విభజన హామీల అమల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ చేపట్టిన ధర్మపోరాట దీక్షకు కడప జిల్లాలోని ప్రొద్దుటూరు ముస్తాబయింది. మంగళవారం మధ్యాహ్నం ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని బొల్లవరం సమీపంలో 86 ఎకరాల విస్తీర్ణంలో భారీ సభావేదిక, ప్రాంగణాన్ని రూపొందించారు. సుమారు రెండు లక్షల మంది హాజరవుతారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రాంగణంలో 50 వేల కుర్చీలను ఏర్పాటుచేశారు. కార్యక్రమానికి తెదేపా అధినేత చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌తో పాటు పలువురు మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు హాజరవుతున్నారు.

kadapa 30102018 2

తొలుత ఈనెల 20న ధర్మపోరాట దీక్ష నిర్వహించేందుకు నిర్ణయించగా వర్షం వల్ల 30వ తేదీకి వాయిదా వేశారు. ముఖ్యమంత్రి మధ్యాహ్నం 12.45 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకుని 1.35 గంటలకు హెలికాప్టర్‌లో ప్రొద్దుటూరుకు వెళ్లనున్నారు. తొలుత గండికోట ప్రాజెక్టు పైలాన్‌ను ఆవిష్కరించి సభకు హాజరవుతారు. జగన్‌పై దాడితో పాటు జిల్లాలో సీఎంను తిరగనివ్వబోమంటూ వామపక్ష నేతలు చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో ధర్మపోరాట దీక్షకు పోలీసులు విస్తృత భద్రత కల్పించారు. తిపక్ష నేత జగన్‌ సొంత జిల్లా కావడంతో స్థానిక నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఉక్కు పరిశ్రమ ఏర్పాటు పై ధర్మపోరాట సభలో సీఎం చంద్రబాబు విధాన ప్రకటన చేస్తారని ఎంపీ సీఎం రమేశ్‌ తెలిపారు.

kadapa 30102018 3

కడప నగరంలోని టీడీపీ కార్యాలయం నుండి సోమవారం ఉదయం తెలుగుదేశంపార్టీ శ్రేణులు నగర వీధుల గుండా భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మంగళవారం ప్రొద్దుటూరులో జరగనున్న ముఖ్యమంత్రి ధర్మపోరాట దీక్షకు మద్దతుగా ప్రజాభిమానాన్ని కూడగట్టేందుకు ఈర్యాలీ నిర్వహించారు. నగరంలోని కొత్తబస్టాండ్‌మీదుగా ఎన్‌టీఆర్ సర్కిల్, ఏడురోడ్లకూడలి, వన్‌టౌన్, అప్సర సర్కిల్ మీదుగా ఈర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి గత నాలుగున్నర సంవత్సరాలుగా చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు తెలిపేందుకు వారి అభిమానాన్ని కూడగట్టేందుకు ముఖ్యమంత్రి ఈ ధర్మపోరాట దీక్ష నిర్వహిస్తున్నారన్నారు.

విజయవాడ నగరం నడిబొడ్డున ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బెంజి సర్కిల్‌ పైవంతెన నిర్మాణంలోని ఒక వైపు ఫ్లై ఓవర్, కీలక దశ దాటింది. అయితే రెండో వరుస మాత్రం, ఇప్పటి వరకు కదలిక లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సార్లు అభ్యర్ధన పంపినా, కేంద్రం పక్కన పడేస్తూ వస్తుంది. దీంతో విజయవాడ ఎంపీ కేశినేని నాని డైరెక్ట్ గా రంగంలోకి దిగారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ఈ రోజు ఢిల్లీలో కలిసి, బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ పరిస్థితి వివరించి, రెండో వైపు నిర్మాణం గురించి, దాని జాప్యం గురించి, వివరించారు. దీంతో గడ్కరీ సానుకూలంగా స్పందించారు. త్వరలో నగరంలోని బెంజ్‌ సర్కిల్‌వద్ద రెండో ఫ్లైఓవర్‌ నిర్మించనున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఈ మేరకు టెండర్లు పిలవాలని జాతీయ రహదారుల సంస్థ... టెక్నికల్‌ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీచేశారు. త్వరగా టెండర్లు పిలవాలని గడ్కరీని టీడీపీ ఎంపీ కేశినేని నాని కోరారు. దీంతో ఆయన వెంటనే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆదేశాలు మాత్రం వెంటనే వస్తున్నాయి, మరి డబ్బులు ఇస్తారో ఇవ్వరో చూడాలి.

gadkari 29102018 2

బెంజి సర్కిల్‌ ఫ్లై ఓవర్ మొదటి దశ పనులు వేగంగా సాగుతున్నాయి. మొత్తం 1450 మీటర్ల దూరం పైవంతెనలో 49 పిల్లర్లను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం గడ్డర్ల నిర్మాణం జరుగుతోంది. సాధారణ ఆకృతుల ప్రకారం పిల్లర్ల మధ్య నిడివి సుమారు 30 మీటర్లు ఉండాల్సి ఉంది. సాధారణ పిల్లర్ల నిర్మాణం ఆ విధంగా చేశారు. కానీ బెంజి సర్కిల్‌ జంక్షన్‌ వద్ద 30 మీటర్ల నిడివి సరిపోవడంలేదు. దీంతో దీని ఆకృతులు ఇక్కడ మార్చారు. 9, 10 పిల్లర్ల మద్య దూరం 42 మీటర్లు ఉండే విధంగా నిర్మాణం చేస్తున్నారు. ఇటీవల పునాదులు ప్రారంభం అయ్యాయి. రెండు పిల్లర్ల మధ్య దూరం 42 మీటర్లు ఉండటం వల్ల వాహనాలు తిరిగే అవకాశం ఉంది. ఎంజీ రోడ్డు నుంచి నేరుగా బందరు రహదారికి, చెన్నై నుంచి వచ్చే వాహనాలు బందరు రహదారికి మళ్లాల్సి ఉంటుంది. దీంతో రెండు పిల్లర్ల మధ్య దూరంపెంచారు. దీంతో స్పాన్ల దూరం కూడా పెరగనుంది.

gadkari 29102018 3

బెంజి సర్కిల్‌ తరహాలోనే నిర్మాలా కాన్వెంట్‌, రమేష్‌ ఆసుపత్రి వద్ద పిల్లర్ల మధ్య దూరం పెంచాల్సి ఉంది. సాధారణంగా ఎక్కడైనా పిల్లర్ల మధ్య సమాన దూరం ఉంటుంది. కానీ ఈ వంతెనకు మాత్రం మూడు ప్రాంతాల్లో వ్యత్యాసం ఉంది. మొత్తం 240 గడ్డర్ల నిర్మాణం చేయాల్సి ఉంది. ఇప్పటికే 100గడ్డర్లను ఏర్పాటు చేశారు. రాత్రిపూట ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. కంకిపాడు సమీపంలో ఫ్యాబ్రికేటెడ్‌ పనులు చేస్తున్నారు. స్పాన్లు, గడ్డర్లను అక్కడ నిర్మాణం చేసి భారీ వాహనాలు, క్రేన్లతో వాటిని తరలించి నిర్మాణం చేస్తున్నారు. బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ పనుల పురోగతి 65 శాతం మేర ఉంది. ముప్పేట సమాంతరంగా పనులు ప్రారంభించటం వల్ల త్వరగా పూర్తవుతాయని అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిథులు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో ఆయన అభిమాని చేసిన దాడి రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది. దాడి జరిగింది ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డిపైన, దాడి చేసిన వ్యక్తి శ్రీనివాసరావు ఆయన వీరాభిమాని. కోడి కత్తితో దాడి జరిగిన వెంటనే ప్రాథమిక చికిత్స చేయించుకుని ఎయిర్‌పోర్టులో ఉన్నవారిని నవ్వుతూ పలకరించుకుంటూ జగన్మోహన్‌రెడ్డి విమానం ఎక్కి హైదరాబాద్‌ వచ్చేశారు. ఆ తర్వాత నుంచి ఆరోపణలు, ప్రత్యారోపణలు మొదలయ్యాయి. ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పనిలో పనిగా గవర్నర్‌ నరసింహన్‌ను కూడా కడిగి పారేశారు.

jaggan 29102018 2

రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి రాష్ట్రపతి పాలన విధించడానికి కుట్ర పన్నారని తీవ్ర స్వరంతో విమర్శించారు. వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ నాయకులు కూడా అదే స్థాయిలో ప్రతి విమర్శలు చేశారు. అయితే కోడి కత్తితో తనపై దాడి జరగ్గానే ప్రాథమిక చికిత్స చేయించుకుని హుందాగా వెళ్లిపోయిన జగన్మోహన్‌రెడ్డి చివరికంటా అదే హుందాతనాన్ని ప్రదర్శించి ఉంటే ఆయన ఇమేజ్‌ పెరిగి ప్రజల్లో మంచి పేరు వచ్చి ఉండేదన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్తమవుతోంది. లేదా జరిగిన సంఘటనను ఆసరాగా చేసుకుని రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటే విశాఖపట్టణంలోని ఏ ఆస్పత్రిలోనో చేరి ఉంటే వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చేవారు. మంచి మైలేజీ వచ్చి ఉండేది. అలా కాకుండా పొరుగు రాష్ట్రం వెళ్లిపోయి ఆస్పత్రిలో చేరడం వల్ల రాజకీయ ప్రయోజనం కూడా సిద్ధించలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.

jaggan 29102018 3

ఇదే విషయం వైసీపీలో కూడా చర్చనీయంసం అయ్యింది. దాడి జరగగానే, వచ్చిన ఫోటోలలో జగన్ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఆ సమయంలో, చూసారా మా అన్న, ఎంత ధీమాగా ఉన్నారో, ఎక్కడా రాజకీయం చెయ్యకుండా వెళ్ళిపోయారు అని సోషల్ మీడియాలో ఊదరగొట్టారు. అయితే, రెండు- మూడు గంటలు ఆగిన తరువాత, జగన్ నాటకాలు చూసి, వీళ్ళు కూడా అవాక్కయ్యారు. ఉన్నట్టు ఉండి, జగన్ మంచం మీద అడ్డం పడటం, కళ్ళు తెరవకపోవటం, ఇవన్నీ ఎవరో చెప్తే చేసారని, అది ఎవరా అని సొంత పార్టీ నేతలే ఆరా తీస్తున్నారు. కోడి కత్తితో జరిగిన దాడి వల్ల జగన్‌కు రాజకీయంగా ఉపయోగం కలిగిందో లేదో ఆ పార్టీ వాళ్లు చెప్పాలి గానీ ‘‘నేను ఆంధ్రా పోలీసులను నమ్మను..’’ అని జగన్‌ చేసిన ప్రకటన మాత్రం ఆయనకు నష్టమే చేసింది. ‘ఆంధ్రా పోలీసులను నమ్మను– తెలంగాణ పోలీసులను నమ్ముతాను’ అన్న వ్యక్తికి ఆంధ్రా ప్రజలపై మాత్రం ఎందుకు నమ్మకం ఉంటుంది అన్న వ్యాఖ్యలు ఎక్కువగా వినిపించాయి.

నిన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌, గుంటూరులో జరిగిన మహిళా మోర్చా కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై దిగాజరి మాట్లాడారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో బాలన్స్ కోల్పోయి, ‘రాష్ట్రంలో ముందు నీ పదవి కాపాడుకో... తర్వాత దేశం గురించి ఆలోచించవచ్చు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబును బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ ఎద్దేవా చేశారు. ‘రాష్ట్రంలో గరుడ పురాణ కాలక్షేపం జరుగుతోంది. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కాంగ్రె్‌సను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మాయావతి కాళ్ల వద్ద కూర్చున్నారు. ’ అని చెప్పారు.

rammadhav 29102018 2

అయితే రాం మాధవ్ మాట్లాడిన మాటల పై, తెలుగుదేశం నేతలు విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద బీజేపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని టీడీపీ అధికార ప్రతినిధి లంక దినకర్ అన్నారు. రాంమాధవ్‌కు ఆయన ఇంట్లో ఓట్లు కూడా పడవు అని, ఆ కారణంగానే ఆయన ఉత్తర భారతదేశంలో తిరుగుతారని ఎద్దేవా చేశారు. ఇక్కడి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ, వైసీపీ నాయకుల కుట్రలు ఒక్కోటిగా బయటకు వస్తున్నాయని అన్నారు. జగన్‌పై దాడి ద్వారా ప్రజలను రెచ్చగొట్టి అలజడులు సృష్టించాలని చూశారని దినకర్ ఆరోపించారు.

rammadhav 29102018 3

లాబ్ రిపోర్ట్ రాకముందే జగన్ విమాన ప్రయాణం చేశారని, విమానాశ్రయం కేంద్రం పరిధిలో ఉంటుందని బీజేపీ నేతలకు తెలియదా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం భద్రతా వైఫల్యాలను ప్రశ్నించకుండా రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేయడం దేనికి? అని ప్రశ్నించారు. గవర్నర్‌ నేరుగా డీజీపీకి ఫోన్ చేయడంలో ఆంతర్యం ఏంటి? అని నిలదీశారు. పోలీసుల విచారణకు జగన్ ఎందుకు సహకరించలేదన్నారు. నిందితుడు శ్రీనివాసరావు టీడీపీ అంటూ వైసీపీ నేతలు చూపించిన ఐడీ కార్డు ఫేక్ అని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read