సూది నుంచి సీటీ స్కాన్‌ వరకు... వైద్యరంగానికి చెందిన అన్ని రకాల ఉపకరణాల తయారీకి ప్రత్యేకించిన ‘మెడ్‌టెక్‌ జోన్‌’ ప్రారంభమైంది. విశాఖలో ఏర్పాటు చేసిన దేశంలోనే మొట్టమొదటి వైద్య ఉపకరణాల తయారీ సెజ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబేతో కలిసి జాతికి అంకితం చేశారు. ప్రభుత్వ నిధులతో దేశంలో తొలిసారి నిర్మించిన వైద్య పరికరాల పార్క్‌ మెడ్‌టెక్‌ జోన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం జాతికి అంకితం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ సమీపంలోని ప్రగతి మైదాన్‌లో దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. కీలకమైన పలు భవనాలు, పారిశ్రామిక యూనిట్లను ఆయన ప్రారంభించారు. ఇదే ప్రాంగణంలో కలామ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటుచేసిన నాల్గో డబ్ల్యూహెచ్‌వో వైద్య పరికరాల ప్రపంచ సదస్సును కూడా ప్రారంభించారు. మెడ్‌టెక్‌ జోన్‌లో ఏర్పాటు చేసిన వివిధ ల్యాబ్స్‌, సంస్థలను కేంద్ర మంత్రితో కలిసి చంద్రబాబు ప్రారంభించారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న రోబోనిక్‌ ఇండియా, ఫోరస్‌ హెల్త్‌, మాస్‌ మెడ్‌టెక్‌, గ్రీన్‌ ఓషన్‌ రీసెర్చ్‌ ల్యాబ్స్‌, ఫోనిక్స్‌ మెడికల్‌ సిస్టమ్స్‌, రెనాలిక్స్‌ హెల్త్‌ సిస్టమ్స్‌, బయోసైన్స్‌ టెక్నాలజీస్‌, జైనా మెడిటెక్‌ వంటి సంస్థలను కూడా చంద్రబాబు పరిశీలించారు.

amtz 14122018 2

విశాఖ జిల్లాలోని పెదగంట్యాడ మండలం మదీనాబాగ్‌ ప్రాంతంలో 270 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ మెడ్‌టెక్‌ జోన్‌లో ఇప్పటికే రూ.10,000 కోట్ల పెట్టుబడులతో 80 కంపెనీలు ప్రారంభం అయ్యాయి. ఈ జోన్‌లో మొత్తం 250 కంపెనీలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. అవన్నీ ఏర్పాటైతే మొత్తం 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని అంచనా. భారత్‌ ఏటా రూ.30 వేల కోట్ల విలువైన వైద్య పరికరాలను దిగుమతి చేసుకుంటోందని... ఈ నేపథ్యంలో దేశీయ అవసరాలు తీర్చడమే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేసే లక్ష్యంతో మెడ్‌టెక్‌ జోన్‌ను ఏర్పాటు చేసారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా, విశాఖలో ఫర్మా సిటీ పెట్టి, అనేక కంపనీలను తీసుకొచ్చారు. ఇప్పుడు మెడ్ టెక్ జోన్ తో, అనేక వైద్య పరికరాల తయారీ కంపెనీలు రానున్నాయి.

amtz 14122018 3

ప్రపంచ అవసరాల కోసం అత్యాధునిక వైద్య పరికరాలను విశాఖలో తయారుచేసేలా ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ప్రపంచ వైద్యపరికరాల మార్కెట్‌కు విశాఖను కేంద్రం చేయాలని తపిస్తున్నామన్నారు. ప్రపంచ ఆర్థిక ఫోరంతోపాటు మరికొన్ని కీలక సదస్సులకు ఐక్యరాజ్యసమితి విభాగాలు దావోస్‌ను కేంద్రంగా ఎంచుకున్నాయని, ఇదే తరహాలో విశాఖను కూడా కేంద్రంగా ఎంపిక చేసుకోవాలని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధులను ముఖ్యమంత్రి కోరారు. వచ్చే డబ్ల్యూహెచ్‌వో సదస్సునూ విశాఖలోనే నిర్వహించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా వైద్యపరికరాల మార్కెటింగ్‌ 2023కి 409 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని, 2030కి అది 800 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఆసియాలో 17శాతం పురోగతి ఉందని తెలిపారు. జపాన్‌, చైనా, దక్షిణకొరియా తర్వాత భారత్‌లోనే వైద్య పరికరాలకు గిరాకీ ఉందని వెల్లడించారు. అత్యధికంగా మెడికల్‌ ఎలక్ట్రానిక్స్‌, సర్జికల్‌ డివైజెస్‌, ఆసుపత్రి పరికరాలకు 53.7శాతం గిరాకీ ఉందని చెప్పారు. ఇప్పటిదాకా 65-70శాతం వైద్య పరికరాలను విదేశాలనుంచే దిగుమతి చేసుకుంటున్నామన్నారు.

 

కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలో రూ.1500 కోట్లతో భారీ సిమెంట్‌ కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు రామ్‌కో సంస్థ ముందుకు వచ్చింది. కర్మాగారాన్ని తదుపరి దశల్లో పూర్తి స్థాయిలో విస్తరించేందుకు దాదాపు రూ. 3వేల కోట్లతో పెట్టుబడి పెట్టనున్నారు. రామ్‌కో సిమెంట్ ప్లాంటుకు ఈరోజు చంద్రబాబు శంకుస్థాపన చెయ్యనున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ పార్క్ కర్నూలు జిల్లాలో ఏర్పాటైంది. ఇప్పుడు రామ్‌కో వంటి పరిశ్రమల రాకతో కర్నూలు జిల్లా దేశంలో అతి పెద్ద సిమెంట్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా మారిపోతోంది. కర్నూలు జిల్లాలో ఇప్పటికే JSW, SV, మహా సిమెంట్, పాణ్యం, ప్రియా సిమెంట్, పోర్టుల్యాండ్ సిమెంట్ వంటి పరిశ్రమలు ఉన్నాయి. రామ్‌కో ఇప్పుడు వాటికి జతయ్యింది.

ramco 14122018 2

కర్నూలు జిల్లాలో కొత్తగా ఏర్పాటవుతున్న సిమెంట్ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 300 మంది, పరోక్షంగా 1000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. 15 మెగావాట్ల వేస్ట్ హీట్ రికవరీ పవర్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నారు. ఏపీలో 30కి పైగా సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి. ACC, భవ్య సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్, హేమాద్రి సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, JP, KCP, JSW, MY HOME, పెన్నా సిమెంట్ వంటి పరిశ్రమలు ఉన్నాయి. రూ.20,660 కోట్ల పెట్టుబడులు ఈ రంగం నుంచి వున్నాయి. 22,100 మంది ఈ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్నారు.

ramco 14122018 3

కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలో రూ.1500 కోట్లతో రామ్‌కో సిమెంటు పరిశ్రమను త్వరలో నిర్మించనున్నట్లు సంస్థ జనరల్ మేనేజర్ గోపాలకృష్ణ, డిప్యూటీ జనరల్ మేనేజర్ అజ్మల్ తెలిపారు. మొదటి దశలో రూ.1000 కోట్లతో ఫ్యాక్టరీ నిర్మాణం పనులు చేపడుతామన్నారు. అనంతరం రూ.500 కోట్లతో రెండవ దశ విస్తరణ పనులు జరుగుతాయన్నారు. 3.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించేలా ప్లాంటు నిర్మాణం జరుగుతుందని తెలిపారు. పరిశ్రమ పరిసరాల్లోని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. పరిశ్రమ స్థాపన ద్వారా ఇక్కడి వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆయా గ్రామాల్లో సర్పంచులు, యువకులు, మేధావులతో గ్రామాభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసి ఆ గ్రామ కమిటీ సూచన మేరకు రోడ్లు, తాగునీరు, వీధిలైట్లు, విద్యా, వైద్య సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిలయన్స్‌ ఎలక్ట్రానిక్స్ రాకకు రంగం సిద్ధమవుతోంది. తిరుపతి విమానాశ్రయం సమీపంలో 150 ఎకరాల్లో ఈ సెజ్‌ ఏర్పాటు కానుంది. ముకేశ్‌ అంబానీ ఇంట పెళ్లి సందడి ముగియగానే... ‘రిలయన్స్‌’ సంస్థ ఎలక్ట్రానిక్స్ సెజ్‌పై దృష్టి సారించనుంది. జనవరిలోనే ఈ సెజ్‌కు శంకుస్థాపన చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో ముకేశ్‌ అంబానీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ తదితరులు పాల్గొననున్నారు. రిలయన్స్‌ ఎలక్ర్టానిక్స్‌ సిటీ కోసం ప్రభుత్వం 150 ఎకరాలు కేటాయించింది. ఇందులో రిలయన్స్‌ సంస్థ సుమారు రూ.15వేల కోట్ల పెట్టుబడి పెడుతుంది. జియోఫోన్లు, సెట్‌టాప్‌ బాక్స్‌లతో పాటు రోజుకు దాదాపు పది లక్షల ఎలక్ట్రానిక్ వస్తువులు ఇక్కడ తయారవుతాయి.

reliance 13122018

ఈ ఒక్క సెజ్‌లోనే 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గతంలో లోకేశ్‌ ముంబై వెళ్లి ముకేశ్‌ అంబానీని కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ రంగంలో సాధిస్తున్న పురోగతిని వివరించారు. ఈ ప్రతిపాదన పై ముఖేశ్‌ సానుకూలంగా స్పందించారు. విశాఖ భాగస్వామ్య సదస్సులో రిలయన్స్‌తో ఎంవోయూ కూడా కుదిరింది. దీని పై తదుపరి చర్చలు కూడా జరిగాయి. జనవరిలో శంకుస్థాపన చేయాలనే నిర్ణయం జరిగింది. రిలయన్స్‌ ఎలక్ట్రానిక్స్ సెజ్‌ రావడం కీలక పరిణామమని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘‘ఇప్పటికే దేశవ్యాప్తంగా తయారయ్యే ప్రతి వంద సెల్‌ఫోన్లలో 30 మన రాష్ట్రంలోనే తయారవుతున్నాయి. రిలయన్స్‌ క్లస్టర్‌ ప్రారంభించిన తర్వాత ఇది మరింత పెరుగుతుంది’’ అని చెబుతున్నాయి.

 

reliance 13122018

తిరుపతిలో ఎలక్ర్టానిక్‌ సెజ్‌ స్థాపిస్తున్న రిలయన్స్‌ సంస్థ అమరావతిలోనూ పెట్టుబడులు పెట్టనుంది. ఇక్కడ ‘రీసెర్స్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ ఫర్‌ స్టార్ట్‌ప్స’ను ప్రారంభించే అవకాశాలున్నాయి. రిలయన్స్‌ కు సంబంధించిన ఒక ప్రధాన కార్యాలయంగా ఇది రూపొందనుంది. ఈ ప్రతిపాదన ఇంకా తుది రూపానికి రాలేదని... ఎలక్ర్టానిక్స్‌ సెజ్‌ ప్రారంభ సమయానికి ఈ సెంటర్‌పైనా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. మరోవైపు ఏపీఎన్‌ఆర్‌టీ ఆధ్వర్యంలో ఐదు ఐటీ కంపెనీలు అమరావతికి రానున్నాయి. ఇందులో విజయవాడలో రెండు, మంగళగిరిలోని ఐటీ సెజ్‌లో మూడు ప్రారంభంకానున్నాయి. ఇవన్నీ చిన్న స్థాయి కంపెనీలే. అమెరికాలో కంపెనీలను నిర్వహిస్తున్న ప్రవాసాంధ్రులు వాటి శాఖలను ఇక్కడ కూడా ప్రారంభించనున్నారు.

తెలుగుదేశం పార్టీ ఎంపీలు లోక్‌సభలో నిరసన తెలుపుతున్నప్పుడు కొంత గందరగోళ పరిస్థితి తలెత్తింది. సభలో నూతన సభ్యుడు ప్రమాణ స్వీకారం చేయడానికి స్పీకర్‌ పోడియం ముందు ఉంచిన నిలువెత్తు మైక్‌కు ప్లకార్డు తగిలించి ఏలూరు ఎంపీ మాగంటి బాబు పైకెత్తినప్పుడు ఇది చోటు చేసుకుంది. పార్లమెంటు సమావేశాలు ఉదయం మొదలైన వెంటనే ఇటీవల కన్నుమూసిన కన్నడ సినీనటుడు, మాజీ ఎంపీ అంబరీష్‌కు సభ సంతాపం ప్రకటించింది. అనంతరం కర్ణాటకలో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో శివమొగ్గ నుంచి గెలిచిన యడ్యూరప్ప కుమారుడు బీవై రాఘవేంద్ర ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రెండు కార్యక్రమాలు అయిన వెంటనే కాంగ్రెస్‌, ఏఐఏడీఎంకె, తెదేపా సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి తమ డిమాండ్లపై ఆందోళన మొదలుపెట్టారు.

speaker 14122018 2

స్పీకర్‌ స్థానానికి కుడివైపున తెదేపా సభ్యులు ప్లకార్డులు పట్టుకొని ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం హామీలు, ప్రత్యక హోదా, రైల్వేజోన్‌పై నినాదాలు చేస్తూ నిల్చున్నారు. మాగంటి బాబు తన ముందున్న నిలువెత్తు మైకు కేబుళ్లలోకి తెదేపా ప్లకార్డును జొప్పించి.. దాన్ని పైకి ఎత్తి నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఇనుప చువ్వతో బలంగా ఉన్న మైక్‌ను పైకి ఎత్తడంతో ఆయన ఏదైనా చేస్తారేమోనన్న ఆందోళన స్పీకర్‌లో మొదలైంది. వెంటనే దాన్ని పక్కనపెట్టాలని గట్టిగా కోరారు. అప్పటికే సభ్యులంతా బిగ్గరగా నినాదాలు చేస్తుండటంతో స్పీకర్‌ మాటలు మాగంటి బాబుకు వినిపించలేదు.

speaker 14122018 3

ఇంతలో పార్లమెంటు వ్యవహారాల మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌..మాగంటి బాబు దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేసి మైకు కిందపెట్టాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. సిబ్బంది ఆయన చేతుల్లోంచి మైకును లాక్కోడానికి ప్రయత్నించినా వదల్లేదు. దీంతో స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట వినకపోతే సస్పెండ్‌ చేస్తానని హెచ్చరించారు. సభ వాయిదా పడిన వెంటనే స్పీకర్‌ తెదేపా సభ్యులందర్నీ తన ఛాంబర్‌కు పిలిపించుకొని సున్నితంగా మందలించారు. సభ పునఃప్రారంభమైన వెంటనే వెల్‌లోకి వచ్చి ఆందోళన చేస్తున్న పార్టీలకు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ హితబోధ చేశారు. ఆందోళన కొనసాగించడంతో సభను శుక్రవారానికి వాయిదా వేశారు.

Advertisements

Latest Articles

Most Read