ఏపికి లక్షల లక్షల కోట్లు ఇచ్చాం, మీరు బ్రతుకుతుందే, మా బిక్షతో అని ఫేక్ ప్రాపగాండా చెయ్యటం కోసం, ప్రధాని మోడీ వచ్చే నెలలో గుంటూరుకు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే నరేంద్ర మోదీ జవనరి నెల 6వ తేదీ గుంటూరు పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. షడ్యుల్ లో నిర్ణయించిన ప్రకారం మోడీ, జనవరి 6న కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటన ఉంది. అయితే మోడీ కేరళ పర్యటన పై సందిగ్ధం ఉండటంతో, గుంటూరు పర్యటనా కూడా వాయిదా పడే అవకాసం ఉంది. ఈ విషయం పై ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ముందుగా అనుకున్న ప్రకారం, కేరళ బీజేపీ వర్గాలు నిర్ణయించిన ప్రకారం తిరువనంతపురంలో జరిగే బహిరంగ సభలో పాల్గుని, మధ్యాహ్నం నుంచి గుంటూరు పర్యటనకు మోడీ బయలుదేరాల్సి ఉంది. దీనికి తగ్గట్టుగా, గుంటూరు నగరంలో బహిరంగ సభ నిర్వహణకు బీజేపీ నేతలు, ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నారు.
అయితే ఇప్పుడు కేరళ బీజేపీ నేతలు, సభా వేదికను తిరువనంతపురంలో కాకుండా శబరిమలై సమీపంలోని పట్టణంతిట్టకు మార్చాలని, కేరళ బీజేపీ వర్గాలు బీజేపీ అధిష్టానం పై ఒత్తిడి తెస్తున్నాయి. ప్రధాని సభ తిరువనంతపురంలో కాకుండా పట్టణంతిట్టలో జరిగితే మోదీ సకాలంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోలేరని, జనవరి 6న గుంటూరులో జరగాల్సిన సభ వాయిదా పడక తప్పదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేరళ సభ నిర్వహణ ప్రాంతం పై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా ప్రధాని పర్యటన పై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.
మరోవైపు పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జనవరి 12, 13 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించాలని బీజేపీ అధిష్టానం తొలుత నిర్ణయించింది. సంక్రాంతి పండుగ దృష్ట్యా ఈ సమావేశాలను ముందుకు జరపాలనే తర్జనభర్జనలు పార్టీలో సాగుతున్నాయి. ఈ ప్రభావం కూడా సభ వాయిదాకు దారి తీయవచ్చునని పార్టీ వర్గాలు తెలిపాయి. కేరళలో మోదీ సభను శబరిమలై సమీపంలోని పట్టణంతిట్టకు మార్చాలని ఆ రాష్ట్ర కమలనాథులు కోరుకుంటున్నారు. ఎందుకంటే శబరిమలై ఆలయానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆ ప్రాంతంలో నిరసనలు తీవ్రంగా జరుగుతున్నాయి. వీటితో తమకు ఆ ప్రాంతంలో సానుకూల వాతావరణం ఉందని కేరళ బీజేపీ భావిస్తోంది. ఇలాంటి సందర్భంగా అక్కడ మోదీ సభ జరిగితే తమకు అడ్వాంటేజ్ అవుతుందని భావిస్తున్నారు.