్రదేశ్ సంగతి అయితే సరే సరి. ఇప్పుడు తాజాగా జీవీఎల్ నరసింహారావు, మీ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టిస్తాం జాగ్రత్తా అంటూ హెచ్చరిస్తున్నారు.

gvl 21012019

చంద్రబాబు వ్యవహారమంతా అవినీతి, ఆర్భాటం, ప్రచారం తప్ప రాష్ర్టానికి చేసింది శూన్యమని, వీటిని వివరించటానికి వారానికో కేంద్రమంత్రి రాష్ట్రానికి రానున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు. గుంటూరులో వారు ఆదివారం మీడియాతో మాట్లాడారు. సోమవారం కేంద్రమంత్రి గడ్కరీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని వారు చెప్పారు. ఉదయం విజయవాడలో పార్టీ కార్యకర్తలతో సమావేశం అనంతరం మధ్యాహ్నం ఆకివీడులో పలు పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్లు వెల్లడించారు. ఒక్క గడ్కరీ మంత్రిత్వశాఖ నుంచే రూ.3లక్షల కోట్లు ఏపీకి వచ్చాయన్నారు.

gvl 21012019

చంద్రబాబు నిత్యం కేంద్రంపై దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. మోదీ తిరిగి ప్రధాని అయితే జైలుకు పోవాలనే భయంతో దొంగలంతా ఓ చోటకు చేరారని వారు ఆరోపించారు. టీడీపీకి భయపడే ప్రధాని పర్యటన వాయిదా వేసుకున్నారనే ప్రగల్భాలను చంద్రబాబు మానుకోవాలని, అదే జరిగితే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తప్పదని జీవీఎల్‌ హెచ్చరించారు. 23 మంది ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మాతో పెట్టుకుని, పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే, రాష్ట్రపతి పాలన వస్తుంది అంటూ, ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వాన్ని, రాష్ట్రపతి పాలన పెట్టిస్తా అని హెచ్చరిస్తుంటే ఏమి చెయ్యాలి ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెడతాం జాగ్రత్తా అంటూ, నిన్న బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని హెచ్చరించిన సంగతి తెలిసిందే. వీళ్ళ వ్యాఖ్యల పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కౌంటరిచ్చారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెడతామని బెదిరిస్తున్నారని, వాళ్ల బెదిరింపులకు ఇక్కడ భయపడే వాళ్లు ఎవరూ లేరని ఘాటుగా సమాధానం ఇచ్చారు. సోమవారం టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ.. ఏపీకి ప్రత్యేకంగా చేసిందేమీ లేదని, బీజేపీ పాలిత రాష్ట్రాల కన్నా చాలా తక్కువ ఏపీకి ఇచ్చారని చంద్రబాబు విమర్శించారు.

cbn counter 21012019

యూపీ రోడ్లుకు ఇచ్చిన నిధుల కన్నా 7 రెట్లు తక్కువ ఏపీకి ఇచ్చారని, మహారాష్ట్ర రోడ్ల కన్నా 4 రెట్లు తక్కువ ఇచ్చారన్నారు. ఏపీ రహదారుల అభివృద్ధికి కేవలం రూ.5,399 కోట్లు మాత్రమే ఇచ్చారని ఆయన విమర్శించారు. ఏపీలో పర్యటించేందుకు వారానికి ఓ కేంద్రమంత్రి వస్తారని, రాష్ట్రానికి ఏం మేలు చేశారని వస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. పైగా బెదిరింపులు కూడా చేస్తున్నారన్నారని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారమంతా అవినీతి, ఆర్భాటం, ప్రచారం తప్ప రాష్ర్టానికి చేసింది శూన్యమని, వీటిని వివరించటానికి వారానికో కేంద్రమంత్రి రాష్ట్రానికి రానున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు నిన్న గుంటూరులో మీడియాతో మాట్లాడారు.

cbn counter 21012019

చంద్రబాబు నిత్యం కేంద్రంపై దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. మోదీ తిరిగి ప్రధాని అయితే జైలుకు పోవాలనే భయంతో దొంగలంతా ఓ చోటకు చేరారని వారు ఆరోపించారు. టీడీపీకి భయపడే ప్రధాని పర్యటన వాయిదా వేసుకున్నారనే ప్రగల్భాలను చంద్రబాబు మానుకోవాలని, అదే జరిగితే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తప్పదని జీవీఎల్‌ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యల పై పెద్ద దుమారమే రేగింది. ఏమున్నా రాజకీయంగా తేల్చుకోవాలని, మాకు ఢిల్లీలో అధికారం ఉంది కదా అని, ఈ దేశం మొత్తం సొంత జాగీరుగా బీజేపీ నేతలు వ్యవహరించటం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేసి, రాష్ట్రపతి పాలన పెట్టిస్తాం అని బెదిరించటం పై, పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

Advertisements

Latest Articles

Most Read