మొన్న ఒక టీవీ ఛానల్ లో 100 సీట్లు తెరాస కి అని చెప్పారు, నిన్న మరో టీవీ ఛానల్ లో 108 తెరాస కి అని చెప్పారు. అప్పుడు మాత్రం కేటీఆర్ ఆనందంగా అవి తన ట్విట్టర్ లో షేర్ చేసి, మేమే కింగ్లు అన్నాడు. ఒక పక్క గ్రామాల్లో తెరాస నాయకులని తరిమి తరిమి కొడుతుంటే, వంద సీట్లు వస్తాయింటే, తెరాస కార్యకర్తలే నమ్మని పరిస్థితి. కాని 100 శాతం కరెక్ట్ అయ్యే లగడపాటి సర్వే రాగానే, ఇవన్నీ తుస్సు అని తేలిపోయింది. లగడపాటి సర్వే ప్రజల్లో ఉన్న క్రెడిబిలిటీ అంతా ఇంతా కాదు. అందుకే తెరాస కి పిచ్చెక్కి పోతుంది. చివరి రెండు రోజులలో లగడపాటి వేసిన దెబ్బ అంతా ఇంతా కాదు. కనీసం 2% వోటింగ్ అయినా కూటమి వైపు తిరిగి ఉంటుంది. అందుకే కేటీఆర్ లగడపాటి క్రెడిబిలిటీ మీదే దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. లగడపాటిది సర్వే కాదని, చిలక జోస్యమని కేటీఆర్ పేర్కొన్నారు.

ktr 05122018

ఇది చివరి నిమిషంలో సర్వేల పేరుతో గందరగోళం సృష్టించే ప్రయత్నమన్నారు. లగడపాటి, చంద్రబాబు పొలిటికల్‌ టూరిస్టులని ఆయన చెప్పారు. డిసెంబర్‌ 11న తట్టాబుట్టా సర్దేస్తారని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. మరో ట్వీట్ ద్వారా కేటీఆర్, లగడపాటి వాట్స్ అప్ మెసేజ్ అంటూ, ఒక స్క్రీన్ షాట్ పెట్టి కవర్ చేసే ప్రయత్నం చేసారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 65-70 స్థానాల్లో విజయం సాధిస్తుందని లగడపాటి తనకు మెసేజ్ చేసిన చాట్ స్క్రీన్‌షాట్‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని ఆయన చంద్రబాబుకు కూడా చెప్పినట్టు ఉంది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆ వాట్స్ అప్ స్క్రీన్ షాట్ ఫేక్ అని కొంత మంది చెప్తున్నా, అది నిజం అనుకున్నా, కేటీఆర్ ఎందుకు ఇలా కవర్ చేస్తున్నాడో అర్ధం కావటం లేదు. కేటీఆర్ చెప్పే దాని ప్రకారం, లగడపాటి నవంబర్ 20న తనకు చెప్పారు అంటున్నారు. నవంబర్20 కి ప్రజాకూటమి అభ్యర్థులు నామినేషన్ లు వేసి మాత్రమే ఉన్నారు.

ktr 05122018

ఆ రోజుకి ఇంకా పూర్తి స్థాయిలో ప్రజల మధ్యలోకి వెళ్లలేదు.... ఎందుకంటే టిక్కెట్ల కేటాయింపు ఆలస్యంగా అయింది.... ఆ టైమ్ లో టిఆర్ఎస్ కొద్దిగా బలంగా కనిపించిన మాట వాస్తవమే.... సోనియా గాంధీ సభ, రాహుల్ గాంధీ-చంద్రబాబు నాయుడు ప్రచారం తో పరిస్థితి పూర్తిగా మారిపోయింది..... అయిన ఎవడైనా నీతో చాటింగ్ చేస్తూ నువ్వు ఓడిపోతావని‌ చెబుతాడా..?? నిన్ను ఏదో ఖుషి చేయడానికి గెలుస్తావని చెబుతాడు.....?? ప్రజలకు మాత్రం నిజం చెబుతాడు కదా.....తమరు అది అర్థం చేసుకోకుండా ఇప్పుడు ఆ చాటింగ్ ను బహిర్గతం చేసి మీరు భయపడుతున్నారని ప్రజలకు తెలియజేస్తున్నావు కదా....! 20 నవంబర్ నాడు లగడపాటి మీకు 62 - 70 సీట్లు వస్తాయి అని చెప్తే , మొన్న EC కి లగడపాటి సర్వే పైన ఎందుకు కంప్లయింట్ చేశారు...? ఆంద్రా రాజగోపాల్ తో మీకు చాటింగ్ చేయాల్సిన అవసరం ఏంది... మళ్ళీ ఆంధ్రోళ్లు తెలంగాణ కు ద్రోహం చేస్తారు అని అడ్డం పొడుగు మాటలు ఎందుకు ? జనాలను సెంటిమెంట్ పేరుతో రెచ్చగొట్టుడు ఎందుకు...? ఈ రెండు వారాల్లో మహాకూటమి కి అనుకూలంగా, తెరాస కి వ్యతిరేకంగా మారింది అని ఎందుకు ఆలోచించలేదు... రాత్రికి రాత్రే మారె పరిస్థితులు ఉంటాయి... లగడపాటి సర్వే డీటెయిల్స్ చెపింది 7.30 గంటలకు... మీ స్క్రీన్ షాట్ చూస్తే 4.19 చూపిస్తుంది...మీరు ట్వీట్ చేసింది 10.30 గంటలకు. ఇప్పుడు ఇక చేసేది ఏమి లేదు... అల్రెడి‌ మీ‌ చేతులు కాలిపోయాయి.....‌

ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐకి నో ఎంట్రీ ఇస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. సీబీఐ దర్యాప్తునకు సాధారణ అనుమతి ఉత్తర్వులను ఉపసంహరిస్తూ జారీ చేసిన జీవోను కొట్టివేసేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. జీవోను సవాల్ చేస్తూ ఓ స్వచ్చంద సంస్థ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. జీవో జారీలో అధికార దుర్వినియోగం ఉందన్న వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చింది. సీబీఐ దర్యాప్తునకు, కోర్టులు ఆదేశాలు ఇవ్వడానికి ఎలాంటి అడ్డంకులు లేవని న్యాయస్థానం పేర్కొంది. సాధారణ అనుమతి ఉపసంహారించినప్పటికీ కేసును బట్టి దర్యాప్తు చేసుకోవచ్చునని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని ధర్మాసనం పేర్కొంది. కాబట్టి తాము జోక్యం చేసుకోమంటూ పిల్‌ను కొట్టివేసింది.

cbi 04122018

అడక్కుండా అడుగు పెట్టొద్దంటూ సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం ‘నో ఎంట్రీ’ బోర్డు చూపడం జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టించింది. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఏపీ తరహా నిర్ణయమే తీసుకున్నారు. సీబీఐకి 1989లో లెఫ్ట్‌ సర్కారు మంజూరు చేసిన ‘జనరల్‌ కన్సెంట్‌’ను ఉపసంహరించుకున్నారు. మరో పక్క, పంజాబ్‌ కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకున్న ఈ నిర్ణయం పై ఆరా తీసింది. పంజాబ్‌ పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్రంలోని ఏసీబీ ఉన్నతాధికారి ఒకరికి ఫోన్‌ చేసి వివరాలు అడిగారు. ‘‘సీబీఐని అనుమతించకుండా ఎలా ఉత్తర్వులిచ్చారు? మాకూ వివరాలు చెప్పండి’’ అని కోరారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా చంద్రబాబుని సమర్ధిస్తూ ట్వీట్ చేసారు.

cbi 04122018

చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు మద్దతు ఇవ్వగా, మరికొన్ని రాష్ట్రాలు మద్దతు ఇచ్చే అవకాశమున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సీబీఐ పలానా రాష్ట్ర పరిధిలో నమోదైన కేసులపై దర్యాప్తు చేపట్టాలన్నా, అవినీతి పై చర్యలు తీసుకోవాలన్నా, ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే అనేది చట్టం చెప్తుంది. చట్టం ప్రకారం, సీబీఐ ఏ కేసునూ సొంతంగా దర్యాప్తునకు చేపట్టలేదు. కేసు పరిధిని బట్టి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా కోరితేకాని, లేదా కోర్టు ఆదేశాలు ఉంటే మాత్రమే సీబీఐ రంగంలోకి దిగుతుంది. అయితే. ఢిల్లీ ప్రత్యేక పోలీసు విభాగ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఫస్ట్‌ గెజిటెడ్‌ స్థాయి ఉన్న రాష్ట్ర అధికారులు, పౌరులు, విడివిడిగా లేదా కలిసి అవినీతికి పాల్పడినట్లయితే సీబీఐ చర్యలు తీసుకోవచ్చు. ఇందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కావాల్సిందేనని ఢిల్లీ స్పెషల్‌ పోలీసు చట్టమే చెబుతోంది.

తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్‌ ప్రజాకూటమి అభ్యర్థి రేవంత్‌ రెడ్డిని అక్రమంగా అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకువెళ్ళారో చెప్పకోవటం పై ఈ మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరిగింది. కేసీఆర్‌ పర్యటన సందర్భంగా రేవంత్‌ రెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారని, శాంతిభద్రతల దృష్ట్యా ఆయనను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్ట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బంద్‌కు రేవంత్‌ పిలుపునిస్తే తప్పేంటని, ఆయనను అదుపులోకి తీసుకొని ఏ నేరాన్ని నియంత్రించారని పోలీసులను ప్రశ్నించింది. నిఘావర్గాల సమాచారం మేరకే తాము రేవంత్‌ రెడ్డిని ఈ రోజు ఉదయం అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

revanth 04122018 2

అయితే ఇంటెలిజెన్స్ అందించిన నివేదికను, ఆధారాలు సమర్పించాలని హైకోర్ట్ పోలీసులను ఆదేశించింది. ఈ ఘటనలో పోలీసుల తీరు పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్ అరెస్టుకు కారణాల పై ఆధారలను ఈ రోజే కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. అనంతరం కేసు విచారణను సాయంత్రం 3.45 గంటలకు వాయిదా వేసింది. ఈ విచారణకు అడ్వొకేట్‌ జనరల్‌ హాజరుకావాలని ఆదేశించింది. రేవంత్‌రెడ్డి అరెస్ట్‌పై హైకోర్టులో కాంగ్రెస్‌ నేత వేం నరేందర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రేవంత్‌ను అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ ఆయన హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలంటూ కోరారు. దీంతో విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం పైవిధంగా వ్యాఖ్యలు చేసింది.

revanth 04122018 2

రేవంత్ రెడ్డి అరెస్ట్ పై, సీఈవో రజత్ కుమార్ మాట్లాడుతూ.. రేవంత్‌‌ను ఎందుకు అరెస్ట్‌ చేశారు..? ఎవరు అరెస్ట్ చేశారు? అనే విషయంపై వివరణ ఇచ్చారు. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సభ రోజు కొడంగల్‌‌లో బంద్‌‌కు పిలుపిచ్చామని ఈ నెల 2న కాంగ్రెస్ పార్టీ స్టేట్‌మెంట్ ఇచ్చిందన్నారు. దీనిపై టీఆర్ఎస్ మాకు ఫిర్యాదు చేసిందని రజత్ కుమార్ తెలిపారు. ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపామని.. వారి ఆదేశాలపై ఆర్వో, జిల్లా ఎన్నికల అధికారికి లేఖ రాశామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందుజాగ్రత్తలో భాగంగా రేవంత్‌ను అరెస్ట్ చేశారని సీఈవో స్పష్టం చేశారు. కొడంగల్‌‌లోనే శాంతి భద్రతల సమస్య ఉందని సీఈవో చెప్పుకొచ్చారు. అయితే ఇదే విషయం తెలంగాణా ప్రభుత్వం కోర్ట్ కి చెప్పటంతో, కోర్ట్ అక్షింతలు వేసింది.

ఆంధ్ర ఆక్టోప‌స్ తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల పై చెప్పిన జోస్యం ఇప్పుడు రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. తెలంగాణ లో జ‌రిగే ఎన్నిక‌ల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్ధులు ఎనిమిది నుంచి ప‌ది మంది వ‌ర‌కు గెలిచే అవ‌కాశం ఉంద‌ని రెండు రోజుల క్రిందట చెప్ప‌టంతో రాజకీయ పార్టీల్లో క‌ల‌క‌లం రేపింది. దీని పై టిఆర్‌య‌స్ సీరియ‌స్ గానే రియాక్ట్ అయింది. సన్నాసి గాడు అంటూ కేసీఆర్ స్పందించారు. ఇదే స‌మ‌యంలో, ఈ రోజు లగడపాటి మొత్తం వివరాలు చెప్పారు. ప్రతి ఎన్నికలప్పుడు కూడా పార్టీలకు అతీతంగా తాను సర్వే నిర్వహిస్తున్నానని, ఇలా సర్వేలు నిర్వహించడం తన అలవాటని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. తెలంగాణ ఎన్నికలు మరో మూడు రోజుల్లో జరగనున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన సర్వేలో పాక్షిక వివరాలను వెల్లడించారు.

lagadapati 04122018

తెలంగాణ ఎన్నికల్లో ఫలితాలపై తన సర్వే వివరాల్లో కీలక అంశాలను బయటపెట్టారు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. ఎన్నికల్లో ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుస్తారని మొన్న చెప్పానని, ఇప్పుడు మరో ముగ్గురు అభ్యర్థుల పేర్లను చెబుతానని అన్నారు. ఇబ్రహీంపట్నం నుంచి కాంగ్రెస్ రెబెల్ మల్ రెడ్డి రంగారెడ్డి, మక్తల్ నుంచి జలంధర్ రెడ్డి , బెల్లంపల్లి నుంచి బీఎస్పీ అభ్యర్థి జి.వినోద్ గెలుస్తారని తన సర్వేలో వెల్లడైనట్లు చెప్పారు. తాజా పరిస్థితులను బట్టి కాంగ్రెస్‌కే అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంటుందని, వరంగల్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో టీఆర్ఎస్ కు ఆధిక్యత లభిస్తుందని, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో మాత్రం పోటాపోటీ ఉంటుందని లగడపాటి అభిప్రాయపడ్డారు.

lagadapati 04122018

హైదరాబాద్ లో ఎక్కువ స్థానాల్లో ఎంఐఎంకు, ఆ తర్వాత బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు గెలుస్తాయని లగడపాటి రాజగోపాల్ తన సర్వేలో పాక్షిక వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం ప్రజానాడీ కాంగ్రెస్ పార్టీ వైపు ఉందని, విభజన తర్వాత ప్రజల మధ్య ఎలాంటి రాగద్వేషాలు లేవని అన్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు గాను వంద నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించామని, అన్ని సామాజిక వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించామని చెప్పారు. అయితే పూర్తి వివరాలను ఏడో తారీఖున పోలింగ్ తర్వాత బయటపెడతానన్నారు. పోలింగ్ శాతం పెరిగితే ప్రజాకూటమిదే విజయమన్న ఆయన.. తగ్గితే మాత్రం హంగ్ వస్తుందన్నారు. తనకు తానుగా వివరాలను బయటపెడితేనే వాటిని నమ్మాలని లేకపోతే... నమ్మొద్దని చెప్పారు. ఎవరికీ లొంగని వ్యక్తిత్వం తనదని.. స్వతంత్రుడిగా ఫలితాలను చెబుతున్నానన్నారు. తనపై ఎవరి ఒత్తిడి లేదని తేల్చిచెప్పారు.

Advertisements

Latest Articles

Most Read