ప్రజలకు ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి బహిరంగ లేఖ రాశారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సీఎం చంద్రబాబు భేటీపై ఆరోపణలు చేస్తున్న నేతలు ఆయన కొన్ని ప్రశ్నలు సంధించారు. రాహుల్‌గాంధీని చంద్రబాబు కలిస్తే, ఏదో జరిగిపోయిందంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి కాంగ్రెస్‌లో చేరి మంత్రి పదవి తీసుకున్నప్పుడు తర్వాత బీజేపీలో చేరినప్పుడు ఎన్టీఆర్ ఆత్మ క్షోభించలేదా? లక్ష్మీపార్వతి జగన్ కాళ్ళ దగ్గర కూర్చుంటే ఎన్టీఆర్ ఆత్మ బాధపడలేదా? టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే మాత్రం ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందా? విభజన చట్టంలోని హామీలను అమలు చేస్తామని చెప్పి మోసం చేశారు. మనకు తీరని అన్యాయం చేసినవారిపై తిరగబడి హ్కకులను కాపాడుకోవాలనుకోవడం తప్పా? అని లేఖలో కేఈ ప్రశ్నించారు.‘‘

ke 05112018 2

వ్యక్తిగత ఇష్టాఇష్టాలు ప్రజాక్షేత్రంలో పని చేయవు. మరో ఉద్యమానికి సిద్ధం కండి...బీజేపీ పాలనను అంతమొందించండి. బీజేపీ చేతిలో వైసీపీ కీలు బొమ్మగా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం అన్ని వ్యవవస్థలను నిర్వీర్యం చేస్తోంది. బీజేపీ నియంతృత్వ విధానాలను ఎదుర్కోవడానికి ఒక సమగ్రమైన పటిష్టమైన ఫ్రంట్ అవసరం. రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా చంద్రబాబు నడుం కట్టారు. అన్ని పక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి చంద్రబాబు చేస్తున్న కృషిని ప్రజలు అర్థం చేసుకోవాలి’’ అని కేఈ కృష్ణమూర్తి సూచించారు. మరో మంత్రి, రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా, ఈ విషయం పై స్పందించారు.

ke 05112018 3

నరేంద్ర మోడీ తెలుగు వారి ఆత్మ గౌరవం మీద దెబ్బ కొట్టారని అందుకే ఆయనకి వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీలతో కలిసి పోరాడుతున్నామని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగు ఆత్మగౌరవం బాటలోనే చంద్రబాబు పయనిస్తూ దేశ రక్షణకు, భారతీయుల సంక్షేమానికి ముందడుగే సారన్నారు. రాష్ట్రం విడిపోయి, పూర్తిగా నష్టపోయి కష్టాల్లో ఉన్నప్పుడు మనకు సహాయం చేసి గట్టెక్కిస్తా రని నమ్మి రాష్ట్రం మేలు కొరకు స్నేహం చేశామన్నారు. ఆయన మాట తప్పారని, హామీలు మరిచారని, విభజన చట్టంలో ఉన్న నిధులను కూడా ఇవ్వడం లేదని, హామీలు సక్రమంగా అమలు చేయడం లేదని అన్నారు. రాను రాను రాష్ట్రం పై కక్ష కట్టారు అన్నారు. ప్రస్తుతం మోడీ బలమైన వ్యక్తి అని ఆయన విషసర్పం లా తయారై రాక్షసునిగా వ్యవహరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ఆయన ప్రభావం తగ్గించాలన్నా, పక్కకి తప్పించాలన్నా అన్ని పార్టీలు కలిసి పని చేయాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇదివరలో కూడా జాతీయ స్థాయిలో సమన్వయకర్తగా నాయకుడిగా వ్యవహరించారని గుర్తుచేశారు. ఆయన వలననే జాతీయ స్థాయిలో అన్ని పార్టీలు ఏకం అయ్యాయన్నారు. అందుకు బహుజన సమాజ్ పార్టీ నాయకురాలు మాయావతి ని ఉదాహరణగా ఆయన చెప్పారు.

ప్రజారాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతిలో మొట్టమొదటి హౌసింగ్ ప్రాజెక్ట్ కి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం శ్రీకారం చుట్టారు. ఒకపక్క అంతర్జాతీయ ప్రమాణాలతో, మరొకపక్క అన్ని వర్గాలకూ అందుబాటు ధరలో ‘హ్యాపినెస్ట్‌’ పేరిట ఏపీసీఆర్డీయే నిర్మించనున్న ఈ భారీ హౌసింగ్‌ కాంప్లెక్స్‌కు సంబంధించిన లోగో, బ్రోచర్‌ను సీఆర్డీయే సమీక్ష సమావేశంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దానికి సంబంధించిన పలు విశేషాలను కళ్లకు కట్టేలా సీఆర్డీయే ప్రదర్శించిన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ సమావేశంలో పాల్గొన్న వారిని విశేషంగా ఆకట్టుకుంది.

happynest 05112018 2

వాస్తుకు పూర్తి అనుగుణంగా, అదే సమయంలో ‘స్మార్ట్‌’గా, పర్యావరణహితంగా, సకల ఆధునిక వసతులతోపాటు చూడగానే ఆకట్టుకునే రూపం, సువిశాల క్లబ్‌హౌస్‌ వంటి ఎన్నెన్నో ప్రత్యేకతలతో జెనెసిస్‌ సంస్థ రూపొందించిన డిజైన్‌ ప్రకారం హ్యాపీనెస్ట్‌ నిర్మితం కానుంది. సదరు విశేషాలిలా ఉన్నాయి. హ్యాపీనె్‌స్టకు సంబంధించిన ప్రధాన ఆకర్షణ దాని లొకేషన్‌! అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్‌, ప్రభుత్వ గృహసముదాయాలతో కూడిన గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌కు ఇంచుమించుగా పక్కన, నేలపాడుకు చేరువలో ఇది రానుంది. అటూ ఇటూ 82అడుగుల వంతున వెడల్పుతో సాగే విశాలమైన 2 రహదారుల మధ్యన ఉన్న కార్నర్‌ ప్లాట్‌లో 14.46 ఎకరాల్లో హ్యాపీనెస్ట్‌ నిర్మితం కానుంది. ఇందులో ఒక్కొక్కటి రెండేసి పార్కింగ్‌ ఫ్లోర్లు, గ్రౌండ్‌ ప్లస్‌ 18 అంతస్థులుండే 12టవర్లు వస్తాయి. వీటిల్లో మొత్తం 1200 డబుల్‌, ట్రిబుల్‌ బెడ్‌రూం ప్లాట్లు ఉంటాయి.

happynest 05112018 3

వివిధ వర్గాలవారికి అందుబాటులో ఉండేలా వీటిని 6 సైజుల్లో.. 1285, 1580, 1700, 1965, 2230, 2735 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు. వీటి ధరను ప్రాథమికంగా చదరపు అడుగుకు రూ.3,500లుగా సీఆర్డీయే నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ల ద్వారానే వీటిని కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించిన ఈ సంస్థ నవంబర్‌ 9వ తేదీ నుంచి అమ్మకాలను ప్రారంభించనుంది. మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యం ప్రాతిపదికన ఫ్లాట్లను కేటాయించనున్నారు. తొలిదశలో 7.3 ఎకరాల్లో 600 ఫ్లాట్లను మాత్రమే నిర్మించి, ఆ తర్వాతి దశలో మిగిలిన 600 ఫ్లాట్లు నిర్మించాలని నిర్ణయించారు. అపార్ట్‌మెంట్లన్నీ తూర్పు, పడమర ఫేసింగ్‌తోనే, అదీ కార్నర్‌వే అయి ఉంటాయి. కేటాయించిన మొత్తం స్థలంలో సుమారు 80 శాతాన్ని పచ్చదనానికి, ఓపెన్‌ ఏరియాలకు నిర్దేశిస్తారు. అంటే కేవలం 20 శాతం భూమిలోనే నిర్మాణాలు వస్తాయి.

కోడి కత్తి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. కోడి కత్తిని మోడి కత్తిగా వినియోగించుకోవాలని చూస్తన్నారంటూ సెటైర్లు పేల్చారాయన. మహాకూటమితో తెలంగాణ నాయకుడితో పాటు ప్రధాని కూడా వణికిపోతున్నారని అన్నారు. ప్రకాశం జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా ఓంగోలులో సమీక్ష సమావేశం నిర్వహించిన చంద్రబాబు..అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా చేస్తామన్నారు. కోడి కత్తి తమను ఏం చేయలేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కోడి కత్తిని ప్రధాని మోదీ కత్తిగా వినియోగించుకోవాలని చూస్తున్నారని ఎద్దేవాచేశారు.

kodi 04112018 2

ఇక్కడ ఏమి జరక్కుండానే గవర్నర్ నరసింహన్, బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, జీవీయల్ నరసింహరావు డీజీపీ ఠాగూర్‌తో ఏవేవో మాట్లాడుతారని చెప్పారు. తెలంగాణలో మహాకూటమి పెడితే అక్కడి నాయకుడితో పాటు మోదీకి వణుకు పుట్టిందన్నారు. ప్రధాని కోడి కత్తి పార్టీతో జత కట్టాలని చూస్తున్నారని, కోడి కత్తి విషయంలో అనవసర రాద్ధాంతం చేసి పరువు పోగొట్టుకున్నారని చెప్పారు. కోడి కత్తి పార్టీని ఎవరూ నమ్మవద్దని సూచించారు. దేశ భవిష్యత్తు బాగుండాలంటే వీరోచితంగా ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు.

kodi 04112018 3

అందుకే అవసరం అనుకున్నప్పుడు ఎవరితో అయినా కలవాలని, రాజకీయాల్లో వ్యక్తిగత ప్రయోజనాల కన్నా దేశ ప్రయోజనం ముఖ్యమని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని మోదీ చేతిలో పెట్టాలని చూస్తుందని, వారి మోసాలను గుర్తించి ప్రశ్నించినందుకే టీడీపీ నేతలపై దాడులు చేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. ఎన్ని దాడులు చేసినా, భయపెట్టాలని చూసినా తాను భయపడేది లేదని మరోసారి స్పష్టం చేశారు. ఇక పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీపైనా సెటైర్లు పేల్చారు చంద్రబాబు. పవన్‌ కళ్యాణ్ రోజుకో రకంగా మాట్లాడున్నారని.. రాజకీయాలంటే సినిమా స్క్రీప్ట్ కాదని ఎద్దేవా చేశారు. జగన్‌ , పవన్‌ కి మోడీ అంటే భయమని, అందుకే వాళ్లిద్దరు ఏరోజు బీజేపీని విమర్శించరని అన్నారాయన. ఒకరికి కేసుల భయం, మరొకరికి నల్లధనం భయం పట్టుకుందని ఆరోపించారు.

మోదీ బలమైన నాయకుడని, ఆయన ఎంత నిరంకుశంగా పనిచేసినా ఆయనను ఎదుర్కొనే శక్తి ప్రతిపక్షాలకు లేదనే అభిప్రాయం నిన్నమొన్నటివరకూ ఉండేది. రాఫెల్‌ కుంభకోణంపై విరుచుకుపడుతున్న తీరుతో రాహుల్‌ గాంధీ గ్రాఫ్‌ కొంత పెరిగినప్పటికీ, ఆయనకు సొంతంగా కాంగ్రె్‌సను గెలిపించేశక్తి లేదని జనం భావించే వారని పరిశీలకులు అంటున్నారు. అంతేకాక ప్రతిపక్షాలు ఒకదానికొకటి మాట్లాడుకునే పరిస్థితి లేకపోవడం, విభిన్నమైన ప్రకటనలు చేస్తుండటంతో వారు ఏకమయ్యే అవకాశాలే లేవనే అంచనాకు వచ్చారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ కూడా ఒకింత దిక్కుతోచని స్థితిలో పడింది. ఈ సమయంలో చంద్రబాబు ఎంటర్ అయ్యారు.

modi 05112018 2

ఒక్కొక్కటిగా దాదాపు 15 పార్టీలకుపైగా నేతలు చంద్రబాబు ఆలోచనలతో ఏకీభవించి జాతీయ స్థాయిలో ఒకే వేదికపై సమావేశం కావడానికి అంగీకరించారు. చంద్రబాబు వ్యూహం ప్రకారం... ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందే ప్రతిపక్షాలు ఢిల్లీలో ఒక వేదిక గా ఏర్పడతాయి. వివిధ రాష్ట్రాల్లో సభలు, ర్యాలీలు నిర్వహిస్తాయి. రాష్ట్రాల ఎన్నికల తర్వాత జనవరిలో మమతా బెనర్జీ కోల్‌కతాలో ఏర్పాటు చేసే ర్యాలీతో అంతా ద్విగుణీకృత ఉత్సాహంతో ఐక్యమవుతారని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ప్రతిపక్ష పార్టీల అధినేతలు, ముఖ్యుల సదస్సు త్వరలో నిర్వహించడం ద్వారా ప్రతిపక్ష ఐక్యతపై బలమైన సంకేతాన్ని ఇవ్వాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు సమాచారం. దీపావళి తర్వాత ఢిల్లీలో ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది.

modi 05112018 3

ఈ సమావేశంలోనే భవిష్యత్‌ కార్యాచరణపై ఒక రోడ్‌ మ్యాప్‌ను కూడా ఖరారు చేయొచ్చు. దీనిపై ఇప్పటికే పవార్‌, ఫరూక్‌ అబ్దుల్లా తదితరులతో చంద్రబాబు చర్చలు జరిపారు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీల ముఖ్యులతో శిఖరాగ్ర సమావేశాలు ప్రారంభించారు. తొలి సమావేశం విజయవాడలోనే జరిగింది. తర్వాత ఒక్కోసారి ఒక్కో రాష్ట్రంలో నిర్వహించారు. అప్పట్లో ఇవి బాగా ప్రసిద్ధి పొందాయి. అదే తరహా వ్యూహం ఈసారి కూడా అమలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

 

Advertisements

Latest Articles

Most Read