ఏపీలో త్వరలోనే ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్న సీఈవో సిసోడియాను ఆకస్మికంగా బదిలీ చేయడం జరిగింది. సిసోడియా స్థానంలో సీఈవోగా గోపాలకృష్ణ ద్వివేదిని నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. పురంధేశ్వరి కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో గోపాలకృష్ణ ద్వివేది వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా కూడా ద్వివేది పనిచేశారు. కాగా 1993 బ్యాచ్‌కు చెందిన ద్వివేది.. ప్రస్తుతం ఏపీ పశుసంవర్దక శాఖ ముఖ్యకార్యదర్శిగా విధులు నిర్వహించారు.

ec 18012019

ఉత్తర్వులు అందిన అనంతరం గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. అందరి సహకారంతో ఎన్నికలను స్వేచ్ఛగా నిర్వహిస్తామన్నారు. తక్కువ సమయం ఉన్నప్పటికీ ఛాలెంజ్‌గా తీసుకుని ఎన్నికలను నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. తప్పులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో వెనుకాడబోయేది లేదని ఆయన తేల్చిచెప్పారు. ఓటు విషయంలో ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఓట్ల గల్లంతుపై ఓటర్లకు అవగాహన ఉండాలని.. తప్పకుండా ఓటర్లు వారి ఓటును పరిశీలించుకోవాలి అని ఈ సందర్భంగా సీఈవో గోపాలకృష్ణ పేర్కొన్నారు.

 

ec 18012019

అయితే ఈ మార్పులు అన్నీ చంద్రబాబు గమనిస్తున్నారు. తమ చేతిలో ఉన్న అధికారంతో మోడీ, అమిత్ షా, ఎన్ని కుట్రలు అయినా పన్నుతారని, ప్రతి అడుగు ఆచి తూచి వెయ్యాలని చెప్తున్నారు. వీరికి తోడు ఇప్పుడు కేసీఆర్ కూడా తోడు అవ్వటంతో, అక్కడ ఇంటలిజెన్స్ కూడా మనకు వ్యక్తిరేకంగా పని చేస్తుందని, జగన మోహన్ రెడ్డికి లబ్ది చేకూరేలా చేస్తారని, అప్రమత్తంగా ఉండలాని అంటున్నారు. ఇది ఒక్కటే కాదని, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత, ఎదో ఒక వంకతో, డీజీపీని కూడా తప్పిస్తారని, వారికి కావలసిన వారిని పెట్టుకుని, పోలీస్ వ్యవస్థని కూడా వారి కంట్రోల్ లోకి తీసుకున్నా ఆశ్చర్యం లేదని, ఈ కుట్రలన్నీ ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించలాని, చంద్రబాబు పార్టీ నేతలకు చెప్తున్నారు. అయితే తెలంగాణా ఎన్నికల అధికారి పై అన్ని ఆరోపణలు వచ్చినా ఏమి చెయ్యని కేంద్రం, సమర్ధవంతంగా పని చేస్తున్న సిసోడియాను ఎందుకు తప్పించిందో అర్ధం కావటం లేదు.

ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటామని స్పష్టంగా చెప్పిన కేసీఆర్‌... మిషన్‌ మొదలు పెట్టారని తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఏపిని తన గుప్పిట్లో పెట్టుకోవటానికి, చంద్రబాబును ఓడించాల్సిందేనని ఆయన గట్టిగా భావిస్తున్నారు. అందుకే తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రెస్‌మీట్‌లో చంద్రబాబుపై విమర్శలకే ఆయన ఎక్కువగా ప్రాధాన్యతను ఇచ్చారు. ఇపుడు మరో అడుగు ముందుకేసి ఏపీ ప్రతిపక్ష నేతతో సమావేశానికి టీఆర్ఎస్ సిద్ధమవ్వడం ఆసక్తికరంగా మారింది. ఫిబ్రవరి రెండో వారం తర్వాత ఏ క్షణమైనా... సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ రావొచ్చు. సమయం తక్కువగా ఉన్నందునే జగన్‌తో కేటీఆర్‌ సమావేశం అయ్యారన్న మాట వినిపిస్తోంది. ఈ ఇద్దరి మధ్య చర్చల్లోనూ ఏపీ రాజకీయ అంశాలే ప్రధానంగా వచ్చాయి. అయితే ఏపీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటామని కేసీఆర్‌, కేటీఆర్‌ చెబుతున్నారు. మరి అది ఎలా ఉంటుంది..? టీఆర్‌ఎస్‌ నేరుగా ఏపీ గ్రౌండ్‌లోకి దిగుతుందా..? ఇక్కడ రంగప్రవేశం చేసే అవకాశం ఉంటుందా...? అంటే.. ఉండకపోవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

jaggugelpu 16012019 2

టీఆర్‌ఎస్‌ నేతలకు వైసీపీ నేతలకు మధ్య సాన్నిహిత్యం ఉంది. టీఆర్‌ఎస్‌ గెలిస్తే.. సంబరాలు చేసుకునేంత ఫ్రెండ్‌షిప్‌ నెలకొంది. అందుకే ఇక్కడ నేరుగా రంగంలోకి దిగకుండా.. వైసీపీని ఏపీలో బలపరచడం టీఆర్ఎస్ మొదటి వ్యూహమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైసీపీకి అవసరమైన అన్ని అండదండలు అందించాలి. ఎన్ని రకాలుగా సాయం చేయగలరో.. అన్ని రకాలుగా జగన్‌ పార్టీకి టీఆర్ఎస్ సాయం చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఇది కేసీఆర్‌ చెబుతున్న రిటర్న్‌ గిఫ్ట్‌లో ఓ కోణం..! ఇక రెండోది...! మిత్రుడి కోసం మరో మిత్రుడిని రంగంలోకి దించడం..! టీఆర్‌ఎస్‌ మిత్రపక్షం ఎంఐఎం అధ్యక్షుడు ఓవైసీ ఇప్పటికే ఐ యామ్‌ కమింగ్‌ టు ఏపీ అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఏపీకి వస్తున్నాను.. కాచుకో అన్న రేంజ్‌లో చంద్రబాబుకు సవాల్ విసిరారు. అయితే ఓవైసీ ద్వారా జగన్‌కు కేసీఆర్ మేలు చేయడం మరో కోణంగా కనిపిస్తోందని చెబుతున్నారు.

jaggugelpu 16012019 3

కర్నూలు, గుంటూరు లాంటి చోట్ల మైనారిటీ ప్రాబల్యం ఎక్కువుగా ఉంది. ఇలాంటి చోట్ల ఎంఐఎం పోటీ చేయడం మరో ఆప్షన్‌గా కనిపిస్తోంది. ఇపుడు తెలంగాణలో టీఆర్‌ఎస్‌, ఎంఐఎంలు కలిసిపోయాయి. ఎంతగా అంటే.. తెలంగాణలో తాము ఓవైసీ స్థానం తప్ప అన్ని గెలుస్తామని చెబుతున్నారు. ఆ స్థానంపై ఫోకస్‌ కూడా చేయడం లేదు టీఆర్‌ఎస్‌. ఇపుడు ఏపీలో కూడా ఇంతే..! ఎంఐఎం రంగంలోకి దిగుతుంది. వైసీపీకి సపోర్ట్‌ చేస్తామని చెబుతోంది.. అంటే ఈ రెండు పార్టీలకు సంధానకర్తగా టీఆర్‌ఎస్‌ ఉంటుందన్న మాట..! తద్వారా టీడీపీ వైపు మళ్లే ముస్లిం ఓటర్లను ఎంఐఎం ద్వారా వైసీపీకి దగ్గర చేయడం రెండో వ్యూహం. అంటే ఎలా చెప్పుకున్నా.. కేసీఆర్‌ నేరుగా ఏపీలో దండయాత్రకు దిగే అవకాశం లేదన్నది స్పష్టంగా కనిపిస్తోంది. నేరుగా రంగంలోకి దిగితే.. నెగిటివ్‌ ప్రభావం ఉంటుందన్న భావన రెండు పార్టీల నేతల్లోనూ వ్యక్తమవుతోంది. 2009లో మహాకూటమి అంటూ జట్టు కట్టినప్పటికీ... తెలంగాణ దాటి ప్రచారం చేయలేదు కేసీఆర్‌. కేవలం హైదరాబారాద్‌, తెలంగాణలో మాత్రమే చంద్రబాబుతో కలిసి ప్రచారం చేశారు. తాజాగా ఫెడరల్ ఫ్రంట్ అంటూ దేశవ్యాప్తంగా పార్టీలతో సమావేశాలు జరుపుతున్నప్పటికీ... ఏపీకి మాత్రం కేసీఆర్ వెళ్లలేదు. అయితే వైసీపీతో భేటీ తర్వాత ఇప్పుడు ఏపీకి వస్తారా..? అంటే డౌటేనంటున్నాయి పార్టీ వర్గాలు.

ఫింఛన్ల పెంపును పక్కదారి పట్టించేందుకే షర్మిలను తెరపైకి తెచ్చారని ఆంధ్రప్రదేశ్ మంత్రి నక్కా ఆనందబాబు విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కొత్త డ్రామా ప్రారంభించారని ఆయన బుధవారం మీడియాతో అన్నారు. తెలంగాణలో జగన్ దొరల కాళ్లు మొక్కుతున్నారని, వారికి కొత్త యాక్టర్ ఓవైసీ తోడయ్యారని నక్కా ఆనందబాబు వ్యాఖ్యానించారు. ఎపికి చుట్టపు చూపుగా వచ్చే జగన్ తో కేసీఆర్ వచ్చి ఏం చర్చలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. అవిశ్వాసం తీర్మానం ప్రతిపాదించినప్పుడు మద్దతు ఇవ్వకుండా టీఆర్ఎస్ ఎంపీలు బయటకు వెళ్లిపోయారని ఆయన అన్నారు.

sharmilaa 16012019

పోలవరాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ ఎపికి టీఆర్ఎస్ నేతలు ఏం మేలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. బిజెపి వ్యతిరేక ఓటును చీల్చేందుకే ఫ్రంట్ పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శిం్చారు. కేటీఆర్‌-జగన్‌ భేటీపై మంత్రి యనమల రామకృష్ణుడు కూడా స్పందించారు. ఇది ఫెడరల్ ఫ్రంట్ కాదు..మోదీ చేతిలో కీలుబొమ్మల ఫ్రంట్ అని వ్యాఖ్యానించారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం మోడీకి ఓట్లను మూటకట్టడమే కేటీఆర్‌-జగన్‌ భేటీలో కుతంత్రమని విమర్శించారు. మోడీ డైరక్షన్‌లోనే కేటీఆర్‌-జగన్‌ భేటీ అయ్యారని చెప్పారు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఒకే వేదికపైకి వస్తున్నాయని, దానిని అడ్డుకునేందుకే ఫ్రంట్ ఎత్తుగడ అని యనమల అన్నారు.

sharmilaa 16012019

ఏపీకి అన్యాయం చేసినవాళ్లంతా ఒకచోట చేరుతున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌, వైసీపీ రహస్య బంధంపై టీడీపీ చెప్పిందే నిజమైందని ఆయన అన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ కూడా, గత కొన్ని రోజులుగా జరుగుతున్న అంశాల పై బేరీజు వేసుకుంటుంది. ఉన్నట్టు ఉండి షర్మిల బయటకు రావటం, జగన్ - కేటీఆర్ భేటీ ఇవన్నీ, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పై ఉన్న పోజిటివ్ బజ్ నుంచి డైవర్ట్ చెయ్యటానికే అనే అభిప్రాయానికి వచ్చారు. వీటికి సమాధానం ఇస్తూనే, ఎక్కువగా వీటి పై ఫోకస్ చెయ్యకుండా, ప్రజలకు చేస్తున్న మంచి, వివిధ పధకాలు, అభివృద్ధి, వీటి పై మాత్రమే ఎక్కువ మాట్లాడాలని, ప్రజల్లోకి కూడా వీటి పై చర్చ జరిగేలా చూస్తూ, అనవసర విషయాల పై డైవర్ట్ కాకూడదు అనే నిర్ణయానికి వచ్చారు.

టీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌, ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌ భేటీలో ఆసక్తికర చర్చ జరిగినట్లు సమాచారం. ఈనెల చివరివారం లేదా వచ్చే నెల మొదటివారంలో అమరావతికి కేసీఆర్‌ వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీ పర్యటనలో వైసీపీని ఫెడరల్‌ ఫ్రెంట్‌లోకి కేసీఆర్‌ ఆహ్వానించనున్నారు. లోటస్‌పాండ్‌లో జగన్, కేటీఆర్ నివాసంలో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ప్రజాసంకల్పయాత్ర వివరాలను కేటీఆర్‌ బృందానికి జగన్‌ వివరించారు. ప్రత్యేక హోదా కోసం కేసీఆర్‌ కేంద్రానికి లేఖరాస్తే బాగుంటుందని జగన్‌ కోరారు. అమరావతిలో భేటీ తర్వాత కేసీఆర్‌ లేఖపై నిర్ణయాన్ని ప్రకటిస్తారని కేటీఆర్‌ తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతు పలుకుతూనే తెలంగాణ ప్రయోజనాల కోసం గట్టిగా పోరాడుదామని కేటీఆర్‌ చెప్పారు.

kcr 16012019

తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికలు, రాహుల్‌-చంద్రబాబు ప్రచారంపై కేటీఆర్‌ను జగన్‌ అడిగి తెలుసుకున్నట్లు వినికిడి. సమావేశంలో కేసీఆర్‌కు ఫోన్‌ చేసి జగన్‌తో కేటీఆర్‌ మాట్లాడించినట్లు సమాచారం. ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసం కలిసి రావాలని జగన్‌ను కేసీఆర్‌ ఆహ్వానించినట్లు వైసీపీ, టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. స్వయంగా అమరావతికి వచ్చి కలుస్తానని జగన్‌కు కేసీఆర్‌ చెప్పారు. అయితే ఇక్కడ ప్రజలకు అర్ధం కాని విషయం ఒకటి ఉంది. అసలు కేసీఆర్, అమరావతి వచ్చి జగన్ ను కలవటం ఏంటో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇద్దరికీ ఇక్కడ ఇల్లు లేదు.... ఇద్దరూ అమరావతికి సంబంధం లేని వాళ్ళే... ఒకరైతే ప్రారంభానికి పిలిచినా నేను రాను చెప్పారు... మరిక్కడ ఎందుకు కలవడం...?

kcr 16012019

మరో పక్క ఈ భేటీ పై లోకేష్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన నారాలోకేశ్.. టీఆర్ఎస్, వైసీపీల స్నేహబంధంపై సెటైర్లు వేశారు. ఈ రెండు పార్టీల పొత్తుతో.. ఏపీపై కుట్రలు బయటపడ్డాయన్నారు. ఢిల్లీ మోదీ, ఆంధ్రా మోదీ, తెలంగాణ మోదీలు ఒక్కటయ్యారని లోకేశ్ ఎద్దేవా చేశారు. ముగ్గురూ కలిసి ఆంధ్రప్రదేశ్‌పై కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. కేసీఆర్‌ను తెలంగాణ మోదీగా, నరేంద్ర మోదీని ఢిల్లీ మోదీగా, జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రామోదీగా అభివర్ణించారు లోకేశ్. ఈ సందర్భంగా కేసీఆర్ గతంలో ఆంధ్రావారి గురించి చేసిన వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు లోకేశ్. ’లంకలో పుట్టినవాళ్లంతా రాక్షసులు, ఆంధ్రాలో పుట్టిన వాళ్లంతా వారి వారసులు. ఆంధ్రా బిర్యానీ పేడలా ఉంటుంది‘ అని అవహేళన చేసిన కేసీఆర్‌తో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జతకట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisements

Latest Articles

Most Read