తెలంగాణాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. సనత్‌నగర్‌ నియోజకవర్గంలో శనివారం రాత్రి తెదేపా అభ్యర్థి కూన వెంకటేష్‌గౌడ్‌తో కలిసి బాలకృష్ణ రోడ్‌షో నిర్వహించారు. స్వామి కాంప్లెక్స్‌ వద్ద, మహంకాళి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణలో చంద్రబాబునాయుడి పేరు వినిపించకుండా చేయాలంటున్నారు, ఆయన చేసింది ఏమి లేదు అంటున్నారు. అలా అయితే చంద్రబాబు కట్టించిన శంషాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేయాలని, హైటెక్ సిటీని కూల్చి వేయాలని, ఫ్లయ్ ఓవర్లను తొలగించాలని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ పనులు చేసే దమ్ముందా? అంటూ కేసీఆర్ కు ఆయన సవాల్ విసిరారు. మాహిష్మతి సామ్రాజ్యాన్ని పాలించేది భల్లాలదేవుడే అయినా ప్రజలు గుర్తు పెట్టుకునేది మాత్రం బాహుబలినే అని సినీనటుడు, తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తెదేపా అధినేత చంద్రబాబును దూషించే వారివి గల్లీ బుద్ధులని విమర్శించారు.

balayya 02122018 2

తెలుగు తెర వీడి ప్రజల కోసం తెదేపాను స్థాపించిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. తెదేపా.. నాయకుల కోసం, ధనవంతుల కోసం పుట్టిన పార్టీ కాదని; భూస్వాములు, పెత్తందారుల అరాచకాలకు వ్యతిరేకంగా ఆవిర్భవించిన పార్టీ అని తెలిపారు. మహిళలతో పాటు అన్ని వర్గాల అభ్యున్నతికి ఆనాడు తెదేపా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఆ పథకాలనే ఇప్పటి పార్టీలు కాపీ కొట్టక తప్పని పరిస్థితి నెలకొందన్నారు. ఎన్ని సుడిగుండాలు ఎదురైనా తెదేపా జెండా రెపరెపలాడుతూనే ఉంటుందన్నారు. హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ నెలకొల్పిన ఘనత చంద్రబాబుది మాత్రమేనన్నారు. చంద్రబాబును హైదరాబాద్‌ చరిత్ర పుటల నుంచి తొలగించాలంటే హైటెక్‌ సిటీని, ఔటర్‌ రింగ్‌ రోడ్డును మాయం చేయాలని అలా చేసే దమ్ము ఎవరికుందని ప్రశ్నించారు.

balayya 02122018 3

చంద్రబాబు కట్టిన కట్టడాల్లో మీటింగ్‌లు పెట్టుకుంటూ చంద్రబాబునే విస్మరిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌కు దీటుగా సైబరదాబాద్‌ను చంద్రబాబు అభివృద్ధి చేశారన్నారు. మూడొస్తే ఫామ్ హౌస్ లో పడుకునే వాడు కాదు చంద్రబాబు .. మూడొస్తే స్టేట్ కోసం నలుదిశలా తిరిగే వాడు చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు ని అవుట్ చేయాలనుకుంటే మీ అంత out-and-out కమెడియన్స్ ఉండరు, అమెరికా అధ్యక్షుడి బిడ్డని తీసుకొచ్చి మీ బిల్డప్పులు ఏందీ భాయ్ నాకు అర్ధం కాలేదు.. 15 ఏళ్ళ ముందటే వాళ్ళ బాబులని ఇక్కడ గుట్టల్లో నడిపించాడు చంద్రబాబు అని బాలయ్య అన్నారు. Laptop కనిపెట్టింది కూడా చంద్రబాబే అని కుళ్ళు సెటైరులు వేస్తున్నారు.. అమెరికా అధ్యక్షుడి కూతుర్ని తీసుకువచ్చి పులి వేషాలు వేశారు ....15 ఏళ్ళ ముందటే వాళ్ళ బాబులని పట్టుకువచ్చాడు అని కౌంటర్ ఇచ్చారు. ‘పార్టీ జెండా.. ఎగరాలి తెలంగాణ నిండా’ అంటూ కార్యకర్తలను ఉత్సాహ పరిచారు. తెలంగాణలో గడీల పాలనను తమ పార్టీనే అంతం చేసిందన్నారు.

ఆ పార్టీలో ఉన్నదే, నలుగురు అయిదుగురు నాయకులు. అందులోనూ ఆ పార్టీ, ఈ పార్టీ నుంచి వచ్చిన జుంపింగ్స్ తో నిండిపోయింది. నిజంగా పవన్ ని, జనసేనని చూసి వచ్చింది, ఇద్దరు, ముగ్గురు. వారిలో కొంచెం బుర్ర ఉన్న వాళ్ళలో ఉంది, ఆర్‌టీఐ మాజీ కమిషనర్‌ విజయబాబు. పవన్ తో మొదటి నుంచి ప్రయాణం మొదలు పెట్టిన ఆర్‌టీఐ మాజీ కమిషనర్‌ విజయబాబుని, జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా నియమించారు. అయితే ఆయన అనూహ్యంగా, ఈ రోజు పార్టీకి రాజీనామా చేస్తునట్టు ప్రకటించారు. ఈ కీలక పరిణామంతో జనసేనలోనే కాదు, మిగతా పార్టీ వాళ్ళు కూడా అవాక్కయ్యారు. ఎందుకంటే, విజయబాబు అంటే జెంటిల్మెన్ అనే భావన ఉంది. అందరి రాజకీయ నాయకులు లా కాకుండా, ఆయన నడవడిక ఉండేది. జనసేన ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్న విజయబాబు రాజీనామా పార్టీ వర్గాల్లో కలకలానికి కారణమైంది.

pk vijayababu 02122018

పలువురు నాయకుల ఈ నిర్ణయంపై విస్మయం వ్యక్తం చేశారు. అయితే తన వ్యక్తిగత కారణా వల్లే పార్టీని వీడుతున్నట్లు విజయబాబు ప్రకటించారు. ఒకటి రెండు రోజులు ఆగితేగాని అసలు విషయాలు వెల్లడయ్యే అవకాశం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. వ్యక్తిగత కారణాల వల్లే తాను రాజీనామా చేసినట్టు చెప్తున్నా, బలమైన కారణాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ అజెండా ఏంటో, ఇప్పటికీ క్లారిటీ లేదు. రోజుకి ఒక మాట చెప్తూ, ఏ విషయంలోనూ క్లారిటీ లేకుండా, పవన్ వ్యవహరిస్తున్న తీరు, ఇలాంటి వారికి చాలా ఇబ్బందిగా మారింది. పార్టీలో ఒకటి అనుకోవటం, తరువాత పై నుంచి వచ్చిన ఆదేశాలతో, మొత్తం అనుకున్నది మారిపోవటం కూడా, ఇలాంటి సీనియర్ నాయకులని ఇబ్బందికి గురి చేస్తుంది. మరో పక్క కేవలం ఒక్క కులానికి పరిమతం అనే భావన ఇప్పటికే బాగా వెళ్ళిపోయింది.

pk vijayababu 02122018

ఈ రోజు అనంతపురంలో కావాతు అంటూ హడావిడి చేస్తున్న పవన్ కళ్యాణ్ కు, ఇదే రోజు విజయబాబు రాజీనామా చెయ్యటంతో, గట్టి షాక్ అనే చెప్పాలి. అయితే ఇప్పటికి ఆయన ఏ విమర్శ చెయ్యకుండా వెళ్ళిపోవటం ఒక్కటే పవన్ కళ్యాణ్ కు ఊరటని ఇచ్చే విషయం. అయితే ఇప్పటికే జనసేనలో చాలా మంది లోపల లోపల నలిగి పోతున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పే మాటలు విని వీరుడు సూరుడు అని మేము డబ్బా కొట్టటం, తీరా విషయం వస్తే, చేతులు ఎత్తేయటం అయిపోయిందని అంటున్నారు. తెలంగాణా విషయంలో అదే జరిగిందని, నాకు తెలంగాణా అంటే ఇష్టం అని చెప్పి, తెలంగాణా ఎన్నికల్లో అసలు పోటీ లేకుండా చేతులు ఎత్తేసిన విషయం గుర్తు చేస్తున్నారు. అలాగే, అవినీతి పరులని దగ్గరకు రానివ్వను అని చెప్పి, రావెల లాంటి వారిని పార్టీలో చేర్చుకుని, మా తల ఎత్తకుండా చేసారని అంటున్నారు. మొత్తానికి, విజయబాబు లాంటి వారితో పాటు, మరికొంత మంది లైన్ లో ఉన్నారని, ఎన్నికలు దగ్గర పడే కొద్దీ, ఈ లిస్టు ఇంకా పెరిగిపోతుంది అనటంలో ఆశ్చర్యం లేదు.

కొడంగల్‌లో అర్థరాత్రి హై డ్రామా నెలకొంది. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కనిపించాయి. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు యూసుఫ్‌ నివాసంలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. నగదు ఏమీ లభించకపోవడంతో వారు వెనుదిరిగారు. రేవంత్‌ రెడ్డికి యూసుఫ్‌ ప్రధాన అనుచరుడు కాబట్టే యూసుఫ్‌కు సంబంధించిన వారి ఇళ్లల్లో దాడులు చేశారని కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు మద్దతుగా కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సెర్చ్‌ వారెంట్‌ చూపించకుండానే ఇళ్లల్లోకి చొరబడ్డారని, మహిళలతో దురుసుగా ప్రవర్తించారని కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆరోపించారు. సోదాలు జరిపినా ఏమీ లభించలేదని రాసి ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు.

revanth 02112218 2

ఎస్‌ఐ కాశికి సమాచారం అందడంతో, ఆయన వచ్చి అదుపుచేసేందుకు యత్నించారు. అదే సమయంలో రేవంత్‌రెడ్డి తన ప్రచారం ముగించుకొని అక్కడికి చేరుకున్నారు. తమ కార్యకర్తలను పోలీసులు భయాందోళనకు గురిచేసేలా ప్రవర్తిస్తున్నారంటూ రోడ్డుపై బైఠాయించారు. అదే సమయంలో బొంరాస్‌పేటలోనూ పోలీసులు, ఆబ్కారీ సిబ్బంది రేవంత్‌ అనుచరుడైన రాంచందర్‌రెడ్డి ఇంట్లో సోదాలు జరిపారు. ఏమీ లభించకపోవడంతో వెనుదిరుగుతుండగా కాంగ్రెస్‌ కార్యకర్తలు పోలీసుల వాహనాన్ని చుట్టుముట్టారు. కావాలనే రాత్రిపూట వచ్చి భయాందోళనలు సృష్టిస్తున్నారంటూ అక్కడే బైఠాయించారు. రేవంత్‌ సోదరుడు తిరుపతిరెడ్డి అక్కడికి వచ్చి మద్దతు పలికారు. అర్ధరాత్రి వరకు కొడంగల్‌, బొంరాస్‌పేటలలో ధర్నా కొనసాగింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో, రెండుచోట్లా పోలీసులు అప్రమత్తమయ్యారు.

revanth 02112218 3

గత సోమవారం గజ్వేల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఒంటేరు ప్రతా్‌పరెడ్డి తనయుడి ఇంట్లోనూ పోలీసులు చొరబడి సోదాలు చేశారు. ఈ సందర్భంగా తనను పోలీసులు వేధిస్తున్నారంటూ ప్రతా్‌పరెడ్డి ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశారు. ఆయన ఇంట్లో ఏమీ దొరక్కపోవడంతో పోలీసులు ఒట్టి చేతులతో వెళుతుంటే ఇంట్లో ఏం దొరికిందో చెప్పాలంటూ కార్యకర్తలు అడ్డుపడి నిలదీశారు. ‘‘ఎవరు ఫిర్యాదు చేశారో చెప్పరు. సోదాలు ఎందుకు చేస్తున్నారో చెప్పరు. ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పరు. అయినా ఎన్నికల సమయంలో పోలీసులు సోదాలు చేయడం ఏమిటి? గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు’’ అంటూ విపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. ఒంటేరు ప్రతా్‌పరెడ్డి గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఢీకొంటుండగా, రేవంత్‌రెడ్డి రాజకీయంగా కేసీఆర్‌ కుటుంబాన్ని ఢీకొంటున్నారు.

"అసలు అది ఒక పార్టీనా...ఆఫ్ట్రాల్ ఒక 0.01 శాతం పార్టీ అది.. మాకు ఆ పార్టీ ఒక పోటీనా ?" ఇది తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు... అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాగే అన్నారు "అసలు తెలుగుదేశం పార్టీకి తెలంగాణాలో జెండా కట్టే వాడు ఉన్నాడా ? మా పార్టీ చూడండి ఎంత ధైర్యంగా తెలంగాణా తిరుగుతుందో చూడండి" అని.. తరువాత అసలు ఆయాన తెలంగాణాలో పోటీలోనే లేడు అనుకోండి, అది వేరే విషయం... ఇటు కేసీఆర్ వ్యాఖ్యలు, ఇటు పవన్ వ్యాఖ్యలు చూస్తే, అసలు తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ ఉనికే లేదు అని ఎవరైనా అనుకుంటారు. కాని అది అవాస్తవం, 15 ఏళ్ళు అధికారానికి దూరంగా ఉన్నా సరే, నాయకులు వెళ్ళిపోయినా సరే, తెలుగుదేశం కార్యకర్తలు చెక్కు చెదరలేదు అని తెలంగాణా ఎన్నికల ప్రచారం చూస్తే అర్ధమవుతుంది.

cbn 021122018 2

ఆంధ్రాలో కంటే, తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ అంటే అభిమానించే కార్యకర్తలు ఎక్కువ అని మరోసారి రుజువైంది. తెలంగాణాలో బీసీ వర్గాల్లో ఇప్పటికే, తమ జీవితాలు మార్చింది తెలుగుదేశమే అని నమ్ముతారు. తెలంగాణా సమాజంలో, సామాజిక, ఆర్ధిక మార్పులకు కారణం తెలుగుదేశం అని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఇలాంటి పార్టీని నాయకులు అందరూ వదిలి వెల్లిపోయనా కార్యకర్తలు మాత్రం వారి భుజాల మీద మోసి, నిలబెట్టారు. ఈ రోజు కేసీఆర్ వచ్చి, తమ ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్ కాదు, తెలుగుదేశం అని చెప్పకనే చెప్పారు. మరి కేసీఆర్ గారు, ఇప్పటికీ ఇది 0.01% పార్టీ అని అంటారా ? పవన్ కళ్యాణ్ గారు మీకు ఎలాగూ పోటీ చేసే దమ్ము లేదు, మరి ఇప్పటికీ తెలంగాణాలో తెలుగుదేశం పార్టీకి జెండా కట్టేవాడు లేడు అంటారా ? నిన్న కూకట్‌పల్లి రోడ్‌షోలో ఇప్పటి వరకు ఎవరికీ రాని జనాలు, చంద్రబాబుకి వచ్చారు.

cbn 021122018 3

వాళ్ళు డబ్బులు ఇచ్చి తెప్పించుకున్న కూలీలు కాదు, లక్షల్లో జీతాలు తీసుకునే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. తమ జీవితాలు ఇలా ఉన్నాయి అంటే, అప్పుడు మీరు వేసిన పునాదులే అని, కృతజ్ఞతగా వచ్చారు. మట్టి పిసుక్కునే చేతులతో, కంప్యూటర్ పట్టుకున్నాం, మా జీవితాలు మీ ముందు చూపు వల్లే బాగుపడినాయి అని చెప్పటానికి వచ్చారు. కూకట్‌పల్లి రోడ్‌షోలో ఎటు చుసిన జనాలే ఉన్నారు. చంద్రబాబు కూడా తన సహజ శైలికి భిన్నంగా చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. "ప్రజల హృదయాల్లో నాకున్న స్థానాన్ని ఎవరూ తొలగించలేరు. నేను ఎందుకు వచ్చానో ప్రజల ఆదరణ చూస్తే కేసీఆర్‌కు తెలుస్తుంది. మీ ఓటుతో కేసీఆర్‌ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి. మోదీ, అమిత్‌షాలు దేశాన్ని భ్రష్టు పట్టించారు. మా హైదరాబాద్‌కు మీ అహ్మదాబాద్‌కు పోలిక ఉందా? అని మోదీని అడుగుతున్నా. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను చిత్తుచిత్తుగా ఓడించాలి. అప్పుడే దేశానికి మంచి రోజులు (అచ్చే దిన్‌) వస్తాయి." అని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read