రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ వ్యవహారంపై ఈసీ సీరియస్‌ అయ్యింది. ఓవైపు న్యాయస్థానం ఏకంగా డీజీపీ కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. మరోవైపు.. రేవంత్‌ అరెస్ట్‌ను పర్యవేక్షించిన ఎస్పీపై ఎన్నికల కమిషన్‌ వేటు వేసింది. ఆమెను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కూడా ఆదేశించింది. అన్నపూర్ణ స్థానంలో ఐపీఎస్‌ అధికారి అవినాష్‌ మహంతిని వికారాబాద్‌ ఎస్పీగా నియమించారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని ఈసీ ప్రకటించింది. కొడంగల్‌ తాజా మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి అయిన రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ వ్యవహారమే ఎస్పీ అన్నపూర్ణ ఆకస్మిక బదిలీకి కారణమైంది. అర్ధరాత్రి వేళ పోలీసులు ప్రహారీగోడ దూకి మరీ రేవంత్‌రెడ్డి ఇంట్లోకి వెళ్లడం.. తలుపులు పగులగొట్టి నిద్రలో ఉన్న రేవంత్‌రెడ్డిని అరెస్ట్‌ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

vikarabad 05122018

ఈ అరెస్ట్‌ వ్యవహారాన్ని ఎస్పీ అన్నపూర్ణ స్వయంగా పర్యవేక్షించారు. దీంతో.. ఎస్పీ అన్నపూర్ణను పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేయాలని ఈసీ సూచించింది. ఆమెకు ఎటువంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని కూడా ఆదేశించింది. అన్నపూర్ణ స్థానంలో వికారాబాద్‌ ఎస్పీగా నియమితులైన అవినాష్‌ మహంతి ప్రస్తుతం హైదరాబాద్‌ సీసీఎస్‌ డీసీపీగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు అందగానే.. ఆయన వికారాబాద్‌ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టేందుకు హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. అయితే.. రేవంత్‌ అరెస్ట్‌ వ్యవహారంలో ఐజీ శ్రీనివాసరావు మీద కూడా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నేతలు ఈసీని కోరారు. కానీ.. ఎస్పీ రమాదేవి బదిలీకే ఈసీ పరిమితమైంది.

vikarabad 05122018

రేవంత్ రెడ్డి అరెస్ట్ కేసులో రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీల్ లేకుండా ఇంటెలిజెన్స్ నివేదిక ఇవ్వడంపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించింది. ఇలాంటి సాదాసీదా కాగితాల నివేదిక ఎవరైనా, ఎక్కడైనా తయారు చేయొచ్చని.. సీల్ లేకుండా ఇస్తే దాన్ని నిరుపయోగపరచరన్న నమ్మకం ఏంటని డీజీపీని ప్రశ్నించింది. పోలీసులు ఇలానే పని చేస్తారా అని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. అయితే తమ దగ్గర సీల్ విధానం లేదని హైకోర్టుకు తెలిపారు డీజీపీ. రేవంత్ ఆందోళనకు దిగుతారన్న సమాచారం ఉన్నప్పుడు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని.. కానీ వారంట్ లేకుండా అర్ధరాత్రి ఎలా అరెస్ట్ చేస్తారని మండిపడింది హైకోర్టు.

ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌తో సెప్టెంబర్‌లో చేసిన వాట్సాప్ చాటింగ్‌ను మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ బయటపెట్టారు. చంద్రబాబు ఒత్తిడితో లగడపాటి సర్వే ఫలితాలను మార్చారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై.. లగడపాటి స్పందించారు. డిసెంబర్ 7 వ తేదీ సాయంత్రమే మాట్లాడతానని చెప్పిన లగడపాటి.. కేటీఆర్ వ్యాఖ్యలతో ముందే మీడియా ముందుకు వచ్చారు. సెప్టెంబర్ 16న బంధువుల ఇంట్లో కేటీఆర్ తనను కలిశారని చెప్పారు. 23 నియోజకవర్గాల్లో ప్రజానాడి ఎలా ఉందో చెప్పాలని కేటీఆర్ తనను రిక్వెస్ట్ చేశారని, దాంతో ఉచితంగానే సర్వే చేసి నవంబర్ 11న కేటీఆర్‌కు వాట్సాప్ ద్వారా రిపోర్ట్ పంపించానన్నారు. చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని, అభ్యర్థులను మార్చకపోతే నష్టం వచ్చే అవకాశం ఉందని తాను కేటీఆర్‌కు ముందే చెప్పానని లగడపాటి తెలిపారు.

lagdaapati 52018

తనకు పదవులు ముఖ్యం కాదని.. వ్యక్తిత్వం ముఖ్యమని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. సర్వేకు సంబంధించి కేటీఆర్ పంపిన ట్విట్టర్ మెసేజ్‌లపై ఆయన మాట్లాడుతూ ఒత్తిడితో సర్వేను మార్చానని కేటీఆర్‌ అనడం విడ్డూరంగా ఉందన్నారు. సెప్టెంబర్‌ 16న తన బంధువు ఇంట్లో కేటీఆర్‌ కలిశారని... అప్పుడే సర్వే గురించి కేటీఆర్‌ తనను అడిగినట్లు చెప్పారు. సర్వే రిపోర్టులు పంపిస్తానంటే కేటీఆర్‌ మెయిల్‌ అడ్రస్‌ కూడా ఇచ్చారన్నారు. కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, కోదండరాం విడివిడిగా ఉన్నప్పుడు ఆ సర్వే చేశామని లగడపాటి చెప్పుకొచ్చారు. వారందరూ కలిస్తే పోటాపోటీగా ఉంటుందని కూడా కేటీఆర్‌కు చెప్పానని తెలిపారు.

 

వీలుంటే పొత్తులతో వెళ్లాలని చెప్పానని.. అయితే కేటీఆర్‌ సింగిల్‌గానే వెళ్తామని చెప్పారని ఆయన తెలిపారు. 65 శాతం ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని కేటీఆర్‌కు చెప్పానని అన్నారు. కేటీఆర్‌ 23 నియోజకవర్గాల జాబితా పంపించి సర్వే ఫలితాలు కోరారని, నవంబర్‌ 11న కేటీఆర్‌ మరో 37 నియోజకవర్గాల జాబితా పంపారన్నారు. కేటీఆర్‌ కోరిన 37 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉందని తెలిపారు. ‘మీ నాన్న గారు పాడు చేసిన వాతావరణాన్ని.. మీరు బాగు చేశారని కేటీఆర్‌కు మెసేజ్‌ చేశా’నని లగడపాటి అన్నారు. నవంబర్‌ 28 తర్వాత తనకు అనేక రిపోర్టులు వచ్చాయని, ఏ రిపోర్ట్‌ను ఎవరితో షేర్‌ చేసుకోలేదన్నారు. 8 మంది ఇండిపెండెట్లు గెలుస్తారని చెప్పానని.. ఏ పార్టీకి వ్యతిరేకంగా చెప్పలేదని లగడపాటి పేర్కొన్నారు.

తెలంగాణలో ప్రజాకుటమికి విజయావకాశాలు మెండుగా ఉన్నాయని, ఈ నెల 11న వచ్చే ఫలితం కూడా అదేనని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. ఇంటింటికీ కుళాయి ఇచ్చాకే ఓట్లు అడుగుతానన్న సీఎం కేసీఆర్‌ హామీ ఏమైందని ప్రశ్నించారు. కొన్నిచోట్ల కుళాయిలు ఇచ్చి అందులో నీటి సరఫరా మరిచారని ఎద్దేవా చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నగరాన్ని డల్లాస్‌గా చేస్తామని సినిమా చూపించారని, స్కై వేలు, ఫ్లై ఓవర్ల ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. చంద్రబాబు చేసిన అభివృద్ధే హైదరాబాద్‌లో ఇప్పటికీ ఉందితప్ప కొత్తగా చేసిందేమీ లేదని విమర్శించారు.

lokesh 05122018

అవసరమైతే ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోనూ తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని ఇటీవల కేటీఆర్‌ హెచ్చరించిన నేపథ్యంలో.. కేటీఆర్‌ నిర్భయంగా ఆంధ్రాలో ప్రచారం చేసుకోవచ్చని, అంతటి ప్రశాంతమైన వాతావరణం తమ వద్ద ఉందని లోకేశ్‌ అన్నారు. గడిచిన నాలుగున్నరేళ్లలో ప్రజలకు చెప్పుకోవడానికి ఒక్క పని కూడా తెలంగాణలో తెరాస చేయలేదని విమర్శించారు. తెలంగాణలో చెప్పుకోదగ్గ పరిశ్రమ ఒక్కటైనా కేసీఆర్ చెప్పగలరా? అని లోకేశ్‌ ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధిని చంద్రబాబు ఎక్కడ అడ్డుకున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానంటే చంద్రబాబు అడ్డుపడ్డారా? దళితులకు మూడెకరాల భూమి ఇస్తానంటే అడ్డుకున్నారా? అని దుయ్యబట్టారు.

lokesh 05122018

అభివృద్ధి చేయడం చేతకాక చంద్రబాబును విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. మళ్లీ గెలిపిస్తే సచివాలయానికి వస్తా అని కేసీఆర్ చెప్పుకోవడమే ఆయన పనితీరుకు అద్దం పడుతోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎవరైనా రావొచ్చని, ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందని, అక్రమ అరెస్టులు, రౌడీయిజం ఉండవని లోకేష్ అన్నారు. రేవంత్‌రెడ్డి అరెస్టుపై ప్రశ్నించగా.. అలాంటి అప్రజాస్వామ్య విధానాన్ని ప్రజలు సహించరన్నారు. మళ్లీ గెలిపిస్తే రోజూ సచివాలయానికి వస్తాననడం కేసీఆర్‌ పనితీరుకు నిదర్శనమని విమర్శించారు. తెలంగాణలో ప్రజాకూటమి గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అర్ధరాత్రి ఇంటికి వెళ్లి రేవంత్ ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే, ఎన్నికల విధుల్లో డీజీపీ బిజీగా ఉన్నారని అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకే రేవంత్ ను అరెస్ట్ చేశామని చెప్పారు.

revanth 05122018

దీనిపై హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ, ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా అర్ధరాత్రి వెళ్లి అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించింది. డీజీపీ కోర్టు ముందు హాజరు కావాల్సిందేనని, అరెస్ట్ వ్యవహారంపై సమాధానం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. తాము కూడా కేసుల విచారణలో బిజీగా ఉన్నామని... కోర్టుకు రావడానికి డీజీపీ ఒక్క గంట సమయాన్ని కేటాయించలేరా? అని కోర్టు ప్రశ్నించింది. డీజీపీ కోర్టుకు వచ్చి నేరుగా సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ మధ్యాహ్నం 2.30 గంటలకు తదుపరి విచారణను వాయిదా వేసింది.

revanth 05122018

అర్ధరాత్రి ఆయనను అరెస్ట్‌ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. డీజీపీ నేరుగా వచ్చి సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కేసీఆర్‌ సభను అడ్డుకోవాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో రేవంత్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్‌ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మంగళవారం పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై బుధవారం ఉదయం మరోసారి హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై డీజీపీనే నేరుగా వచ్చి సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఎన్నికల విధుల్లో డీజీపీ నిమగ్నమై ఉన్నారని ఏజీ సమాధానం చెప్పినప్పటికీ సంతృప్తి చెందని ధర్మాసనం.. డీజీపీ వచ్చి తీరాల్సిందేనని స్పష్టం చేసింది.

Advertisements

Latest Articles

Most Read