టెలివిజన్‌, మొబైల్‌ ఎల్‌ఈడీ స్ర్కీన్లు, పరికరాలను తయారు చేసే ప్లాంట్లు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామంటూ ప్రముఖ సంస్థలు ముందుకొచ్చాయి. తిరుపతి ఎలక్ట్రానిక్ హబ్‌లో వీటిని స్థాపిస్తామంటూ ఆయా సంస్థలు తమ ప్రతిపాదనల్లో పేర్కొన్నాయి. ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రఖ్యాతిగాంచిన వోల్టాస్‌ రూ.653 కోట్ల పెట్టుబడితో 1680 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పింది. మరో ప్రముఖ సంస్థ టీటీఈ కూడా రూ.65.03 కోట్లు, ప్యానెల్‌ ఆప్టోడిస్‌ప్లే టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (పీవోటీపీఎల్‌) రూ.1229.34 కోట్లు పెట్టుబడిగా పెడతామని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖకు ప్రతిపాదనలు పంపాయి. వీటికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ (ఎస్‌ఐపీసీ) ఆమోదం తెలియజేసింది. ఈ సంస్థలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలపైనా స్పష్టత ఇచ్చింది. ఎస్‌ఐపీసీ చేసిన సిఫారసులు సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర స్థాయి పారిశ్రామిక ప్రోత్సాహక మండలి(ఎస్‌ఐపీబీ) ఆమోదించింది.

electronics 14122018 1


భారత్‌కు చెందిన ప్రఖ్యాత వోల్టాస్ ఎలక్ట్రానిక్‌ కంపెనీ రేణిగుంట ఈఎంసీ-2లో వంద ఎకరాల విస్తీర్ణంలో రూ.653 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఎయిర్‌ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కూలర్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు తయారు చేస్తున్న ఈ కంపెనీ ఏర్పాటుతో 1,680 మందికి ఉపాధి లభించనుంది. చైనాకు చెందిన అప్టోడిస్ల్పే టెక్నాలజీ ప్రయివేట్‌ లిమిటెడ్‌ (పీవోటీపీఎల్‌) రేణిగుంట ఈఎంఎస్‌ క్లస్టర్‌లో 70 ఎకరాల్లో రూ.308 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. టెలిఫోన్‌, టెలివిజన్‌, మొబైల్‌ ఫోన్‌, రిఫ్రిజిరేటర్‌, వాషింగ్‌ మెషిన్‌, ఎయిర్‌ కండీషనర్లు ఈ సంస్థ తయారు చేయనుంది. ఉపాధి కల్పనపై ఈ కంపెనీ నుంచి ఇంకా స్పష్టత రాలేదు. చైనాకు చెందిన మరో ఎలక్ట్రానిక్‌ కంపెనీ పేనల్‌ ఆప్టోడిస్ల్పే టెక్నాలజీ రేణిగుంటలో 70 ఎకరాల్లో రూ.1,229 కోట్ల పెట్టుబడులతో కంపెనీని ఏర్పాటు చేయనుంది. ఎల్‌సీడీ ప్యానళ్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు తయారు చేసే ఈ కంపెనీ ప్రారంభంతో ప్రత్యక్షంగా 700 మందికి, పరోక్షంగా 1,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నిర్వాహకులు మూడు విడతల్లో ప్రాజెక్టుని పూర్తి చేయనున్నారు.

 

electronics 14122018 1

ముఖ్యమంత్రి సమక్షంలో ఒకటి, రెండు రోజుల్లో నిర్వహించే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో ఈ ప్రతిపాదనలపై చర్చించి తదుపరి నిర్ణయాన్ని తీసుకోనున్నారు. ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల తయారీ కంపెనీల ఏర్పాటుకు తిరుపతి సమీపంలోని రేణిగుంటలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రెండు ఎలక్ట్రానిక్‌ క్లస్టర్లు అభివృద్ధి చేశారు. వీటిలో ఎక్కువగా చైనాకు చెందిన ప్రఖ్యాత ఎలక్ట్రానిక్‌ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఇదే ప్రాంతంలో టెలిఫోన్‌ కమ్యూనికేషన్‌ లిమిటెడ్‌ (టీసీఎల్‌) కంపెనీకి ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేయనున్నారు. ఇప్పుడు మరో మూడు ప్రఖ్యాత కంపెనీలు ఇక్కడే పెట్టుబడులు పెట్టేందుకు తాజాగా పరిశ్రమలశాఖను ఆశ్రయించాయి.

రాష్ట్రానికి మరోసారి తుపాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. తుపానుగా మారి రానున్న 3, 4 రోజుల్లో రాష్ట్రం వైపుగానే వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ అంచనా వేస్తోంది. గురువారం రాత్రి వరకు ఉన్న సమాచారం ప్రకారం వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి గురువారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో మచిలీపట్నానికి 1250 కి.మీ, చెన్నైకి 1080కి.మీ, ట్రింకోమలీ (శ్రీలంక)కి 780కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది తీవ్రంగా మారి శుక్ర, శనివారాల్లో తుపానుగా మారనుందని అంచనా. ఆ తర్వాత 3 రోజుల్లోపు వాయువ్యదిశగా ప్రయాణించి ఆంధ్రప్రదేశ్‌ తీరంవైపుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

cyclone 13122018 2

ఇప్పుడున్న అంచనాల ప్రకారం గంటకు 100కి.మీ నుంచి 120కి.మీ వరకు గాలులు వీచనున్నాయి. పలు అంతర్జాతీయ వాతావరణ వెబ్‌సైట్లు ఇప్పటిదాకా వేస్తున్న అంచనాల ప్రకారం మచిలీపట్నం, అమలాపురం మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉంది. మరో వైపు ఇది ఎక్కడ తీరాన్ని తాకుతుందనేది ఇంకా ఐఎండీ స్పష్టం చేయలేదు. ఈ తీవ్రవాయుగుండం, తుపాను ప్రభావాలతో రాష్ట్రంలో 15వ తేదీ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, 16వ తేదీ ఈ నాలుగు జిల్లాలతో పాటు రాయలసీమలోని చిత్తూరు, కడప జిల్లాల్లో, 17వ తేదీ కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని జిల్లాల్లోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు పలుచోట్ల నమోదవుతాయని హెచ్చరిస్తున్నారు. తుపాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను అప్రమత్తం చేసింది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ దళాలను సిద్ధం చేసింది.

cyclone 13122018 3

ఈ ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠంగా 20 సెం.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఆర్టీజీఎస్‌ తెలియజేసింది. తీసుకోవాల్సిన చర్యలపై శాఖల వారీగా సమాచారం అందించినట్లు విపత్తు నిర్వహణశాఖ కమిషనర్‌ ప్రసన్న వెంకటేశ్‌ తెలిపారు. ఈ నెల 13 నుంచి 16 దాకా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. దక్షిణ కోస్తా తీర ప్రాంత జిల్లాల్లోని మత్స్యకారులు వెళ్లకూడదు. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని అధికారులు సూచనలు చేశారు. తుపాను వచ్చే జిల్లాల్లో ఎం.ఎల్‌.ఎస్‌. కేంద్రాల వద్ద నిత్యావసర సరుకులను సిద్ధం చేసి ఉంచుతున్నారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే రేషన్‌ డీలర్లు వాటిని తక్షణమే పంపిణీ చేయడానికి వీలుగా చర్యలు చేపట్టారు. విద్యుత్తు వ్యవస్థకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇంధనశాఖ మంత్రి కళా వెంకట్రావు ఆదేశించారు. సరఫరాలో అంతరాయం ఏర్పడితే యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని గురువారం జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులకు సూచించారు.

గత ఆరు నెలల నుంచి, ఒకడి తరువాత ఒకడు, చంద్రబాబు పై విషం చిమ్మటం కోసం పోటీ పడటం, చంద్రబాబు అవినీతి పరుడుగ ముద్ర వెయ్యటానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చెయ్యటం, చివరకు విపి అవ్వటం, ఇదే తంతు... ఇన్ని ఆరోపణలు, ఇంత హంగామా చేసి చివరకు ఒక్క రూపాయి అవినీతి ఇప్పటి వరకు ప్రూవ్ చెయ్యలేదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు, చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు మాట్లడటం, ప్రజల్లో ఏవో అపోహలు కలిగించటం, చెప్పిందే చెప్తే ప్రజలు నిజం అని నమ్ముతారేమో అని ఆశ... మీడియా ముందు చేసారు అంటే అర్ధం ఉంది, చివరకు కోర్ట్ లు దగ్గర కూడా, ఇవే గాల్లో ఆరోపణలు చేస్తే కోర్ట్ లు ఊరుకుంటాయా ?

revanth 14122018 2

కొన్ని రోజుల క్రిందట, రాజకీయ కక్షతో కొంత మంది, లోకేష్ పై సిబిఐ విచారణ కోరుతూ, హైకోర్ట్ కు వెళ్తే, అక్కడ కోర్ట్ కొట్టేసిన విషయం చూసాం. కనీస ఆధారాల్లేకుండా విచారణ ఎలా అని ప్రశ్నించింది. ప్రస్తుతానికి అక్కడ కథ ముగిసింది. అయితే ఇప్పుడు కధ మళ్ళీ మొదలైంది. రేవంత్ రెడ్డి మీద కొన్ని రోజుల క్రితం ఐటి దాడులు జరిగిన విషయం గుర్తుంది కదా, ఆ టైంలో దొంగ ఎకౌంటు నెంబర్లు ఇచ్చి, అక్కడ వేల కోట్లు ఉన్నాయి అంటూ, మీడియాలో లీక్ లకు కారణమైన హైదరాబాద్ లయార్ ఇమ్మనేని రామారావు, ఇప్పుడు అదే స్ట్రాటజీతో చంద్రబాబు మీద పడ్డాడు. ఈ ఇమ్మనేని రామారావు గురించి, దాదపుగా ఒక 30 కేసుల వరకు, అందులోనూ ఇలా బ్లాక్ మెయిల్ కేసులు ఉన్న విషయం తెలిసిందే.

revanth 14122018 3

అయితే ఇప్పుడు కోర్ట్ కు వెళ్ళే హక్కు ఆసరాగా తీసుకుని, సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన కంపెనీల ఖాతాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ జరిపించాలంటూ తాను ఇచ్చిన ఫిర్యాదుపై రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్వోసీ), తీవ్ర నేరాల పరిశోధన కార్యాలయం చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది ఇమ్మనేని రామారావు ఉమ్మడి హైకోర్టులో గురువారం పిటిషన్‌ దాఖలు చేశారు. చంద్రబాబు, లోకేశ్‌, బ్రాహ్మణి, భువనేశ్వరిలకు చెందిన 20 కంపెనీల వ్యవహారాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ జరిపించాలని, వారి కంపెనీలకు యూఐఎన్‌ నెంబర్లు కేటాయించాలంటూ గత నెల 26న ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ప్రతివాదులుగా కేంద్రం, ఆర్వోసీ, ఎస్‌ఎఫ్‌ఐఓతోపాటు పలు కంపెనీలను, చంద్రబాబును చేర్చారు. అయితే కోర్ట్ ఈ పిటీషన్ స్వీకరిస్తుందా, లేదా అనేది చూడాలి. ఎన్ని సార్లు కోర్ట్ లలో కేసులు వేసినా, ఎన్ని సార్లు కొట్టేసినా, వేరే వేరే రూపాల్లో కేసులు వేసి, హైదరాబాద్ వేదికగా కుట్ర చేస్తున్నారు.

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై భాజపా అగ్ర నాయకద్వయం మాట్లాడకపోవడం ఆ పార్టీ నాయకులను ఆశ్చర్యపరిచింది. గురువారం పార్లమెంటు గ్రంథాలయ భవనంలో జరిగిన ఎంపీల సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ గానీ, అధ్యక్షుడు అమిత్‌ షా గానీ ఎన్నికల అంశాన్ని అసలు ప్రస్తావించలేదు. సుదీర్ఘ ప్రసంగం చేసిన మోదీ అధికభాగం దివంగత అటల్‌ బిహారీ వాజ్‌పేయీకి నివాళులు అర్పించడానికే కేటాయించారు. ఎన్నికల పరాజయంపై ఒక్క మాటైనా మాట్లాడకపోవడం ఆశ్చర్యపరిచిందని పలువురు ఎంపీలు వ్యాఖ్యానించారు. మరో నాలుగు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ప్రస్తుత ఫలితాలపై వ్యాఖ్యానించి విలువైన సూచనలు, సలహాలు ఇస్తారని భావిస్తే అసలు దానిపైన ప్రస్తావనే లేదని అన్నారు. ఏమీ చెప్పకుండా దాటవేతకు కారణం ఏమిటా అని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

amitshah 14122018 2

పార్టీ ప్రధాన కార్యాలయంలో 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల పదాదికారుల సమావేశంలో కూడా అధ్యక్షుడు అమిత్‌ షా ఓటమిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పోలింగ్‌ బూత్‌ స్థాయిలో కార్యక్రమాల నిర్వహణపై సూచనలు ఇచ్చారు. ఓటర్లతో అనుసంధానమయ్యేలా క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఆధునిక సాంకేతిక పరికరాలను అందివ్వాలని సూచించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులతో మాట్లాడి ఓటమిపై నివేదికలు ఇవ్వాలని ఎన్నికలు జరిగిన అయిదు రాష్ట్రాల పార్టీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శులను అమిత్‌ షా కోరినట్టు తెలిసింది. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలో ఓటమికి వేరువేరు కారణాలు ఉన్నాయని, వాటన్నింటినీ ప్రస్తుతం ఈ సమావేశంలో చర్చించడం సరికాదని అన్నట్టు తెలిసింది.

amitshah 14122018 3

అయితే ఈ రోజు మాత్రం, అమిత్ షా ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడుతున్నారు. దీనికి కారణం రాఫల్ పై కోర్ట్ ఇచ్చిన తీర్పు. రఫేల్‌ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని, వీటిపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లను న్యాయస్థానం ఈ రోజు తోసిపుచ్చింది. దేశ భద్రత దృష్ట్యా కొన్ని అంశాల్లో గోప్యత పాటించాల్సి వస్తుందని కోర్టు పేర్కొంది. రఫేల్‌ ఒప్పంద నిర్ణయ విధానం, ధరల వ్యవహారం, అంతర్జాతీయ ఒప్పందం వంటి అంశాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణాలు కన్పించట్లేదని కోర్టు తెలిపింది. అయితే కోర్ట్ తీర్పు ఇచ్చిన వెంటనే అమిత్ షా ప్రెస్ మీట్ పెట్టి రాహుల్ గాంధిని తిట్టారు. అయితే 5 రాష్ట్రాల్లో ఓటమికి బాధ్యత తీసుకొని పార్టీ అధ్యక్షుడు, కోర్ట్ తీర్పు పై వెంటనే ప్రెస్ మీట్ పెట్టటం విశేషం.

Advertisements

Latest Articles

Most Read