ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుంటే అసూయ పడుతున్నారు సీఎం చంద్రబాబు అన్నారు. ఏమీ లేకపోయినా కోడి కత్తి కేసును కేంద్రం ఎన్‌ఐఏకి అప్పగించిందని మండిపడ్డారు. కోడి కత్తి కేసులో బెయిల్‌ కూడా రాకుండా కేసులు నమోదు చేశామన్నారు. జగన్‌ ఫిర్యాదు చేయకపోయినా సీరియస్‌గా దర్యాప్తు చేశామని చెప్పారు. రాష్ట్ర అధికారాలపై కేంద్రం జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేదని సీఎం హెచ్చరించారు. దేశ వ్యవస్థలపై జగన్‌కు నమ్మకం లేకుంటే ఏ దేశంతో విచారణ కోరతారని ప్రశ్నించారు. అభివృద్ధిపై ఎవరితోనైనా చర్చకు సిద్ధమని చంద్రబాబు సవాల్ విసిరారు.

cbn 180120019

మరో పక్క, కోడికత్తి కేసును ఎన్‌ఐఏకు అప్పగించాలన్న కేంద్రం నిర్ణయంపై న్యాయపోరాటం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రాల హక్కుల్లో తలదూర్చే విధంగా.. సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడిచేలా కేంద్రం వ్యవహరిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం విమర్శిస్తోంది. ‘ఎన్‌ఐఏకు ఉగ్రవాదం కేసులు, రెండు, మూడు రాష్ట్రాల్లో నేరాలతో సంబంధమున్న కేసులను మాత్రమే అప్పగిస్తారు. ఎన్‌ఐఏ ఏర్పాటు చట్టంలోనే ఆ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. అలాంటిప్పుడు వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై జరిగిన కోడికత్తి దాడిలాంటి చిన్న కేసుపై ఎన్‌ఐఏ విచారణ చేయడం.. ఆ సంస్థ చట్ట పరిధిని అతిక్రమించడమే’ అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ విషయాలన్నింటినీ ప్రస్తావిస్తూ శనివారం హైకోర్టులో పిటిషన్‌ వేయనుంది. వాస్తవానికి కోడికత్తి కేసుపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపింది. ఆ విచారణను కాదంటూ ఎన్‌ఐఏకు కేసును అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

cbn 180120019

దీనిపై ఏం చేయాలన్న దానిపై సీఎం చంద్రబాబుతో డీజీపీ ఠాకూర్‌, అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివా్‌సలు రెండుసార్లు భేటీ అయ్యారు. తొలుత కేంద్ర నిర్ణయానికి నిరసనగా ఒక లేఖ రాయాలని అనుకుని ఆ మేరకు రాశారు. అయినా కేంద్రం నుంచి స్పందన లేకపోవడంతో.. ఇప్పుడు హైకోర్టులో పిటిషన్‌ వేయాలని నిర్ణయించారు. అలాగే హైకోర్టులో ఈ అంశం తేలేవరకు కోడికత్తికి సంబంధించిన ఏ రికార్డునూ ఎన్‌ఐఏకు ఇవ్వకూడదని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రాల హక్కుల విషయంలో కేంద్రం తలదూర్చడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని.. న్యాయపరంగా బలమైన పోరాటం చేస్తామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం ఉదయం భేటీ అయ్యారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ, కాల్వ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమోహన్‌‌రెడ్డి తదితరులతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ తో కేటీఆర్ భేటీ, 19వతేదీన కోల్‌కతా టూర్‌పై చర్చ తదితర అంశాలపై వీరిమధ్య చర్చ జరిగింది. కాగా... రేపు సాయంత్రం సీఎం చంద్రబాబు కోల్‌కతా వెళ్లనున్నారు. మమతా బెనర్జీ నిర్వహించనున్న ర్యాలీలో చంద్రబాబు పాల్గొననున్నారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిర్వహించనున్న ర్యాలీలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తన దావోస్ పర్యటనను రద్దు చేసుకున్నారు. పార్టీ నేతల సూచనతో పర్యటన రద్దు చేసుకున్నారు. ఎన్నికలు, పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించనున్నారు.

cbn 180120019

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు చూసి.. విపక్ష నేతలకు కంటగింపు కలుగుతోందని విమర్శించారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో పారిశ్రామిక ప్రగతి చూసి అసూయపడుతున్నారని అన్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు రగిలించాలని కుట్రలు పన్నుతున్నారని, రాయలసీమ, ఉత్తరాంధ్రలో చిచ్చుపెట్టాలని చూశారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రాన్ని మోసం చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన నేతలను హెచ్చరించారు. జగన్‌తో కేటీఆర్ హడావుడిగా భేటీ అయ్యారని, బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కాకుండా కుతంత్రాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

cbn 180120019

రాజకీయ స్వలాభం కోసం విపక్షాలు ఎంతకైనా సిద్ధపడుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ఐదేళ్లలో అద్భుతమైన అభివృద్ధి సాధించామని.. 670కి పైగా అవార్డులు వచ్చాయని చెప్పుకొచ్చారు. ఒక్కరోజులో రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో ఏపీపై అక్కసు పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. ప్రాంతాల మధ్య చిచ్చు రగల్చాలని కుట్రలు, పన్నుతున్నారని... రాయలసీమ, ఉత్తరాంధ్ర మధ్య చిచ్చు పెట్టాలని చూశారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రాన్ని మోసం చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన నేతలను చంద్రబాబు హెచ్చరించారు. ఏపీకి హోదా ఇస్తే తమకూ ఇవ్వాలని కేసీఆర్ అన్నారని గుర్తుచేశారు. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 సంస్థల విభజనకు అడ్డంకులు పెట్టారన్నారు. చివరికి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయనివ్వలేదని సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓ వైపు సీఎం చంద్రబాబు.. మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇద్దరూ సడన్‌గా విదేశీ పర్యటనలు రద్దు చేసుకున్నారు. దావోస్ పర్యటనకు చంద్రబాబు, లండన్ పర్యటనకు వైఎస్ జగన్ వెళ్లాల్సి ఉంది. అయితే సడన్‌గా వారిరివురూ తమ నిర్ణయాలు మార్చేసుకున్నారు. దీంతో రద్దు వెనుక అసలు కారణాలేంటి..? అమరావతిలో అసలేం జరుగుతోంది..? ఏపీ రాజకీయాల్లో ఇంత సడన్‌గా ఏం జరగబోతోంది..? అనేది అంతుచిక్కడం లేదు.. సీఎం చంద్రబాబు దావోస్‌ పర్యటన రద్దయినట్లు ప్రకటించారు. ఎన్నికలు, పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించేందుకు పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలిపారు. పార్టీ నేతల సూచనతో సీఎం పర్యటన రద్దు చేసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా ఇప్పటికే మంత్రి లోకేష్‌ దావోస్‌ పర్యటన ఖరారైంది. దావోస్‌లో సీఎం హాజరయ్యే సమావేశాల్లో లోకేష్‌ పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈనెల 21న మధ్యాహ్నం ఏపీ కేబినెట్‌ సమావేశం జరగనుంది.

cbn 18012019

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వరుస భేటీలు, అర్ధరాత్రి వరకూ పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. పూర్తిగా అభ్యర్థుల ఎంపికపైనే దృష్టిసారించారు. దీంతో పర్యటనను రద్దు చేసుకున్న వైఎస్ వ్యూహ రచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వైఎస్ జగన్‌ కూడా అభ్యర్థుల ఎంపికలపై వరుస సమీక్షలతో బిజీబిజీగా గడపనున్నారని తెలుస్తోంది. నియోజకవర్గాల్లో చేరికలు, అభ్యర్థుల ఎంపికపైనే ప్రస్తుతం చంద్రబాబు పూర్తి దృష్టిసారించారు. మరీ ముఖ్యంగా అభ్యర్థులపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన బాబు.. రాయలసీమ జిల్లా నుంచి తన కసరత్తు ప్రారంభించారు. అదీ కాక, అన్ని వైపుల నుంచి కుట్రలు తారా స్థాయిలో జరుగుతున్న తరుణంలో, ఇప్పుడు విదేశీ పర్యటనలకు వెళ్తే మరింత ప్రమాదమని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

cbn 18012019

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ మోహన్‌‌రెడ్డి సడన్‌గా లండన్ పర్యటన రద్దు చేసుకున్నారు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి జగన్.. హైదరాబాద్ నుంచి లండన్‌‌కు వెళ్లాల్సి ఉంది. పాదయాత్ర అనంతరం.. సుమారు 15 నెలల తర్వాత తన పెద్ద కుమార్తె వర్షా రెడ్డిని చూడటానికి కుటుంబంతో కలిసి లండన్‌కు వెళ్లాలనుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ టూర్ రద్దైంది. ఇదిలా ఉంటే అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఇద్దరూ విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవడంతో అమరావతిలో అసలేం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మొత్తానికి చూస్తే.. ఏపీలో రెండు మూడ్రోజుల్లో భారీగానే చేరికలు ఉంటాయని తెలుస్తోంది. అయితే ఈ చేరికలు ఎటునుంచి ఎటు ఉంటాయన్నేది మాత్రం అంతుచిక్కడం లేదు. అయితే ఎవరు ఏ పార్టీలోకి చేరతారో.. ఎవరు సొంత పార్టీల్లో నిలబడుతారో తెలియాలంటే మరో రెండ్రోజులు వేచి చూడాల్సిందే మరి.

దుర్గమ్మ కొండపై ప్రభుత్వం కొత్త నిబంధనలు విధించింది. ఆలయం ఆవరణలో తెలంగాణ నేత తలసాని రాజకీయ ప్రకటన చేయడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలయ పరిసరాలు ఆధ్యాత్మికంగానే ఉండాలంటూ కొత్త నిబంధనలు విధించింది. ఆలయం పరిసరాల్లో రాజకీయాలు మాట్లాడకూడదని, ఎటువంటి ప్రెస్‌మీట్‌లకు అనుమతి లేదని దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు. వ్యాపారపరమైన పోస్టర్లు, ఫ్లెక్సీలు పెడితే చర్యలు తీసుకుంటామని దేవస్థానం అధికారులు హెచ్చరించారు. ఇటీవల దుర్గమ్మ దర్శనానికి వచ్చి కొండపై రాజకీయాలు మాట్లాడిన తెలంగాణ నేత తలసాని శ్రీనివాస యాదవ్ ఇంద్రకీలాద్రి ఆవరణలో రాజకీయ ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే.

temple 18012019

విజయవాడ దుర్గమ్మ పర్యటనకు వచ్చిన సందర్భంలో సనత్‌నగర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల్లో మొక్కులకు వచ్చి రాజకీయ వ్యాఖ్యలు చేస్తారా అని ఆయన మండిపడ్డారు. టీఆర్‌ఎస్ నేతల ఏపీ పర్యటనల్లో టీడీపీ నేతలు పాల్గొనరాదని చంద్రబాబు ఆదేశాలిచ్చారు. టీఆర్‌ఎస్ నేతల పర్యటనల్లో పాల్గొంటే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. బంధుత్వాలు, స్నేహాల పేరుతో పార్టీని పణంగా పెట్టొద్దని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. ఆలయాల్లో మొక్కులకు వచ్చి రాజకీయ వ్యాఖ్యలు చేస్తారా..?

temple 18012019

ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసే చర్యలను సహించేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణలో జాబితా నుంచి 26కులాలను తొలగించి బీసీలకు అన్యాయం చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఇక్కడికి వచ్చి బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నారని ఆయన తలసానిపై మండిపడ్డారు. బీసీలకు అన్యాయం చేసిన వారితో జగన్‌ అంటకాగుతున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. టీఆర్‌ఎస్‌తో జతకట్టిన వైసీపీకి బీసీలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అవినీతి గొంగళి పురుగును కేసీఆర్‌ కౌగలించుకున్నారని వ్యాఖ్యానించారు. జగన్‌తో స్నేహం తెలంగాణ కోసమేనా.. కేసీఆర్‌, కేటీఆర్‌ జవాబివ్వాలన్నారు. మోదీ చెప్పింది చేయడమే కేసీఆర్‌ కర్తవ్యమని సీఎం వ్యాఖ్యానించారు.

Advertisements

Latest Articles

Most Read