తెలంగాణలో టిడిపి ర్టీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళాలని, కాంగ్రెస్‌తో కలిసి వెళ్ళవద్దని, తెలంగాణ ముఖయంత్రి కేసీఆర్‌ తనను కోరారని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం అమరావతిలో జరిగిన టీడీపీ ఎంపీల సమావేశంలో, టీఆర్‌ఎస్‌ పార్టీతో జరిగిన చర్చల వివరాలను చంద్రబాబు వివరించారు. తెలుగు రాష్ట్రాలు కలిసి పని చేద్దామని కెసిఆర్ కు చెప్పిన, విషయాన్ని టీడీపీ పార్లమెంటరి సమావేశంలో చంద్రబాబు ప్రస్తావించారు. రాజకీయంగా ఆంధ్రా -తెలంగాణా రాష్ట్రాలు కలిసి ఉంటే దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాలదే పైచేయి అవుతుందని, ఢిల్లీలో పట్టు పెరుగుతుందనే విషయాన్ని కేసీఆరుకు వివరించానని చంద్రబాబు అన్నారు. ఈ విషయం పై ఆలోచించి చెబుతానన్న కేసీఆర్, వారం రోజుల తర్వాత మీతో కలిసి రావటం కుదరదని చెప్పారని చంద్రబాబు వెల్లడించారు.

cbn 07102018

ఇదే సమయంలో, తెలంగాణలో పోటి చేస్తే టిడిపి ఒంటరిగా పోటి చేయించాలని, కాంగ్రెస్‌తో పొత్తు వద్దని కేసీఆర్ చెప్పారని, దీంతో నాకు అప్పటికే కెసిఆర్ వేరేవాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయాడని అర్ధం అయ్యిందని చంద్రబాబు అన్నారు. 2014లో ఎన్నికల ముందే ఏపీలో జగన్, తెలంగాణలో టీఆర్ఎస్ వస్తుందని కేసీఆర్ చెప్పారన్నారు. దీనిని బట్టి అర్థమైంది ఏంటంటే, ఏపీలో జగన్ వస్తే తానే సమర్ధుడిగా చలామణి కావొచ్చని కేసీఆర్‌ ఆశించారన్నారు. కానీ ఏపీ ప్రజలు కేసీఆర్ ఆశలను తారుమారు చేశారన్నారు. చారిత్రక కారణాల వల్లే తెలంగాణలో కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు స్పష్టం చేసారు. చంద్రబాబును ఉద్దేశించి కేసీఆర్‌ చేస్తున్న విమర్శలు, వాడుతున్న భాష ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.

cbn 07102018

చేసిన అభివృద్ధిని చెప్పుకొని ప్రజల వద్ద ఓట్లు పొందగలిగే పరిస్థితిలో కేసీఆర్‌ లేరని, అందుకే ఆంధ్రులను, చంద్రబాబును తిట్టి మరోసారి తెలంగాణ ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొడితే తప్ప గెలవలేనన్న అభిప్రాయంతో ఈ పని చేస్తున్నారని టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు. ‘ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉండగా మెదక్‌ జిల్లా రాజకీయాల్లో కరణం రామచంద్రరావుకు ప్రాధాన్యం ఇచ్చేవారు. కేసీఆర్‌ను పట్టించుకొనే వారు కాదు. నేను కేసీఆర్‌కు ప్రాధాన్యం ఇచ్చి ముందుకు తెచ్చాను. నా కేబినెట్‌లో మంత్రిగా అవకాశం ఇచ్చాను. ఆయన నా కింద పనిచేశారు. అయినా నేను ఎప్పుడూ కేసీఆర్‌ను ఆ దృష్టితో చూడలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఎప్పుడూ ఇచ్చాను. ఆయనను నా సహచరుడిగా (కొలీగ్‌)గా సంబోధించేవాడిని తప్ప తక్కువగా చూడలేదు. కేసీఆర్‌ ఎలా ఉన్నా... ఎలా మాట్లాడినా నా హుందాతనం నేను నిలుపుకొన్నాను. ఆయన మాట్లాడే భాషను ప్రజలు సమర్ధిస్తారని నేను అనుకోను’ అని చంద్రబాబు అన్నారు.

కొన్ని రోజుల క్రితం జగన్ మోహన్ రెడ్డి తన ఎంపీల చేత, పార్లిమెంట్ లో పోరాటం చెయ్యనివ్వకుండా, వారి చేత రాజీనామాలు చేపించి, అమిత్ షా డైరెక్షన్ లో చేసిన తంతు గుర్తుందా ? మేము ఇప్పుడు రాజీనామా చేస్తున్నాం, ఎన్నికలకు వెళ్తున్నాం అంటూ బిల్డ్ అప్ ఇచ్చారు. కాని ఎన్ని నెలలు అయినా దీని పై ఎక్కడా కదలిక లేదు. ఇదంతా అమిత్ షా డైరెక్షన్ లో నడిచిన స్క్రిప్ట్ అని తెలుగుదేశం పార్టీ కూడా ఆరోపించింది. దానికి తగ్గట్టుగానే, అవిశ్వాసం సమయంలో బీజేపీని నిందించే ధైర్యం లేక, రాజీనామా చేసి ఇంట్లో కూర్చున్నారు. మరో పక్క తెలుగుదేశం ఎంపీలు, పార్లిమెంట్ లో మోడీని చాకిరేవు పెట్టారు.

jagan 06102018 2

అయితే ఇప్పుడు మరోసారి ఈ రాజీనామా అంశం తెర పైకి వచ్చింది. సరిగ్గా జూన్ 2 తో మోడీ పాలన మొదలైన రోజు. అయితే వీరి రాజీనామాలు కనుక జూన్ 2 న ఆమోదం చేసి ఉంటే, ఎన్నికలు వచ్చేవి. కాని వీరి రాజీనామాను చాలా తెలివిగా జూన్ 3న ఆమోదించారు. అంటే ఒక్క రోజు గ్యాప్ తో, సాంకేతిక కారణం చూపించటం కోసం. ఈ రోజు ఎన్నికల కమిషన్ కూడా అదే చెప్పింది. వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు సంబంధించి త్వరలోనే ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఓపీ రావత్‌ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అయితే ఎప్పుడో రాజీనామా చేసిన వైసీపీ ఎంపీల రాజీనామా ప్రస్తావన వచ్చింది. దీంతో, ఆంధ్రప్రదేశ్‌లో జరగాల్సిన ఐదు పార్లమెంట్‌ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు సంబంధించి కూడా ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది.

jagan 06102018 3

‘2019 జూన్‌ 4వ తేదీతో లోక్‌సభ పదవీకాలం గడువు ముగుస్తుంది. ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన నియోజకవర్గాలకు కనీసం ఏడాది పాటు అయినా ప్రజాప్రతినిధులు పదవిలో ఉండాలి. ఏడాదిలోపు పదవీ కాలం ఉన్న నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు వీల్లేదని ఎన్నికల చట్టంలో స్పష్టంగా ఉంది. ఈ ఏడాది జూన్‌ 3వ తేదీన వైకాపాకు చెందిన ఐదుగురు ఎంపీల రాజీనామాలు ఆమోదించారు. అప్పటి నుంచి లెక్క చూస్తే వచ్చే ఏడాది జూన్‌ 4వ తేదీకి లోక్‌సభ‌ పదవీకాలం గడువు ముగుస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు’ అని రావత్‌ స్పష్టం చేశారు.

ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కొన్నాం కానీ.. కేంద్రం నుంచి వాటిల్లుతున్న నష్టాలను నివారించలేకపోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం రాష్ట్రాన్ని బలి తీసుకుంటున్నారని, ఆంధ్రప్రదేశ్‌ను ఒక రాజకీయ బాధిత రాష్ట్రంగా మారుస్తున్నారని కేంద్రం తీరుపై మండిపడ్డారు. ‘ఆంధ్రప్రదేశ్‌ను ఒక రాజకీయ బాధిత రాష్ట్రంగా మార్చారు. వారి రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని బలిచేస్తున్నారు. ఇదే విషయాన్ని చాలా సూటిగా, స్పష్టంగా, సమర్ధవంతంగా 15వ ఆర్థిక సంఘానికి తెలియజెప్పాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఈ నెల 11న జరగనున్న 15వ ఆర్థిక సంఘం సమావేశంలో సభ్యుల ముందు ఏఏ అంశాలను ప్రస్తావించాలనే విషయంపై శుక్రవారం తన కార్యాలయంలో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు.

cbbn 06102018 2

కేంద్ర రెవెన్యూ శాఖ మాజీ కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యుడు నంద్‌కిశోర్ సింగ్ అధ్యక్షునిగా వున్న 15వ ఆర్థిక సంఘం ఆర్థిక కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వ వాదనలు విని వినతులు స్వీకరించేందుకు రాష్ట్రానికి వస్తోంది. ఈ సందర్భంగా జరిగే సమావేశంలో అశాస్త్రీయ రాష్ట్ర విభజన ద్వారా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిన వైనాన్ని, ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని అందరికీ అర్ధమయ్యేలా కూలంకుశంగా విడమరచి చెప్పాలని సీఎం చంద్ర‌బాబు స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రత్యేక హోదాపై కొత్త ఆర్థిక సంఘం వైఖరి ఏమిటో గట్టిగా నిలదీయాలన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని తెలియజేసేందుకు ఇంతకు మించిన సందర్భం మరొకటి లేదని అభిప్రాయపడ్డారు. ‘నిజానికి నీతిఆయోగ్ డమ్మీగా మారింది, ప్రణాళికా సంఘాన్ని తీసేశారు, నేషనల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ మీటింగ్ పెట్టరు, ఇక రాష్ట్ర సమస్యల్ని చెప్పడానికి ఒక ఫోరం అంటూ ఏదీ లేదు. ఈ పరిస్థితులలో 15వ ఆర్థిక సంఘాన్ని మించిన వేదిక మనకు దొరకదు అని ముఖ్యమంత్రి అన్నారు.

cbbn 06102018 3

‘14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా తప్పించుకుంది. ఇప్పుడీ అంశాన్ని ప్రస్తావించి కొత్తగా వీరేం చెబుతారో తెలుసుకోవాల్సి వుంది’ అని సీఎం చంద్ర‌బాబు నాయుడు అన్నారు. 1971 జనాభా ప్రాతిపదిక అంశాన్ని మార్చడం, ఇచ్చిన నిధులను వెనక్కి తీసుకున్న వైనం, పునర్విభజన చట్టంలో పొందుపరచిన అంశాలనూ, పార్లమెంటులో ఇచ్చిన హామీలనూ నెరవేర్చకుండా చేస్తున్న మోసం.. వీటినన్నింటినీ ఎండగట్టేలా మన వాదన ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. ముఖ్యంగా కేంద్ర పన్నుల ఆదాయాన్ని రాష్ట్రాలకు పంపిణీ చేసే నిష్పత్తిని నిర్ణయించటానికి 2011 జనాభా గణాంకాలను ప్రాతిపదికగా తీసుకోవాలని 15వ ఆర్థిక సంఘానికి నిర్దేశించడం పట్ల ఈ సమావేశంలో తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేయాలని ముఖ్యమంత్రి చెప్పారు.

తెలంగాణ అపద్ధ‌ర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు తీవ్రంగా విరుచుకుపడ్డారు. మూడో కన్ను తెరవడానికి దెయ్యానివా.. రాక్షసుడువా? అని కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్య సమాజం సిగ్గుపడేలా మాట్లాడుతున్న తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రిది నోరా లేక మున్సిపల్ డ్రైనేజా అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీయేనన్నారు. అవన్నీ మరిచిపోయి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేలా బీజేపీతో కలిసి టీడీపీ పతానానికి కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. వెల‌గ‌పూడి స‌చివాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణాలో ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ ఇష్టారాజ్యంగా సభ్య సమాజం సిగ్గుపడేలా మాట్లాడుతున్నారన్నారు. రాజకీయాల్లో దిగుజారుడుతనానికి కేసీఆర్ తీరు పరాకాష్ట అని అన్నారు. తోటి తెలుగు రాష్ట్రమైన ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సభ్యత సంస్కారం మరిచి టీఆర్ఎస్ అధినేత ఇష్టారాజ్యంగా మాట్లాడడం సరికాదన్నారు.

kcr 06102018 2

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిదేళ్లు సీఎంగా, ప్రతిపక్ష నేతగా పదేళ్లు పనిచేసిన చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలడం సబబుకాదన్నారు. టీడీపీలో కేసీఆర్ ఉన్నప్పుడే సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారన్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. తెలంగాణాలో టీడీపీకి ఆఫ్ పర్సంటేజీ ఓట్ల శాతం మాత్రమే ఉందని కేసీఆర్ అంటున్నారని, అటువంటప్పుడు తమ పార్టీని చూసి ఆయనెందుకు భయపడాలని ప్రశ్నించారు. గురువారం జరిగిన ఎన్నికల సభలో గంట పాటు కేసీఆర్ మాట్లాడితే అందులో అరగంట పాటు టీడీపీ, చంద్రబాబు గురించి మాట్లాడారన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే కేసీఆర్‌కు భయం పట్టుకుందని తెలిపారు. మంత్రి పదవి ఇచ్చి ఉంటే ఆయన టీఆర్ఎస్ పార్టీని స్థాపించే వారా? అని ప్రశ్నించారు. మూడో కన్ను తెరిస్తే, చంద్రబాబు నాయుడు భగ్గుమని మాడిపోతారని కేసీఆర్ అంటున్నారని, ఆయనేమైనా దెయ్యమా…రాక్షసుడా? అని అన్నారు.

kcr 06102018 3

రాబోయే ఎన్నికల్లో విజయానికి కాంగ్రెస్ పార్టీకి సీఎం చంద్రబాబు డబ్బులిస్తున్నారని కేసీఆర్ అనడం సరికాదన్నారు. 2009 ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు కాళ్ల ముందు ఇదే కేసీఆర్ సాగలబడి, టీడీపీతో పొత్తు కుదుర్చుకున్నారని గుర్తు చేశారు. ఆనాడు తమకేమైనా డబ్బులిచ్చావా? అని మంత్రి నక్కా ఆనందబాబు నిలదీశారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడడం సరికాదన్నారు. గత నాలుగున్నర ఏళ్లలో తెలంగాణాలో ఏమి అభిచేశావో చెప్పాలని కేసీఆర్‌ను ఆయన నిలదీశారు. "తెలంగాణలో మహా కూటమికి భయపడే కేసీఆర్‌ చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. నోటి దురుసు ఎక్కువై లేనిపోని మాటలంటున్నారు. వ్యక్తులను కించపరుస్తూ మాట్లాడటం కేసీఆర్‌కు కొత్తేంకాదు. తమ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై ఐటీ దాడులు చేయించడం భాజపాకు సాధారణమైపోయింది" అంది మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు.

Advertisements

Latest Articles

Most Read