తెలంగాణ శాసనసభకు జరుగనున్న ఎన్నికల పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దృష్టి సారించారు. అక్కడ జరుగుతున్న ఎన్నికల ప్రచారాన్ని ఏపి ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. నాలుగున్నర సంవత్సరాల క్రితం వరకు కలిసి ఉన్న రాష్ట్రం 2014లో విడిపోయింది. అప్పుడు జరిగిన తొలి ఎన్నికల్లో కేసీఆర్ సారధ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించి ప్రభుత్వాన్ని నెలకొల్పింది. తాజాగా ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నానని ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రకటించి ప్రభుత్వాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. దేశంలోని మిగతా రాష్ట్రాలతో తెలంగాణ ఎన్నికలకు ఎన్నికల సంఘం జెండా ఊపింది. దీంతో తెలంగాణలో రాజకీయ కాక రగిలింది. గత నెల రోజులుగా రాజకీయ పార్టీలు విస్తృత ప్రచారం చేపట్టాయి. కేసీఆర్ తెలంగాణాకు ఏమి చెయ్యలేదని, మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ జనసమితి, సీపీఐ కలిసి ప్రజాకూటమిగా ఏర్పాటై ఉమ్మడిగా పోరాడుతున్నాయి.

ap 14112018

తొలుత ప్రజాకూటమి నిలుస్తుందా అన్న అనుమానాలు తలెత్తాయి. అయితే కూటమిలో తలెత్తిన ఇబ్బందులను అధిగమించి ఉమ్మడి పోరుకు పార్టీలు సిద్ధం కావడంతో పోరు ఉద్ధృతం కానుంది. ఇదిలా ఉండగా జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. విభజన చట్టం, హామీల అమలులో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు నమ్మక ద్రోహం చేసిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపిస్తూ కర్నాటకలో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని అక్కడి తెలుగు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కర్నాటకలో కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు కీలక భూమిక పోషించారన్న వార్తలు వచ్చాయి. ఇదే తరహాలో తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీకి ఆ పార్టీతో పరోక్షంగా స్నేహం చేస్తున్న టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఓటేయాలని చంద్రబాబు పిలుపునివ్వనున్నారు.

ap 14112018

ఇప్పటివరకు చంద్రబాబు ఈ విషయంపై మాట్లాడకపోవడానికి కారణం బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ కలిసి వస్తారన్న నమ్మకంతోనేనని టీడీపీ నేతలు వెల్లడిస్తున్నారు. అయితే ఆయన నుంచి అలాంటి సంకేతాలు ఏవీ లేకపోగా చంద్రబాబునే లక్ష్యంగా చేసుకుని టీఆర్‌ఎస్ వ్యక్తిగత దూషణలకు దిగడంతో తెలంగాణాలో స్వయంగా ఎన్నికల ప్రచారం చేయడానికి బాబు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రధానంగా టీడీపీ అభ్యర్థులు పోటీచేస్తున్న స్థానాల్లో ప్రచారం చేస్తారని ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రజాకూటమిలోని ఇతర పార్టీలు కోరితే అక్కడ ప్రచారం చేసే అంశంపై కూడా చంద్రబాబు ఆలోచించవచ్చని తెలుస్తోంది. కాగా ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేస్తామని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైకాపా అధినేత జగన్‌లు తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. తెలంగాణలో ఆ రెండు పార్టీలు పోటీ చేయడం లేదని స్పష్టమైంది. రాష్ట్ర విభజన విషయంలో కేసీఆర్‌పై, విభజన చట్టం, హామీల అమలు విషయంలో బీజేపీపై ఆగ్రహంతో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే. తెలంగాణలోని నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలతో పాటు హైదరాబాదు నగరంలో టీడీపీ ప్రభావం గణనీయంగా ఉందని ఆ పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. సుమారు 40 స్థానాల్లో ఫలితాలను తారుమారు చేసే శక్తి టీడీపీకి ఉందని వారు విశ్వసిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కి, బీజేపీ పార్టీకి ఉన్న లోపాయికారీ ఒప్పందం అందరికీ తెలిసిందే... మార్చ్ 2018 వరకు మోడీని, బీజేపీని తప్పు పట్టిన పవన్, కొన్ని విపత్కర పరిస్థితుల్లో అమిత్ షా కి లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఆ రెండు అమిత్ షా దగ్గర ఉండటంతో, పవన్ కళ్యాణ్, అమిత్ షా ఏది చెప్తే అది చెయ్యాల్సిన పరిస్థితి.అందుకే బీజేపీని ఒక్క మాట కూడా అనకుండా, కేవలం చంద్రబాబుని మాత్రమే టార్గెట్ చేస్తూ, చంద్రబాబు జాతీయ స్థాయిలో చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వకుండా, బలహీన పరిచే కుట్రలు చేస్తున్నాడు. అయితే, ఎప్పుడూ బీజేపీ పై డైరెక్ట్ గా మాట్లాడని పవన్, నిన్న బీజేపీ పై డైరెక్ట్ కామెంట్స్ చేసారు.

pk 14112018 2

బీజేపీ హిందువుల పార్టీ కాదని... ఒక రాజకీయ పార్టీ అని పవన్‌ పేర్కొన్నారు. కాకినాడలో మంగళవారం ముస్లింలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయ న మాట్లాడారు. ‘దేశంలో ద్వితీయశ్రేణి పౌరులుగా అభద్రతాభావంతో జీవిస్తున్నాం. ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తున్న బీజేపీతో జనసేన బంధంపై ఒక ప్రకటన చేయాలి’ అని జవహర్‌ అలీ అనే న్యాయవాది పవన్‌ను కోరారు. దీనిపై పవన్‌ స్పందిస్తూ... ‘‘బీజేపీ అనేది హిందువుల పార్టీ కాదు.. అదొక రాజకీయపార్టీ. బీజేపీకి మద్దతు ఇచ్చినప్పుడు... ఆ పార్టీ సంఘ్‌తో ఉంటుందని చాలామంది చెప్పారు.

pk 14112018 3

అలాగైతే ఈ దేశంలో ఎవ్వరితోనూ దోస్తీ చేయలేం. ఇదే టీడీపీ గోద్రా అల్లర్ల సమయంలో మోదీని విమర్శించింది. ఆ తర్వాత మళ్లీ చేతులు కలిపింది. ప్రాంతీయ పార్టీలు వాటిలో ఏదో ఒకదానితో కలవాల్సిందే. జనసేనను బీజేపీలో విలీనం చేస్తే మీరు భయపడాలి’’ అని తెలిపారు. అయితే రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం, ఆశ్చర్యపోతున్నారు. మన పార్టీ గురించి, మనం కూడా ఎప్పుడూ ఇలా చెప్పుకోలేదు, మన పార్టీని హిందుత్వ పార్టీ అని అందరూ అంటుంటే, మనం ఎప్పుడూ ఖండించలేదు, పవన కళ్యాణ్ మన తరుపున కూడా మాట్లాడుతున్నాడు, ఒంటి చేత్తో ఎన్నో బాధ్యతలు పవన్ మోస్తున్నాడు అంటూ, ప్రశంసలు కురిపించారు.

కొంతకాలంగా సీఎం చంద్రబాబు, టీడీపీ లక్ష్యంగా రెచ్చిపోతున్న వైసీపీ సోషల్‌ మీడియా తాజాగా చంద్రబాబుపై మరో అభ్యంతరకర పోస్టింగ్‌ను పెట్టింది. ఈ నెల 8న బెంగుళూరు వెళ్ళిన సీఎం చంద్రబాబు ఫొటోలను మార్ఫింగ్‌ చేసి అసభ్య రాతలతో పోస్టు చేసింది. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వచ్చిన బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యుల ప్లకార్డులను మార్ఫింగ్‌ చేసి అసభ్యకరమైన సందేశాలు తయారు చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీనిపై ఈ నెల 10న టీడీపీ సోషల్‌ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి కనకమేడల వీరాంజనేయులు గుంటూరులోని అరండల్‌పేట పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

janasena 14112018 2

కేసు దర్యాప్తు చేసిన పోలీసులు చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన వైసీపీ రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ సోషల్‌ మీడియా ఇన్‌చార్జి కుమార్‌రాజు నవీన్‌కుమార్‌రాజును మంగళవారం అరెస్టు చేశారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వచ్చిన టీడీపీ నేతల చేతిలో ఉన్న ప్లకార్డుల్లోని అక్షరాలను మార్ఫింగ్‌ చేసి టీడీపీకి, చంద్రబాబుకు వ్యతిరేకంగా కొటేషన్లు రూపొందించి కొందరు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. దానిని కుమార్‌రాజు తనకు అందుబాటులో ఉన్న అనేక గ్రూపులకు ఫేస్‌బుక్‌ అకౌంట్లకు ఫార్వార్డ్‌ చేశాడు. ఈ మేరకు నమోదైన కేసులో అర్బన్‌ ఎస్పీ విజయరావు ఆధ్వర్యంలో అదనపు ఎస్పీలు వై.టి.నాయుడు, లక్ష్మినారాయణ, వెస్ట్‌ డీఎస్పీ సౌమ్యలత నేతృత్వంలో అరండల్‌పేట సీఐ వై.శ్రీనివాసరావు నిందితుడిని అరెస్టు చేసి మంగళవారం మీడియా ఎదుట హాజరుపరిచారు.

janasena 14112018 3

ఈ కేసు విచారణలో ఉందని, ఆయా ఫొటోలను మార్ఫింగ్‌ చేసిన నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. ఎవరికైనా రాజకీయ అభిప్రాయాలు ఉంటాయి, అయితే వాటిని సక్రమ మార్గంలో వ్యక్తపరిచవలసిన అవసరం ఉంది. అలా కాకుండా మా ఇష్టం వచ్చినట్టు నిజాలను వక్రీకరించి రాస్తాం, మార్ఫింగ్ చేసి కించపరుస్తాం అంటే కుదరదు. ఇది అన్ని పార్టీల అభిమానులకూ వర్తిస్తుంది, అభిమానం హద్దు మీరకుండా చూసుకోండి. దురభిమానం ఇలాంటి విపత్కర పరిస్థితులకు దారి తీయకుండా జాగ్రత్త వహించండి. ఒక్కసారి కేసు బుక్ అయితే, మీ జీవితాలు నాశనం అయిపోతాయి. మీ మీద కేసు బుక్ అయితే, మహా అయితే బెయిల్ ఇచ్చి బయటకు తీసుకువస్తారు, ఆ కేసు మాత్రం, మీ కెరీర్ ని దెబ్బతీస్తుంది. అప్పుడు జగన్ రాడు, పవన్ రాడు, టిడిపి నాయకులు రారు. మన ఖర్మ మనమే అనుభవించాలి...

రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై ఇవాళ సుప్రీం కోర్టులో జరుగుతున్న వాదోపవాదనలు టెన్షన్‌ను పెంచుతున్నాయి. తొలిరోజే ప్రముఖ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ మధ్య వాడివేడి వాదనలు చోటుచేసుకున్నాయి. రాఫెల్ యుద్ధ విమానాల ధరలు అమాంతం పెంచినట్టు వస్తున్న ఆరోపణలతో పాటు.. విమాన ధరల వివరాలు వెల్లడించకూడదన్న నిబంధనపైనే ప్రధానంగా వాదనలు జరుగుతున్నాయి. భారత్, ఫ్రాన్స్ చేసుకున్న ఈ ఒప్పందంలో గోప్యతా నిబంధన కారణంగానే ధరల వివరాలు చెప్పేందుకు కేంద్రం నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే.

supreme 14112018 2

ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీకోర్టు ఇవాళ విచారణ ప్రారంభించింది. ప్రశాంత్ భూషణ్, మాజీ కేంద్రమంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ తదితరులు దాఖలు చేసిన ఈ పిటిషన్లపై... చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. రాఫెల్ ఒప్పందంలో జరిగిన నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే తెప్పించుకున్న ధర్మాసనం.. విమాన ధరల వివరాలను కూడా సీల్డ్ కవర్‌లో రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోప్యతా నిబంధనను అడ్డంపెట్టుకుని రాఫెల్ యుద్ధ విమానాల ధరలు ఎలా దాస్తారని ప్రశాంత్ భూషణ్ వాదిస్తున్నారు. ‘‘దేశ భద్రతకు సంబంధించిన విమాన ధరలు వెల్లడించకుండా ఎలా దాస్తారు?’’ అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

 

supreme 14112018 3

అధికారులే రావాలి... ఆయుధాల సేకరణ కోర్టు సమీక్షించజాలదని అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ వాదించారు. ఈ ఒప్పందం గురించి కోర్టుకు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు వివరించే ప్రయత్నం చేయగా... సుప్రీం కోర్టు నిరాకరించింది. నేరుగా ఐఏఎఫ్‌ అధికారుల వివరణ వింటామని... ఇది వారికి సంబంధించిందని సుప్రీం కోర్టు స్పష్ట చేసింది. దీంతో హుటాహుటిన ఐఏఎఫ్‌ అధికారులు కోర్టుకు బయలు దేరారు. అంతకుమునుపు మరో పిటీషనర్‌ కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ శౌరీ తన వాదనను కోర్టుకు వినిపించారు.

Advertisements

Latest Articles

Most Read