భాజపా చేసిన నమ్మకద్రోహానికి ఈ గడ్డపై పుట్టిన వారెవ్వరూ ఆ పార్టీకి మద్దతు ఇవ్వబోరని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేంద్రం చేస్తోంది మంచి పనా లేదా చెడ్డదా? అన్నది రాష్ట్రంలోని భాజపా నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ‘రాష్ట్ర ప్రయోజనాల కోసం కష్టపడతారా? లేదా భాజపాకు ఊడిగం చేస్తారా? తేల్చుకోవాలి. మనస్సాక్షి ప్రకారం నడుచుకోవాలి’ అని హితవు పలికారు. మధ్యంతర ఎన్నికలకు ఎందుకు వెళ్లారో తెలంగాణ సీఎం కేసీఆర్‌కే తెలియదని ఎద్దేవా చేశారు. బంగారుబాతులాంటి హైదరాబాద్‌ను అప్పగిస్తే సరిగ్గా సాకకుండా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. విజయనగరం జిల్లాకు చెందిన భాజపా, వైకాపా నేతలు కొందరు శుక్రవారం ఉండవల్లిలో సీఎం చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు.

cbn 17112018 2

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ...‘బెదిరింపులకు ఎన్నడూ భయపడలేదు. కేసీఆర్‌, జగన్‌, పవన్‌కల్యాణ్‌ భాజపాకు మేలు చేసేందుకే నన్ను విమర్శిస్తున్నారు. అవినీతి రహిత రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో ఉంటే అవినీతి అంటూ పవన్‌ విమర్శించడం విడ్డూరం. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.70 వేల కోట్లు రావాలన్నారు. అవిశ్వాసం పెడితే మద్దతిస్తానని అన్నారు.. ఏమైంది? కేంద్రాన్ని ఇప్పుడెందుకు అడగడం లేదు? అవిశ్వాసం పెడితే కనిపించకుండా పోయారు’ అని విమర్శించారు. ‘తిత్లీ తుపానుతో శ్రీకాకుళం జిల్లా అస్తవ్యస్తమయితే ప్రతిపక్ష నేత జగన్‌ కనీసం పరామర్శించలేదు. రాష్ట్రం, ప్రజల పట్ల కనీస బాధ్యత లేని పార్టీ వైకాపా. కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయాలని, ఎన్డీయే నుంచి బయటకు రావాలని.. కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలని అన్నారు. అన్నీ చేశాక గోదా వదిలేసి పరారయ్యారు. లోక్‌సభలో తెదేపా అవిశ్వాసానికి 15 పార్టీలకు చెందిన 126 మంది ఎంపీలు మద్దతిస్తే వైకాపా ఎంపీలు పత్తా లేకుండా పోయారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్న లక్ష్యంతోనే తెదేపా పనిచేస్తుంది’ అని సీఎం స్పష్టం చేశారు.

cbn 17112018 3

‘కేంద్రంలోని బీజేపీ నేతలు నవ్యాంధ్రకు తీరని ద్రోహం చేశారు. పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి బీజేపీ ఓట్లు వేయించుకుంది. గెలిచాక అసలే ఇవ్వకుండా మోసం చేసింది. కేంద్రంపై పోరాడుతున్న టీడీపీకి పార్టీలకతీతంగా అందరూ అండగా నిలవాలి. ఈ గడ్డపై పుట్టినవారెవరూ బీజేపీకి మద్దతివ్వరు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కష్టపడతారా.. కేంద్రంలో బీజేపీ నేతలకు ఊడిగం చేస్తారా? రాష్ట్ర బీజేపీ నేతలే తేల్చుకోవాలి. మోదీ ప్రభుత్వం చేసేది మంచిదో చెడ్డదో ప్రశ్నించుకోవాలి. మనస్సాక్షి ప్రకారం నడుచుకోవాలి’ అని సూచించారు. రాజకీయాలు ప్రజల కోసం చేయాలని.. స్వార్థం కోసం కాదని చెప్పారు.

ముంబయికి చెందిన ప్రఖ్యాత లీలావతి సహా మరో 5 ప్రముఖ ఆసుపత్రుల శాఖలు త్వరలో అమరావతిలో ఏర్పాటు కానున్నట్లు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ప్రాథమిక వైద్యం, కుటుంబ సంక్షేమ, గిరిజన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిడారి శ్రావణ్‌కుమార్‌ మంత్రులు చినరాజప్ప, లోకేశ్‌, అఖిలప్రియ, ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య అభినందనలు తెలిపారు. సచివాలయంలోని కిడారి ఛాంబర్‌లో శుక్రవారం వారు ఆయన్ని అభినందించారు.

leela 17112018 2

ఈ సందర్భంగా చైనా పర్యటనకు ముందు శాసనసభ సమావేశాల సమయంలో దివంగత కిడారి సర్వేశ్వరావుతో నియోజకవర్గ అభివృద్ధి గురించి చర్చించినట్లు లోకేశ్‌ గుర్తుచేసుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కిడారి కోరగా మంత్రులందరి తోడ్పాటు ఎప్పుడూ ఉంటుందని లోకేశ్‌ హామీ ఇచ్చారు. అరకులో భూగర్భ మురుగునీటి వ్యవస్థ పనులు ప్రారంభించాలని మంత్రిని కిడారి శ్రావణ్‌ కోరగా ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదికలు(డీపీఆర్‌లు) సిద్ధమయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని లోకేశ్‌ చెప్పారు. అరకును పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలని మంత్రి అఖిలప్రియను కోరగా.. ఎవరైనా ముందుకొస్తే పీపీపీ పద్ధతిలో ఆ పనులు చేపడతామని ఆమె బదులిచ్చారు.

కేంద్ర ప్రభుత్వం చేతిలో పావుగా మారిన సీబీఐకు రాష్ట్రంలో దాడులు, దర్యాప్తు చేసే అధికారాన్ని నిరాకరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం, ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై ఏపి ప్రభుత్వనికి భారత పౌరుడిగా వినతి పత్రం ఇచ్చానని విజయవాడకు చెందినా లాయర్ మీడియాతో చెప్పారు. భారత పౌరుడిగా, బెజవాడ న్యాయవాదిగానే సీఎస్‌కు వినతి పత్రం ఇచ్చానని న్యాయవాది ఎర్నేని వేదవ్యాస్ తెలియజేశారు. దేశంలో సీబీఐ ప్రతిష్ట దెబ్బతిన్నదని, సీబీఐ ఆఫీసులో సీబీఐ అధికారులే దాడులు చేస్తున్నారని న్యాయవాది ఎర్నేని వేదవ్యాస్ అన్నారు. దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడూ లేదని వ్యాఖ్యానించారు.

cbi 16112018 2

శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సీబీఐ, ఐటీ, ఈడీ సంస్థలను రాజకీయ ప్రత్యర్థుల పై ఉపయోగిస్తున్నారని విమర్శించారు. ఢిల్లీ పోలీస్‌ చట్టం సెక్షన్‌ 6 ప్రకారం సీబీఐకి అనుమతి నిరాకరించే అధికారం రాష్ట్రాలకు ఉందని తెలిపారు. కోర్టులూ కూడా కాదనలేవని, న్యాయపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. భారత పౌరుడిగా, బెజవాడ న్యాయవాదిగానే సీఎస్‌కు వినతి పత్రం ఇచ్చానని ఆయన తెలియజేశారు. సీబీఐ కంటే ఏపీ ఏసీబీకే మంచి పేరు ఉందన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఏసీబీ బ్రహ్మాండంగా పనిచేస్తోందని తెలిపారు. ఏపీ ఏసీబీ పనితీరును సీబీఐ, ఐటీ కూడా ప్రశంసించాయని గుర్తుచేశారు.

cbi 16112018 3

ఏసీబీ నుంచి ఐటీ అధికారులు వివరాలు తీసుకున్న సందర్భాలున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై దర్యాప్తు చేసే సామర్ధ్యం ఏసీబీకి ఉందని చెప్పుకొచ్చారు. సాంకేతిక నైపుణ్యం కూడా ఏపీ ఏసీబీ సొంతమని న్యాయవాది ఎర్నేని వేదవ్యాస్‌ పేర్కొన్నారు. మరో పక్క, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయానికి పశ్చిమ్‌ బంగ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ మద్దతు ప్రకటించారు. చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకున్నారని, సీబీఐని రాష్ట్రంలోకి అడుగుపెట్టనివ్వకుండా ఆయన తీసుకున్న నిర్ణయం సరైందేనని వ్యాఖ్యానించారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ కూడా చంద్రబాబు నిర్ణయాన్ని సమర్ధించారు.

విశాఖలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఎం.ఎస్‌.ధోని క్రికెట్‌ అకాడమీని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఎం.ఎస్‌.ధోనికి చెందిన ఆర్కా స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి(ఏపీఈడీబీ) ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు సమక్షంలో విశాఖలోని ఓ హోటల్‌లో ఈ ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఆర్కా స్పోర్ట్స్‌ సంస్థ రూ.60 కోట్లతో రెండు దశల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్‌ అకాడమీని, అంతర్జాతీయ పాఠశాలను అభివృద్ధి చేస్తుంది.

dhoni 17112018 2

క్రికెట్‌తోపాటు ఇతర క్రీడలకూ ఉపయోగకరంగా ఉండేలా దాదాపు 24 క్రీడా మైదానాలు(ఇండోర్‌ అండ్‌ అవుట్‌ డోర్‌)ను నిర్మించనున్నట్టు తెలిసింది. ధోనీ అకాడమీతో విశాఖ క్రీడా ముఖచిత్రంతో పాటు రాష్ట్ర క్రీడాముఖచిత్రంలో కూడా పెనుమార్పులు సంభవిస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. అకాడమీని విశాఖలో ఎక్కడ ఏర్పాటు చేస్తారు? ఎప్పుడు ప్రారంభిస్తారన్న విషయాలను త్వరలోనే నిర్వహకులు ప్రకటించనున్నారు. మరో పక్క కొన్ని రోజుల క్రితం, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా చంద్రబాబుని కలిసి, అమరావతిలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు అంశం పై చర్చించిన విషయం తెల్సిందే.

dhoni 17112018 3

ఇది ఇలా ఉంటే, విశాఖలో 50 ఎకరాల విస్తీర్ణంలో ఇంటెలిజంట్‌ గ్లోబల్‌ హబ్‌(ఐ-హబ్‌)ను ఏర్పాటుచేస్తామని, వచ్చే మంత్రిమండలి సమావేశంలోనే భూకేటాయింపు నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. గురువారం విశాఖలోని ఓ హోటల్‌లో యునెస్కో ఎంజీఐఈపీ విభాగం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటుచేసిన ‘టెక్‌-2018’ సమావేశంలో ఆయన ప్రసంగించారు. అనంతరం విలేకరులతోనూ మాట్లాడారు. డిజిటల్‌, ఐటీ పరిజ్ఞానాలను ఉపయోగించి తయారుచేసే వివిధ ఉపకరణాలతో పిల్లలకు బోధిస్తే సత్ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read