కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నిర్మిస్తున్న ‘గ్రీన్‌ఫీల్డ్‌’ విమానాశ్రయం పనులు తుదిదశకు చేరాయి. వచ్చే ఏడాది జనవరి 7న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా దీనిని ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ప్రస్తుతం చకచకా జరుగుతున్నాయి. ఈ నెల 31న ప్రయోగాత్మక పనితీరు(ట్రయిల్‌ రన్‌) నిర్వహించనున్నారు. దీనికి అనుగుణంగా విమానం దిగేందుకు, ఎగిరేందుకు రంగం సిద్ధం చేశారు. ట్రయిల్‌రన్‌ను రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌, ఏపీఏడీసీఎల్‌ ఎండీ వీరేంద్రసింగ్‌ త్వరలో పరిశీలించనున్నారు. ఇప్పటికే రన్‌వే, ఆప్రాన్‌లను రంగులతో సుందరంగా తీర్చిద్దారు.

kurnool 29122018 2

ఓర్వకల్లు గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు.దేశీయ విమానసేవల్లో భాగంగా ఓర్వకల్లు నుంచి విజయవాడ, చెన్త్నె, బెంగళూరుకు సర్వీసులు తిరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రభుత్వం నాంది పలికింది. రాష్ట్ర రాజధాని అమరావతికి వాయు మార్గంలో చేరుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఏటీసీ కేంద్రం పనులు ముగిసిన తర్వాత డిసెంబరు ఆఖరు లోగా ఓర్వకల్లు నుంచి ఏప్రిల్‌ నెలలో, విజయవాడ, చెన్నైలకు విమానాలు తిరిగేలా చర్యలు తీసుకుంటున్నారు..

kurnool 29122018 3

కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలో గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం నిర్మాణానికి చంద్రబాబు జూన్ 2017లో శంకుస్థాపన చేశారు. ఈ విమానాశ్రయంతో కర్నూలు జిల్లా నుంచి వివిధ నగరాలకు విమానం ద్వారా వెళ్లే వెసులుబాటు ఉంటుందన్నారు. ఓర్వకల్లులో ఏర్పాటు చేస్తోన్న గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం మూడు విభాగాలుగా ఉంటుందని అధికారులు తెలిపారు. మొదటి విభాగంలో ఎనిమిది విమానాలను నిలుపుకొనేందుకు అవకాశం ఉంటుంది. మరో విభాగంలో మూడు విమానాలు, ఇంకో విభాగంలో మరమ్మతులకు గురైన విమానాలు ఆపేందుకు అవకాశం ఉంటుంది. విమాన రాకపోకలు పెరిగాక మరో విభాగం ఏర్పాటు చేయనున్నారు.

ప్రధాని మోదీ పర్యటన వాయిదా పడింది. ‘అనుకోకుండా వచ్చిన ముఖ్యమైన కార్యక్రమాల వల్లే రాష్ట్ర పర్యటనకు మోదీ రాలేకపోతున్నారు’ అని చెబుతున్నప్పటికీ... ఆయన తిరిగి ఎప్పుడు సీమాంధ్రకు వస్తారు, ఇప్పుడు పర్యటన వాయిదాకు కారణమేమిటో బీజేపీ రాష్ట్ర నేతలెవరూ అధికారికంగా చెప్పడంలేదు. ప్రస్తుతానికి ఆయన కార్యక్రమం రద్దయినట్లేనని, ఎన్నికల ప్రచారానికిగానీ రాష్ట్రానికి వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. ఎందుకు రద్దు అయ్యింది, కారణం ఏంటి అని మీడియా అడిగితే, సమాధానం లేదు. ముందుగా ఖరారైన కార్యక్రమం ప్రకారం జనవరి 6న గుంటూరులో మోదీ బహిరంగ సభ జరగాల్సి ఉంది. టీడీపీతో కటీఫ్‌, కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వ యుద్ధం నేపథ్యంలో... ప్రధాని సభను బీజేపీ నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.

modi 29122018 2

‘రాష్ట్రానికి మేం ఏం చేశామో మోదీ చెబుతారు. ఆ తర్వాత రాష్ట్రంలో పరిస్థితి మారిపోతుంది’ అని కూడా తెలిపారు. మరోవైపు... మోదీ పర్యటనపై అధికార టీడీపీ, ఇతర పార్టీలు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. మోదీ క్షమాపణ చెప్పాకే రావాలనే డిమాండ్లు మొదలయ్యాయి. ‘‘రాష్ట్రానికి తీరని అన్యాయంచేసి.. చచ్చామో బతికామో చూసేందుకు వస్తున్నారా?’’ అని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణులు, వామపక్షాలు, ప్రజా సంఘాలు నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యాయి. పరిస్థితులపై కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీశాయి. భద్రతపై రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను ఆరా తీసినట్లు తెలిసింది.

modi 29122018 3

భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదని, అయితే సభా ప్రాంగణంలో ప్రత్యేక హోదా కోసమో, ప్రధానికి వ్యతిరేకంగానో నినాదాలు చేసే అవకాశం ఉందని వారు చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇతర మార్గాల్లో నిఘా వర్గాలు ధ్రువీకరించుకున్నాయి. మొత్తానికి... వాతావరణం అనుకూలంగా లేదని, బహిరంగ సభలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యే అవకాశముందని ప్రధాని కార్యాలయానికి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి మోదీ ఆంధ్రకు వెళ్లకుండా ఉంటేనే మంచిదన్న నిర్ణయానికి కేంద్ర పెద్దలు వచ్చారు. కాగా ప్రధాని మోదీ పర్యటన వాయిదా పడిందని, ఎప్పుడు జరిగేదీ త్వరలో ప్రకటిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గుంటూరులో చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి ప్రత్యెక స్థానం ఉండనే చెప్పాలి. అయితే ఆయన 2014 ఎన్నికల నాటి నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన భార్య పురంధేశ్వరి మాత్రం, బీజేపీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇద ఇలా ఉంటే గత కొంతకాలం నుంచి దగ్గుబాటి కుటుంబ వారుసుడిగా హితేష్‌ చెంచురామ్‌ని పోటీలో దించే విషయం పై వెంకటేశ్వరరావు ప్రయత్నం చేస్తున్నారన్న వార్తలు విన్పిస్తున్నాయి. వైసీపీ అగ్రనాయకులలో కొందరు ఆయనను కలిసి పార్టీలో చేరమని పర్చూరు నుంచి ఆయన కుమారుడిని పోటీలో దించమని కోరారు. దగ్గుబాటి అంగీకరిస్తే ఆయన సతీమణి పురంధేశ్వరికి లోక్‌సభకు పోటీచేసే అవకాశం కూడా ఇస్తామని సూచించారు. అయితే ఈ ప్రతిపాదనపై ప్రారంభంలో సానుకూలత చూపని దగ్గుబాటి ప్రస్తుతం తాజా రాజకీయ పరిస్థితులపై నిశిత పరిశీలన ప్రారంభించారు.

daggubaati 28122018 1

రెండేళ్ల క్రితం ఆయన కుమారుడు హితేష్‌ చెంచురామ్‌ నిర్వహణలో నడిచే విధంగా చీరాల సముద్ర తీరంలో ఆక్వా ప్రాసెసింగ్‌ యూనిట్‌ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి దగ్గుబాటి నియోజకవర్గంకు రాకపోకలను భారీగా పెంచారు. తనకు ఆహ్వానం అందిన ప్రతి చిన్న కార్యక్రమానికి హాజరవటం ప్రారంభించారు. ఆయన కుమారుడు వ్యాపారపరమైన పనుల పేరుతో రాకపోకలు సాగిస్తున్నారు. దీనికి తోడు టీడీపీలో లోకేష్‌ పాత్ర పెరిగిన తర్వాత దగ్గుబాటి హితేష్‌కి లోకే్‌షతో సాన్నిహిత్యం ఉన్నందున టీడీపీకి చేరువ కావచ్చని భావించారు. అయితే బీజేపీలో క్రియాశీల పాత్ర పోషిస్తూ పురంధేశ్వరి టీడీపీపైన, ప్రత్యేకించి చంద్రబాబుపైన విమర్శల దాడి పెంచటం, మరో పక్క దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా చంద్రబాబు పాలనపై మాటల్లోను, సోషల్‌ మీడియాలోను వ్యతిరేకతను ప్రదర్శించారు. కొంతకాలం నుంచి వైసీపీ అగ్రనాయకులు ఒకరిద్దరు దగ్గుబాటికి టచ్‌లోకి వెళ్లటంతో తిరిగి రాజకీయంగా ముందుకొస్తే వైసీపీలోనే చేరతారన్న ప్రచారం జరుగుతోంది. తొలుత జిల్లాకు చెందిన మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మరికొందరు దగ్గుబాటిని కలిసి పార్టీలో చేరమని ఆహ్వానించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆయనకు టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు.

daggubaati 28122018 1

అయితే ఇదే సమయంలో, రెండు రోజుల నుంచి ఫోన్‌లో జరుగుతున్న ఒక సర్వే నియోజకవర్గ రాజకీయ వర్గాలలో కలకలాన్ని సృష్టిస్తోంది. పర్చూరు నియోజకవర్గ వైసీపీ శ్రేణులకు, నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుందన్న ప్రశ్నను వేస్తున్నారు. గొట్టిపాటి భరత్‌, దగ్గుబాటి హితేష్‌ చెంచురామ్‌లలో ఎవరు ధీటైన అభ్యర్థి అని ఆ ఫోన్‌ వాయిస్‌లో అడగటం విశేషం. అలా నియోజకవర్గంలోని పలువురు వైసీపీ శ్రేణులకు ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. అయితే అందులో ప్రస్తుత పార్టీ సమన్వయకర్త రంగనాథబాబు పేరు లేకపోవటం విశేషం. వైసీపీలో ఇలాంటి సంప్రదాయం లేదని కూడా అంటున్నారు. దీంతో ఆ సర్వేపై పలురకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దగ్గుబాటి వైపు నుంచే ఈ సర్వే జరుగుతుందనే ప్రచారం కూడా జరుగుతుంది. కుమారుడిని వైసీపీలోకి పంపించాలాని, దాదపుగా నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది. source:andhrajyothy

కొన్ని రోజుల క్రితం అనంతపురంలో జరిగిన ఘటనలో, సీనియర్‌ నేత, ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డికి మీసం తిప్పి మరీ సవాల్‌ విసిరి వార్తల్లోకి వచ్చిన అనంతపురం జిల్లా కదిరి అర్బన్‌ సీఐ గోరంట్ల మాధవ్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు తెలిసింది. త్వరలో ఆయన వైసీపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. శుక్రవారం రాత్రి తన రాజీనామా లేఖను కదిరి డీఎస్పీ లక్ష్మికి అందించినట్లు సమాచారం! 22 ఏళ్లుగా పోలీసు శాఖలో ఉన్న మాధవ్‌కు దూకుడు ఎక్కువనే పేరుంది. పోలీసు అధికారుల సంఘం నాయకుడిగా.. జేసీ దివాకర్‌ రెడ్డికి సవాలు విసిరి మరోమారు వార్తల్లోకి వచ్చారు. హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా అవకాశం ఇస్తామన్న హామీ మేరకే.. ఆయన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

diwakar 29122018 1

ఈ మధ్యనే తాడిపత్రిలో ప్రబోధానంద స్వామి ఆశ్రమం వద్ద గొడవలు జరిగిన సంగతి తెలిసిందే! ఈ సమయంలో పోలీసులను ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి దూషించారు. దీంతో మాధవ్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. పోలీసు అధికారుల సంఘం కార్యదర్శిగా ఉన్న మాధవ్ "తమ మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడితే నాలుక కోస్తాను'' అని నేతలను హెచ్చరిస్తూ మీసం మెలేశారు. మాధవ్‌ తీరుపై జేసీ స్పందించారు. "ఒక సీనియర్‌ పొలిటీషియన్‌, పైగా ఎంపీ అయిన తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మాధవ్‌పై చర్యలు తీసుకోవాలి'' అని తాడిపత్రి పోలీసులకు ఫిర్యాదుచేశారు. అయితే కేసు నమోదుకు పోలీసులు తిరస్కరించారు.

diwakar 29122018 1

ఈ నేపథ్యంలో హైకోర్టులో ఎంపీ దివాకర్‌రెడ్డి పిటిషన్ దాఖలుచేశారు. పార్లమెంట్‌కు కూడా ఫిర్యాదుచేశారు. ఈ అంశంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. మరోవైపు మాధవ్‌ వ్యవహారంపై 20 రోజుల్లోగా తమ అభిప్రాయం చెప్పమని పోలీసు ఉన్నతాధికారులను హైకోర్టు ఆదేశించింది. మాధవ్ కూడా ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై వ్యక్తిగతంగా కేసు వేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపధ్యంలోనే, మాధవ్ తన పదవికి రాజీనామా చేసి, వైసిపీ లాంటి పార్టీ అండ ఉంటే, ఇంకా జేసి పై రేచ్చిపోవచ్చని, ఈ నిర్ణయం తీసుకునట్టు తెలుస్తుంది. మరో పక్క జేసి వర్గం మాత్రం, మరోలా స్పందించింది. ఆయన పోలీస్ కాబట్టి, ఎంపీ పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా, న్యాయ పరంగా ఎదురుకుంటున్నారని, ఇప్పుడు ఉద్యోగానికి రాజీనామా చేసి, రాజకీయంగా వస్తే మాకు చాలా మంచి చేసిన వారవుతారని, డైరెక్ట్ గా తెల్చుకోవచ్చని అంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read