గత రెండు మూడు రోజులుగా, సిబిఐ మాజీ జేడీ కొత్త పార్టీ పెడుతున్నారని, దాని పేరు వందేమాతరం అని, జనధ్వని అని, ఇలా అనేక వార్తలు వచ్చాయి. కొత్త పార్టీ ప్రకటన ఈ రోజు ఉంటుందని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు ఆయన కొత్త పార్టీ పెట్టటం లేదని, పాత పార్టీలోనే, కొత్తగా ఎంట్రీ ఇస్తున్నారని సమాచారం. ఆయాన లోక్‌సత్తా పార్టీలో చేరి, లోక్‌సత్తా అధినేత కానున్నట్లు తెలిసింది. కొత్త పార్టీ ఏర్పాటు ప్రయత్నాన్ని విరమించుకుని లోక్‌సత్తాలో అధ్యక్ష పదవి స్వీకరించబోతున్నట్లు సమాచారం. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని ప్రియదర్శిని హాల్లో సోమవారం ఉదయం 10 గంటలకు జరిగే సమావేశంలో దీనిపై అధికారికంగా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
ఏపిలో పర్యటన తరువాత, కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారు. జనధ్వని అనే పేరును కూడా పరిశీలించారు. అయితే కొత్త పార్టీ ఏర్పాటు చేయడం కంటే, లోక్‌సత్తా వంటి పార్టీలో చేరి దాన్ని నడిపించడం మేలనే భావనకు తాజాగా వచ్చారు. దీనిపై లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణతో సంప్రదింపులు జరిపారు. భావజాలం, ప్రజాసమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల విషయంలో ఇద్దరి ఆలోచనలు ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. జేడీతో పాటు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న వారు లోక్‌సత్తాలో చేరి కలిసి నడుస్తారు. లోక్‌సత్తా అధినేతకు సలహాలు, సంప్రదింపుల బాధ్యతలో జేపీ ఉంటారు.
అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ఎంట్రీ ఇస్తాను, ఇక్కడ రైతులని ఉద్దరిస్తాను అంటున్న లక్ష్మీనారయణ, హైదరాబాద్ లో ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ఎంట్రీ గురించి చెప్తారంట. మన ఖర్మ కాకపొతే, ఇప్పటికే ఒకడు ప్రతి గురువారం ఉదయం హైదరాబాద్ పోయి, అక్కడ రెండు రోజులు రెస్ట్ తీసుకుని, ఇక్కడకు వచ్చి రాజకీయం చేస్తాడు. ఇంకొకడు, నాలుగు రోజులు ఇక్కడ తిరిగి, మళ్ళీ హైదరాబాద్ పోయి, అక్కడ ఓ 10 రోజులు ఫార్మ్ హౌస్ లో పడుకుని, మళ్ళీ ఇక్కడకు వచ్చి రాజకీయం చేస్తాడు. వీళ్ళకు తోడు, ఇంకో ఆంధ్రాభాదీ, లక్ష్మీనారాయాణ వస్తున్నారు. ఆ ప్రకటన చేసేది ఏ విజయవాడలోనో, తిరుపతిలోనో, వైజాగ్ లోనో చెయ్యొచ్చు కదా సార్. ఏదేమైనా 2009లో చంద్రబాబుని దెబ్బ తియ్యటానికి లోక్‌సత్తా, చిరంజీవి పార్టీలను పెట్టి ఎలా ప్రజలను కన్ఫ్యూజ్ చేసారో, ఇప్పుడు లోక్‌సత్తా రీలోడెడ్, ప్రజారాజ్యం రీలోడెడ్ తో ప్రజలను బకరాలను చేసి, చంద్రబాబుని తప్పించటానికి మళ్ళీ అన్ని వైపుల నుంచి తరుముకొస్తున్నారు.