తెలంగాణా రాష్ట్రంలో మీడియా సంగతి ఎలా ఉందో చెప్పే పనే లేదు. తెలంగాణాలో ఎన్నో సమస్యలు ఉన్నా, కనీసం వార్తల్లో రావు. ఎంత సేపు కేటీఆర్ కు సినిమా వాళ్ళు చేసిన భజన తప్పితే తెలంగాణా వార్తలు నుంచి ఏమి ఉండవు. అదే ఆంధ్రాలో అయితే, చీమ చిటుక్కు మన్నా, ఇక ప్రపంచం అంతం అయిపోతుంది అన్నంత కలరింగ్ ఇస్తుంది హైదరాబాద్ మీడియా. అలాంటి హైదరాబాద్ మీడియా, ఎన్నికల సమయంలో కూడా వెన్నుముక లేకుండా కేసీఆర్ ను మోస్తుంది. ఒక పక్క సోషల్ మీడియాలో కేసీఆర్ ను ఉతికి ఆరేస్తుంటే, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మాత్రం ఏమి లేదు.

kcrmedia 18112018 2

తెరాస అభ్యర్ధి కనిపిస్తే తరిమి తరిమి కొడుతున్న వీడియోలో సోషల్ మీడియాలో అనేకం చూస్తుంటే, టీవీ చానల్స్ లో మాత్రం, అవేమి ఉండవు. ఎంత సేపు కేసీఆర్ ని ఆహా ఓహో అనటం, కూటమిలో లుకలుకలు అని చెప్పటమే. అయితే, మారుతున్న రాజకీయ పరిస్థితులో మరేదన్నా కాని, కెసిఆర్ కు సన్నిహితంగా ఉండే మీడియా అధినేత మాత్రం, ఈ మధ్య కొంచెం ఓపెన్ అప్ అవుతున్నారు. మాకు పరిమితులు ఉన్నాయి అని చెప్తూ, తెలంగాణాలో మీడియా స్వేఛ్చ గురించి చెప్పకనే చెప్తున్నారు. మా ఒత్తిడిలు మాకు ఉంటాయి, కాని సోషల్ మీడియా అలా కాదు అని వాస్తవం చెప్తున్నారు.

kcrmedia 18112018 3

మీడియా కూడా విశ్వసనీయత కోల్పోతున్న వ్యవస్థల జాబితాలో చేరిపోతోంది అంటూ తెలంగాణాలో వాస్తవ పరిస్థితి చెప్పకనే చెప్పారు. ప్రగతి నివేదన సభ పేరిట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొంగరకలాన్‌లో నిర్వహించిన భారీ బహిరంగసభ విఫలమైనప్పటికీ ప్రధాన మీడియా ఆ విషయాన్ని పట్టించుకోలేదని, సోషల్ మీడియాలో మాత్రం, ఉతికి ఆరేసిందని అన్నారు. మొత్తానికి ఒక వాయిస్ తెలంగాణా నుంచి గట్టిగానే లేగిసే సూచనలు కనిపిస్తున్నాయి. మళ్ళీ కేసీఆర్ గెలుస్తాడు అంటే, ఈ సాహసం చేసే వారు కాదేమో. కేసీఆర్ ఓడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టే, మీడియా నెమ్మిదిగా ఓపెన్ అవుతుంది. కనీసం ఈ 20 రోజుల్లో అయినా తెలంగాణా ప్రజలకు వాస్తవాలు చూపిస్తారని ఆశిద్దాం...

అంతా అనుకున్నట్టే, ప్లాన్ ప్రకారం జరుగుతుంది. తెలంగాణా ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ లబ్ధి కోసం, పవన్, జగన్ ఆరాట పడుతున్న సంగతి తెలిసిందే. కాకపొతే, వ్యవహారాలు అన్నీ లోపల లోపల చేసుకుంటున్నారు. ఏది బయటకు చెప్పటం లేదు. రాజకీయాల్లో ఏదైనా ప్రజల ముందు చెయ్యాలి కాని, అన్నీ చాటు మాటు వ్యవహారాలు చేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, చంద్రబాబుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఢిల్లీ నుంచి నడిపిస్తున్న స్క్రిప్ట్ అనేది అందరికీ తెలిసిందే. ఇక తెలంగాణా ఎన్నికల విషయానికి వద్దాం. తెలంగాణా ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు కోసం పవన్, జగన్ ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.

pk 18112018 2

ఈ క్రమంలోనే, పవన్ కళ్యాణ్ శుక్రవారం రాత్రి అర్ధాంతరంగా తూర్పు గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని ముంబై వెళ్లారు. అదే సమయంలో ఎదో అవార్డుల కార్యక్రమంలో పాల్గునటానికి కేటీఆర్ కూడా ముంబై వెళ్లారు. వీరిద్దరి మధ్యా చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. ప్రాధమిక సమాచారం ప్రకారం, తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో, పవన్ కళ్యాణ్ తన అభ్యర్ధులని నిలబెడతారాని, ఆంధ్రా ఓట్లు చీలిక కోసం, ఈ ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. ఈ రోజు కొంత మందికి బీఫారం లు కూడా పవన్ ఇస్తారని సమాచారం.

pk 18112018 3

ఇదంతా కేటీఆర్ తో భేటీ తరువాతే, ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. హైదరబాద్ లో అయితే, మీడియా కంట పడతారు కాబట్టి, ఈ వ్యవహారం అంతా ముంబైలో జరిగినట్టు సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ నిజంగా అభ్యర్ధులని నిలబెడతారా, లేక టీఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతు ఇస్తారా అనేది చూడాల్సి ఉంది. అయితే ఈ విషయం పై ముంబై మిర్రర్ అసిస్టెంట్ ఎడిటర్ కూడా ట్వీట్ చేసారు "అనూహ్యంగా, జనసేన తెలంగాణా ఎన్నికల్లో పోటీకి వస్తుంది. నిన్న ముంబైలో జరిగిన బేటీ తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు" అంటూ ట్వీట్ చేసారు. అంటే కేటీఆర్ తో భేటీ నిజం అని ఈ ట్వీట్ ద్వారా తెలుస్తుంది. చూద్దాం పవన్ ఏమి చేస్తారో..

అధికారంలో లేకపోతేనే ఈ వైసీపీ నాయకులని ఆపలేకపోతున్నాం, పొరపాటున అధికారంలోకి వస్తే, వీళ్ళు చేసే అరాచకాలకు హద్దే ఉండదేమో. అక్కడ ఎమ్మల్యే అనిల్ కుమార్ ఎలాంటి వాడో అందరికీ తెలిసిందే. అతన్ని చూసుకుని, ఈ అనుచరగణం రెచ్చిపోతుంది. మూడు రోజుల క్రితం ఓ టీచర్ పై అత్యాచారయత్నానికి పాల్పడిన కేసులో వైసీపీకి చెందిన ఓ కార్పొరేటర్‌కు అయిదేళ్లు జైలు శిక్ష పడిన విషయం మర్చిపోక ముందే, ఇప్పుడు వైసీపీకి చెందిన మరో కార్పొరేటర్‌ టూరిజం హోటల్లో బీభత్సవం సృష్టించాడు. ఏకంగా హోటల్‌ రిసెప్షనిస్టు పై తప్ప తాగి దాడి చేసి గాయపరిచారు.

nellore 18112018 2

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, వైసీపీ పార్టీకి చెందిన కార్పొరేటర్‌ రాజశేఖర్‌ శుక్రవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో కొండాయపాళెం గేటు సమీపంలో ఉన్న ఏపీ టూరిజం హరిత హోటల్‌లో ఇద్దరు ఉంటామని చెప్పి 318 నంబరు గల గదిని తీసుకున్నారు. గదిని అద్దెకు తీసుకునే సమయంలో హోటల్‌ సిబ్బందికి ఇవ్వాల్సిన గుర్తింపు కార్డులు మళ్లీ ఇస్తామని చెప్పడంతో రాత్రి 11.30 గంటల ప్రాంతంలో హోటల్‌ రిసెప్షనిస్టు అయిన షేక్‌ షాకీర్‌ కార్పొరేటర్‌ ఉన్న గదికి వెళ్లాడు. అయితే ఆ సమయంలో గదిలో ఎనిమిది మంది ఉండటంతో అంతమంది ఉండేందుకు టూరిజం అధికారులు ఒప్పుకోరని కార్పొరేటర్‌కు తెలియజేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కార్పొరేటర్‌ రాజశేఖర్‌ రిసెప్షనిస్టు షాకీర్‌ను హోటల్‌ పైఅంతస్తు నుంచి కొట్టుకుంటూ కిందకు తీసుకువచ్చాడు.

nellore 18112018 3

కార్పొరేటర్‌ అయిన తనకే ఎదురు చెబుతావా అంటూ దుర్భాషలాడుతూ రిసెప్షన్‌ కేంద్రం వద్ద ఉన్న నోటీసు బోర్డును తీసుకుని అతనిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో షాకీర్‌ దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, ఎస్సై పూర్ణచంద్ర రావు హోటల్‌కు చేరుకుని దాడికి సంబంధించిన వివరాలను సేకరించారు. శనివారం కూడా పోలీసులు హోటల్‌ వద్దకు చేరుకుని వివరాలు ఆరా తీశారు. హోటల్‌లో ఉన్న సీసీ కెమేరా ఫుటేజీలను పరిశీలించగా, అందులో పూర్తి సమాచారం కనపడింది. కార్పొరేటర్‌ రాజశేఖర్‌, తేజ, మరో ఆరుగురు తనపై దాడికి పాల్పడ్డారని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్గామిట్ట ఎస్సై పూర్ణచంద్ర రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

 

ప్రకాశం బ్యారేజీ వద్ద ఎన్టీఆర్‌ సాగర్‌లో రెండో రోజు ఎఫ్‌1హెచ్‌2ఓ-పవర్‌ బోట్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.. ప్రధానంగా ఫార్ములా-1 అర్హత పోటీలు ఉత్కంఠభరితంగా సాగి ఉర్రూతలూగించాయి. మూడు రౌండ్లుగా జరిగిన ఈ పోటీల్లో అమరావతి బోట్‌ డ్రైవర్‌ అగ్రస్థానంలో నిలవాలంటూ.. ప్రేక్షకులు కేరింతలు కొడుతూ ప్రోత్సహించారు. శనివారం ఫార్ములా-1 అర్హత పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ రౌండ్లలో కేవలం కొన్ని సెకన్ల తేడాతో కొందరు, మిల్లీసెకన్‌ తేడాతో ఒక డ్రైవర్‌ తాము ఆశించిన స్థానాన్ని అందుకోలేకపోయారు.. అయితే, ఈ రేస్ చూడటానికి, హీరో మంచు మానోజ్ కూడా అమరావతి వచ్చారు. రేస్ చూసిన తరువాత మనోజ్ తన అనుభూతిని, సోషల్ మీడియాలో పంచుకున్నారు.

manoj 18112018 2

"Watch #F1H2O today..Thanks to Tourism Minister Akhila Bhuma and TeluguDesamParty for inviting me to such an crazy and great event conducted by our CM Nara Chandrababu Naidu...Great initiative and a proud moment for India and specially Telugu people ???? Was fun watching this with my fav Bhuvaneshwari garu... ‪#F1H2O_Amaravati ' అంటూ పోస్ట్ పెట్టారు మనోజ్. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ఎఫ్‌1హెచ్‌2ఓ పవర్‌ బోటింగ్‌ రేసుల్లో భాగంగా శనివారం జరిగిన రేసులో మనోజ్ పాల్గున్నారు.

manoj 18112018 3

మరో పక్క, స్థాయికి మించి రాణించిన అమరావతి టీమ్‌(ఐదో స్థానం)తో పాటు అబుదబీ టీమ్‌కు చెందిన షాన్‌ టొరెంటె(ప్రథమ స్థానం), ఎమిరేట్స్‌ రేసింగ్‌ టీమ్‌కు చెందిన మేరిట్‌ స్ర్టోమోయ్‌(ద్వితీయ స్థానం), అబు దబీ టీమ్‌కు చెందిన ఎరిక్‌ స్టార్క్‌(తృతీయ స్థానం), థాని అల్‌ కెమ్జీ (నాలుగో స్థానం), టీమ్‌ విక్టరీకి చెందిన అహ్మ ద్‌ అల్‌ హమేలీ(ఆరోస్థానం) ఫైనల్స్‌కు చేరుకున్నారు. టీమ్‌ అమరావతి ఫైనల్స్‌కు చేరుకుందని విన్న గ్యాలరీల్లోని ప్రజలు జై అమరావతి అంటూ హర్షధ్వానాలు చేస్తూ.. డ్రైవర్‌ ఆండర్సన్‌కు అభినందనలు తెలిపారు. ల్యాప్స్‌(లక్ష్యాన్ని)ను అతితక్కువ సమయంలో దాటిన రేసర్ల ప్రతిభను బట్టి విజేతలను నిర్ణయించారు. ప్రతిభకు పట్టం కట్టిన నిర్ణేతల న్యాయంతో అమరావతి టీమ్‌ ఫైనల్స్‌కు స్థానం దక్కించుకుంది.

Advertisements

Latest Articles

Most Read