గుంటూరు జిల్లా పుష్పగిరి పీఠం భూముల వివాదానికి సానుకూల పరిష్కారం ల‌భించింది. ఉండ‌వ‌ల్లిలోని ప్రజావేదికలో ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం ఉద‌యం ముఖ్యమంత్రి చంద్రబాబుతో పీఠం పెద్దలు, రైతులు, అధికారులు, స్పీకర్ కోడెల శివప్రసాద‌రావు, మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలిశారు. పీఠానికి, రైతులకు నడుమ పెద్దలుగా విశ్రాంత ఐపీఎస్ అధికారి డిజిపి అరవింద్‌రావు, సీనియర్ జర్నలిస్ట్ పొత్తూరి వెంకటేశ్వరరావు వ్య‌వ‌హ‌రించారు. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ ఏ రైతుకు భూ వేధింపులు అనేవి ఉండకూడద‌న్నారు. అన్నిరకాల భూ వివాదాలను పరిష్కరిస్తున్నాం. ఆధార్ తరహాలో భూధార్ తెచ్చాం. స్వాతంత్ర్యం ముందు నుంచీ సతమతం చేస్తున్న భూ వివాదాలను కూడా పరిష్కరిస్తున్నాం. చుక్కల భూముల సమస్యను పరిష్కరించాం. భూ రికార్డులను టాంపర్ చేసే పరిస్థితే లేకుండా చేశాం. మఠం రుణం రైతులు తీర్చుకోవాలి.

peetham 28122018 2

రైతుల ఆశలను మఠం నెరవేర్చాలి. రైతుకు చేసే మేలుకన్నా గొప్ప ఆధ్యాత్మిక, థార్మిక కార్యక్రమం మరొకటిలేదు. ఇది 3వేల రైతు కుటుంబాల సమస్య. ఆరేడు దశాబ్దాలుగా రగులుతున్న సమస్య. వివాదం వల్ల రుణాలు పొందేవీలు లేక రైతుల ఇక్కట్లు. ఈ భూమిపై ఆదాయం రాక పీఠం ఆవేదన. స్పీకర్ చొరవతో, పెద్దలు పొత్తూరి, అరవింద్‌రావు సలహాలతో సమస్య పరిష్కారం. పుష్పగిరి పీఠం, రాష్ట్ర ప్రభుత్వం, రైతులు ఉమ్మడిగా అఫిడవిట్ హైకోర్టులో దాఖలు చేద్దాం. స్థానిక ధర ప్రకారం 13శాతం చెల్లించేందుకు రైతులు ముందుకు వచ్చారు. అందుకు పుష్పగిరి పీఠం కూడా అంగీకరించింది. ఉభయ కుశలోపరిగా ఇరువర్గాలు సామరస్యంగా సమస్య పరిష్కరించుకోవడం మంచిపని. రాష్ట్రప్రభుత్వ తరఫున పూర్తి సహకారం ఇస్తాం. రైతులకు,పీఠానికి అనుకూల నిర్ణయం తీసుకుంటున్నాం. రేపు జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో దీనిపై కూడా చర్చిస్తాం. రాష్ట్రంలో ఏ రైతుకు భూ వివాదం అనేది ఉండరాదు.

peetham 28122018 3

అందుకే రెవిన్యూ శాఖలో వినూత్న సంస్కరణలు. తన భూమికి ఏమి అవుతుందనే చింత ఏ రైతు పడరాదు. మనకు ఇన్ని ఇచ్చిన రైతుకు మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. అందుకే రూ.16 వేల ఆర్ధిక లోటులో కూడా రైతులకు రూ.24వేల కోట్ల రుణ ఉపశమనం కల్పించాం. దేశం మొత్తం రైతాంగం అశాంతితో రగిలిపోతుంటే మన రైతులు మాత్రం గుండెల్లో పూర్తి భరోసాతో సేద్య పనుల్లో నిమగ్నం అయ్యారు. కేంద్రంలో బిజెపి నేతల రైతాంగ వ్యతిరేక విధానాలు బాధాకరం. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల‌న్నింటిలో రైతులు రోడ్డెక్కి ఆందోళనలకు దిగడం కేంద్ర ప్రభుత్వ ఘోరవైఫల్యం. ఎక్కడ రైతు సంతోషంగా ఉంటాడో అక్కడే సిరి, సంపద ఉంటాయ‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా పీఠం పెద్ద‌లు, రైతులు సీఎం చంద్ర‌బాబును స‌త్క‌రించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల కేంద్రం తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీని దేశంలో భాగంగా కేంద్రం చూడటం లేదని మండిపడ్డారు. విశాఖ ఉత్సవ్‌లో ఎయిర్ షో నిర్వహించనివ్వకుండా అడ్డుకున్నారన్నారు. విశాఖ ఉత్సవ్‌లో ఎయిర్ షో ట్రైల్స్ తర్వాత రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు హైకోర్టు విభజన విషయంలోనూ సంప్రదింపులు జరపలేదన్నారు. సమయం ఇవ్వకుండా జనవరి1 కల్లా వెళ్లిపోవాలి అనడం సరికాదని అన్నారు. రాష్ట్రాల విషయంలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విరుచుకుపడ్డారు. ఆరో శ్వేతపత్రం విడుదల సందర్భంగా మాట్లాడిన ఆయన.. జగన్ కేసులను దృష్టిలో పెట్టుకునే విభజన చేసినట్టుగా అనిపిస్తోందన్నారు. హైకోర్టు విభజనతో నాంపల్లి సీబీఐ కోర్టు విభజన కూడా జరుగుతుందని తెలిపారు.

modijagan 28122018

ఉమ్మడి హైకోర్టు విభజనకు, వైఎస్ జగన్ పై నమోదయిన కేసులకు మధ్య లింక్ ఉందని చంద్రబాబు ఆరోపించారు. జగన్‌ కేసులో వాదనలు జరగకపోయినా న్యాయ ప్రక్రియ ముగిసిందని.. హైకోర్టు విభజనతో నాంపల్లి కోర్టు జడ్జి కూడా బదిలీ అవుతారన్నారు. కాబట్టి ఇప్పుడా ప్రక్రియ మళ్లీ ప్రారంభించాల్సిందేనన్నారు. ఇప్పటి వరకు జరిగిన విచారణ అంతా కొత్త జడ్జికి బదిలీ అయితే, మళ్ళీ మొదట నుంచి విచారణ మొదలవుతుందని అన్నారు. ఇదంతా జగన్ కు మేలు చెయ్యటం కోసమే అని చంద్రబాబు అన్నారు. జగన్ కేసులపై అనుమానాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోందన్నారు. ఉమ్మడి హైకోర్టు విభజనలో కేంద్రం ఎలాంటి సంప్రదింపులు జరపలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సంప్రదింపులు లేకుండానే హైకోర్టును విభజించారని ఆయన అన్నారు. సమయం ఇవ్వకుండా జనవరి 1కల్లా వెళ్లిపోవాలనడం సరికాదని ఆయన అన్నారు.

modijagan 28122018

రాష్ట్ర విభజన తరహాలో హైకోర్టు విభజనకు సైతం మరికొంత సమయం ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కేంద్రం నిర్ణయం కారణంగా ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఒక రాష్ట్రం పట్ల కేంద్రం ఇలాంటి విధానం అనుసరిచండం సరైనది కాదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తామంటే కేంద్రం సహకరించ లేదని, ఇప్పుడు కేంద్రం రుణమాఫీ అంటే ఎన్నికల స్టంటే అని వ్యాఖ్యానించారు. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును రాజ్యసభలోనూ వ్యతిరేకిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. కడప స్టీల్ ప్లాంట్‌కు సహకరించని కేంద్రానికి పన్నులు ఎందుకు కట్టాలని ప్రశ్నించారు. కడప స్టీల్‌ ఫ్యాక్టరీపై సమాచారం ఇవ్వలేదని కేంద్రం అనడం సరికాదన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రానికి వైసీపీ ఊడిగం చేస్తోందని దుయ్యబట్టారు. కడప ఉక్కు ఫ్యాక్టరీపై వైసీపీ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. ప్రజలకు వైసీపీ సంజాయిషీ ఇవ్వాలని సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయాలు, సంస్కృతికి అద్దంపట్టేలా విశాఖ ఉత్సవ్ పేరుతో ఏటా ఏపీ ప్రభుత్వం వేడుకలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది కూడా విశాఖ ఉత్సవాలు శుక్రవారం నుంచి (డిసెంబరు 28) ప్రారంభంకానున్నాయి. ఈ ఉత్సవాలను అంగరంగా వైభవంగా నిర్వహించేందుకు పర్యటక శాఖ భారీ ఏర్పాట్లను చేసింది. శుక్రవారం సాయంత్రం సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరై ఉత్సవ్‌ను ప్రారంభిస్తారు. వేడుకల్లో భాగంగా సెంట్రల్‌ పార్క్‌లో భారీ పుష్ప ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఇందుకోసం బెంగళూరు, కడియం సహా వివిధ ప్రాంతాల నుంచి పూల మొక్కలను తీసుకొచ్చారు. అలాగే సంగీత, సాంస్కృతిక, జానపద కళారూపాల నిర్వహణ, ప్రదర్శన కోసం బీచ్‌రోడ్డులో రెండు ప్రధాన వేదికలను ఏర్పాటుచేశారు. అలాగే చిన్నారుల కోసం అమ్యూ‌జ్‌మెంట్ జోన్ కూడా ఏర్పాటు చేశారు.

vizag 28122018 2

అయితే ఇదే ఉత్సవాల్లో, ఈ రోజు నిర్వహించే విశాఖ ఉత్సవ్ లో విశాఖ తీరంలో 9 యుద్ద విమానాలతో చేసే ఎయిర్ షోను కేంద్రం రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిన 90 మంది వాయుసేన సిబ్బందిని వెనక్కు రావాలని ఆదేశించింది. ఎయిర్‌ షోకు మొదట అనుమతి ఇచ్చిన కేంద్రం ఆ తరువాత వెనక్కి తీసుకుంది. విశాఖ చేరుకున్న సిబ్బందిని రక్షణ శాఖ వెనక్కి రప్పించింది. మోదీ ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగానే ఎయిర్‌ షోకు అనుమతి ఇవ్వలేదంటూ టీడీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమన్వయ లోపాలే కేంద్రం నుంచి అనుమతులు రాకపోవడానికి ముఖ్య కారణంగా కనిపిస్తున్నాయి. గత వారం ఎయిర్‌ షో నిర్వాహకులు విశాఖపట్నం వచ్చి ఆర్కే బీచ్‌, ఇతర ప్రాంతాలను పరిశీలించి నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించారు. అయితే అన్ని ఏర్పాట్లు చేసి, వాయుసేన సిబ్బందిని రిహార్సల్స్ పూర్తి చేశాక వెనక్కు పిలిపించింది కేంద్రం.

vizag 28122018 3

వాయుసేన సిబ్బంది విశాఖ ఉత్సవ్ లో పాల్గొనకుండా వెళ్లిపోవడానికి కేంద్రమే కారణమని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ఇదే విషయం పై పార్లమెంట్ ఆవరణలో, ఎంపీలు ఆందోళన చేసారు. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. జానపద నృత్యాలు, ట్రైబల్ జోన్, అడ్వెంచర్లు, కార్నివాల్ పెరేడ్ తదితర కార్యక్రమాలను మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. ధాన వేదికను ఒకేసారి 50 మంది కళాకారులు ప్రదర్శన ఇచ్చేలా తీర్చిదిద్దారు. విద్యుత్తు, రేడియం దీపాలతో దీనిని అలంకరించారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రత్యేకాధికారులకు ప్రత్యేక గ్యాలరీ మినహా మిగతా ప్రాంతాన్ని ప్రజలు వీక్షించేందుకు వీలుగా ఉంచారు. ప్రత్యేక స్టాళ్ల కోసం 200కుపైగా డేరాలను ఏర్పాటు చేశారు. బీచ్‌లో పదికిపైగా దేవాలయాల నమూనాలను తీర్చిదిద్దారు. సింహాచలం వరాహలక్ష్మీనర్సింహస్వామి, అన్నవరం సత్యనారాయణస్వామి, కన్యకాపరమేశ్వరి, ఇతర ఆలయాల నమూనాలను సిద్ధం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన వాయిదా పడింది. జనవరి 6న ప్రధాని రాష్ట్రానికి రావాల్సి ఉంది. ఆకస్మికంగా నిర్ణయించిన కార్యక్రమాలతో ప్రధాని తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరిలో ప్రధాని పర్యటన ఉండే అవకాశం ఉంది. తొలుత నిర్ణయించిన ప్రకారం ప్రధాని జనవరి 6న కేరళ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పర్యటించాలన్నది ప్రణాళిక. కేరళ భాజపా వర్గాలు నిర్ణయించిన ప్రకారం తిరువనంతపురంలో జరిగే బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం మోదీ మధ్యాహ్నం నుంచి ఏపీ పర్యటనకు బయలుదేరాల్సి ఉంది. అందుకు అనుగుణంగా గుంటూరు నగరంలో బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగాయి. అయితే ఆకస్మికంగా నిర్ణయించిన కార్యక్రమాలతో మోదీ పర్యటన వాయిదా పడింది.

vizag 28122018 2

అయితే జనవరి లేదా ఫిబ్రవరిలో మోడీ ఏపికి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఫిబ్రవరిలో మొదటి తారీఖు నుంచే బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. అవే చివరి సమావేశాలు. అవి 10 రోజుల దాకా ఉండే అవకాసం ఉంది. ఇవి అయిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నారు. ఇక ఈ హడావిడిలో పడిపొతే, ఏపి వైపు చూసే అవకాశమే లేదు. ఎందుకంటే ఏపిలో బీజేపీ ఒక్క ఎంపీ స్థానంలో కూడా డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. తనకు బలం ఉన్న చోట, హోరా హూరీ ఉన్న చోటే ప్రచారానికే వెళ్తారు. అందుకనే ఇక ఏపిలో మోడీ పర్యటన ఉండే అవకాశాలు లేవని చెప్తున్నారు. మోడీ బదులు, ఒకటి రెండు సార్లు, అమిత్ షా పర్యటన చేసే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. ఎన్నికల ప్రచారంలో కూడా మోడీ ఏపికి వచ్చే అవకాశాలు చాలా తక్కువ.

vizag 28122018 2

ఏ హామీ నెరవేర్చకుండా, ఏపి వస్తే, ఏమి చెయ్యలేమని అర్ధమయ్యే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ముందుగా, జనవరి 6న కడప స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ ప్రకటన ఉంటుందనే లీక్లు ఇచ్చారు. ప్రధాని స్వయంగా ఈ ప్రకటన చేస్తారని బీజేపీ నాయకులు అన్నారు. అయితే, ఇవి ప్రకటన చెయ్యాలంటే, ఇంకా అధ్యయనం చెయ్యాలని కేంద్రం చెప్పటంతో, ఈ ప్రకటన లేదని, కేవలం చంద్రబాబు పై విమర్శలకు అయితే, మీటింగ్ అనవసరం అని బీజేపీ నాయకులు నిర్ణయం తీసుకుని ఉండచ్చు. వారం నుంచి తెగ హడావిడి చేసిన బీజేపీ నాయకులు, ఈ పరిణామంతో షాక్ అయ్యారు. మోడీ నెలాఖరుకి వస్తారని, ఈ లోపు ఏపికి ఇచ్చిన అన్ని హామీలు నేరవేరుస్తారని, పాత పాటే పాడారు.

Advertisements

Latest Articles

Most Read