గచ్చిబౌలి పరిధిలోని గోపన్‌పల్లిలో సర్వే నంబరు 126, 127లో ఉన్న కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఫామ్‌ హౌస్‌ గోడను కూల్చివేశారు. రేవంత్‌ రెడ్డి, ఏపీ వైకాపాకు చెందిన ఓ నేతకు మధ్య సర్వే నంబరు 127కు సంబంధించి భూవివాదం కోర్టులో నడుస్తోంది. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున వైకాపా నేత అనుచరులు మూడు జేసీబీలు ఉపయోగించి వివాదాస్పదంగా ఉన్న ప్రహరీని కూల్చి వేశారు. ఈ ఘటనపై రేవంత్‌ రెడ్డి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గచ్చిబౌలి పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

revanth 04122018 2

మరో పక్క, కేసీఆర్ సభ సందర్భంగా రేవంత్ రెడ్డి ముందస్తు అరెస్ట్‌తో కొడంగల్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నియోజకవర్గంలో భారీగా బలగాలను మోహరించారు. అటు రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద ఆయన అనుచరులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో నిరసన దీక్షకు దిగారు. రేవంత్‌రెడ్డిని వెంటనే విడుదల చేయాలి అంటూ నినాదాలు చేశారు. రేవంత్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌పై కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌తో కొడంగల్ అట్టుడికిపోతోంది. నియోజకవర్గం అంతటా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు.

revanth 04122018 3

కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని రేవంత్‌ అభిమానులు తిట్టిపోశారు. రేవంత్‌ను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. కోస్గిలో మంగళవారం నిర్వహించ తలపెట్టిన కేసీఆర్‌ సభను అడ్డుకుంటామని రేవంత్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు కొడంగల్‌లో ఆయన్ను అరెస్ట్‌ చేశారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగింది. రేవంత్‌ను అక్రమంగా అరెస్ట్‌ చేశారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేత వేం నరేందర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కేసీఆర్ సభ ముగిశాక రేవంత్‌‌తో పాటు ఆయన అనుచరులను విడుదల చేస్తామని ఎస్పీ అన్నపూర్ణ స్పష్టం చేశారు.

గన్నవరం విమానాశ్రయానికి పూర్తిస్థాయిలో అంతర్జాతీయస్థాయి నేటి నుంచి రానుంది. 2017 మే నెలలో గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదాను కల్పిస్తున్నట్టు కేంద్ర పౌరవిమానయాన శాఖ ప్రకటించింది. ఆరు నెలల్లో అంతర్జాతీయ విమాన సర్వీసులు గన్నవరం నుంచి బయలుదేరతాయన్నారు. కానీ.. అప్పటినుంచి అనేక ఒడుదుడుకులను ఎదుర్కొని.. ఏడాదిన్నర తర్వాత ఈరోజు కల సాకారం కాబోతోంది. ఏడాది కిందటే అంతర్జాతీయ సేవలు అందించేందుకు అవసరమైనమౌలికసౌకర్యాలు విమానాశ్రయంలో సిద్ధమైనా.. ఇమ్మిగ్రేషన్‌, కస్టమ్స్‌ విభాగాలకు సంబంధించిన అనుమతులు, విమానయాన సంస్థలు ముందుకు రాకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. చివరికి.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవడంతో.. ఇండిగో విమానయాన సంస్థ ముందుకొచ్చింది.

singapore 04122018 1

దీంతో గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నేడు ప్రారంభం కానున్నాయి. సింగపూర్ విమాన సర్వీసును వెంకయ్యనాయుడు లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు, సహాయ మంత్రి జయంత్ సిన్హాతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకావాల్సి ఉంది. అయితే కేంద్రంలోని ఎన్‌డీఏతో తెగతెంపులు చేసుకున్న తరువాత చంద్రబాబు రాష్ట్రంలో కేంద్ర మంత్రుల పర్యటనలకు దూరంగానే ఉంటున్నారు. ఈ కార్యక్రమానికి కూడా హాజరు వస్తారనే సమాచారం ఉన్నా, చంద్రబాబు వస్తారో రారో చూడాల్సి ఉంది. ఇక సింగపూర్ విమాన సర్వీసును ప్రారంభించే వెంకయ్య నాయుడు, అంతర్జాతీయ సమగ్ర టెర్మినల్ భవన నిర్మాణానికి కూడా భూమిపూజ చేస్తారు.

singapore 04122018 1

ప్రస్తుతం మంగళ, గురువారాల్లో రెండు రోజులు సింగపూర్‌కు సర్వీసులు నడుస్తాయి. రద్దీని బట్టి వీటిని పెంచనున్నారు. 180 సీటింగ్‌ ఉన్న ఏ320 ఎయిర్‌బస్‌లను సింగపూర్‌కు ఇండిగో నడుపుతోంది. టిక్కెట్‌ ధర రూ.7,500 నుంచి రూ.10,422గా నిర్ణయించారు. సింగపూర్‌ నుంచి కూడా మంగళ, గురువారాల్లోనే విజయవాడకు సర్వీసులు నడుస్తాయి. సింగపూర్‌లో ఉదయం 11.40కు బయలుదేరే విమానం మధ్యాహ్నం 3.45కు గన్నవరం చేరుతుంది. గన్నవరం నుంచి నేడు బయలుదేరి వెళ్లనున్న తొలి సర్వీసుకు 99, సింగపూర్‌ నుంచి ఇక్కడికి వచ్చే సర్వీసుకు 150 టిక్కెట్లు బుక్కయ్యాయి.

చైనా ప‌ర్య‌ట‌న‌కు లోకేష్‌ని ఎవ‌రూ పిల‌వ‌లేద‌ని, రూ.30 కోట్లు ఖ‌ర్చు పెట్టి స్లాట్‌ కొనుక్కున్నాడు అంటూ, అటు జగన్, పవన్, బీజేపీ కలిసి, రెండు నెలల క్రిందట ఎలా హేళన చేసారో తెలిసిందే. అయితే, అప్పుడే వీళ్ళ నోరు మూపిస్తూ, వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం, లోకేష్ కి పంపిన ఆహ్వానంతో పాటు, వివిధ డాక్యుమెంట్ లు చూపించటంతో నోరు మూసారు. ఇది పక్కన పెడితే, రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సెప్టెంబర్ లో లోకేశ్‌ చైనా పర్యటన ఫలితాన్ని ఇస్తుంది. ఆ పర్యటనలోనే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమ టీసీఎల్‌ తిరుపతిలో పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, చైనాకు చెందిన మల్టీనేషనల్‌ ఎలక్ర్టానిక్స్‌ కంపెనీ ‘సన్నీ ఆప్టికల్స్‌’ రాష్ట్రంలో రూ.500కోట్లతో ప్లాంట్‌ ఏర్పాటు చేయనుంది. తద్వారా 2500 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

lokesh 04122018 1

చైనా పర్యటనకు వెళ్లిన సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ సదరు కంపెనీ ఉప డైరక్టర్‌ ఆరాన్‌తో చర్చలు జరిపారు. రాష్ట్రంలో ఉన్న అవకాశాల గురించి వివరించి... పూర్తి సహకారం అందిస్తామని, రాష్ట్రానికి రావాలని కోరారు. దీంతో సన్నీ ఎలక్ర్టానిక్స్‌ రాష్ట్రానికి వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. మంగళవారం నాడు లోకేశ్‌ సమక్షంలో పెట్టుబడులకు సంబంధించి ఒప్పందం జరగనుంది. కెమెరా మాడ్యుల్స్‌, ఆప్టికల్‌ కాంపొనెంట్స్‌ తయారీలో సన్నీ ఆప్టికల్స్‌కు మంచి పేరుంది. సెల్‌ఫోన్‌ తయారీ కంపెనీలు హువాయ్‌, జియోమీ, ఒప్పో, వివో, లెనోవో, సోనీ, పానాసోనిక్‌, ఒలంపస్‌, కార్ల్‌జిస్‌ లాంటి కంపెనీలకు ఆప్టికల్‌ కాంపొనెంట్స్‌ను సన్నీ ఎలక్ర్టానిక్స్‌ తయారుచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీలో 28వేల మంది పనిచేస్తున్నారు.

lokesh 04122018 1

మొబైల్‌ ఫోన్లు, టీచింగ్‌ సపోర్ట్‌, ఆప్టికల్‌ ఇమేజింగ్‌ సేవలను సన్నీ ఆప్టికల్స్‌ అందిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో 15వేల మంది ఒకేచోట పనిచేసేలా ఫాక్స్‌కాన్‌ కంపెనీని తీసుకురాగా.. తిరుపతిలో రానున్న రిలయన్స్‌ సెజ్‌లో దాదాపు 35 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. మరో పక్క, విశాఖలో ఇంటెలిజెంట్‌ గ్లోబల్‌ హబ్‌(ఐ-హబ్‌) ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనను యునెస్కో స్వాగతించింది. డిజిటల్‌ మేథా సంపత్తికి సంబంధించి ఐ-హబ్‌ ఏర్పాటుచేసేందుకు 50 ఎకరాలను కేటాయిస్తున్నట్లు ఇటీవల విశాఖలో జరిగిన టెక్‌-2018 సదస్సులో చంద్రబాబు ప్రకటించారు. యునెస్కోకు అనుబంధంగా పనిచేస్తున్న మహాత్మాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ సస్టెయినబుల్‌ డెవల్‌పమెంట్‌(ఎంజీఐఈపీ) సంచాలకులు ఆచార్య డాక్టర్‌ అనంత దురైయ్యప్ప దీనిపై చంద్రబాబుకు లేఖ రాశారు. యునెస్కో ఎంజీఐఈపీ-ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందంతో ఐ-హబ్‌ ఏర్పాటు... గ్లోబల్‌ డిజిటల్‌ విద్యా విధానాలను విస్తృతం చేసేందుకు ఉపయోగపడుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఏపీతో తాము ఈ ప్రాజెక్టులో భాగస్వామి అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

రేవంత్‌రెడ్డిని అరెస్ట్‌ తో తెలంగాణాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రేవంత్ ను అరెస్ట్ చేసి ఎక్కడికి తరలించారో చెప్పాలని ఆయన సతీమణి గీత డిమాండ్‌ చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగానే అరెస్ట్‌ చేశామని పోలీసులు చెప్పడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 8 గంటలుగా ఓపికగా ఉన్నామని, కుటుంబసభ్యులతో పాటు రేవంత్‌ అనుచరులు, అభిమానుల్లో ఆందోళన నెలకొందని చెప్పారు. కొడంగల్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలనే తాము కోరుకుంటున్నామని గీత చెప్పారు. రేవంత్‌ను తీసుకెళ్లింది పోలీసులో కాదో తామెలా నిర్ధారించుకోవాలని ప్రశ్నించారు.

revanth 04122018 2

స్థానిక పోలీసులైతే హెల్మెట్లు పెట్టుకుని ఎందుకు వస్తారన్నారు. గుర్తింపు కార్డులు, అరెస్ట్‌ వారెంట్ కూడా చూపించకుండా రేవంత్‌ను తీసుకెళ్లారన్నారు. తీసుకెళ్లింది పోలీసులే అయినప్పుడు ఎక్కడున్నారో చెప్పడానికి ఇబ్బందేంటని ఆమె ప్రశ్నించారు. కార్యకర్తలంతా సంయమనంతో ఉన్నారని, రేవంత్‌ ఎక్కడున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కుటుంబసభ్యులుగా రేవంత్‌ వివరాలు తెలుసుకోవాల్సిన బాధ్యత తమకు లేదా అని ప్రశ్నించారు. 144 సెక్షన్ అమలులో ఉన్నప్పుడు కేసీఆర్ సభ ఎలా నిర్వహిస్తారని ఆమె పోలీసులను ప్రశ్నించారు. అయితే... ఆమె ప్రశ్నకు పోలీసులు స్పందిస్తూ.. సభకు అనుమతులున్నాయని చెప్పారు.

revanth 04122018 2

అయితే.. సభకు వెళ్లేందుకు తనకు కూడా అనుమతినివ్వాలని ఆమె పోలీసులను కోరారు. తెల్లవారుజామున 3గంటలకు బెడ్‌రూం లోపలికొచ్చి దొంగను ఈడ్చుకెళ్లినట్టు ఈడ్చుకెళితే చూస్తూ ఊరుకోవాలా అని రేవంత్ భార్య గీత పోలీసులను ప్రశ్నించారు. నేను కేసీఆర్ సభకు వెళ్తాను అంటూ ఆమె సంచలన నిర్ణయం తీసుకోవటంతో ఒక్కసారిగా పోలీసులు అలెర్ట్ అయ్యారు. కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ కేసీఆర్‌ కుట్రే అని ఆరోపించారు. కాంగ్రెస్‌ అభ్యర్థుల్ని కేసీఆర్‌ వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్‌ సభ ఉంటే రేవంత్‌రెడ్డిని ఎలా అరెస్ట్‌ చేస్తారన్నారు. ‘రేపు ఇదే పరిస్థితి నీ కూతురికి జరిగితే...ఎలా ఉంటుందో కేసీఆర్‌ ఆలోచించుకోవాలి’ అని కేసీఆర్‌ను జైపాల్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు.

Advertisements

Latest Articles

Most Read