పోలవరం ప్రాజెక్టులో మరో అంకానికి జలవనరుల శాఖాధికారులు శుక్రవారం సాయంత్రం శ్రీకారం చుట్టారు. ఎగువకాఫర్‌ డ్యాం పనుల ప్రారంభానికి పూజలు జరిపారు. ప్రాజెక్టులో నాణ్యత విభాగం పనులు పరిశీలిస్తున్న ఎస్‌ఈ జి.ఆనంద్‌కుమార్‌ వీటిని ప్రారంభించారు. 2019 జూన్‌ నాటికి గ్రావిటి ద్వారా నీరు ఇవ్వాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. ఇందుకు స్పిల్‌వేలో గేట్ల బిగింపుతోపాటు, గోదావరి నదిపై ఎగువకాఫర్‌ డ్యాం నిర్మాణంతో సర్కారు సంకల్పం నేరవేరుతుంది. తదనుగుణంగా అధికారులు గోదావరి మధ్యలో 1,225 మీటరు వద్ద డ్యాం పనులకు పూజలు జరిపారు. రాబోయే 6 నెలల్లో పనులు పూర్తి చేయాలని లక్ష్యం విధించుకున్నారు.

polavaram 17112018 2

ఇప్పటికే జెట్‌ గ్రౌటింగ్‌ పూర్తయినందున దానికి ఇరువైపులా 6 మీటర్ల వెడల్పున కాఫర్‌ డ్యాం నిర్మాణం తలపెట్టారు. ఈ విషయంలో సరికొత్త రికార్డులు సృష్టించాలన్న పట్టుదల ఇంజనీర్లలో కనిపిస్తోంది. జెట్‌గ్రౌటింగ్‌ పూర్తికి ఎంత క్రియాశీలంగా వ్యవహరించారో.. కాఫర్‌ డ్యాం నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేసి మరోసారి తమను తాము నిరూపించుకోవాలని వారు భావిస్తున్నారు. గోదావరిలో నీటి ప్రవాహం ఆరంభం కాకమునుపే పనులన్నిటినీ పూర్తిచేసి, సీఎం చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యానికి అనుగుణంగా వచ్చే ఖరీఫ్‌ నాటికి గ్రావిటీ ద్వారా గోదావరి జలాలను అందించే ఉద్దేశంతో కాంట్రాక్టు సంస్థలు పనులకు ఉపక్రమించాయి. దీనిని మే 30లోపు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. నెలరోజుల ముందే పూర్తిచేయాలని కాంట్రాక్టు సంస్థ నవయుగ సంకల్పించింది. అందుకు తగినట్లుగానే ఆధునిక యంత్రాలను రప్పిస్తోంది.

polavaram 17112018 3

నిర్మాణం ఇలా.. గోదావరిలో సుమారు 2,480 మీటర్ల పొడవున, 187ను ంచి 237 మీటర్ల మేర వెడల్పున.. 42.5 మీటర్ల ఎత్తున ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మిస్తారు. దీనికిగాను 66.751 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి, రాయి, మెటల్‌ను నిర్మాణంలో వినియోగిస్తారు. ఇందులో 42.324 లక్షల క్యూబిక్‌ మీటర్ల రాయి, 5.116 లక్షల క్యూబిక్‌ మీటర్ల హీటింగ్‌ సాయిల్‌, 3.573 లక్షల క్యూబిక్‌ మీటర్ల మెటల్‌, 26,700 క్యూబిక్‌ మీటర్ల జిగురుమట్టిని వాడతారు. జెట్‌గ్రౌటింగ్‌ జరిగిన ప్రాంతంలో 6మీటర్ల వెడల్పున ఇరువైపులా నల్ల మట్టితో నింపుతారు. ఇలా నింపే నల్లమట్టిని ఏ రోజుకారోజు ప్రత్యేకించి ఏర్పాటు చేసిన ల్యాబ్‌లో పరీక్షలు చేస్తారు. దీనికి సంబంధించి అత్యంత ఆధునికంగా సెంట్రల్‌ సాయిల్‌ మెటీరియల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు.

సిబిఐ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జాతీయ స్థాయిలో, చర్చకు దారి తీసింది. ఎక్కువ మంది, ఏపి ప్రభుత్వాన్ని సమర్ధిస్తున్నా, ఇంకా కొంత మంది విమర్శిస్తున్నారు. దీంతో సీబీఐ పరిధికి కత్తెర వేస్తూ నిర్ణయం తీసుకోవడానికి దారి తీసిన పరిస్థితులు, కారణాలు, రాష్ట్రానికి ఈ విషయంలో ఉన్న అధికారంపై ప్రజలకు పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనిపై అవగాహన పత్రాలు ముద్రించి పంపిణీ చేయాలని తీర్మానించింది. ‘‘ఇది కొత్తగా, మన రాష్ట్రం ఒక్కటే తీసుకున్న నిర్ణయం కాదు. 29 రాష్ట్రాల్లో 19 రాష్ట్రాలు సీబీఐకి జనరల్‌ కన్సెంట్‌ ఇవ్వలేదు. ఇందులో బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్ర, హరియాణా, ఛత్తీ్‌సగఢ్‌ వంటివీ ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో కొంత కాలం క్రితమే సీబీఐ అధికార పరిధి పెంచారు. దేశంలో మెజారిటీ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాన్నే ఏపీ ఎంచుకుంది. మోదీ పాలనలో సీబీఐ స్వయంప్రతిపత్తిని కోల్పోయినందునే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’’ అని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

cbi 17112018 2

సీబీఐకి సాధారణ అనుమతి ఉపసంహరణపై.. అనవ‌స‌ర రాద్ధాంతం చేస్తున్నారని ఏపీ ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో 10 రాష్ట్రాలే సాధారణ అనుమతి ఇచ్చాయన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో దర్యాప్తు చేయాలంటే రాష్ట్రాల అనుమ‌తి తప్పనిసరి అని ఆయన అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, హిమాచల్‌ వంటి రాష్ట్రాల్లో సీబీఐకి సాధారణ అనుమతి ఇవ్వలేదని.. కోర్టులు అదేశిస్తే సీబీఐ ఎక్కడైనా దర్యాప్తు చేయవచ్చునని కుటుంబరావు తెలిపారు.

cbi 17112018 3

ప్రస్తుతం సీబీఐలో జరగుతున్న పరిణామాలను చూస్తుంటే... దొంగ కేసులను నమోదు చేస్తోందన్న అనుమానాలు కలుగుతున్నాయని కుటుంబరావు అన్నారు. సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసుల్లో కేవలం 60 శాతమే శిక్షలు ఖరారయ్యాయన్నారు. ఢిల్లీ పోలీస్ చ‌ట్టం చ‌దివితే సీబీఐ ప‌రిధి ఏంటో తెలుస్తుందని అన్నారు. వైసీపీ నేతలు ఆర్థిక ఉగ్రవాదంలో మునిగితేలారని కుటుంబరావు ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర వంటి భాజపా పాలిత రాష్ట్రాల్లో సీబీఐ దర్యాప్తునకు సాధారణ సమ్మతి ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. దీనిపై భాజపా ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు ఎందుకు స్పందించడం లేదన్నారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఆర్థిక ఉగ్రవాదం, సీబీఐ కేసుల్లోనూ ఆరితేరారని, అందుకే ముందుగా ఆయనే ట్విట్టర్లో స్పందించారని విమర్శించారు.

అడక్కుండా అడుగు పెట్టొద్దంటూ సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం ‘నో ఎంట్రీ’ బోర్డు చూపడం జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టించింది. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఏపీ తరహా నిర్ణయమే తీసుకున్నారు. సీబీఐకి 1989లో లెఫ్ట్‌ సర్కారు మంజూరు చేసిన ‘జనరల్‌ కన్సెంట్‌’ను శుక్రవారం ఉపసంహరించుకున్నారు. మరో పక్క, పంజాబ్‌ కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకున్న ఈ నిర్ణయం పై ఆరా తీసింది. పంజాబ్‌ పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్రంలోని ఏసీబీ ఉన్నతాధికారి ఒకరికి ఫోన్‌ చేసి వివరాలు అడిగారు. ‘‘సీబీఐని అనుమతించకుండా ఎలా ఉత్తర్వులిచ్చారు? మాకూ వివరాలు చెప్పండి’’ అని కోరారు.

cbn 17112018 2

ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా చంద్రబాబుని సమర్ధిస్తూ ట్వీట్ చేసారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సరైన పనే చేశారు. ఏపీలో ఆదాయపన్ను విభాగాన్ని కూడా అనుమతించకూడదు. సీబీఐ, ఐటీ విభాగాల్ని మోదీ దుర్వినియోగం చేస్తున్నారు. నోట్లరద్దు కుంభకోణం వెనకున్న వారిని సీబీఐ ఎందుకు పట్టుకోవడం లేదు?" అంటూ ట్వీట్ చేసారు. కర్ణాటక ప్రభుత్వం కూడా, ఏపి నిర్ణయానికి మద్దతు తెలిపింది. మరో పక్క బీజేపీ పాలిత రాష్ట్రాలైన హరియాణా, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ ఆయా ప్రభుత్వాలు సీబీఐకి సాధారణ సమ్మతి ఇవ్వలేదని ఏపీ అధికార వర్గాలు చెబుతున్నాయి.

cbn 17112018 3

చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు మద్దతు ఇవ్వగా, మరికొన్ని రాష్ట్రాలు మద్దతు ఇచ్చే అవకాశమున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సీబీఐ పలానా రాష్ట్ర పరిధిలో నమోదైన కేసులపై దర్యాప్తు చేపట్టాలన్నా, అవినీతి పై చర్యలు తీసుకోవాలన్నా, ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే అనేది చట్టం చెప్తుంది. చట్టం ప్రకారం, సీబీఐ ఏ కేసునూ సొంతంగా దర్యాప్తునకు చేపట్టలేదు. కేసు పరిధిని బట్టి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా కోరితేకాని, లేదా కోర్టు ఆదేశాలు ఉంటే మాత్రమే సీబీఐ రంగంలోకి దిగుతుంది. అయితే. ఢిల్లీ ప్రత్యేక పోలీసు విభాగ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఫస్ట్‌ గెజిటెడ్‌ స్థాయి ఉన్న రాష్ట్ర అధికారులు, పౌరులు, విడివిడిగా లేదా కలిసి అవినీతికి పాల్పడినట్లయితే సీబీఐ చర్యలు తీసుకోవచ్చు. ఇందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కావాల్సిందేనని ఢిల్లీ స్పెషల్‌ పోలీసు చట్టమే చెబుతోంది.

‘‘ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న పోరాటాన్ని స్వాగతిస్తున్నాం. ఇప్పుడు చేస్తున్న పోరాటం రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచీ చేసుంటే హోదా వచ్చేది’’ అని సినీ నటుడు ఆర్‌.నారాయణమూర్తి తెలిపారు. హోదా ఇచ్చేవారికే ఏపీ ప్రజలు ఓట్లు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీకి మొదటి నుంచి అన్యాయం జరుగుతూనే ఉందని, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన నేతలు ఏమైపోయారని ప్రశ్నించారు. తిరుమల వెంకన్న సాక్షిగా ప్రధాని మోదీ హామీ ఇచ్చి మాట తప్పారని ఆరోపించారు. ఉత్తరాంధ్రకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ రైల్వేజోన్‌, కడప ఉక్కు ఫ్యాక్టరీపై కేంద్రం ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ఆర్‌. నారాయణమూర్తి దుయ్యబట్టారు.

rnm 1711201 8 2

ప్రత్యేక హోదాపై విద్యార్థి, యువజన జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన జీపు జాత శుక్రవారం విజయనగరం జిల్లా బొబ్బిలికి చేరుకుంది. నారాయణమూర్తి విలేకరులతో మాట్లాడుతూ, ‘‘దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసాన్ని చేస్తూ కేంద్రంపై పోరాడుతున్నారు. ప్రత్యేక హోదా పోరాటంలో పాల్గొన్న వారిపై కేసులు కొట్టివేయాలి. రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని కోరిన వెంకయ్యనాయుడు నోరు మూయించేందుకే మోదీ రాజ్యాంగబద్ద ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టారు. వెంకయ్య పదవిని త్యజించి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలి. పార్టీలు జెండాలు పక్కనపెట్టి హోదా పోరాటంలో దిగాలి. ఇందుకు సీఎం చంద్రబాబు చొరవ చూపాలి’’ అని విజ్ఞప్తి చేశారు.

rnm 1711201 38

‘‘ప్రత్యేక హోదా ఉద్యమానికి సీఎం చంద్రబాబు నాయకత్వం వహించాలి. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై గట్టిగానే పోరాడుతున్నారు. ప్రధాని మోదీ గుజరాత్‌కే ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారు తప్ప దేశానికి కాదు. ఆంధ్రా ప్రేక్షకుల నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న హీరోలు రాష్ట్ర ప్రయోజనాలు పట్టకుండా వ్యవహరిస్తున్నారు. శివాజీ, సంపూర్ణేష్‌బాబు తప్ప మిగతావారు స్పందించకపోవడం దారుణం. వారంతా చరిత్రహీనులుగా నిలిచిపోతారు’’ అని ఏపీ ప్రత్యేక హోదా సాధన కమిటీ చైర్మన్‌ చలసాని శ్రీనివాస్‌ అన్నారు.

 

Advertisements

Latest Articles

Most Read