వాళ్ళు చెయ్యరు... చేసే వాళ్ళని చెయ్యనివ్వరు... పైగా అబద్ధపు ప్రచారాలతో హోరెత్తిస్తారు.. అన్నీ ఇచ్చేసాం అని ఒక పక్క అంటారు.. మరో పక్క తప్పుని రాష్ట్రాల పై నెట్టేస్తారు. ఇది కేంద్రంలో బీజేపీ పరిస్థితి తీరు. మన రాష్ట్రం విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఏపి విభజన చట్టంలో ఒకటైన కడప ఉక్కు ఫ్యాక్టరీ పై, నాలుగేళ్ళుగా తరిగి తిరిగి, కేంద్రం చెయ్యదు అని తెలుసుకుని, సొంతగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున, కడప ఉక్క ఫ్యాక్టరీ పెట్టాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం, కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమకు చంద్రబాబునాయుడు ఈరోజు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశం పై కేంద్రం ప్రభుత్వం ఈ రోజు ప్రకటన ఒక ప్రకటన విడుదల చేసింది.
fy;">
ఏదో మంచి వార్తా అనుకునేరు. కాదు. ఏపి ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ, తమ చేతకాని తనాన్ని ఏపి ప్రభుత్వం పై నెట్టివేసే ప్రయత్నం చేస్తూ, ప్రకటన విడుదల చేసింది. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు సాధ్యపడదని సెయిల్ నివేదిక చెప్పిందని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఉక్కు కర్మాగారంపై పూర్తి వివరాలు అందించలేదని విమర్శించింది. కడపలో స్టీల్ ప్లాంట్ పై ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని, దీని ద్వారా కర్మాగార సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని చెప్తుంది. టాస్క్ ఫోర్స్ నుంచి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఏపీ ప్రభుత్వం స్పందించలేదని, తమ వద్ద ఉన్న నివేదికలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించలేదని విమర్శించింది. నాలుగేళ్ల తరువాత కూడా, వీళ్ళు పరిశీలిస్తూనే ఉంటారు.
దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం ఘాటుగా జవాబు ఇచ్చింది. మెకాన్ సంస్థకు ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించిందని.. కేంద్రానికి కావాల్సిన నివేదిక కూడా అందించామని ప్రకటించింది. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పదిసార్లు వినతి పత్రాలను అందించామని.. పరిశ్రమ ఏర్పాటుకు మెకాన్ సంస్థకు సానుకూలంగానే స్పందించిందని ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం సహకరించకుండానే మెకాన్ సంస్థ కేంద్రానికి నివేదిక ఇచ్చిందా? టాస్క్ ఫోర్స్ నివేదికను కేంద్రం ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించింది. అసలు నాలుగేళ్ల నుంచి ఈ విషయం పై కేంద్రం ఏమి చేస్తుందని, ఇప్పుడు వచ్చి ఏపి ప్రభుత్వం పై తోసెయ్యటం ఏంటని, ముందు మెకాన్ సంస్థ నివేదిక బయట పెట్టి, మాట్లాడాలని, కేంద్రాన్ని, ఏపి ప్రభుత్వం నిలదీసింది.