ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి, ఆయన్ను జగన్ తో సమానం చెయ్యాలి, అవినీతి మారక అంటించాలి అనే అతి పెద్ద కుట్ర ఢిల్లీ లెవెల్ లో జరగటం, దానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో పాత్రదారులు మనం రోజు చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు పై విషం చిమ్మటం కోసం పోటీ పడటం, చంద్రబాబు అవినీతి పరుడుగ ముద్ర వెయ్యటానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చెయ్యటం, చివరకు విపి అవ్వటం, ఇదే తంతు... ఇన్ని ఆరోపణలు, ఇంత హంగామా చేసి చివరకు ఒక్క రూపాయి అవినీతి ఇప్పటి వరకు ప్రూవ్ చెయ్యలేదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు, చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు మాట్లడటం, ప్రజల్లో ఏవో అపోహలు కలిగించటం, చెప్పిందే చెప్తే ప్రజలు నిజం అని నమ్ముతారేమో అని ఆశ...
కొన్ని రోజుల క్రిందట, రాజకీయ కక్షతో కొంత మంది, లోకేష్ పై సిబిఐ విచారణ కోరుతూ, హైకోర్ట్ కు వెళ్తే, అక్కడ కోర్ట్ కొట్టేసిన విషయం చూసాం. తరువాత రేవెంత్ రెడ్డి మీద పెట్టి, చంద్రబాబుని ఇరికించే ప్రయత్నం చేసారు. దొంగ ఎకౌంటు నెంబర్లు ఇచ్చి, అక్కడ వేల కోట్లు ఉన్నాయి అంటూ, మీడియాలో లీక్ లకు కారణమైన హైదరాబాద్ లయార్ ఇమ్మనేని రామారావు, ఇప్పుడు అదే స్ట్రాటజీతో చంద్రబాబు మీద పడ్డాడు. చంద్రబాబు, లోకేశ్, బ్రాహ్మణి, భువనేశ్వరిలకు చెందిన 20 కంపెనీల వ్యవహారాలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని, వారి కంపెనీలకు యూఐఎన్ నెంబర్లు కేటాయించాలంటూ హై కోర్ట్ కి వెళ్లారు. అయితే ఈ పిటీషన్ పై కోర్ట్ ఘాటుగా స్పందించింది.
హెరిటేజ్ గ్రూపు కంపెనీలపై పిటిషన్ దాఖలు చేయడంలో మీకేం సంబంధమని పిటిషనర్ అయిన న్యాయవాది ఇమ్మనేని రామారావును శనివారం ఉమ్మడి హైకోర్టు ప్రశ్నించింది. ఈ పిటిషన్ పై విచారించడం వల్ల వ్యక్తిగతంగా ఏం ఉపశమనం కోరుకుంటున్నారంది. ఒకవేళ ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం అయితే దాని కారణాలేమిటో చెప్పి తగిన ఫోరంలో సవాలు చేయవచ్చని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారానికి సంబంధించి తగిన నిర్ణయం చెప్పాలంటూ విచారణను జనవరి 4వ తేదీకి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌లో వ్యక్తిగత ప్రయోజనం ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. లేదని న్యాయవాది సమాధానం చెప్పడంతో మరి రిట్ పిటిషన్ ఎందుకు దాఖలు చేశారంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. ఒకవేళ ప్రజాప్రయోజనం ఉందనుకుంటే తగిన వేదికను ఆశ్రయించవచ్చని, దీనిపై ఓ నిర్ణయానికి రావాలంటూ విచారణను వాయిదా వేశారు.