ఫెడరల్ ఫ్రంట్, దేశం, రాష్ట్రాలు, ప్రాంతీయ పార్టీలు అంటూ రెండు రోజుల క్రితం జగన్, కేటీఆర్ కలిసి ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడారో విన్నాం. మేమే ఈ దేశంలో రాజకీయ ప్రత్యామ్నాయం అంటూ హడావిడి చేసారు. కేసీఆర్ ఈ దేశానికి మరో గాంధీ అన్నట్టుగా, జగన్ భజన చేసారు. అయితే, కేసీఆర్ రంగు ఒక్క ఫోన్ కాల్ తో బయట పడింది. ఈ రోజు కేసీఆర్ కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫోన్ చేశారు. రేపు ‘యునైటెడ్ ఇండియా’ ర్యాలీ నిర్వహిస్తున్నారు. కోల్ కతాలో రేపు నిర్వహించే ర్యాలీకి మమతా బెనర్జీ ఆహ్వానించారు. రేపు నిర్వహించనున్న ర్యాలీలో ఎన్డీయేతర పార్టీల నేతలు పాల్గొననున్నారు. అయితే ఈ భేటీకి కేసీఆర్ రావటం లేదని, మమతాకో ఎవో కారణాలు చెప్పి తప్పించుకునట్టు తెలుస్తుంది. అయితే, తన పార్టీ తరుపున ఒక ప్రతినిధిని కూడా అక్కడకు పంపించేందుకు కేసీఆర్ భయపడుతున్నట్టు తెలుస్తుంది. దీనికి కారణం ఢిల్లీ మోడీ, సహారా ఫైల్ బయటకు తీస్తాడని. ఇక్కడ మాత్రం, ఎన్నో కబురులు చెప్తున్న కేసీఆర్, ఇలా ఒక్క ఫోన్ కాల్ తో, తన బండారం బయట పెట్టుకున్నాడు.

jagan 1801200019

మరో పక్క, టీడీపీ అధినేత అయిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం కోల్ కతా వెళ్లి ర్యాలీలో పాల్గొంటారు. డీఎంకే అధినేత స్టాలిన్ కూడా సభకు హాజరవుతున్నప్పటికీ చంద్రబాబే ఆ సభలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తారు. చంద్రబాబుకు మమత రెండు సార్లు ఫోన్ చేసి ర్యాలీకి రావాల్సిందిగా వ్యక్తిగతంగా ఆహ్వానించారు. పార్టీ నేతలు మంత్రులు కూడా ర్యాలీకి వెళితేనే బావుంటుందని చంద్రబాబుకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను మమతా బెనర్జీ మొదటి నుంచి ప్రతిఘటించడం, ఎపీలో సీబీఐకి అనుమతిని రద్దు చేసిన వెంటనే కోల్ కతాలో కూడా అక్కడి ప్రభుత్వం ఇటువంటి నిర్ణయమే తీసుకోవడం వంటి అంశాలతో పాటు భావసారూప్యత కూడా ఉండటంతో ర్యాలీకి వెళితేనే బాగుంటుందని నేతలు సూచించడంతో సీఎం కూడా వారి వాదనతో ఏకీభవించారు.

jagan 1801200019

కాంగ్రెస్ తరపున సోనియా, రాహుల్ ఇద్దరూ హాజరవుతారని భావించారు. అనారోగ్య కారణాలతో సోనియా రాకపోయినా రాహుల్ ఖచితంగా వస్తారని నమ్మారు. అయితే రాహుల్ కూడా రావడం లేదు. పార్టీ తరపున లోక్ సభా పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కోల్ కతా ర్యాలీకి వెళ్తున్నారు. జేడీఎస్ తరపున దేవె గౌడ, కుమారస్వామి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎస్పీపీ నేత శరద్ పవార్, ఆర్జేడీ తరపున తేజస్వీ యాదవ్, పాటిదార్ ఉద్యమకారుడు హార్డిక్ పటేల్ ఇలా అనేక మంది హాజరవుతున్నారు. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రతినిధిగా సతీష్ చంద్ర మిశ్రా ఈ ర్యాలీకి హాజరవుతారు. ఇక బీజేపీకి దూరంగా ఉంటున్న యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, శత్రుఘ్న సిన్హా ఇలా ఇలా స్టేజీపైనే భారీ రాజకీయ తారాగణం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, అజిత సింగ్, శరద్ యాదవ్ లాంటి నేతలు కూడా ర్యాలీలో ఉంటారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీంటిని ఒకతాటిపైకి తీసుకురావడమే మమత ధ్యేయం. అందుకే అందరు నేతలను ఆమె వ్యక్తిగతంగా ఆహ్వానిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల ముందు బీజేపీ వ్యతిరేక శక్తుల ఐక్యతను చాటడం కూడా ముఖ్యమేనని తృణమూల్ కాంగ్రెస్ భావిస్తోంది.

జగన్ కు ఎన్నికల వరకు సలహాలు ఇచ్చే, ప్రశాంత్ కిషోర్ టీం, కేటీఆర్ తో భేటీ పై దిమ్మ తిరిగే ఫీడ్ బ్యాక్ ఇచ్చింది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తో భేటీ ప్రి ప్రజలు ఏమనుకుంటున్నారో అని, జగన్ సర్వే చేపించారు. అయితే, ప్రజల దాకా వెళ్ళకుండానే, కేవలం జగన్ అభిమానులను ముందుగా సర్వే చేస్తేనే దిమ్మ తిరిగే ఫలితాలు వచ్చాయి. జగన్‌ పాదయాత్రతో పార్టీకి కాస్త మైలేజ్‌ వచ్చిందని సంబరపడుతున్న వైసీపీ కోఆర్డినేటర్లలో టీఆర్‌ఎస్‌తో జగన్‌ జట్టుకట్టడం షాక్‌కి గురిచేసిందని ఓ నేత వ్యాఖ్యానించారు. ఆంధ్రాపై అక్కసువెళ్లగక్కుతున్న పొరుగు రాష్ట్ర ప్రాంతీయ పార్టీ నేతల పంచన చేరితే ఇక్కడ సామాన్య జనం హర్షిస్తారా? అంటూ సదరు నేత ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల వరకు కాస్త హుషారుగా ఉన్న వైసీపీ కేడర్‌లో ఈ తాజా పరిణామం నీళ్లుచల్లినట్టయిందని ఆ పార్టీ నేతలే ఆందోళన చెందుతున్నారు. కొన్ని నియోజకవర్గాలలో టికెట్ల కోసం పోటీపడిన నేతలలో కొందరు తమ ప్రయత్నాలకు ఫుల్‌స్టాప్‌ పెడుతున్నట్టు ప్రచారం సాగుతోంది.

jagann 18012019

‘‘ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడి ప్రచారం వల్ల అక్కడ మహాకూటమి ఓటమిపాలైందని వైసీపీ నేతలు విమర్శలు చేశారు. చంద్రబాబు ఎప్పుడూ తెలంగాణ ప్రజలను, పాలకులను వ్యక్తిగత విమర్శలు చేయలేదని, అయినా చంద్రబాబుపై తెలంగాణలో అంత వ్యతిరేకత వచ్చిందంటే.. కేసీఆర్‌ మనల్ని ఆంధ్రోళ్లు దోపిడీదారులని, దొంగలని, ఆంధ్రా బిర్యానీ పేడ బిర్యాని అని, తెలంగాణ వచ్చాకా ఆంధ్రా విద్యా సంస్థలను నిషేధిస్తామని... ఇలా అనేక ఆంధ్రా వ్యతిరేక స్టేట్‌మెంట్స్‌ ఇచ్చి అవమానించారు. వాటిని ఆంధ్ర ప్రజలు ఎలా మర్చిపోతారు.. ఈ పరిణామం ఖచ్చితంగా వైసీపీకి పెద్ద మైనస్సే అవుతుంది..’’ అని ఓ రాజకీయ విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు.

jagann 18012019

‘శత్రువుకు శత్రువు మిత్రుడు’ అనే సూత్రం టీఆర్‌ఎస్‌ విషయంలో వర్తించదని... కేసీఆర్‌తో దోస్తీని సీమాంధ్ర ప్రజలు సహించరని చెబుతున్నారు. ప్రత్యేక హోదాపై వ్యతిరేకత, పోలవరంపై కేసుల దాఖలు, విద్యుత్తు వినియోగానికి సంబంధించి రూ.5200 కోట్ల ఎగవేత, ఉమ్మడి సంస్థల ఆస్తుల పంపిణీకి సహాయ నిరాకరణ... ఇలాంటి అనేక అంశాల నేపథ్యంలో టీఆర్‌ఎ్‌సతో చేతులు కలపడం ఆత్మహత్యాసదృశ్యమే అవుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. కేంద్రంలో అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తెలంగాణ గడ్డపైనే సోనియా, రాహుల్‌ చేసిన ప్రకటనపై కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ తదితర టీఆర్‌ఎస్‌ నేతలు వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో సంప్రదింపులు జరపడం ద్వారా అధికార టీడీపీకి కొత్త ఆయుధం ఇచ్చినట్లయిందని వైసీపీ కీలక నేత ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్‌, కేటీఆర్‌, టీఆర్‌ఎస్‌ నేతలు ఏపీలో వైసీపీ తరఫున ప్రచారం చేస్తే తమకే నష్టమని చెబుతున్నారు.

మార్చి మొదటి వారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. 6,7 దశల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఈసీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. లోక్‌సభతో పాటు ఏపీ, అరుణాచల్‌ప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. 16వ లోక్‌సభ పదవీకాలం జూన్ 3తో ముగియనుంది. ఈ లోపే ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి కావాల్సి ఉంది. దీంతో స్పీడ్ పెంచిన ఎన్నికల కమిషన్ మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయాలని భావిస్తోంది. కాగా.. ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన సీఈవోలతో పలుమార్లు సమావేశాలు నిర్వహించిన ఈసీ ఫైనల్‌గా ఈ నిర్ణయానికొచ్చింది.

ap elections 18012019

అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సీఈవోలకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిపిన చర్చల్లో సమస్యలన్నీ కూడా ఓ కొలిక్కి తెచ్చే ప్రయాత్నాలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఎంతమంది భద్రతా సిబ్బంది ఉన్నారు? వారిని వినియోగించుకుంటూ ఎన్ని దశల్లో పోలింగ్ నిర్వహించవచ్చు? అధికారుల మార్పులు, చేర్పులతో పాటు పలు అంశాలపై సమావేశంలో ఎన్నికల కమిషన్ చర్చించినట్లుగా తెలుస్తోంది. 2014లో మాదిరిగానే అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించే వీలుంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌‌ ప్రదేశ్‌ల‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ap elections 18012019

జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలతో నిర్వహించడంపై ఈసీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 2019లోకి అడుగుపెట్టడంతో ఆంధ్రప్రదేశ్‌‌లో పొలిటికల్ హీట్ మరింత పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఏపీలోని రాజకీయ పార్టీలకు ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాయి. కాగా.. 2014లో ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 5న ప్రకటించారు. ఏప్రిల్, మే నెలల్లో 9 దశల్లో ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారిగా గోపాలకృష్ణ ద్వివేదిని నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆయనకు ఎలాంటి అదనపు బాధ్యతలు అప్పగించరాదని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్న సిసోడియాను ఆకస్మికంగా బదిలీ చేసి.. ఆయన స్థానంలో గోపాలకృష్ణ ద్వివేదిని నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయోషా మీరా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. సత్యంబాబును ఈ రోజు సుదీర్ఘంగా విచారించిన సీబీఐ ఆ తరువాత మాజీ మంత్రి కోనేరు రంగారావు మనవడు కోనేరు సతీష్ ను విచారిస్తున్నారు. గూడవల్లిలోని ఆయ్న స్వగృహంలో సతీష్ ను ప్రశ్నిస్తున్నారు. ఇబ్రహీంపట్లంలోని హాస్టల్లో ఆయోషామీరా పదేళ్ల కిందట హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆ కేసులో కింది కోర్టు సత్యంబాబును దోషిగా నిర్ధారించి శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు సత్యం బాబును నిర్దోషిగా విడుదల చేసింది. ఆయోషా హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. ఆయోషా హత్య జరిగిన సమయంలోనే ఆమె తల్లి షంషాద్ బేగం తన కుమార్తె హత్యకు కోనేరు సతీష్, అతడి స్నేహితులే కారణమని ఆరోపించిన సంగతి తెలిసిందే.

aayisha 18012019 2

శుక్రవారం కృష్ణా జిల్లా నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చేరుకున్న సీబీఐ బృందం సత్యం బాబును విచారించింది. సుమారు ఐదు గంటల పాటు సత్యంబాబును సిబిఐ టీమ్ విచారించింది. ఓ దశలో సిబిఐ అధికారులతో వాగ్వాదానికి దిగిన సత్యంబాబు... ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసులో అప్పట్లో పోలీసు అధికారులు మా అమ్మని, చెల్లిని చంపేస్తామని.. నన్ను ఎన్‌కౌంటర్ చేస్తామని బెదిరించారని సిబిఐ అధికారుల ముందు వాపోయిన సత్యంబాబు... ఆ హత్య కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. నన్ను కావాలనే బెదిరించి ఈ కేసులు ఇరికించారని సిబిఐ టీమ్‌కు వివరణ ఇచ్చిన సత్యంబాబు.. కొంతమంది అధికారులు కేవలం ప్రమోషన్ల కోసం కక్కుర్తిపడి నన్ను ఈ కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశాడు.

aayisha 18012019 3

విచారణ పేరుతో పోలీసులు తనను చిత్రహింసలు పెట్టారనీ, ఆ టార్చర్ తట్టుకోలేక నేరం చేసినట్లు ఒప్పుకున్నానని అన్నాడు. ప్రస్తుతం తనకు బతకడానికి పని కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, సిబిఐ విచారణ నేపథ్యంలో సత్యంబాబుకి మద్దతుగా అతని ఇంటి దగ్గర భారీగా చేరుకున్న స్థానికులు... సత్యంబాబుని మళ్లీ ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారా? అంటూ తీవ్ర స్థాయిలో సిబిఐ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన సత్యంబాబు... ఈ కేసులో న్యాయం కోసం విచారణకు పూర్తిగా సహకరిస్తానని సిబిఐ అధికారులకు చెప్పినట్టు వెల్లడించారు.

Advertisements

Latest Articles

Most Read