సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి అప్పటి నుంచి ఆ పార్టీ నేతగానే కొనసాగుతున్నారు. తన పార్టీకి వచ్చిన 18 సీట్లు కాంగ్రెస్ కు ఇచ్చి, రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. అనంతరం రాష్ట్ర విభజన జరగడం, ఆ సమయంలో చిరంజీవి పై సీమంద్ర ప్రాంతంలో విమర్శలు రావంతో, ఇక రాజకీయాలకు దూరం జరిగి, సినిమాల వైపు వెళ్ళిపోయారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ, 150వ చిత్రం ‘ఖైదీ నం.150’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరంజీవి... ప్రస్తుతం స్వాతంత్ర్య సమరయోధుడు సైరా నరసింహారెడ్డి బయోపిక్‌ ‘సైరా’లో నటిస్తున్నారు.

chiru 16102018

ఇటీవల చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ కాలపరిమితి ముగియగా, దాన్ని పునరుద్ధరించుకోలేదు. దీంతో ఆయన ఆ పార్టీకి దూరమైనట్లేనని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీలో క్రియాశీలకంగా ఉండాలని ఇటీవల రాహుల్‌గాంధీ.. చిరంజీవిని కోరినట్లు తెలుస్తోంది. దీనికి ఆయన నుంచి స్పందన లేనట్లు సమాచారం. దీంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీకి ఇక దూరమైనట్లేనని భావిస్తున్నారు. ఆ మ‌ధ్య క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ ప్ర‌చారానికి ర‌మ్మ‌ని పిలిచినా, ఇప్పుడు తెలంగాణ‌లో ఎన్నిక‌ల‌ ప్ర‌చారం చేయించాల‌ని కాంగ్రెస్ పార్టీ కోరినా, చిరంజీవి దూరం వెళ్ళిపోయారు.

chiru 16102018

ఈయ‌న రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం కూడా మూడు నెల‌ల కిందే ముగిసిపోవ‌డంతో ఇప్పుడు ఈయ‌న కేవ‌లం కాంగ్రెస్ స‌భ్యుడు మాత్ర‌మే. అందుకే పదవి లేకుండా, కేవలం సభ్యుడిగా ఉండటం చిరంజీవికి నామోషి అని చెప్తున్నారు. అన్నీ కుదిర్తే జ‌న‌సేన వైపు వెళ్లి అక్క‌డ త‌మ్ముడికి అండ‌గా ఉండాల‌ని ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఇప్పటికే చిరంజీవి కోసం, గౌరవ అధ్యక్ష పదవి కూడా రెడీ చేసారని, సరైన సందర్భంలో చిరంజీవి వచ్చి, తమ్ముడు పార్టీలో చేరటమే మిగిలిందని తెలుస్తుంది. అందుకే, ఈ మ‌ధ్య ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎక్కువ‌గా ప్ర‌తీ మీటింగులోనూ చిరు గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్థావిస్తున్నాడు. త్వరలోనే ప్రజా రాజ్యం - 2 ఆవిష్కృతం కాబోతుంది.

తిత్లీ తుఫాను దెబ్బకు విలవిలలాడిన శ్రీకాకుళం జిల్లాలో సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు, ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి జిల్లాలో పర్యటించనున్నారు. తుఫాను తీరం దాటిన తర్వాత నాలుగు రోజుల పాటు అక్కడే ఉన్న చంద్రబాబు,ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ,సహాయక చర్యలను పరుగులు పెట్టించారు. దీంతో గతంలో ఎన్నడూ లేని రీతిలో, మౌలిక వసతుల పునరుద్ధరణ కార్యక్రమాలు జరిగాయి. అయితే అధికారిక కార్యక్రమాల కోసం రెండు రోజుల పాటు అమరావతికి విచ్చేసిన చంద్రబాబు, మరోసారి శ్రీకాకుళం జిల్లా వెళ్లారు.

cyclone 16102018

ఇదే అంశంపై నిన్న అమరావతిలో సమీక్ష సమావేశం నిర్వహించిన చంద్రబాబు, తుఫానులను ఎదుర్కొనే విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఏడాదిలో ఓ రోజును ‘సైక్లోన్ డే’గా నిర్వహించాలని నిర్ణయించారు. గతంలో సంభవించిన హుద్‌హుద్, ప్రస్తుత తిత్లీ తుపాను అనుభవాల ఆధారంగా తుపానులను ఎదుర్కోవడంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను ముందుగానే సన్నద్ధం చేయడానికి కొన్ని చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. తుపానులన్నీ అక్టోబరు నెలలోనే వస్తున్నా వాటిని ఎదుర్కొనేందుకు సరైన విధానం లేదని ఇకపై ఇలా జరగకూడదని, కచ్చితమైన విధానాన్ని అనుసరించాల్సిందేనన్నారు.

 

cyclone 16102018

తుపానులు, భారీ వర్షాలు వచ్చేటప్పుడు వ్యవహరించాల్సిన తీరుపై కోస్తాంధ్రలోని అన్ని ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.. చంద్రబాబు. తుఫాను సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా బలమైన గాలులను సైతం తట్టుకుని నిలబడగలిగేలా విద్యుత్ స్తంభాల్ని వినియోగించాలన్నారు. అలాగే ప్రతీ పది, పదిహేను గ్రామ పంచాయతీలకు ఓ జనరేటర్ ను ఉంచాలని సమీక్షలో నిర్ణయించారు. ప్రధానంగా అక్టోబరు, నవంబరులోనే తుపాన్లు వస్తున్నా వీటిని ఎదుర్కోవటంలో మాత్రం పక్కా విధానం లేదు. హుద్‌హుద్‌ సమయంలో తయారుచేసిన బ్లూబుక్‌లో వీటిని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ప్రస్తావనలున్నా, వరదల సమయంలో మాదిరి దీనిని అనుసరించటం లేదు. ఇకపై పక్కా విధానం అనుసరించాలని తాజా సమీక్షలో సీఎం నిర్ణయించారు.

ఇటీవల శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను తిత్లి తుపాను అతలాకుత లం చేసిన నేపధ్యంలో ఆ జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ యంత్రాంగం చేపట్టిన సహాయ పునరావాస చర్యల పట్ల ఉభయ రాష్ట్రాల గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసిం హన్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ ప్రాంతాల్లో చంద్రబాబునాయుడు ముందు చూపును ప్రదర్శించి సహాయ, పునరావాస కార్యక్రమాల నిర్వహణలో అధికార యంత్రాంగంతో చురుకుగా పనిచేయించారని అభినందించారు. ఈ మేరకు గవర్నర్‌ నరసింహన్‌ సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అభినందన లేఖ రాశారు. ఈ తుపాను కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించడం పట్ల గవర్నర్‌ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

governer 16102018 2

శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ తుపాను ప్రభావం వల్ల ఉద్దానం ప్రాంతానికి అపార నష్టం వాటిల్లింది. ఇక్కడ బాధితులకు అండగా నిలిచి సాధారణ పరిస్థితులు మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూడు రోజులుగా సెక్రటేరియేట్‌ను అమరావతి నుంచి పలాసకు మార్చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఓ ముఖ్యమంత్రి మున్సిపల్ కార్యాలయాన్ని తన క్యాంపు ఆఫీసుగా మార్చుకుని బస్సులోనే బస చేస్తూ24 గంటలు విధులు నిర్వహించేలా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించడం శ్రీకాకుళం జిల్లాలో ఇదే ప్రథమం. గతంలో విశాఖకు హూద్ హూద్ వచ్చినప్పుడు కూడా, ఇలాగే పని చేసారు చంద్రబాబు.

governer 16102018 3

తాజగా శ్రీకాకుళంలో కూడా అలాగే పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి పిలుపుతో డిప్యూటీ సి.ఎం. నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు కె.నారాయణ, పితాని సత్యనారాయణ, నారా లోకేష్, దేవినేని ఉమా, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కిమిడి కళా వెంకటరావులతోపాటు ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లు విజయానంద్, అజయ్‌జైన్, నీరపుకుమార్‌ప్రసాద్, పూనం మాలకొండయ్య, చిరంజీవి చౌదరితోపాటు 50 మంది ఐఎఎస్ అధికారులు, 100 మంది డిప్యూటీ కలెక్టర్లు, 136 మంది ఉన్నతాధికారులతో పలాసలో మినీ సెక్రటేరియేట్‌ను ముఖ్యమంత్రి నడుపుతున్నారు.

తుఫానుతో అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లాను ఆదుకోవడానికి చాలా మంది ముందుకొచ్చి సాయం చేస్తున్నారు. సినీ హీరోలు మొదలుకుని పారిశ్రామికవేత్తలు వరకూ బాధితులను ఆదుకోవడానికి ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షపార్టీ వైసీపీ సోమవారం నాడు కోటి రూపాయిలు విరాళంగా ప్రకటించింది. నిన్న జగన్ మోహన్ రెడ్డి ఈ ప్రకటన చేస్తూ, తమ కార్యకర్తలను కూడా అక్కడకు వెళ్లి, సహాయ కార్యక్రమాల్లో పాల్గునమన్నారు. అయితే, వైసీపీ ప్రకటించిన కోటి రూపాయల విరాళంపై టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

ramu 16102018 1

"తుఫాను బాధితులకు విరాళం ప్రకటించిన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. రాజకీయాలు పక్కనబెట్టి పార్టీలకు అతీతంగా తుఫాను బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలి" అని ట్విట్టర్ వేదికగా యువ ఎంపీ పిలుపునిచ్చారు. ఒక పక్క ఎంత విషం చిమ్మే రాజకీయాలు, వ్యక్తిగంగా వెళ్ళిపోతున్న రాజకీయాలు చూస్తున్న ప్రజలు, వైసీపీ సాయాన్ని ఒక పక్క అభినందిస్తూనే, ప్రత్యర్ధి ప్రజలకు చేసిన సాయాన్ని, ఆ ప్రాత ఎంపీగా అభినందించిన రామ్మోహన్ నాయుడిని, ప్రజలు మెచ్చుకుంటున్నారు.

ramu 16102018 1

మరో పక్క, తుపాను బాధితులకు సహాయం అందిస్తున్న దాతలకు మంత్రి నారా లోకేశ్‌ కృతజ్ఞతలు తెలిపారు. సినీ నటులు ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ పెద్ద మొత్తంలో తుపాను బాధితులకు విరాళాలు ప్రకటించి ఓ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టారని అభినందించారు. వీరిద్దరికి ట్విట్టర్‌లో మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. వీరితో పాటు తుపాను సహాయాన్ని ప్రకటించిన సినీనటులు విజయ్‌ దేవర కొండ తదితరులతో పాటు ఇతర సినీ రంగ ప్రముఖులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. తుపాను బాధితులను ఆదుకునేందుకు అన్నివర్గాల వారు ముందుకు రావాలని కోరారు.

Advertisements

Latest Articles

Most Read