ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తాను రాజకీయ ఆరంగేట్రం చేయాలని నిర్ణయించుకున్నానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. శనివారం తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన ఆలోచనలకు అనుగుణంగా ఏ రాజకీయ పార్టీ అయినా, వ్యక్తులైనా కలిసి వస్తే వారితో పనిచేయడానికి సిద్ధమన్నారు. అలాకాని పక్షంలో సొంత పార్టీ ఏర్పాటు చేసుకుని తన అలోచనలను కార్యాచరణలో పెట్టడానికి కృషి చేస్తానన్నారు. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ అగ్రనేతలైనా మిమ్మల్ని సంప్రదించారా? అని అడిగిన ప్రశ్నకు లేదని సమాధానమిచ్చారు. మీరు ఎవరినైనా సంప్రదించారా? అని అడిగిన ప్రశ్నకు ఆయన మాట్లాడుతూ ఇప్పుడే తన ఆలోచనలకు ఒక రూపకల్పన చేశానని ఇక వాటిని ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళతానని తెలియజేశారు. ధనం, కులాలకు అతీతంగా తన రాజకీయ ప్రయాణం ఉంటుందన్నారు.

jd 07102018 2

అభివృద్ధికి తీవ్ర విఘాతంగా మారుతున్న అవినీతికి వ్యతిరేకంగా పోరాడటమే తన ఆలోచనా విధానమన్నారు. ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలో ధనం, కులం కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. ఎన్నికలంటేనే ధన వ్యయంతో కూడుకున్న ఒక ప్రక్రియగా మారిందన్నారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి తన ప్రచారం కోసం నిర్ధిష్టమైన మొత్తాన్ని వ్యయం చేయడానికి ఎన్నికల కమిషన్ అనుమతిస్తోందన్నారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మొత్తానికన్నా తక్కువ వ్యయం చేసి ఎన్నికలకు వెళ్లాలన్నది తన వైఖరి అన్నారు. ఎన్నికల సందర్భంగా 50 శాతం మంది ప్రజలు డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేస్తే మంచి పరిపాలకులను ఎంచుకోవచ్చని అది ప్రజా సంక్షేమానికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అమలు కావాలన్నది తన ఆలోచన అన్నారు.

jd 07102018 3

రాష్ట్ర వ్యాప్తంగా ఆయా గ్రామాలకు సంబంధించిన సమస్యలను అక్కడి ప్రజలే గుర్తించి ఎన్నికలకు ముందు తమ వద్దకు వచ్చే ప్రతి అభ్యర్థి దృష్టికి తీసుకెళ్లాలన్నారు. అంతేకాకుండా ప్రతి అభ్యర్థి వద్ద వంద రూపాయల స్టాంప్ పేపర్‌పై సంతకం తీసుకోవాలన్నారు. ఎన్నికల తరువాత ఎవరు గెలుస్తారో సమస్యల పరిష్కారం కోసం వారిని ప్రశ్నించే అధికారం ప్రజలకు ఉంటుందన్నారు. ఒకవేళ సదరు ఎన్నికైన అభ్యర్థి ప్రజా సమస్యలను పరిష్కరించకపోతే వంద రూపాయల స్టాంప్‌పై సంతకం చేసిన ప్రతిపాదనలకు సంబంధించి న్యాయస్థానంలో పిల్ దాఖలు చేయవచ్చని అన్నారు. ఆ ప్రక్రియకు తాను అన్నివిధాలా ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు.

తెలంగాణలో మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్‌తో కలసి పోటీ చేసినా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ సహా ఏ పార్టీతోనూ తెదేపాకు పొత్తు ఉండబోదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. చంద్రబాబు అధ్యక్షతన శనివారం ఉండవల్లిలోని ప్రజావేదికలో జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తెదేపా లక్ష్యమని, ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలనుంచే ఆ దిశగా పనిచేయాలని నిర్ణయించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయానికే మమతా బెనర్జీ, అఖిలేష్‌ యాదవ్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, మాయావతి వంటివారిని ఒక తాటిపైకి తెచ్చి డీఎంకే వంటి పార్టీలతోనూ కలిపి ప్రత్యామ్నాయ వేదికను సిద్ధం చేయాలని నిర్ణయించారు.

cbn elections 07102018 2

అవసరమైతే చంద్రబాబు ఆయా నాయకులతో కలిసి ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో భాజపాకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఒక పక్క విభజన చట్టంలోని హామీలు, రాష్ట్రానికి రావలసిన ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచుతూనే, మరోవైపు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా జాతీయ స్థాయిలో పోరాడాలన్న నిర్ణయానికి వచ్చారు. మనమేదో కాంగ్రెస్‌తో చేతులు కలుపుతున్నామన్న భావన ప్రజల్లో కలిగించడం మంచిది కాదని, తెలంగాణలో మహాకూటమిలో కాంగ్రెస్‌ కూడా భాగస్వామే తప్ప నేరుగా ఆ పార్టీతో చేతులు కలపలేదని, ఈ విషయంలో ఎంపీలంతా స్పష్టతతో ఉండాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

cbn elections 07102018 3

ఏపీ అభివృద్ధిని చూసి గుజరాత్‌ కన్నా ఎక్కడ ముందుకు వెళ్తుందో అన్న ఆందోళన ప్రధాని మోడీలో ఉందని అందుకే చంద్రబాబు, వెంకయ్యనాయుడులు ఉన్నారని గుజరాత్‌కు ఎవరున్నారన్న మోడీ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో బీజేపీ, వైకాపా రహస్య పొత్తులపై మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయని, గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణకు లబ్ధి చేకూర్చేందుకే లేళ్ల అప్పిరెడ్డిని పక్కకు పెట్టారని ప్రజలు, ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారని కొందరు ఎంపీలు ఈ సందర్భంగా చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన చంద్రబాబు రాష్ట్రంలో 10, 15 సీట్లు బీజేపీకి ఇచ్చేందుకు సైతం జగన్‌ ఉన్నట్లుగా తెలుస్తుందన్నారు. ఈ అనైతిక పొత్తులు, రహస్య లాలూచీలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి ఎండగట్టాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు.

తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ తనను పర్సనల్ గా టార్గెట్‌ చేయడా,న్ని ఆంధ్రప్రదేశ్‌లో తనకు రాజకీయంగా కూడా అనుకూలంగా మలచుకోవడానికి చంద్రబాబు పావులు కదుపుతున్నారు. చంద్రబాబు ఎలాగూ, కెసిఆర్ స్థాయికి దిగాజారి మాట్లాడలేదు, అందుకే ఈ పరిస్థితులని తనకు అనుకూలంగా మారుస్తున్నారు. తెలుగువారు కలిసి ఢిల్లీని డీ కొందామని కెసిఆర్ కు చెప్పినా, ఆయన బీజేపీతో అంట కాగుతూ, కాదన్నందుకే కాంగ్రెస్‌తో కలవాల్సి వచ్చిందని చంద్రబాబు తరుచూ చెప్తున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్‌తో కలవడం వల్ల కేసీఆర్‌ తనను శత్రువుగా పరిగణిస్తారని చంద్రబాబుకు తెలియనిది కాదు. ఈ పరిణామం ఏపీలో ఎన్నికలు జరిగే నాటికి ప్రత్యర్థుల సంఖ్యను పెంచడమే కాకుండా వారిని సంఘటితం చేసే ప్రమాదం లేకపోలేదని కూడా చంద్రబాబు అంచనా వేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తనదైన శైలిలో అడుగులు వేస్తున్నారు.

kjp 07102018 2

ప్రధాని మోదీ డైరెక్షన్‌లో కేసీఆర్‌, జగన్మోహన్‌రెడ్డి, పవన్‌ కల్యాణ్‌ నడుచుకుంటున్నారనీ, అందరూ ఏకమై చంద్రబాబుని వేధిస్తున్నారనే అభిప్రాయం ఏపిలో చాలా మందికి ఉంది. ఎన్నికలు జరగబోయే వేళ ఐటి అధికారులు అమరావతి మీద విరుచుకుపడి, సోదాలకు పాల్పడటం టిడిపిని, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మద్దతుదారులను వేధించడంలో భాగమేనన్న అభిప్రాయం ఏపీ ప్రజలలో వ్యాపిస్తోంది. దీనికి తోడు ఏపి బీజేపీ నాయకుల మాటలు.. చంద్రబాబుకు చుక్కలు చూపిస్తాం.. చంద్రబాబుని దింపివేస్తాం, అంటూ జీవీఎల్‌ నర్సింహారావు లాంటి వారు, ఇటీవలి కాలంలో ఇచ్చిన వార్నింగ్ లు కూడా ప్రజల్లో అనుమానాలు మరింత బలపడేలా చేశాయి. కేసులు పెడతాం, జైలుకు పంపుతాం వంటి హెచ్చరికలు ఎలా ఉన్నా, అవి మాత్రం రాజకీయంగా చంద్రబాబుకు ఉపయోగపడుతున్నాయి.

kjp 07102018 3

ఎన్నికలు సమీపించేనాటికి చంద్రబాబుకి వ్యతిరేకంగా, జగన్, పవన్, కెసిఆర్, బీజేపీ ఒక్కటవుతున్నారని, ఇప్పటికే ఏపి ప్రజలు భావిస్తున్నారు. ఇదే అభిప్రాయాన్ని బలపరిచే విధంగా, చంద్రబాబు కూడా ఆయన పని ఆయన చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రత్యర్థులుగా ఉన్న జగన్మోహన్‌రెడ్డి, పవన్‌ కల్యాణ్‌ను ఏకం చేయడానికి కేసీఆర్‌ ప్రయత్నిస్తారని చంద్రబాబు అనుమానిస్తున్నారు. అదే జరిగితే తీసుకోవాల్సిన విరుగుడు చర్యల పై ఆయన దృష్టి కేంద్రీకరించారు. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక శక్తులను సంఘటితం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగే నాటికి జగన్మోహన్‌రెడ్డి, పవన్‌ కల్యాణ్‌లను ఆత్మరక్షణలోకి నెట్టాలన్నది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. బీజేపీకి పరోక్షంగా, ప్రత్యక్షంగా సహకరించే ఎవరైనా రాష్ట్ర ద్రోహులుగా ఉన్న పరిస్థితిని, చంద్రబాబు మరింతగా ప్రజల్లో నాటే ప్రయత్నం చేస్తున్నారు.

‘నేను మాత్ర‌మే బతకాలి.. ఇంకెవరూ బతకకూడదు’ అనేది ప్రధాని న‌రేంద్ర‌మోదీ భావజాలమని, తనతో పాటు పది మంది బతకాలనే మనస్తత్వం సీఎం చంద్రబాబు నాయుడుదని తెదేపా ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు శ‌నివారం విజయవాడ వచ్చిన ఆయన.. కేశినేని భ‌వ‌న్ వ‌ద్ద మీడియాతో మాట్లాడారు. ఈ స‌దంర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌, మోదీపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ భస్మాసురుడు లాంటి వాడని, భస్మాసురుడు ఎలాగైతే తన చేత్తో తానే భస్మమయ్యాడో ఆయన కూడా తన మూడో కంటితో తానే బూడిదవుతాడని ఎద్దేవా చేశారు.

diwakar 07102018 2

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జరుగుతున్న ఐటీ దాడులకు ఎవరూ భయపడటం లేదని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు పై కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను దివాకర్‌రెడ్డి ఖండించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అలాంటి భాష వాడటం మంచిది కాదని పేర్కొన్నారు. కేసీఆర్‌ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలీదు. కోపం, రాజకీయ శత్రుత్వం ఉండొచ్చుగానీ... ఆ స్థాయిలో ఉన్నవారు అలాంటి భాష మాట్లాడకూడదు. చంద్రబాబుకి ఎంత బాధ కలిగిందో నాకుతెలియదు గానీ, నేనయితే నాలుగంటించే వాడిని. చంద్రబాబుకి, కేసీఆర్‌కి అదే తేడా. కేసీఆర్‌ మూడో కన్ను తెరిస్తే భస్మాసురుడిలా ఆయనే భస్మమై పోతాడన్నారు.

diwakar 07102018 3

నాలుగేళ్ల పాలనలో తెలంగాణకు చేసింది చెప్పుకోలేకే తెలంగాణ ముఖయమంత్రి కేసీఆర్‌ ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. హైదరాబాద్‌ ఏమైనా ఆయన ఫాం హౌజ్‌ అనుకుంటున్నారా అని మండిపడ్డారు. శనివారం ఉండవల్లిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... కేసీఆర్‌ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. దీనిపై చర్చించేందుకు బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడవద్దని తెలంగాణ ముఖయమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్న చంద్రబాబును తిట్టడానికి ఆయనకు నోరు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్‌ను తిట్టడానికి అసలు బూతులు కూడా లేవని అన్నారు. ప్రధాని మోదీ ఓ బండరాయని, అనుబంధాల విలువ తెలియదని, ఆయన పాలనలో అదే కనిపిస్తోందని విమర్శించారు.

Advertisements

Latest Articles

Most Read