తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, ఈ రోజు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం తరువాత, ఆయన మీడియాతో మాట్లాడారు. తుఫానుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు. నిన్న రాత్రే టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుతో ముందస్తు చర్యలపై చర్చించామన్నారు. అధికారులందర్నీ అప్రమత్తం చేశారని.. అన్ని చోట్లా హైఅలర్ట్ ప్రకటించని గవర్నర్ చెప్పుకొచ్చారు. తుపాను ఏర్పాట్లు చంద్రబాబు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారన్నారు. మరో పక్క పెథాయ్ గడగడలాడిస్తోంది. సుడులు తిరుగుతూ గంటకు 28 కిమీ వేగంతో తీరంవైపు దూసుకొస్తోంది. శ్రీహరికోటకు తూర్పున 280 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుఫాను,
17వ తేదీ సాయంత్రానికి కాకినాడ నుంచి తుని మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నాయి.
గత యాభైఏళ్లలో డిసెంబర్ నెలలో కోనసీమను తుఫాన్ ప్రభావం లేదు. అంతకుముందు కోనసీమను అతలాకుతలం చేసిన తుఫాన్ దృష్ట్యా కాకినాడ వద్ద తీరం దాటితే పెను ప్రమాదం అవకాశాలు అధికంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీరందాటే సమయంలో పెనుగాలులు, 20 సెమీకంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. సముద్రం అలలు ఆరేడు మీటర్ల ఎత్తున ఎగసిపడనున్నాయంటున్నారు. విశాఖ, ఉభయగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు.
తీరం వెంబడి 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. తుఫాన్ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమైనారు. ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. సహాయ చర్యల కోసం అధికారులు ఫోన్ నెంబర్లను ప్రకటించారు. ఫోన్ నెంబర్లు: మచిలీపట్నం- 08672 252486, గుడివాడ- 08674 243697, ,నూజివీడు- 08656 232717, విజయవాడ- 0866 2574454, అలాగే తూర్పుగోదావరి జిల్లాలో తుఫాన్ సహాయ కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు చేశారు. కలెక్టరేట్- 1800 425 3077, అమలాపురం ఆర్డీవో కార్యాలయం 08856 233208, కాకినాడ ఆర్డీవో ఆఫీసు- 08842 368100 నెంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.