తెలంగాణ ప్రజా కూటమిలో మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఒంటేరు ప్రతాపరెడ్డిని 'ఒకే ఒక్క మగాడ'ని తెలంగాణ ప్రజలు కొనియాడుతున్నాయి. దక్షిణ తెలంగాణలో టీఆర్ఎస్ అరాచకాలు తట్టుకోలేక అల్లాడుతుంటే ప్రతాపరెడ్డి..ఏకంగా ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు గజ్వేల్ నియోజకవర్గంలో చెమటలు పట్టిస్తుండటమే దీనికి కారణం. అనేక సర్వేల్లో కేసీఆర్ ఈ స్థనంలో గడ్డు పరిస్థితి ఎదుర్కుంటున్నారని చెప్పటంతో, ఏకంగా అక్కడ హరీష్ రావుని క్యాంప్ వేయించారు కేసీఆర్. ఒంటేరు ప్రతాపరెడ్డి అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి కంటే భయపడుతున్నాడు కేసీఆర్. అందుకే నానా రకాలుగా తన దగ్గర ఉన్న అధికారంతో ఒంటేరు ప్రతాపరెడ్డిని ఇబ్బంది పెడుతున్నాడు.

kcr 27112018

కొంపల్లిలోని ప్రతాప్‌రెడ్డి కుమారుడు విజయ్‌రెడ్డి ఇంట్లో సోమవారం అర్ధరాత్రి దాదాపుగా 50 మంది పోలీసులు వచ్చి, ఇంటిని చుట్టుముట్టి, ఇంటి లోపలకి వెళ్లి సోదాల పేరుతో, ఇళ్ళంతా చిందర వందర చేసారు. ఇంట్లో నగదు, మద్యం భారీగా ఉందని ఎన్నికల అధికారులకు ఎవరో ఫిర్యాదు చేశారని, వారి ఆదేశాల మేరకు ఇంట్లో సోదాలు చేసేందుకు వచ్చామని పోలీసులు వివరించారు. సోదాల్లో నగదు, మద్యం దొరకలేదు. రెండుమూడు రోజులుగా పోలీసులు తనను వెంటాడుతున్నారని ప్రచారం చేసుకోవడానికి కూడా వెళ్లలేకపోతున్నానని వివరించారు. వంటేరు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొందని తెలియడంతో కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు.

kcr 27112018

కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై 27 కేసులు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో ఫిర్యాదు ఇచ్చిన తర్వాత విలేకర్లతో మాట్లాడారు. గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే రూ.50 కోట్లు ఖర్చు చేశారన్నారు. మరోపక్క తమ ఫోన్లను ట్యాపింగ్‌ చేస్తున్నారని, తన వెంట సివిల్‌ పోలీసులను ఉంచి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ ఫాంహౌ్‌సలో డబ్బులు ఉన్నాయన్నారు. అక్కడ పోలీసులు ఎందుకు తనిఖీలు చేయడం లేదని ప్రశ్నించారు.ు. గజ్వేల్‌లో కేసీఆర్‌కు 337 ఎకరాలుంటే కేవలం 57 ఎకరాలనే అధికారికంగా ప్రకటించారని.. మిగిలిన భూములు ఎవరివనే విషయమై విచారణ జరిపించే దమ్ముందా? అని సవాల్‌ విసిరారు. మంత్రి హరీశ్‌రావు గల్లీ లీడర్‌లా వ్యవహరిస్తూ అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని ధ్వజమెత్తారు.

కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో తీసుకొస్తున్న పౌరసత్వ (సవరణ) చట్టం-2016ను వ్యతిరేకిస్తూ తాము చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిందిగా అఖిల అసోం విద్యార్థుల సంఘం ముఖ్యమంత్రి చంద్రబాబును అభ్యర్ధించింది. సోమవారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్ నాయకులు అసోంలో స్థానికులను మైనారిటీలుగా మార్చేందుకు కేంద్రం చేస్తున్న కుట్రను తిప్పికొట్టడంలో సహకరించాలని కోరారు. అసోంలో సరిహద్దు వలసలపై 1979 నుంచి ఆందోళన చేస్తున్న అఖిల అసోం విద్యార్థుల సంఘం (ఎఎఎస్‌యు) దీనిపై సవరణ చట్టం తెచ్చేందుకు ఇటీవల జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవడంలో గట్టిగా పోరాటం చేస్తోంది.

assam 27112018 2

దేశంలో బీజేపీయేతర రాజకీయపక్షాలను ఏకం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మద్దతు తమకు అత్యంత అవసరమని భావించిన అఖిల అసోం విద్యార్థుల సంఘం (ఎఎఎస్‌యు) భావిస్తోంది. అందులో భాగంగా ముఖ్యమంత్రిని కలిసి సమస్యను కూలంకుషంగా వివరించి తమ పోరాటానికి మద్దతు కావాలని కోరింది. అసోం స్థానిక ప్రజానీకం ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నా సవరణ బిల్లును ఆర్డినెన్సు రూపంలో తెచ్చేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీన్ని అడ్డుకునేందుకు రాజకీయంగా తమకు సహకరించాలని అడిగింది. వలసల సమస్యకు మతకోణాన్ని జోడించి పబ్బం గడుపుకునేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ కుటిల యత్నాలు చేస్తోందని ఎఎఎస్‌యు నేతలు ముఖ్యమంత్రికి వివరించారు. స్థానికుల ఆకాంక్షలకు విరుద్ధంగా బీజేపీ ఈ బిల్లును తెచ్చిన పక్షంలో రెండు దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉన్న అసోంలో మళ్లీ గొడవలు రాజుకొనే పరిస్థితులు అధికంగా ఉన్నాయని వారీ సందర్భంగా ఆందోళన వెలిబుచ్చారు.

assam 27112018 3

అసోం ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సునిశిత సమస్యపై పార్టీలో చర్చించి అక్కడి స్థానికులకు అన్నివిధాలుగా న్యాయం జరిగేలా ఎలా వ్యవహరించాలన్న అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎఎఎస్‌యు ప్రతినిధులకు చెప్పారు. జాతీయ సమగ్రతను కాపాడే ఆలోచన కేంద్ర పాలకుల్లో ఏకోశానా కనిపించడం లేదని, రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాలతో ఆడుకుంటున్నారని ఆయనీ సందర్భంగా ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను గౌరవించడం పాలకుల విధిగా చెబుతూ, దానికి విరుద్ధంగా వ్యవహరించే శక్తులపై పోరాడటానికి ప్రజాస్వామ్యవాదుల ఏకీకరణ అనివార్యమని అన్నారు. గతంలో అసోంలో జరిగిన అనేక విద్యార్ధి పోరాటాలకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసిన ఎఎఎస్‌యూ అధ్యక్షుడు దీపాంక కుమార్ నాథ్, పార్లమెంటులో ఈ సమస్యపై పోరాడేందుకు సీనియర్ రాజకీయవేత్తగా తమకు మార్గదర్శనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో దీపాంకతో పాటు స్టూడెంట్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి లురిన్ జ్యోతి గొగొయ్. ముఖ్య సలహాదారు సముజ్జల్ భట్జాచార్య, ప్రొఫెసర్ బసంత్ దేకా, గౌహతి యూనివర్శిటీ ప్రొఫెసర్ శిఖా శర్మ ఉన్నారు.

శ్రీకాకుళంలో ప్రవేశించిన జగన్ మోహన్ రెడ్డికి, జగన్ గో బ్యాక్ అంటూ నినాదాలు వచ్చాయి. ఆదివారం సాయంత్రం కాశీబుగ్గ ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు ప్ల కార్డులు పట్టుకొని నిరసన చేపట్టారు. ఏ మొహం పెట్టుకొని జిల్లాలో జగన్‌ ప్రజాసంకల్పయాత్ర నిర్వహిస్తారని జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌతు శిరీష ప్రశ్నించారు. శిరీష మాట్లాడుతూ తితలీ తుపానుతో ప్రజలు సర్వస్వం కోల్పోతే పట్టకుండా వ్యవహరించడం దారుణమన్నారు. సీఎం చంద్రబాబు, ఇతర మంత్రులు, రాష్ట్ర యంత్రాంగమంతా వచ్చి సహాయ చర్యలు చేపట్టడం ఈ ప్రాంత ప్రజలు మరువలేదన్నారు. రికార్డుస్థాయిలో తక్కువ వ్యవధిలో బాధితులకు పరహారం అందిందన్నారు. కానీ జగన్‌ పక్క జిల్లాలో ఉన్నా కనీసం పరామర్శించిన పాపాన పోలేదన్నారు.

jagan 26112018 2

ఆయనకు జిల్లాలో అడుగు పెట్టడానికి అసలు అర్హతే లేదన్నారు. ప్రజలు ప్రశ్నించాలని, రాబోయే ఎన్నికల్లో ఆయనకు తగురీతిలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజలు కష్టాల్లో ఉంటే పట్టించుకోకుండా..ఇప్పుడు సిగ్గు లేకుండా పాదయాత్రకు బయలుదేరారని జగన్‌పై మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆధ్వర్యంలో రాజాంలో ఆదివారం భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి..అంబేద్కర్‌ జంక్షన్‌ వద్ద మాన వహారం చేపట్టారు. జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోండ్రు మురళీమోహన్‌ మాట్లాడుతూ తితలీ బాధితులకు సీఎం చంద్రబాబు కన్నతండ్రిలా ఆదుకున్నారని కొనియాడారు. బాధితుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.

jagan 26112018 3

గంటల వ్యవధిలో వెళ్లి పరామర్శించడానికి అవకాశం ఉన్నా జగన్‌ ముఖం చాటేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ మూల్యం చెల్లించుకుంటారన్నారు. జిల్లా ప్రజలకు జగన్‌ క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. ఆయన మాట్లాడుతూ, విపక్ష పాత్రను కూడా సరిగ్గా చేపట్టడం లేదని ఎద్దేవా చేశారు. జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర పేరుతో ఆటవిడుపు యాత్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. పాద యాత్రకు ఒక ల క్ష్యం, సిద్ధాంతం లేదన్నారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమ యంలో రెండు లక్షల ఎక రాల ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన ఘనుడు జగన్‌ అన్నారు.. అటువంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తి జిల్లాలో పాదయాత్రకు అడుగుపెట్టడం దురదృష్టకరమన్నారు. సుమారు రెండున్నర లక్షల కుటుంబాలు తితలీ తుపానుతో నష్టపోతే...ఒక్క కుటుంబాన్ని పరామర్శించే తీరిక లేకపోవడం దారుణమన్నారు. కోడికత్తి డ్రామాలకు ఉన్న సమయం తితలీ బాధితుల పరామర్శకు లేదా అని ప్రశ్నించారు. పాదయాత్ర చేసే హక్కు జగన్‌కు లేదని... ప్లకార్డులు పట్టుకుని జగన్‌ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఏపి రాజకీయ చరిత్రలో పెను సంచలనం చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ ని సియం చేస్తాను అంటూ, ప్రజా శాంతి పార్టీ కేఏ పాల్ ప్రకటించారు. పవన్ సొంత ఛానల్ అయిన 99 టీవీలో ఇంటర్వ్యూ ఇస్తూ, పవన్ కళ్యాణ్, నేను కలుస్తాం, పవన్ ను సియం ని చేస్తాను, పవన్ కు పెద్దగా తెలియదు కాబట్టి, నేను ప్రపంచమంతా తిరిగి పెట్టుబడులు తెస్తాను అంటూ కేఏ పాల్ స్పష్టం చేసారు. నా చేతిలోనే ఉంది, ఏది కావాలంటే అది చేస్తా, పవన్ స్పీచ్ లు ఈ రోజే చూసాను, ఆయన ధైర్యం చూస్తుంటే, నా తమ్ముడు లాగా అనిపించింది, అప్పుడే ఎవరో ఫోన్ చేసి, ఇద్దరూ కలిసి పని చెయ్యాలి అని అన్నారు, అప్పుడే డిసైడ్ అయ్యాను, పవన్ ని ఆంధ్రప్రదేశ్ సియం ని చెయ్యాలని డిసైడ్ అయ్యాను, అవసరం అయితే తన పార్టీ నా పార్టీలో విలీనం చెయ్యవచ్చు, ఇద్దరం కలిసి పని చేస్తామని, కేఏ పాల్ అన్నారు.

pk 26112018

కేఏ పాల్ ప్రకటననతో, ఇక నేను మళ్ళీ సియం కాలేను అని చంద్రబాబు అనుకుంటున్నట్టు, జగన ఇక పాదయాత్ర ఆపేసి, లోటస్ పాండ్ వెళ్లిపోవాలి అంటూ, జనసైనికులు పోస్ట్ లు పెడుతున్నారు. పవన్, కేఏ పాల్ కలిస్తే, ఇక చంద్రబాబు, జగన్ పని అంతే అని అంటున్నారు. ఇది ఒక సంచలన కలయిక అని, పవన్ ఛానల్ లోనే, కేఏ పాల్ ఈ మాట చెప్పారు అంటే, పవన్, కేఏ పాల్ కలవటం ఇక లాంఛనమే అంటున్నారు. కేఏ పాల్ చెప్పటంతోనే, వైజాగ్ లో విజయమ్మ ఓడిపోయిందని, క్రీస్టియన్లు మొత్తం కేఏ పాల్ మాట వింటారని, ఇక జగన్ ఓటు బ్యాంక్ అంతా, మా పవన్ కు వచ్చేస్తుందని, ఇక జగన్ సద్దుకోవాల్సిందే అని అంటున్నారు. కేఏ పాల్ చేసిన ఈ పెను సంచలన వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

pk 26112018

చంద్రబాబుని గెలిపించింది నేనే... చంద్రబాబుకి అనుభవం ఉందని, నేనే మద్దతు ఇచ్చి గెలిపించా... నేను కాపుని, కాని నాకు అన్ని కులాలు ముఖ్యం... చంద్రబాబుకి ఎలా పాలించాలో తెలియదు.. ఏపిలో మార్పు రావాలి, నేను మార్చేస్తా... ఏపి యువత అంతా నా వెంటే ఉన్నారు... తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేసే టైం నాకు లేదు, ముందస్తు రాకుండా ఉంటే పోటీ చేసే వాడిని, తెలంగాణాలో నా టార్గెట్ వచ్చే పార్లమెంట్ ఎన్నికలు... చంద్రబాబు నన్ను చూస్తే భయపడి పోతున్నారు.. చంద్రబాబు నాకు పర్మిషన్ ఇవ్వటం లేదు.. పోయిన ఎన్నికల్లో టిడిపిని నేనే గెలిపించా, ఈ సారి మాత్రం గెలిపించను. అంటూ, పాల్, పవన్ కళ్యాణ్, ఒకే రకమైన భావాలు కలిగి ఉన్నారు. కేఏ పాల్ చెప్పే ప్రతి మాట వింటుంటే, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలే గుర్తుకువస్తున్నాయి అని, అటు జనసేన అభిమానులు, ఇటు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఐడియాలజీకి దగ్గరగా కేఏ పాల్ ఉన్నారు కాబట్టి, ఇద్దరూ కలిస్తే, ఇక చంద్రబాబు, జగన్ ఇంటికే అంటున్నారు. ఒక పక్క తెలంగాణా ఎన్నికలు, ఆంధ్రాలో చంద్రబాబు-మోడీ యుద్ధంతో హీట్ ఎక్కిన వాతవరణం, పాల్-పవన్ ప్రకటనలతో ఆహ్లాదంగా మారింది. కేఏ పాల్ చెప్పిన వీడియో ఇక్కడ చూడవచ్చు https://twitter.com/Iambhargav9/status/1067072136056049664

Advertisements

Latest Articles

Most Read