విజయవాడ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమవ్వడానికి ముహూర్తం ఖరారైంది. ఇందులో భాగంగా ఈ నెల 25న గన్నవరం నుంచి సింగపూర్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసులను తొలుత నడపనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ, ఇండిగో సంస్థ తేదీని ఖరారు చేస్తూ ఒప్పందం కుదుర్చుకున్నాయి. విమానాశ్రయం అధికారులకు సైతం సిద్ధంగా ఉండాలంటూ శుక్రవారం సమాచారం అందించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమైతే.. ఈ ప్రాంతానికి దేశవిదేశాలతో అనుసంధానం ఏర్పడినట్లే. ప్రపంచంలోనే ప్రముఖ వాణిజ్య, వ్యాపార కేంద్రమైన సింగపూర్‌కు విజయవాడ నుంచి నేరుగా మూడు గంటల్లో చేరిపోవచ్చు.

gannavaram 06102018

అక్కడి నుంచి ప్రపంచమంతటికీ విమాన సర్వీసులు పుష్కలంగా అందుబాటులో ఉంటాయి. ఏ దేశానికైనా తేలికగా చేరిపోయేందుకు అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ ప్రయాణికులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రయాణ ఛార్జీలతో పాటూ ప్రయాస తగ్గిపోతుంది. సింగపూర్‌తో భారతదేశానికి బలమైన వ్యాపార సంబంధాలు ఉన్నాయి. సముద్ర మార్గంలో నౌకల ద్వారా జరిగే రవాణా చాలావరకు సింగపూర్‌, దుబాయ్‌ మీదుగానే ఇతర దేశాలకు చేరుకుంటాయి. సింగపూర్‌కు ఏటా కోస్తా ప్రాంతం నుంచి వెళ్లేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. . రోజూ హైదరాబాద్‌ నుంచి సింగపూర్‌, దుబాయ్‌లకు ఆరు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఇక్కడి నుంచి రోజూ ఒక్క విమాన సర్వీసును సింగపూర్‌, దుబాయ్‌కు నడిపితే.. వెసులుబాటు కలుగుతుందని ఎప్పటినుంచో ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.

gannavaram 06102018

మరో పక్క, విమానాశ్రయంలో ప్రస్తుతం 7500 అడుగుల రన్‌వే ఉంది. దీనిని 11,023 అడుగులకు పెంచుతున్నారు. కొత్తగా 3523 అడుగులు పొడిగిస్తున్నారు. రూ.148 కోట్ల బడ్జెట్‌ అంచనా వేయగా.. ప్రస్తుతం రూ.120 కోట్ల వరకూ ఖర్చవుతోంది. రన్‌వే విస్తరణ పనులను 2017 ఏప్రిల్‌ నుంచి ప్రారంభించారు. 20 నెలల్లో అనుకున్న లక్ష్యంలోగానే పనులను పూర్తి చేస్తున్నారు. విమానాశ్రయం డైరెక్టర్‌ జి.మధుసూదన్‌రావు దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టి అనుకున్న లక్ష్యంలోగా పూర్తిచేసేందుకు ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఉన్న 7500 పొడవైన రన్‌వే అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు అనువుగానే ఉంది. భవిష్యత్తులో రద్దీ మరింత పెరిగాక.. అవసరాల దృష్ట్యా రన్‌వేను పొడిగిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్త రన్‌వేపై సర్వీసులు రాకపోకలు సాగించనున్నాయి.

విద్యుత్‌ చట్టం-2003లో సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఆ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌.. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, భాజపాయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పశ్చిమ్‌ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌.డి కుమారస్వామి, పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణ స్వామి, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, మిజోరాం ముఖ్యమంత్రి లాల్ ‌తన్హ‌వ్‌లా,

kejriwal 06102018 2

పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్, సిక్కిం ముఖ్యమంత్రి పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌లకు లేఖలు చేసి పలు విషయాలను ప్రస్తావించారు. విద్యుత్‌ చట్టం-2003లో మార్పులు తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు అభ్యంతరకరంగా ఉన్నాయని కేజ్రీవాల్ ఆ లేఖల్లో పేర్కొన్నారు. వీటిని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని, విద్యుత్‌ రంగం పూర్తిగా కేంద్ర సర్కారు చేతిలోకి వెళ్లిపోతుందని, విద్యుత్ ధరలు పెరిగిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

kejriwal 06102018 3

‘కొన్ని సంస్థలకు లాభాలు వచ్చేలా కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరణ చేయాలని భావిస్తున్నట్లు అనిపిస్తోంది. పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందడానికి వీల్లేదు. విద్యుత్‌ చట్టంలో సవరణలు తీసుకొచ్చే ప్రయత్నాన్ని పార్లమెంటులో మనం అందరం కలిసి అడ్డుకోవాల్సి ఉంది. ఈ బిల్లు వల్ల సామాన్య ప్రజలపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు పడతాయనే విషయాలను మనం ప్రచారం చేయాల్సి ఉంది’ అని ముఖ్యమంత్రులకు రాసిన లేఖల్లో కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఈ అంశాలపై చర్చించడానికి తాను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవాలనుకుంటున్నానని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో ఐటీ దాడులు కలకలం రేపాయి. శుక్రవారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాటేదాకా వరుస సోదాలతో ఐటీ అధికారులు హడావుడి చేశారు. దీంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న ఉద్రిక్తత సర్వత్రా కనిపించింది. పొరుగు రాష్ట్రాలనుంచీ అదనపు సిబ్బందిని రప్పించుకొని ఏకకాలంలో, ముందుగా ఎంచుకొన్న కంపెనీలు, వ్యాపారుల సంస్థలపై ఐటీ అధికారులు విరుచుకుపడ్డారు. గుంటూరులో ఐదు చోట్ల, విజయవాడలో మూడు సంస్థలపై, విశాఖలో రెండు ఆఫీసులపై, ప్రకాశం జిల్లాలో ఒకే నేతకు చెందిన పలు సంస్థలపై దాడులు మొదలుపెట్టారు. నెల్లూరులో టీడీపీ సీనియర్‌ నేత బీద మస్తానరావుకు (బీఎమ్మార్‌) చెందిన సంస్థల్లో సోదాలు శుక్రవారం కూడా కొనసాగాయి.

it 06102018 1 1

రాజధాని ప్రాంతమైన విజయవాడ, గుంటూరు నగరాలతోపాటు విశాఖ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు స్థిరాస్తి సంస్థలు, పరిశ్రమలు, రొయ్యల ఎగుమతి సంస్థలకు చెందిన కార్యాలయాలు, వాటిని నిర్వహిస్తున్నవారు, అందులో పనిచేస్తున్న ముఖ్యమైన ఉద్యోగుల ఇళ్లలో ఉదయంనుంచి రాత్రి వరకూ విస్తృతంగా తనిఖీలు సాగాయి. హైదరాబాద్‌లోని పలు చోట్ల కూడా తనిఖీలు చేశారు. వీటిల్లో పలువురు రాజకీయ ప్రముఖులకు సంబంధించిన సంస్థలూ ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో తెదేపా ముఖ్య నేత బీద మస్తాన్‌రావుకు చెందిన సంస్థల్లోనూ, ప్రకాశం జిల్లాలో కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావుకు(ఈయన వైకాపా నుంచి తెదేపాలో చేరారు) చెందిన పరిశ్రమల్లోనూ, విశాఖలో నంబూరు శంకరరావు (రేవంత్‌రెడ్డి సన్నిహితుడని ప్రచారం ఉంది. వైకాపాలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు) సంస్థల కార్యాలయాల్లోనూ సోదాలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28 చోట్ల తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం.

it 06102018 1 1

విజయవాడలో శుక్రవారం తెల్లవారుజామునే ఐటీ అధికారులు తమ పని మొదలుపెట్టారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ ప్రాంతాల నుంచి మొత్తం 9 బృందాలు గురువారం రాత్రికే విజయవాడ చేరుకొన్నాయి. తెలతెలవారుతుండగానే తనిఖీలు మొదలుపెట్టారు. తొలుత సదరన్‌ డెవలపర్స్‌లో, అనంతరం వరుసగా శుభగృహ, వీఎస్‌ ఎకో బ్రిక్స్‌లో తనిఖీలు చేపట్టాయి. బెంజ్‌ సర్కిల్‌లోని నారాయణ విద్యాసంస్థ కార్యాలయానికి వెళ్లినా, ఏమనుకున్నారోఏమోగానీ తనిఖీలు జరపకుండానే వెనువెంటనే వెనుదిరిగారు. అప్పటికే సమాచారం అందడంతో మీడియా.. మహాత్మాగాంధీ రోడ్‌లోని సదరన్‌ డెవలపర్స్‌ వద్దకు చేరుకొంది. గుంటూరుకు చెందిన వల్లభనేని శ్రీనిసవారావు కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటలో ఏర్పాటుచేసుకొన్న వీఎస్‌ ఎకో బ్రిక్స్‌లో మరో టీమ్‌ తనిఖీలు జరిపింది.

ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు, శుక్రవారం ఏపీలో జరిగిన ఐటీ సోదాలపై హీరో శివాజీ మీడియాతో మాట్లాడారు. ఏకకాలంలో సోదాలు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో విధంగా దెబ్బతీయాలని కొందరు కుట్ర చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు ప్రభుత్వానికి ముప్పుందని తాను ముందే చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా మరోసారి శివాజీ గుర్తు చేశారు. చంద్రబాబుపై కోపం ఉంటే ఎన్‌కౌంటర్‌ చేయండని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో ఉన్న నలుగురు, ఈ నలుగురిలో ఉన్న ఒక మహిళామణి కలిసి, ఢిల్లీలో చేసిన తతంగమే ఈ ఐటి దాడులని శివాజీ అన్నారు. అయితే, ఆ మహిళామణి పేరు చెప్పటానికి మాత్రం ఆయన నిరాకరించారు. నా మాటలు వింటే ఎవరో తెలుస్తుందని, పేర్లు చెప్తే, నన్ను లీగాల్ ఇరికించటానికి రెడీగా ఉన్నారని అన్నారు.

sivaji 06102018

"ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అల్లర్లకు కుట్ర చేస్తున్నారు. ఏపీకి చెందిన నలుగురైదుగురు ఢిల్లీలో కుట్రలు చేస్తున్నారు. బీజేపీ నేత జీవీఎల్‌ అర్థంలేకుండా మాట్లాడుతున్నారు. ఏపీ ప్రజలు పిచ్చోళ్లని అనుకుంటున్నారా?. సొంత ఆదాయం, ప్రయోజనాల కోసం మోసం చేస్తున్నారు. ప్రత్యేకహోదా అంశాన్ని మోదీ చెప్పలేదని, మార్ఫింగ్‌ చేశారని అంటున్నారు. మోదీ రెచ్చగొట్టి పంపడంతోనే ఇలాంటి ఘటనలు ఏపీలో జరుగుతున్నాయి. ప్రత్యేకహోదా లేకుంటే ఏపీ అభివృద్ధి చెందదు. హోదాపై జగన్‌, పవన్‌ ఎందుకు మాట్లాడటం లేదు. నవంబర్‌ 2వ వారం నుంచి హోదా సైన్యాన్ని తయారుచేస్తున్నాం. గొప్ప సైన్యం ఉన్న వ్యక్తి పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడటం లేదు. అన్ని పార్టీలు కలిస్తేనే ప్రత్యేక తెలంగాణ వచ్చింది" అని శివాజీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

sivaji 06102018

"ఏపీకి ఇంతకంటే చీకటిరోజు ఉండదేమో.?. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. చంద్రబాబే లక్ష్యమైతే ఎన్‌కౌంటర్ చేయండి. బాబును ఎన్‌కౌంటర్ చేయడానికి కూడా కేంద్రం వెనకాడదు. డిసెంబర్‌లో జరగాల్సిన ఐటీ దాడులు ఈ రోజే జరిగాయి. మోదీ ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పలేదనడం దుర్మార్గం. బీజేపీ నేతలకు సినిమా అంటే ఎలా ఉంటుందో త్వరలోనే చూపిస్తాం. రేవంత్ ఆస్తుల గురించి ఎవరు సమాచారం ఇచ్చారో ఏపీలో ఐటీ సోదాలకు సంబంధించి కూడా అతనే సమాచారం ఇచ్చారు. మీడియాకు ముందే సమాచారం తెలియడంతో ఐటీ అధికారులు ప్లాన్ మార్చారు" అని శివాజీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

Advertisements

Latest Articles

Most Read