ఇప్పటికే లగడపాటి పై తెరాస కారాలు మిరియాలు నూరుతూ ఉండగా, తాజాగా లగడపాటి, కరీంనగర్‌ జిల్లాలోని చొప్పదండి కాంగ్రెస్‌ అభ్యర్థి మేడిపల్లి సత్యంకు లగడపాటి ఫోన్‌ చేసి తన అంచనా వెల్లడించారని కథనాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. లగడపాటి రాజగోపాల్‌, మేడిపలిసత్యంలు తెలంగాణ ఉద్యమంలో హోరాహోరీ తలపడిన నాయకులు. ఇలాంటి సందర్భంలో లగడపాటి నేరుగా మేడిపల్లి సత్యంకు ఫోన్‌చేసి చిన్న వయస్సులోనే పెద్ద ఫాలోయింగ్‌ సంపాదించావు.. ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్నావు.. ఇది ఎలా సాధ్యమయిందని అడిగారట. తాను చేసిన సర్వే వివరాలతో పాటు, ఈ ఎన్నికల్లో సత్యంకు ఎన్ని ఓట్లు వస్తాయి అనేది తెలిపారట. దీంతో ఉబ్బితబ్బిబ్బయిన సత్యం తాను విద్యార్థి ఉద్యమం నుంచి ప్రస్తుత స్థితి వరకు వివరించినట్టు సమాచారం.

lagadapati 03122018

మరో పక్క, మహాకూటమి చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థి మేడిపల్లి సత్యం చొప్పదండి నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ఊరూరా ప్రచారం ఉదృతంగా నిర్వహిస్తున్నారు.చొప్పదండి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నియోజక వర్గ ప్రజలనుండి విశేష స్పందన లబిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ,మహా కూటమి నాయకుల్లో నయ జోష్ కనబడుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేడిపల్లి సత్యం సోమవారం రోజు బోయినిపల్లి మండలం దేశాయిపల్లి,జగ్గరావు పల్లి, వరదవెల్లి,కొదురుపాక, నీలోజిపల్లి, వెంకట్రావుపల్లి,మల్లాపూర్, మానువాడ, కొత్తకోట, నర్సింగపూర్ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

lagadapati 03122018

ఈ సందర్బంగా భారీగా తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ చొప్పదండి ఎమ్మెల్యేగా తనను ఆశీర్వదించండి బోయినిపల్లి మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ది చేస్తానని,గడిచిన నాలుగున్నర సంవత్సరాల టిఆర్‌ఎస్ పాలనలో ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం రాష్ట్రంలో పేదల సంక్షేమానికి,పేద ప్రజల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. చొప్పదండి నియోజకవర్గంలో పలు స్వచ్చంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తు,బలమైన వేలాది మంది కార్యకర్తలు కలిగి ఉన్న గంగాధర సింగిల్ విండో ఛైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి మిత్రమండలి సభ్యులు సుమారు 3వేల మంది ఆదివారం రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ శ్రేణుల్లో నయా జోష్ నింపింది.

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ 5వ తారీఖు దాకా అక్కడే మకాం వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. నిజానికి చంద్రబాబు రెండు రోజులు మాత్రమే ప్రచారం చేద్దామని అనుకున్నారు. కాని కేసీఆర్, కేటీఆర్ రెచ్చగొట్టే మాటలతో, చివరి వారం రోజులు కీలకమని చంద్రబాబు భావించారు. వీరు చేసే తప్పుడు ప్రచారాలు, అక్కడే తిప్పికొట్టాలని, వ్యూహం మార్చుకుని, మరో అయిదు రోజులు పాటు, తెలంగాణా ఎన్నికల ప్రచారంలో పాల్గునాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ దెబ్బతో కేసీఆర్ కి కూసాలు కదులుతున్నాయి. అదీ చంద్రబాబు హైదరబాద్ పరిధిలోనే తిరుగుతూ ఉండటంతో, హైదరాబాద్ నియోజకవర్గాల పై కేసీఆర్ పెట్టుకున్న ఆశలు, రోజు రోజుకీ పోతున్నాయి. అనవసరంగా చంద్రబాబుని రెచ్చగొట్టి, ఇక్కడ దాకా తెచ్చుకున్నాం అనే భావాన తెరాసలో ఉంది. తెలంగాణ ఎన్నికలు మహాకూటమికి ప్రతిష్టాత్మకం కావడంతో అవసరమైతే కాంగ్రెస్ అభ్యర్థుల తరుపున కూడా ప్రచారం చేయాలని యోచిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ, కేసీఆర్ టార్గెట్‌గా ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం వ్యూహరచన చేస్తున్నారు.

kcr 03122018

రాహుల్ గాంధీతో కలసి పాల్గొన్న బహిరంగసభలతో పాటు స్వయంగా రోడ్‌షోలు నిర్వహిస్తూ పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రచారం చేస్తున్నారు. అంతకు ముందు తెలంగాణకు చంద్రబాబు వస్తే ప్రతిఘటించాల్సిందిగా టీఆర్‌ఎస్ శ్రేణులకు కేసీఆర్ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు అక్కడే మకాంవేసి పార్టీ విజయావకాశాలను బేరీజు వేస్తున్నారు. ప్పటి వరకు ఖమ్మం జిల్లాతో పాటు సనత్‌నగర్, నాంపల్లిలో పర్యటన పూర్తిచేసిన చంద్రబాబు శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో నిర్వహించిన రోడ్‌షోలు సక్సెస్ కావడంతో టీఆర్‌ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని కూటమి గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు.

kcr 03122018

సెటిలర్లు అధికంగా ఉన్న కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, రాజేంద్రనగర్‌లో కూటమి అభ్యర్థుల విజయం తథ్యమని చెప్తున్నారు. ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపు నల్లేరు పై బండినడకే అని భావిస్తున్నారు. కూకట్‌పల్లితో పాటు ఈ నియోజకవర్గంలోనూ సెటిలర్లు అధికంగానే ఉన్నందున టీడీపీకి విజయావకాశాలపై అంచనా వేస్తున్నారు. తెలంగాణలో కూటమి పొత్తులో భాగంగా టీడీపీ పోటీచేస్తున్న 13 నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల విజయం సాధించేందుకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేల్లో సీనియర్లను నియమించారు. గత కొద్దిరోజులుగా పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, పలువురు మంత్రులు హైదరాబాద్‌లో మకాంవేసి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తున్నారు.

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ సీరియస్‌‌గా తీసుకుంది. శనివారం రాత్రి కొడంగల్‌ నియోజకవర్గంలో పోలీసులతో అర్దారాత్రి దాడులు చేపించిన నేపధ్యంలో రేవంత్ ధర్నా చేసారు. ఆ సమయంలో కేసీఆర్ చేస్తున్న పనుల పై దుమ్మెత్తి పోస్టు, ఈ నెల 4న కొడంగల్ బంద్ కు పిలుపిచ్చారు. అయితే, మరుసటి రోజు దాన్ని ఉపసమహరించుకున్నారు కూడా. అయితే, శనివారం భయాందోళనలు సృష్టించిన రేవంత్‌రెడ్డి.ని, ఈ నెల 4న సీఎం కేసీఆర్‌ సభను అడ్డుకోవడంతో పాటు బంద్‌కు పిలుపునిచ్చి ఆందోళనకు గురిచేశారని ఎన్నికల కమిషన్‌‌కు టీఆర్‌ఎస్‌ ఫిర్యాదు చేసింది. రేవంత్ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి సీఈఓ ఆదేశాలు జారీచేశారు.

revanth 03122018

రేవంత్‌రెడ్డిపై తగు చర్యలు తీసుకోవాలని డీజీపీని ఈసీ ఆదేశించింది. రేవంత్‌పై ఏం చర్యలు తీసుకున్నారో సోమవారంలోగా వివరణ ఇవ్వాలని సీఈఓ ఆదేశించారు. అయితే అదే సందర్భంలో, తెరాస అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు చేసిన సమయంలో ఎన్నికల ఖర్చుల వివరాలు, డైరీ లభించాయని రేవంత్ వర్గం ఆరోపిస్తుంది. మండలాల వారీగా నేతల కొనుగోళ్లు, పెట్టిన ఖర్చులు, మద్యం కొనుగోలుకు చేయాల్సిన అంచనాలు తదితర వివరాలతోపాటు రూ. 17.51 కోట్ల నగదు దొరికిందన్నారు. ఇప్పటి వరకు ఆయన సుమారు రూ. 50 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ఐటీ అధికారులే రూ. 5 కోట్లకు ఖర్చు తేల్చారని, దీని ఆధారంగా పట్నం నరేందర్‌రెడ్డిపై అనర్హత వేటు వేయాలని ఎన్నికల అధికారులను కోరారు. కాని ఆ విషయం పై ఎటూ తెల్చిని ఈసీ, తన పై దాడులు జరుగుతున్నాయని, కేసీఆర్ పై విమర్శలు చేసినందుకు మాత్రం, వెంటనే రేవంత్ పై చర్యలు తీసుకోమనటం గమనార్హం..

 

revanth 03122018

అయితే రేపు కేసీఆర్ సభ, అదేరోజున నిరసన ర్యాలీలకు కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి ప్రకటన.. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు సోమ, మంగళవారాల్లో కొడంగల్‌లో 144 సెక్షన్‌ విధిస్తున్నట్లు ప్రకటించారు. ‘‘నేనొక్కడినే.. కేసీఆర్‌కి మందీ మార్బలం, అధికారం, కమీషన్లు ఇచ్చే గుత్తేదారులు ఉన్నారు. ఈ ఎన్నికలు కొడంగల్‌ ఆత్మగౌరవానికి, కేసీఆర్‌ కౌరవ సైన్యానికి మధ్య జరుగుతున్నాయి. ఒక్కరు కాదు వందమంది కేసీఆర్‌లు వచ్చినా పాతాళానికి తొక్కుతా’నంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై కోపంతో కొడంగల్‌కు తీరని అన్యాయం చేసిన కేసీఆర్‌ ముందుగా ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వాల మెడలు వంచి తాను తెచ్చుకున్న నారాయణ్‌పేట్‌ ఎత్తిపోతల వంటి అనేక పథకాలు అమలు కాకుండా అడ్డుపడ్డారని.. చివరకు విద్యాసంస్థలను కూడా ఏర్పాటుకానివ్వలేదని ఆరోపించారు. కోయిల్‌సాగర్‌ తాగునీటి పథకానికి రూ. 100 కోట్లు ఖర్చు చేసిన తర్వాత దాన్ని ప్రజలకు దూరం చేసిన దుర్మార్గులని రేవంత్ ఆరోపించారు.

పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే గేట్లు అమర్చే ప్రక్రియ ఈ నెల 17వ తేదీ నుండి ప్రారంభిస్తామని జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. ఆదివారం సాయంత్రం పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వచ్చిన మంత్రి దేవినేని గేట్లు అమర్చే ప్రాంతాన్ని నిపుణుడు కన్నపనాయుడుతో కలసి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ నుండి 41వ బ్లాకు వద్ద గేట్లు అమర్చడం ప్రారంభిస్తామన్నారు. ఒక గేటు అమర్చేందుకు ఎన్ని రోజులు పడుతుంది, ఎంతమంది సిబ్బంది పని చేయాలనేది ఒక అవగాహనకు వచ్చి మిగిలిన 47 గేట్లు అమర్చేందుకు ముందుకు వెళ్తామన్నారు. ఎగువ కాపర్‌డ్యామ్ పనులు జరుగుతున్నాయని, రెండున్నర నెలల్లో ఈ పనులు పూర్తవతాయని మంత్రి తెలిపారు.

polavaram 03122018

అలాగే వచ్చే జనవరి నుండి ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యాం పనులు ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. ఛత్తీశ్‌ఘడ్ ఒరిస్సా రాష్ట్రాలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలని కోర్టులో కేసు వేసిన నేపధ్యంలో సోమవారం కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉందన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూలంగా దాఖలు చేస్తుందా లేదా అన్నది చూడాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఛత్తీస్‌గఢ్, ఒడిసా రాష్ట్రాల్లో ముంపునకు సంబంధించి నష్టపరిహారం ఇప్పటికే డిపాజిట్ చేయడం జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఛత్తీస్‌ఘడ్ 1.5 టీఎంసీలు, ఒరిస్సా 5 టీఎంసీలు గోదావరి నీటిని వినియోగించుకోవచ్చునన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 3200 కోట్ల రూపాయలు కేంద్రం చెల్లించాల్సి ఉందన్నారు.

polavaram 03122018

ప్రాజెక్టు నిర్మాణం సవరించిన అంచనాలను కేంద్రం ఆమోదించాలన్నారు. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసినట్టు మంత్రి తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ఖర్చులు, పనుల వివరాలు మొత్తం ప్రతీ వారం ఆన్‌లైన్‌లో పెడుతున్నామన్నారు. ఎవరైనా వాటిని పరిశీలించుకోవచ్చునన్నారు. పట్టిసం ఎత్తిపోతల పథకం ద్వారా ఈ సీజన్‌లో సుమారు వంద టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలించినట్టు మంత్రి తెలిపారు. గత నాలుగు సీజన్లలో ఇప్పటి వరకూ మొత్తం 262 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలించామని మంత్రి దేవినేని తెలిపారు. మంత్రి వెంట నవయుగ కాంట్రాక్టు ఏజెన్సీ ఎండీ శ్రీ్ధర్, ఛీఫ్ ఇంజినీరు వి శ్రీ్ధర్, ఎస్‌ఈ విఎస్ రమేష్‌బాబు, డిఎస్పీ ఎటీవీ రవికుమార్, ఎస్‌ఐ కె శ్రీ్ధర్ తదితరులున్నారు.

Advertisements

Latest Articles

Most Read