కూకట్‌పల్లి నియోజకవర్గ అభ్యర్థిగా, దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పేరును తెలుగుదేశం ప్రకటించింది. శనివారం ఆమె నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. విశాఖపట్నం పర్యటనలో ఉన్న పార్టీ అధినేత చంద్రబాబు ఆమెను గురువారం అక్కడికి పిలిపించి మాట్లాడారు. ఆమెను బరిలోకి దింపాలని నిర్ణయించే ముందు హరికృష్ణ తనయులు, సినీనటులు కళ్యాణ్‌రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌లతోనూ చంద్రబాబు చర్చించారు. అయితే ముందుగా ఇక్కడ కళ్యాణ్‌రామ్‌ పోటీ చేస్తారనే వార్తలు వచ్చినా, కుటుంబం అబిప్రాయం మేరకు సుహాసిని వైపు చంద్రబాబు మొగ్గు చెపారు.

cbn 16112018 2

సుహాసిని బరిలోకి దింపడం ద్వారా సీఎం చంద్రబాబు వ్యాహాత్మకం ప్రత్యర్థులను డిఫెన్స్‌లోకి పడేశారు. సుహాసిని అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంతో పురందేశ్వరి మినహా ఎన్టీఆర్ కుటుంబమంతా ఏకతాటిపైనే ఉన్నారనే సంకేతాలను టీడీపీ ఇచ్చినట్లయింది. ఢిల్లీ అహంకారానికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ పార్టీ పెట్టారని, అప్పుడు కాంగ్రెస్ ఆ అహంకారం చూపిస్తే, ఇప్పుడు బీజేపీ ఆ అహంకారం చూపిస్తుందని, అందుకే కాంగ్రెస్ తో కలిసి, మోడీ-షా లను ఎదుర్కుంటుంది తెలుగుదేశం. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీ అంతా, పార్టీ వెంటే ఉందని అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్తుందని చంద్రబాబు ఆలోచన. ఇది ఒక్కటే కాదు హరికృష్ణను కోల్పోయిన కుటుంబానికి అండగా ఉన్నామని భరోసా ఇచ్చినట్లయింది.

cbn 16112018 3

కాంగ్రెస్‌తో టీడీపీ కలిసిందన్న విమర్శలకు సమాధానం చెప్పడంతో పాటు, నందమూరి కుటుంబసభ్యులను ప్రచారంలోకి దింపాలని నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో కూడా గ్రేటర్ పరిధిలో మహాకూటమి విజయానికి దోహదపడాలంటే సుహాసినిని అభ్యర్ధిగా ప్రకటిస్తే అన్ని స్ధానాలపై ప్రభావం ఉంటుందని టీడీపీ భావిస్తోంది. అంతేకాకుండా మిగతా అభ్యర్ధులకు కూడా సుహాసిని బరిలోకి దిగడం కలిసివస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది. మరోవైపు మహాకూటమి తరపున బాలకృష్ణ కూడా ప్రచారం నిర్వహిస్తారని టీటీడీపీ నేత ఎల్. రమణ ప్రకటించిన విషయం తెలిసిందే. గతంలో హరికృష్ణ కూడా టీడీపీ నుంచి ఎంపీగా, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. ఆయన రోడ్డుప్రమాదంలో మృతి చెందిన తర్వాత ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చంద్రబాబు భావించారు. సుహాసినికి కూకట్‌పల్లి అభ్యర్థిగా ప్రకటించడంతో హరికృష్ణ కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తిని నుంచి ప్రాతినిధ్యం వహించారు. అలాగే నల్గొండ నుంచి కూడా ప్రాతినిధ్యం వహించారు. తర్వాత నందమూరి కుటుంబం నుంచి తెలంగాణలో ప్రాతినిధ్యం వహించిన దాఖలాలు లేవు. అయితే ఆయన మనవరాలు సుహాసిని తెలంగాణ నుంచి రెండో సారి ప్రాతినిధ్యం వహించబోతున్నారు.

చంద్రబాబు పడుతున్న కష్టం ఫలిస్తుంది. రాష్ట్ర పారిశ్రామిక రంగంలోకి మరో భారీ పెట్టుబడితో, అతి పెద్ద కంపెనీ రానుంది. దేశంలోనే పెద్ద విదేశీ పెట్టుబడి అయిన కియా మోటార్స్‌ తరువాత, ఇదే రెండో అతి పెద్ద పరిశ్రమ. ఇండోనేసియా దేశానికీ చెందిన అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజం ఆసియా పల్ప్‌ పేపర్‌ (ఏపీపీ) గ్రూపు, అనుబంధ సంస్థ సినర్‌ మాస్‌ గ్రూపు మన రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో పరిశ్రమను స్థాపించనుంది. రెండు దశల్లో రూ.21,600 కోట్ల (3 బిలియన్‌ యూఎస్‌ డాలర్లు) పెట్టుబడులు పెట్టనుంది. టిష్యూ, ప్యాకింగ్‌, పేపర్‌ తయారీ పరిశ్రమను 2 వేల ఎకరాల్లో పెట్టాలని నిర్వాహకులు నిర్ణయించారు.

app 16112018 2

ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలను ఇప్పటికే ఈ కంపెనీ ప్రతినిధుల బృందం పరిశీలించింది. ప్రకాశం జిల్లాలో పెట్టుబడుల పై సంసిద్ధతను వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి ఇప్పటికే ప్రాథమిక నివేదిక ఇచ్చిన కంపెనీ నిర్వాహకులు నెలాఖరులో ముఖ్యమంత్రికి డీపీఆర్‌ అందజేయనున్నారు. అందుబాటులో సుబాబుల్‌, యూకలిప్టస్‌, సరుగుడు కర్రలను ఉపయోగించి పేపర్‌ పరిశ్రమను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను నిర్వాహకులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో పరిశ్రమలశాఖ అధికారులు రంగంలోకి దిగారు. ముడి సరుకు కలిగిన ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలకు ఇటీవల సినర్‌ మాస్‌ గ్రూపు ప్రతినిధుల బృందాన్ని తీసుకెళ్లారు.

app 16112018 3

ప్రపంచ వ్యాప్తంగా టిష్యూ, ప్యాకింగ్‌, పేపర్‌కు బాగా గిరాకీ ఉన్నందున ఎగుమతులకు వీలుగా ఓడరేవుకు సమీపంలో భూములు కావాలన్న నిర్వాహకుల సూచనల పై రామాయపట్నంలోని పలు ప్రాంతాలను చూపించారు. భారీ పెట్టుబడులతో వచ్చేవారికి ప్రభుత్వం తరఫున కల్పిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలను అధికారులు వివరించారు. పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రకాశం జిల్లాలో పెట్టుబడులు పెట్టాలన్న ప్రాథమిక నిర్ణయానికి సినర్‌ మాస్‌ గ్రూపు వచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి. మొదటి దశలో రెండు బిలియన్లు, తదుపరి దశలో బిలియన్‌ డాలర్లతో ఏర్పాటయ్యే ఈ పరిశ్రమతో 6వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

రాజనగరం సమీపంలో రోడ్డు ప్రమాదంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి జరిగిన ప్రమాదంలో నలుగురు బౌన్సర్లతో పాటు, తొమ్మిది మంది గాయపడ్డారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ రాజానగరం బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళ్తుండగా రంగంపేట వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది గాయపడినట్టుతెలుస్తుంది. అయితే, ముగ్గురిని మాత్రం వెంటనే ఆసుపత్రికి తరలించారు. చిన్నపాటి గాయలు కావడం, ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి అతి వేగమే కారణం అని తెలుస్తుంది. కాన్వాయ్ లో ఉన్న 4గురు బౌన్సర్లకు గాయాలు జిఎస్సెల్ ఆస్పత్రికి తరలించారు.

pkconvoy 15112018 2

రంగంపేట శివారున పవన్ కల్యాణ్ కాన్వాయ్ వేగంగా వెళ్తున్న టైములో, ఆయన సెక్యూరిటీ వాహనం వేగంగా వచ్చి లారీ ఢీకొనడంతో సెక్యూరిటీ సిబ్బందికి గాయాలు అయ్యాయి. జిఎస్ఎల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిబ్బంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరో పక్క పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరీ మదురుపూడి విమానశ్రయానికి చేరుకున్నారు. ఇండిగో విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్ళిపోయారు. గతంలో కూడా శ్రీకాకుళం పర్యటనలో, పవన్ ప్రయాణిస్తున్న కారు, ఒక బాలుడు పై నుంచి వెళ్ళటంతో, తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రాణా పాయం తప్పటంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు కూడా అతి పెద్ద ప్రమాదం తప్పింది.

pkconvoy 15112018 3

మరో పక్క నిన్న, విపక్ష నేత జగన్‌పై జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో జరిగిన బహిరంగ సభలో పవన్‌ ప్రసంగించారు. "జగన్‌ మోహన్‌రెడ్డి ఏమైనా సురవరం ప్రతాప రెడ్డా, తరిమెల నాగిరెడ్డా, రావి నారాయణరెడ్డా, పుచ్చలపల్లి సుందరరామి రెడ్డా, పుచ్చలపల్లి రామచంద్రా రెడ్డా. వాళ్లంతా జైలుకెళ్లారు. జగన్‌ కూడా జైలు కెళ్లారు. అంతామాత్రాన వారికీ, జగన్‌కూ పోలిక లేదు’’ అని పవన్‌ వ్యాఖ్యానించారు. వారంతా జనం కోసం జైలుకు వెళ్లగా... జగన్‌ అవినీతి చేసి జైలుకు వెళ్లారని పరోక్షంగా చెప్పారు.

ఢిల్లీ అహంకారులు విర్రవీగితే, కొమ్ములు విరిచేసిన చరిత్ర మన ఆంధ్రుడిది. ఆ చరిత్ర మళ్ళీ తిరగరాసే టైం వచ్చింది. ఇష్టం వచ్చినట్టు రాష్ట్రం పై తన ప్రతాపం చూపిస్తున్న ఢిల్లీ అహంకారులకు, మరోసారి ఆంధ్రోడి దెబ్బ చూపిస్తున్నారు చంద్రబాబు. రోజుకో దెబ్బతో, ఢిల్లీ కొమ్ములు విరిచేస్తున్నారు. సిబిఐ, ఈడీ, ఐటి, కోర్ట్ లు, ఆర్బీఐ, ఇలా అన్ని వ్యవస్థలని నాశనం చేస్తున్న మోడీ-షా లకి తగిన గుణపాఠం చెప్తున్నారు. సిబిఐ మా చేతిలో ఉంది, అందులో మా గుజరాత్ ముఠా ఉంది, మీ అంతు చూస్తాం అంటూ విర్రవీగితున్న మోడీ-షా లకు, నువ్వు అంతు చూస్తే మేము చూస్తూ ఊరుకుంటామా, తాట తీస్తాం అనే సందేశం ఇచ్చారు చంద్రబాబు. ఇప్పటికే సిబిఐ పై నమ్మకాలు పోయాయి. వాళ్ళలో వాళ్ళే కొట్టుకునే పరిస్థితి వచ్చింది. కోర్ట్ లలో ఆ విషయం ఉంది.

cbi 16112018

ఈ తరుణంలో ఏపి ప్రభుత్వం సిబిఐ పై సంచలన ఉత్తర్వులు ఇచ్చింది. ఢిల్లీ ప్రత్యేక పోలీసు చట్టం ప్రకారం సీబీఐ ఏర్పాటైంది. అంటే... దీని పరిధి ఢిల్లీ మాత్రమే. దీంతో ఇతర రాష్ట్రాల వ్యవహారాల్లో సీబీఐ ఎలా వేలు పెడుతుందంటూ వివాదాలు తలెత్తాయి. ఈ సమస్యకు ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌ చట్టంలోనే పరిష్కారం చూపించారు. ఇందులోని సెక్షన్‌ 6 ప్రకారం... రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో మాత్రమే సీబీఐ సంబంధిత రాష్ట్రంలో దర్యాప్తు చేపట్టగలదు. కర్ణాటక వంటి ఒకటి రెండు రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాలన్నీ ఇందుకు అనుమతి ఇచ్చాయి. ఏపీ సర్కారు ఏకంగా గుండుగుత్తగా అనుమతి (జనరల్‌ కన్సెంట్‌) ఇచ్చేసింది. ఇందుకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అక్కర్లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ఎప్పుడో సీబీఐకి ‘జనరల్‌ కన్సెంట్‌’ ఇచ్చేశారు. దీనిని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తున్నారు.

cbi 16112018 2

గతంలో రాష్ట్రం ఇచ్చిన సమ్మతి నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా మన రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులపై దాడి చేయడానికి సీబీఐకి అవకాశం ఉండదు. తాజా ఉత్తర్వుతో రాష్ట్రంలో దాడులు చేయడానికి సీబీఐకి పరిధి రద్దయింది. కేంద్ర ప్రభుత్వం అధీనంలోని సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఏసీబీ రెండూ అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్టు) ప్రకారం కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతుంటాయి. అయితే సీబీఐ రాష్ట్ర భూభాగంలో తన అధికారాలను అమలు చేసేందుకు వీలు లేకుండా పోయిన నేపథ్యంలో ఏపీలో సీబీఐ పాత్రను మన రాష్ట్ర ఏసీబీయే పోషించే అవకాశముంది. రాష్ట్రంలో పనిచేస్తూ అవినీతికి పాల్పడే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులపై ఏసీబీ దాడులు చేయొచ్చు.

cbi 16112018 3

ఆదాయపు పన్ను శాఖ, పోర్టులు, తపాలా కార్యాలయాలు, సెంట్రల్‌ ఎక్సైజ్‌, టెలిఫోన్‌ కార్యాలయాలు, వాటిలోని ఉద్యోగులపై దాడులు చేయడానికి, సోదాలు నిర్వహించేందుకు, కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసేందుకు వీలవుతుంది. ఈ అధికారాలన్నింటినీ సమీప భవిష్యత్తులో ఏసీబీ వినియోగించుకునేందుకు కసరత్తు చేస్తోంది. తద్వారా రాజకీయ కక్ష సాధింపు ధోరణితో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో చేయిస్తున్న దాడులకు సహకరించే, కొమ్ముకాసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గట్టిగా గుణపాఠం చెప్పాలని భావిస్తోంది. తమ జోలికి వస్తే... చేతులు ముడుచుకుని కూర్చోబోమని, అంతకు అంత బదులు చెబుతామని కేంద్రానికి ఓ గట్టి హెచ్చరిక పంపించాలనుకుంది. ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీబీఐకి ఎర్రజెండా చూపించిందని భావిస్తున్నారు. ఇలాంటిది ఒకటి ఉంది అని చాలా రాష్ట్రాలకు తెలుసో లేదో కాని, ఇప్పుడు చంద్రబాబు నిర్ణయంతో, బీజేపీ లేని రాష్ట్రాల్లో, అన్ని ప్రభుత్వాలు ఇది అమలు చేస్తే, ఇక మోడీ-షా లకు మరో రాజకీయ అస్త్రం వాళ్ళ చేతిలో నుంచి పోయినట్టీ. ఫెడరల్ స్పూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఢిల్లీ అహంకారులకు, ఇలాంటి నిర్ణయాలు చెంప పెట్టు.

Advertisements

Latest Articles

Most Read