పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పై అటు కేంద్రంతో పాటు ఇటు ప్రకృతి కూడా ఇబ్బంది పెడుతుంది. గత అక్టోబరు వరకు వరద ప్రవాహం కారణంగా పనులు చేయలేకపోయారు. ఇప్పుడు రికార్డు స్థాయిలో కాంక్రీటు పనులు చేస్తూ ‘రికార్డు’ కాలంలో ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ప్రయత్నాలకు తుఫాను అడ్డంకిగా నిలిచింది. నవయుగ ఇంజనీరింగ్‌ సంస్థ.. ఈ నెల 16న(ఆదివారం) స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌, లెఫ్ట్‌ ఫ్లాంక్‌ కాంక్రీటు పనులు ప్రారంభించి 24 గంటల్లో 28 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు వేయాలని నిర్ణయించిం ది. ఈ దిశగా ఇప్పటిదాకా దుబాయ్‌ పేరిట ఉన్న గిన్నిస్‌ రికార్డును బద్దలు కొట్టాలని సంకల్పించింది. మర్నాడు అంటే 17న ప్రాజెక్టు రేడియల్‌ గేట్ల బిగింపునకు ముహూర్తం కూడా నిర్ణయమైంది.

polavaram 15122018

కాంక్రీటు పనుల్లో రికార్డు సృష్టించనున్నందున ఈ రెండు కార్యక్రమాలకు ముక్తాయింపుగా ప్రాజెక్టు ప్రాంతంలో 17న బహిరంగ సభ ఏర్పాటు చేసి.. సీఎం చంద్రబాబును ముఖ్య అతిథిగా పిలవాలని జలవనరుల శాఖ నిర్ణయించింది. కానీ అందరి ఆశలపై ‘పెథాయ్‌’ తుఫాను నీళ్లు చల్లింది. తుఫాను కారణంగా ఆదివారం చేపట్టాల్సిన కాంక్రీటు పనులు వాయిదా పడ్డాయి. ఇప్పటికే ఈ పనుల పర్యవేక్షణ కోసం గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ నమోదు ప్రతినిధులనూ.. కేంద్ర జల వనరుల శాఖ అధికారులనూ.. రాష్ట్ర యంత్రాంగాన్ని నవయుగ సంస్థ అప్రమత్తం చేసింది. వాస్తవ పరిస్థితిని నవయుగ ఎండీ శ్రీధర్‌ శుక్రవారం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. వాతావరణం సహకరించనప్పుడు ఏం చేస్తామని సీఎం వ్యాఖ్యానించారు. నెలాఖరులో గానీ, జనవరిలో గానీ కార్యక్రమం చేపట్టాలన్నారు.

polavaram 15122018

ఈ ఏడాది జూన్‌-జూలైలో ఒకసారి అనధికారికంగా రికార్డు స్థాయిలో కాంక్రీటు పనులు చేపట్టేందుకు నవయుగ సిద్ధపడింది. ఆరోజు 11,650 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు వేశాక.. భారీ వర్షంతో పనులు నిలిచిపోయిన ఘటన సీఎంతో చర్చ సందర్భంగా చర్చకు వచ్చింది. తుఫాన్‌ నేపథ్యంలో సచివాలయ టవర్ల కోసం ఈ నెల 19న చేపట్టే భారీ ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు కురిస్తే పనులు ఆపక తప్పదని అధికారులు, నిపుణులు అనుకుంటున్నారు. ఒకసారి గనుక ర్యాఫ్ట్‌ పనులు మొదలు పెడితే 3 రోజులపాటు ఆపకుండా సాగించాలి. కాబట్టి తుఫాన్‌ ముప్పు పూర్తిగా తొలగే వరకూ వాటిని ప్రారంభించకపోవడమే మంచిదని భావిస్తున్నారు.

రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్ష కార్యరూపం దాల్చబోతోంది. కడప ఉక్కు పరిశ్రమ గురించి కేంద్రాన్ని అడిగి అడిగి విసిగిపోయి, రాష్ట్రంపై కక్షగట్టిన కేంద్రాన్ని కదిలించేందుకు నిరాహార దీక్షలు చేసి పోరాడినా ఫలితం లేక చివరికి ముఖ్యమంత్రే మూడు ప్రత్యామ్నాయ మార్గాలను కేంద్రం ముందుంచారు. అయినా కేంద్రం స్పందించలేదు. అలాగని ప్రజల ప్రయోజనాలను, మనోభావాలను పక్కన పెట్టలేక... క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో సైతం కడప జిల్లాలో వంద శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఉక్కుపరిశ్రమను ఏర్పాటు చేయాలనుకున్నారు చంద్రబాబు.

rayalseema 14122018 2

మైలవరం మండలంలోని ఎం.కంబలదిన్నె గ్రామం వద్ద 3,147 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఈ పరిశ్రమకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే రెండు ప్రత్యేక ఎస్‌పీవీలను ఏర్పాటుచేసింది. ఈ ఉక్కుపరిశ్రమకు డిసెంబరు 27న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు గనుల శాఖ కార్యదర్శి బి.శ్రీధర్‌ అధికారికంగా ఉత్తర్వులు జారీచేశారు. మైలవరం మండలంలోని ఎం.కంబలదిన్నె గ్రామంలో పరిశ్రమను నెలకొల్పనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే రెండు ఎస్‌పీవీలను ఏర్పాటుచేసింది.

rayalseema 14122018 3

ఉక్కు పరిశ్రమ ఎస్‌పీవీ వాటిలో మొదటిది. రాయలసీమ ఉక్కు సంస్థ లిమిటెడ్‌, ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో మరో మైనింగ్‌ ఎస్‌పీవీని ఏర్పాటుచేశారు. ఇది పరిశ్రమకు ఇనుప ఖనిజాన్ని సరఫరా చేస్తుంది. రాయలసీమ ఉక్కు సంస్థకు ఛైర్మన్‌, ఎండీగా పి.మధుసూదన్‌ను నియమించింది. బోర్డు ఆఫ్‌ డైరెక్టర్స్‌ నియామకం, మూలధనం కింద రూ.2కోట్లు విలువ చేసే 20లక్షల షేర్లను ఒక్కొక్కటి రూ.10 చొప్పున కేటాయించే ప్రక్రియలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తిచేసింది.

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముఖ్య ఘట్టం ఆవిష్కృతమవుతోంది. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌(పునాది)ని కాంక్రీటుతో నింపే బృహత్తర కార్యక్రమాన్ని ఈ నెల 19న ప్రారంభించనున్నారు. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల్ని ఐదు టవర్లుగా నిర్మిస్తుండగా.. వాటిలో రెండో టవర్‌ పునాదిని కాంక్రీటుతో నింపే ప్రక్రియను ఇపుడు ప్రారంభిస్తారు. మూడున్నర రోజులపాటు ఏకబిగిన ఈ కార్యక్రమం భారీ క్రతువులా కొనసాగనుంది. వందలాది ఇంజినీర్లు, కార్మికులతో పాటు భారీసంఖ్యలో వాహనాలు, యంత్రాల్ని వినియోగించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. మూడో టవర్‌కి 22న, సీఎం కార్యాలయం ఉండే ఐదో టవర్‌కి 24న పునాదుల్లో కాంక్రీటు నింపే ప్రక్రియను మొదలుపెట్టనున్నారు.

raft 14122018 2

కొద్ది రోజుల వ్యవధిలో మిగతా రెండు టవర్లకూ ఆ పనులు పూర్తిచేస్తారు. కీలక ఘట్టాన్ని ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తిచేసేందుకు సీఆర్‌డీఏ అన్ని సన్నాహాలూ చేస్తోంది. వీటిలో ముఖ్యమంత్రి కార్యాలయ భవనం ఉండే టవర్‌ని 50, మిగతా నాలుగు టవర్లను 40 అంతస్తులుగా నిర్మిస్తున్నారు. ఈ భవనాలకు పునాదుల నిర్మాణమే అనేక విశేషాల సమాహారం. ప్రతి టవర్‌కి సుమారు 12వేల ఘ.మీ.ల కాంక్రీటు వేయాల్సి ఉంటుంది. ‘ఎం45’ టెంపరేచర్‌ కంట్రోల్డ్‌ కాంక్రీటు వినియోగిస్తారు. ఎం45 కాంక్రీటు బలాన్ని తెలియజేస్తుంది. సాధారణ నిర్మాణాల్లో ఎం30 కాంక్రీటు వినియోగిస్తారు

raft 14122018 3

ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ పనుల్ని క్రతువులా కొనసాగించాల్సి ఉంటుంది. ఒక్కసారి కాంక్రీటు వేయడం ప్రారంభించాక నిరంతరాయంగా పూర్తిచేయాల్సిందే. సచివాలయ భవనాల ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌కు ఒక్కో టవర్‌కి 84 గంటల సమయం పడుతుందని భావిస్తున్నారు. ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ అంటే.. నేల స్వభావం, భవన పరిమాణాల దృష్ట్యా ఎలాంటి పునాది వేయాలో నిర్ణయిస్తారు. రాజధానిలో ఇప్పటి వరకు చేసిన నిర్మాణాలకు పైల్‌ ఫౌండేషన్‌ విధానం అనుసరించగా, సచివాలయ భవనాలకు ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ వేస్తున్నారు. ఈ విధానంలో నేలలో అవసరమైనంత లోతు తవ్వి.. అక్కడి నుంచి భారీ కాంక్రీటు దిమ్మను నిర్మిస్తారు. దానిపై భవన నిర్మాణం జరుగుతుంది. ఆ కాంక్రీటు దిమ్మనే ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌గా పిలుస్తారు.

విజయవాడ నుంచి సింగపూర్‌ నూతన సర్వీసు మొదలు పెట్టిన వేళ, మొదట్లో ఎదో రెస్పాన్స్ ఉంటుంది, తరువాత ఉండదు అని అధికారులు అనుకున్నారు. కాని సింగపూర్‌ నూతన సర్వీసుకు అనూహ్య స్పందన లభిస్తోంది. రెండువారాల్లో సింగపూర్‌ నుంచి సగటున 170మంది వరకు ఇక్కడికి వస్తున్నారు. విజయవాడ నుంచి సింగపూర్‌కు వెళ్ళే వారు సగటున 70 మంది ఉంటున్నారు. ఈ నెంబర్లు చూసి, అధికారులే షాక్ అవుతున్నారు. ఇంత రెస్పాన్స్ అసలు ఊహించాలేదని చెప్తున్నారు. సర్వీస్ మొదలు పెట్టిన కొత్తలో, సహజంగా ఉంటారు అనుకున్నామని, కాని రెండు వారలైన, అదే ఫ్లో ఉందని అంటున్నారు. రెండువారాల కిందట ప్రారంభించిన సింగపూర్‌ సర్వీసు దుమ్ము రేపడంతో విజయవాడలో వీసాకేంద్రం ఏర్పాటుకు సింగపూర్‌ కాన్సులేట్‌ ఆసక్తి చూపుతోంది. అతి త్వరలో వీసాకేంద్రం బెజవాడలో కొలువు తీరబోతోంది.

singapore 1412208 2

వీసాకోసం వీరు అటు బెంగళూరుకు కానీ, ఇటు హైదరాబాదుకు కానీ వెళ్లాల్సి వస్తోంది. స్థానికంగానే వీసా కేంద్ర ఏర్పాటు చేస్తే విజయవాడ నుంచి వెళ్లే ప్రయాణీకుల సంఖ్య మరింత పెరుగుతుందని ఏపీ ప్రభుత్వం భావించింది. దీనితో రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ(ఏపీ ఏడీసీఎల్‌), సింగపూర్‌ కాన్సులేట్‌తో చర్చలు మొదలు పెట్టింది. దీనిపై సింగపూర్‌ కాన్సులేట్‌ కూడా సానుకూలంగా స్పందించింది. ఇదే జరిగితే అంతర్జాతీయ రాకపోకలు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. ప్రభుత్వం ఇంత ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వటంతో, ప్రయాణీకులు కూడా సంతోషిస్తున్నారు. ఇక్కడే వీసా వచ్చేస్తే అంతకంటే, ఏమి కావాలని అంటున్నారు. సింగపూర్‌ కాన్సులేట్‌ చూపిన ఆసక్తివల్ల విజయవాడ నుంచి విదేశీయానానికి మరింత ఊపు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కృషికి ఇదే నిదర్శనం.

singapore 1412208 32

విజయవాడలో రెండువారాల కిందట సింగపూర్‌కు విదేశీయానం ప్రారంభమైంది. తొలి అంతర్జాతీయ సర్వీసుగా సింగపూర్‌కు ఇండిగో విమానం నడుస్తోంది. వారంలో మంగళ, గురు రెండురోజుల పాటు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. సింగపూర్‌ సర్వీసుకు రాష్ట్రప్రభుత్వం వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌) ప్రాతిపదికన ఇండిగో సంస్థకు బ్రేక్‌ఈవెన్‌ ఇవ్వటానికి కూడా చొరవతీసుకుంది. ఫలితంగా మార్గం సుగమం అయింది. విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలు, ఖమ్మం, ప్రకాశం జిల్లాలనుంచి ఐదులక్షల మంది విదేశాలలో ఉంటున్నారు. తరచూ ఇక్కడికి రాకపోకలు ఉంటున్నాయి. ప్రతిఏడాది 30 వేలకు పైగా విద్యార్థులు విద్యనభ్యశించటానికి వెళుతున్నారు. ఉపాధికి వెళ్ళే వారిశాతం కూడా ఎక్కువుగా ఉంటోంది. హైదరాబాద్‌ నుంచి విదేశాలకు వెళ్ళే ప్రతి 100మంది ప్రయాణీకులలో సగటున 46మంది ఈ ప్రాంతం వాళ్ళే ఉంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. సింగపూర్‌ సర్వీసుకు ఆదరణ ఉండటం, రానున్న రోజుల్లో మరింత వృద్ధి నమోదయ్యే అవకాశం ఉండటంతో సింగపూర్‌ కాన్సులేట్‌ నిర్ణయం తీసుకుంది.

Advertisements

Latest Articles

Most Read